నా గురువు నాటిన విత్తనం

‘అంజయ్య నల్లన అంజయ్య బొజ్జ పెద్దన ఎందువలన ? ‘ అంటూ ఒక రోజు మేము సప్తపది సినిమాలో  ‘గోవుల్లు తెల్లన’ కి పేరడీ కి కట్టిన పాట పాడుతూ గట్టిగా నవ్వుకుంటున్నాము. ఇంతలో మా క్లాసు టీచర్ రావటం మా పాట వినటం జరిగింది.  అలా పాడిన వారిని లేచి నిల్చోబెట్టి మన రాష్ట్ర ముఖ్య మంత్రి ని వెక్కిరించటం అంటే ఇంట్లో తండ్రిని వెక్కిరించినట్లే  అని మందలిచ్చారు. ఆయన ఎవరో ఆ స్థాయి కి ఎలా వచ్చారో మీకు తెలీదు కాబట్టి అలా  హేళన చేయద్దు అన్నారు. ఈ సంఘటన నేను ఎలిమెంటరీ స్కూల్  తరగతి  లో ఉన్నపుడు బహుశా 1981-82 ల మధ్య జరిగినది. మేము  పాడిన ఆ పాట  అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి  T.అంజయ్య గారిపై (అంజయ్య గారు   హైదరాబాదు లో  Allwyn ఫ్యాక్టరీ లోని  ఒక సామాన్య ఉద్యోగి స్థాయి నుంచి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అయ్యారు).  

ఒక ఆర్నెల్ల క్రిందట – రాహుల్ గాంధీ బెంగళూరు కాలేజికి వెళ్లి  ‘స్వచ్చ్ భారత్  పని చేస్తున్నదా’  అంటూ తన ప్రసంగం మొదలుపెట్టారు. ఆ విద్యార్థినులు  ‘పని చేస్తోంది’ అని చెప్పగానే భారత దేశం అంతా  ముఖపుస్తకం లోను,  whatsapp లో పడీ పడీ  నవ్వుకున్నారు .  

ఈ మధ్య భాజపా  రెండేళ్ల పాలన పూర్తి అయిన కారణం గా ఏదో టీవీ ఛానెల్ లో స్మృతి  ఇరానీ  గ్గారు – ఆవిడ శాఖ ఏమి  చేసిందో ఏమి చేస్తుందో  ప్రశ్నోత్తరాల కార్యక్రమం ద్వారా చెప్తున్నారు.  మధ్యలో ఎవరో కాంగ్రెస్ వారు (నాకు పేరు  తెలియదు) ఒక అప్రస్తుత ప్రసంగం చేశారు –  “గూగుల్  లో  ‘Most Stupid PM’  అంటే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరే వస్తుంది చూడండి” అంటూ .  

పోయిన వారం నరేంద్ర మోదీ అమెరికా పర్యటన లో క్యాపిటల్ హిల్ లో ప్రసంగం అయిన  రెండో రోజున whatsapp లో ఈ సందేశం:

**********************************************************************

I got a call from my American friend today.

He asked me – what is “Monkey Bath”?

I was very much surprised…. Monkey Bath!!  I have never heard about it.

He told me that entire America is talking about this Monkey Bath between Obama and Modi.

I told him – You stupid…It is not Monkey Bath, but it is ..

मन की बात

😜😃

***********************************************************************

భారత ప్రధాని  నరేంద్ర మోదీ – ఒకప్పుడు రైలు స్టేషన్ టీ అమ్ముకున్న యువకుడు – ఈ రోజున ప్రపంచం లో అతి పెద్దదైయిన  ప్రజాస్వామ్యం లో  అత్యధిక మెజారిటీ  తో ఎన్నిక కాబడిన  నాయకుడు.  అటువంటి వ్యక్తి యువతకి ఎంతో  స్ఫూర్తి దాయకం. ఆయన చెప్పే పనుల చేయమని  యువత ని ప్రోత్సహించవలసింది పోయి మనమే ప్రతిదీ హాస్యాస్పదం గా మార్చటం వలన ఎవరికి నష్టం కలిగిస్తున్నాము ? దేనికి నష్టం కలిగిస్తున్నాము?  ప్రతి రైలు పెట్టె దగ్గరికి వెళ్లి’ చాయ్ చాయ్’ అంటూ అరిచిన  పిల్లవాడు అమెరికా క్యాపిటల్ హిల్ లో Standing Ovation తీసుకున్నవ్యక్తి గా మారిన విషయం  మన కి జోక్  గా కన్పిస్తే –  మన పిల్లలకి  కూడా ఆ వ్యక్తి జోకర్ గానే కన్పిస్తాడు. రేపు  వారికి పెంచిన తల్లి తండ్రులు, విద్య నేర్పే గురువులు ఎంత పెద్ద జోకర్లు  అవుతారో ఒకసారి ఆలోచించండి!!

