మన బంగారం మంచిదయితే..

వారాంతం అవ్వగానే సోమవారంనాడు ఇక ఈ వారం  మొదలు అనుకుంటూ ఏ  విఘ్నాలు కలగ కుండా చూడమని  గణేశుడిని  ప్రార్థిస్తూ నా కారు లో  నేను పెట్టుకునే మొదటి పాట  ‘ముదకరాత్తమోదకం’.  నా చేయి నాకు తెలియకుండానే  మొదటి సీడీ  లోని మొదటి పాటని పెట్టేస్తుంది.  నా మెదడు సోమవారానికి అంతగా  ప్రోగ్రాం చేయబడింది. ప్రతి విషయాన్నీ గుర్తు చేయించుకునే  మా పిల్లలు కూడా,  మేము  గుర్తు చేయకుండానే –  ప్రతి ఏడు బడి మొదలయ్యేటప్పటికి   బాలవికాస్ లో  వినాయక చవితి చేసేసుకుని,   పూజ చేసుకున్న చిన్ని వినాయకుడి విగ్రహాలు కొత్త బాక్ పాక్ ల లో సర్దేసుకుంటారు.  బడిలో ఏదైనా పరీక్షా  ఉంటే  ఇంట్లో నుంచి బయలుదేరే ముందు బాగా మార్కులు వచ్చేయాలని  ఓ  మూడు గుంజిళ్ళు చేసి, మా గుమ్మం దగ్గరే ఉన్న  వినాయకుడి దగ్గర ఆశిస్సులు తీసుకుంటారు.  వినాయకుడు అంటే విఘ్నాలు తొలగించేవాడు, ప్రతీ  పని ఆయనకి  ముందు చెప్పాలి అన్న నమ్మకం మా మెదళ్ల  లో గుడి కట్టేసుకుంది.

ఇలా మా కుటుంబం ఒక్కటే కాదు, హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి వారికీ ఇలాంటి  ఒక నమ్మకం ఉంటుంది.   అందునా  గణేశుడు అంటే మరీ !! అటువంటి నమ్మకం ఉన్నహిందూ ధర్మాన్ని పాటించే వారి మనోభావాలు దెబ్బ తీస్తూ  Amazon  వారు  గణేశుడు బొమ్మ  ఉన్న కాలి పట్టాలు (కాళ్ళు తుడుచుకునే  doormat)  అమ్మకాలు మొదలు పెట్టారు. ఎంత  హేయమైన ఆలోచన!! హిందూ ధర్మాన్ని పాటించే వారు, కొంత మంది  ట్విట్టర్ లో గొడవ చేసాక వారి వెబ్సైటు లో నుంచి అవి తొలగించారు.  Amazon వారికీ వ్యాపారం తో పని కాబట్టి పెద్ద గొడవ లేవీ లేకుండానే తొలగించారు. సరే, Amazon  వారు విదేశీయులు  వాళ్ళకి తెలీదు. కాబట్టి  ఒక విధం గా క్షమించవచ్చేమో !!

PK చలనచిత్రం మాటేమిటి? శివుడు వెళ్లి  Restroom లో దాక్కోవడం , బాబాలని క్రించపరుస్తూ  చివరికి  ఆ ముగింపు  ఏంటి ? సరే PK చలనచిత్రం లో నటించిన అమీర్ ఖాన్ తన నటన తో పొట్టపోసుకునే వాడు, ఇస్లాము మతానికి చెందిన వాడు కాబట్టి ఆయనకి తెలియదు అనుకుని క్షమించి వేయవచ్చు !!

అత్తారింటికి దారేది  చలనచిత్రం చూసిన  ఒక స్నేహితురాలు ఒకరు  అందులో హీరో సన్యాసుల లా నటించిన పాట  గురించి, అహల్య పాత్ర తో ఒక హాస్య సన్నివేశం గురించి చెప్తే యూ ట్యూబ్  లో చూసాను.  హిందూ ధర్మం ని , రామాయణం లోని పాత్ర ని ఎందుకోసం ఇంత క్రించపరచారు అనిపించింది. మొన్నటికి మొన్న ‘బ్రహ్మోత్సవం’  చలన చిత్రం!! అలా  పేరు పెట్టచ్చా  పెట్టకూడదా  అన్న ఇంగితజ్ఞానం, ఆలోచన కూడా లేదు.  మొన్న ఒక తెలుగు బ్లాగు లో కూడా దీని  మీద ఎవరో ఆవేదన వ్యక్త్యం చేసారు కూడా!!  సరే వీరందరూ సినిమా వాళ్ళు. నటించాక, మనం కొనే ఆ టికెట్ డబ్బులతో పొట్ట పోషించుకునే వారు పాపం – అనుకుని వీరిని కూడా క్షమించేయచ్చు !!

ఇక మీడియా వారైతే వారి గురించి చెప్పనే అక్కర్లేదు.  హిందూ మతాన్ని ఎంత దూషిస్తే అంత మంచిది కాస్త రోజు గడుస్తుంది అన్నపద్దతి  లో ఉంటారు.