రాహుల్ గాంధీ ఇలా ఒక విద్యాసంస్థ కి కి వెళ్లి,  విద్యార్థులతో ఈ విధం గా మాట్లాడవచ్ఛునా  అని ఎవరు మాట్లాడినట్లు లేదు.  ఎంత  ప్రతి పక్షం లో ఉన్నా కనీసపు నీతి నియమాలు పాటించలేని ఇటువంటి వ్యక్తుల తీరును ఎవరూ ఖండించినట్లు గా  కూడా వినలేదు మరి.

నా ఈ టపా కి కారణం: పైన చెప్పిన whatsapp లో సందేశం చూసి నేను చాలా తీవ్రం గా  స్పందించడం జరిగింది.  ఆ సందేశం పంచిన వ్యక్తి మనసు గాయపరిచానేమో !! కానీ  – ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా’ అంటూ  భారత దేశం ఖ్యాతి ని  ప్రపంచం నలుమూలల చాటుతున్న ఆ ప్రధానిని, ఆ సందేశం ఆ విధం గా హేళన  చేస్తుంటే దాని  గురించి మాట్లాడకపోవడం కూడా  నేను పరోక్షంగా  నా మౌనంతో సమ్మతి ని చెప్పినట్లే  కదా అన్పించింది.

ఆ రోజు టీచర్ మమ్మల్ని ఎందుకు మందలిచ్చారో మాకు అస్సలు అర్ధం కాలేదు. ‘ జోకు ని జోకు లాగా  తీసుకోవచ్ఛు కదా ‘ అనే అనుకున్నాము. ఆ తరువాత ఎప్పుడూ ఎవరినయినా హేళన చేయాలంటే  తిడతారేమో అని భయం వేసేది .  ఎందుకు చెప్పారో అర్ధం అయ్యాక  హేళన చేయడానికి మనసు రాలేదు. పైగా అమెరికా లో  పెరిగే మా పిల్లలకి  ‘ Look at the bright side of it’ అంటూ  చెప్పడం మొదలుపెట్టాను.  నాకు ఆ రోజు ఈ విత్తనం నా మనసు లో నాటి, ఈ అవగాహన ని కల్పించిన నా గురువుకి పాదాభివందనములు _/\_.

గమనిక: నేను  నరేంద్ర మోదీ భక్తురాలిని కాదు. నేను ఆయనని ఓటు వేసి ఎన్నుకోలేదు.

11 thoughts on “నా గురువు నాటిన విత్తనం”

  1. ఒకప్పుడు రైలు స్టేషన్ టీ అమ్ముకున్న యువకుడు – ఈ రోజున ప్రపంచం లో అతి పెద్దదైయిన ప్రజాస్వామ్యం లో అత్యధిక మెజారిటీ తో ఎన్నిక కాబడిన నాయకుడు.

    నిజమే ! అధికారం అంత తేలిగ్గా రాదు అని ఆయనకు తెలుసు, పిల్లలకు తెలియదు కదా ? ఒక చాయ్ అమ్ముకునేవాడు లీడర్ అవ్వాలంటే ఎన్ని వెధవ వేషాలు వేయాలో,వేసాడో మనమే చెప్పాలి.నరమేధం చేయాలి, అవతలివారిని రెచ్చగొట్టాలి,భయోత్పాతం సృష్టించాలి,చేతిలో కత్తి చూపించి బెదిరిస్తుండాలి, చేసేది తక్కువగా ఉండి వాగేది ఎక్కువగా ఉండాలి,దేశదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చి జనాన్ని ముంచాలి.

    మెచ్చుకోండి

  2. ఫోటోలకు ఫోజులిచ్చేసి స్వచ్చ భారత్ అంటే అయిపోదు కదండీ, ఒక్కరోజన్నా వెనక్కి తిరిగి చూసారా ? రాహుల్ గాంధీ ఈ విషయమే అడిగారు. ఇంటర్ నెట్ లో గోల చేయడం ఎంతసేపు ? ఎన్నో కుంభకోణాలు చేసారన్నారు,మూడేళ్ళలో ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదా ? అబద్దాలతో కొంతకాలం మోసం చేయవచ్చు,ఎల్లకాలమూ మోసం చేయలేరు. కాంగ్రెస్ అభిమానిగా నా కోపం నాకూ ఉంటుంది. రాహుల్ పేరెత్తితే నేను ఇలాగే వ్రాయవలసి వస్తుంది.