ఇలా ఎవర్నయినా క్షమించాలి  అన్పిస్తుంది కొందర్నితప్ప. కొంతమంది ని ముఖపుస్తకం లో చూస్తుంటాను. గోడ ఒకటి దొరికింది కదా అని ఏదో ఒకటి వ్రాసేస్తూ ఉంటారు. మేము అంత బాగా చదువుకున్నాము,  ఇంత బాగా సేవ చేస్తున్నాము అంటూ చెప్పుకుంటూనే హిందు ధర్మం గురించి మాత్రమే దూషణ, హేళన మొదలు పెడుతుంటారు.  ఎలా అంటే మచ్చుకి కొన్ని ఉదాహరణలు  :  చాగంటి గారు లాంటి వారు  చెప్పిన దాంట్లో ఆవగింజ లో అరవయ్యవ భాగం ఏదో ఒకటి విని, ఆయన గురించి పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ మాట్లాడేసేయటం.  ఈ అయ్యప్పకి ఆడవాళ్ళం టే పడదా అంటూ హేళన చేయడం (ఇది ఎంత దాకా  వచ్చిందంటే ఎవరి నమ్మకాలతో కూడా పనిలేకుండా – అయ్యప్ప గుడిలో ఆడవారిని అనుమతిచ్చే దాకా). ‘ఈ స్వాములను ముట్టుకోకూడదు కానీ పొప్ చూడండి  అందర్నీ కౌగిలించుకుంటారు’ అంటూ జీయర్ స్వామిని,  పీఠాధిపతులనీ అవమానించటం. అది వేరే మతస్తులు కాదు. హిందువులే !! అదీ  భారతదేశపు వాసులే !! ఇటువంటి వారికి – వారి  చదువు, ఇతరుల కి వారు చేస్తున్న సేవ  నేర్పిస్తున్న సంస్కారం ఇదేనా అన్పిస్తుంది. సాటి  భారతీయుడి నమ్మకాల మీద ఎందుకింత అగౌరవం? అమెజాన్  అమ్మకాలు అయితే ఆపగలిగాము కానీ  మరి ఇటువంటి వారిని ఏం  చేస్తున్నాము ? ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా  పట్టలేడు కదా మరి !!  మన బంగారం మంచిదయితే అమెజాన్ వారి లాంటి వారిని అనుకోవడం దేనికి ?

భారతీయులందరూ నా సహోదరులు అని రోజు ప్రతిజ్ఞ చేయటం కాదు. సాటి  మనిషిని, వారి సంప్రదాయాలని గౌరవిస్తూ చేసిన ప్రతిజ్ఞ ని ఆచరణ లో కూడా పెట్టాలి. లేకపోతే   రోజు అమెజాన్ వినాయకుడి మీద  కాళ్ళు తుడిపించేందుకు ప్రయత్నించారు.  రేపు అంగారకగ్రహం వారు వచ్చి ఇంకో విధం గా ఈ హిందూ ధర్మాన్ని అవమాన పరచినా ఆశ్చర్యపోనక్కరలేదేమో మరి!!

ప్రకటనలు

14 thoughts on “మన బంగారం మంచిదయితే..”

 1. వినాయకుడిని మనం పూజిస్తామని తెలిసీ డోర్ మేట్లపై వేసారంటే ఎంతకు దిగజారారో చూడండి.హిందూయిజం లో బోలెడు లోపాలుండవచ్చు కానీ ఒకరు పూజించే దేవుడిని అలా అవమానించడం సరికాదు.నేను కానీ ఆ డోర్ మేట్ చూస్తే కాల్చి వచ్చేదాన్ని.విదేశాలకు మన ప్రధానులు వెళ్ళి పెట్టుబడులు పెట్టండి అని అడుక్కుంటుంటే పెట్టుబడిదారులు ఇలాగే హీనంగా చూస్తారు.మన దగ్గర తెలివితేటలు,కష్టించే మనస్థత్వం ఉండి వాళ్ళను అడుక్కోవడమేమిటో నాకు అర్ధం కాదు. అడుక్కునేవాడు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా వాడిని బిచ్చగాడనే అంటారు.బిచ్చగాళ్ళను ఇంతకన్నా గౌరవంగా చూస్తారా ?

  మెచ్చుకోండి

 2. బ్లాగు మిత్రులు శరచ్ఛంద్రిక గారికి

  నమస్కారం.

  తెలుగు బ్లాగులోకంలో మీదైన శైలిలో రచనలు చేస్తున్నందుకు, ఆ విధంగా అంతర్జాలంలో తెలుగు పాఠకులకు మరింత చేరువవుతున్నందుకు ముందుగా మీకు అభినందనలు. మేము ఇటీవలే అంతర్జాలంలో రచనలు చేస్తున్న తెలుగు రచయితలు అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఒక వినూత్న ప్రయత్నాన్ని చేస్తూ ప్రతిలిపి.కామ్ అనే వెబ్‌సైట్ ప్రారంభించాము. ఒక బ్లాగులో మీరు ఎలాగైతే రచనలు చేస్తారో.. అదే విధంగా మీరు ప్రతిలిపిలో కూడా లాగిన్ అయ్యి మీ రచనలు, టపాలు ఉచితంగా పోస్టు చేసుకోవచ్చు. ఆ పోస్టులన్నియు కూడా ఈబుక్స్ రూపంలో, ఈ ఆర్టికల్స్ రూపంలో దర్శమిస్తాయి. వాటిని మీరు ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇదో కొత్త ప్రయత్నం. ప్రతిలిపిలో ప్రచురితమయ్యే ఉచిత పుస్తకాలు, వ్యాసాలు అన్నియు కూడా ఎప్పటికప్పుడు ప్రతిలిపిలో మీ పేరు మీద డేటాబేస్‌లో నిక్షిప్తం అవుతాయి. ఆ విధంగా నిక్షిప్తం అయ్యే మీ పోస్టులను ఎప్పటికప్పుడు మీరు ఒక బ్లాగును ఎలాగైతే యాక్సెస్ చేస్తారో అలాగే యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతిలిపిలో మీ ప్రొఫైల్‌ మీకు ఒక ఆన్‌లైన్ గ్రంథాలయంగానూ ఉపయోగపడే అవకాశం ఉంది.

  ప్రతిలిపిలో లాగిన్ అయ్యేందుకు మీరు http://telugu.pratilipi.com వెబ్‌సైట్‌ని వీక్షించగలరు.

  మీరు మీ బ్లాగును మేమే ప్రతిలిపిలోకి మార్చేందుకు కూడా అనుమతిని అందజేయవచ్చు.

  ప్రతిలిపి గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనేందుకు మీరు మాకు telugu@pratilipi.com ఈమెయిల్ అడ్రసుకు మెయిల్ చేయగలరు లేదా 9247810639 నెంబరులో గానీ సంప్రదించగలరు. ధన్యవాదాలు.

  ప్రతిలిపిలో రచయిత నమూనా ప్రొఫైల్
  http://telugu.pratilipi.com/gurajada-apparao

  ధన్యవాదాలు,

  మీ భవదీయుడు.
  కొయిలాడ.బాబు, ప్రతిలిపి తెలుగు విభాగం, బెంగళూరు.

  మెచ్చుకోండి

 3. మీరు ఇంటి దొంగలని క్షమించేసారు. నేను వీళ్ళని అంతహ్సత్రువులంటాను. వాళ్లకి తెలియదు, సరైన గురువుని స్వీకరించి తెలుసుకొనే ఓపిక లేవు. మనల్ని మనం చిన్నచూపు చూస్తూ తక్కువ చేసుకోన్నంతకాలం బయటవల్లని అని ప్రయోజనం లేదు. ముందు మనలో ఉన్న కలుపుమోక్కలని ఎరేయ్యాలి.

  మెచ్చుకోండి

 4. Identified the problem is well done. Where is the solution mode. Excusing is OK but next what. Chandrika ji, the strength of the blog could be to come out with solutions.
  Suggest to bring amazon to court of law in India. I am sure there will be lawyers to take up the case.
  Suggesting the importance of the Dharma & the way the peetadhipathis lead their lives etc..
  People may perceive them the way they want, at least you would have set a direction.
  By & large a well directed article. Congratulations!!!

  మెచ్చుకోండి

 5. ఉన్నవీలేనివీ చెప్పి ముప్పైమంది మరణానికి పరోక్షంగా కారణమైన చాగంటిమీద మీకు అవ్యాజమైన అభిమానం ఉండడం ఆశ్చర్యకరం.

  ఈయన ఫక్తు కులపిచ్చి పురుషుడు (ఓహొ… దాన్ని సనాతన ధర్మ ప్రచారం అనాలికదూ).
  ఈయన చెప్పే రామాయణం మీరువిన్నారా? రాజుగారి భార్య గుర్రంతోపడుకొంటే అవతారపురుషుడు పుట్టాడట. ఎంత గొప్ప విషయమిది!!
  ఈయన చెప్పే సూక్తులు ఒక్క బేమ్మలకు తప్ప ఇంకెవరికీ అణాకాణీ లాభం చెయ్యవు.
  స్త్రీలను అణచిఉంచడంలో ఇస్లాంకంటే పెద్దపాత్ర పోషించిన హిందూమతానికి ఈయన ప్రచారం చేస్తాడు, దానిని మీరు పొగుడుతారు.

  మెచ్చుకోండి

  1. చదివినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చని విషయాలు చెప్పారు. మీ అభిప్రాయము మీది. నాకు నచ్చిన విషయాలు నేను వ్రాసాను. నా అభిప్రాయము నాది.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s