    మెచ్చుకోండి

    1. నేను వ్రాసింది పాఠకులకి సరిగ్గా అందించానా లేదా అనుమానం కలుగుతోంది మీ వ్యాఖ్య చూస్తే. నేను రాజకీయాలు మాట్లాడలేదు. ఏ పార్టీల గురించి చెప్పలేదు. ఆ ప్రధాని కుర్చీలో కూర్చున్న వారికి గౌరవం ఇవ్వమని చెప్తున్నాను. రాహుల్ గాంధీ బహిరంగ సభ పెట్టి ఆ మాట మాట్లాడవచ్చు. కానీ ఒక విద్యా సంస్థ కి వెళ్లి మాట్లాడవలసిన మాట కాదు. ఒకప్పుడు రాజకీయ నాయకులకి ఎంత వైరం ఉన్నా కొంత నైతికత ఉండేది. ఇంత దిగజారుడు గా ఉండేవారు కాదు. ఆ నైతిక విలువల గురించి మాట్లాడుతున్నాను నేను. రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయి, ప్రతి పక్షం లో మోదీ ఈ విధం గా మాట్లాడినా నేను ఇదే చెప్తాను. మీకు మోదీ ఇష్టం లేకపోవచ్చూ ఉండవచ్చు. కానీ నా లాంటి ప్రవాసభారతీయులకి ఒక గుర్తింపు తెస్తున్నారు. అందుకే ఆ గౌరవం అంతే. అది నేను ప్రాక్టీకల్ గా చూసాను. చూస్తున్నాను. జూన్ 8, 2016 న భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా క్యాపిటల్ హిల్ లో ప్రసంగించారు. ఆ రోజు అమెరికా లో రేడియో వార్తలలో మోదీ పర్యటన గురించి చెప్పారు. అమెరికా మీడియా వారు ఇలా చెప్పడం చాలా అరుదు. అంతటి ప్రాముఖ్యత ని సంతరించుకున్నది ఆ ప్రసంగం. అమెరికా అధ్యక్షులు ఒబామా భారత దేశ పర్యటన గురించి కూడా వార్తలలో చెప్పగా వినలేదు మరి!! DC లో పని చేసే ప్రవాస భారతీయులు, కార్యాలయాలని నుంచి ఆ భోజనాల సమయం లో ఆయనని చూడటానికి వెళ్లారు. ఆయన ని చూడటానికి పరుగు పరుగు న వెళ్తున్న వీడియో ఒకటి చూసాక అన్పించింది – భారత దేశం లో రాజకీయనాయకుడు బహిరంగ సభ అంటే లారీల్లో జనాలని తెచ్చేవారు నా చిన్నపుడు. కానీ నరేంద్ర మోదీని చూడటానికి పని కూడా వదిలేసి వస్తున్నారు. అదీ ప్రవాసం లో !!అందరికి ఇంత ప్రీతిపాత్రుడు అవ్వడానికి ఏంటి ఈయన ప్రత్యేకత అని చాలా ఆశ్చర్యం వేసింది. మీకు నచ్చినా నచ్చకపోయినా అవునన్నా కాదన్నా ఆయన యువత కి మంచి ప్రేరణ ఇస్తున్నారు ఆయన మాటలతో . మంచి చెప్తున్నప్పుడు అది అనుసరించేవారు ఎప్పుడైనా బాగుపడ్తాడు. సమాజాన్ని బాగు చేస్తాడు. వీడెవడో నాకు చెప్పేది ఏంటి అని అహంకారం తో ఉండేవాడిని ఎవరు బాగుపరచలేరు కదా !!

      మెచ్చుకోండి

  3. ఆ ప్రధాని కుర్చీలో కూర్చున్న వారికి గౌరవం ఇవ్వమని చెప్తున్నాను.

    నేను కూడా అదే అడుగుతున్నాను.మన్మోహన్ సింగ్ గారిని వాళ్ళు ఎంతగా అవమానించారో ఒక్కసారి గుర్తుకుతెచ్చుకండి.

    మెచ్చుకోండి

  4. నా లాంటి ప్రవాసభారతీయులకి ఒక గుర్తింపు తెస్తున్నారు. అందుకే ఆ గౌరవం అంతే. అది నేను ప్రాక్టీకల్ గా చూసాను.

    ప్రవాసులెపుడూ ప్రవాసులే, మీకంటూ గుర్తింపు ఉంటే ప్రవాసం వెళ్ళరు.
    మీరు గొప్పగా పొగుడుతున్న ప్రధానికి 5 సార్లు వీసా తిరస్కరించడానికి కారణం ఏమిటి ?

    మెచ్చుకోండి

  5. ఆయన ని చూడటానికి పరుగు పరుగు న వెళ్తున్న వీడియో ఒకటి చూసాక అన్పించింది.

    సన్నీలియోన్ కనిపించినా అలాగే పరిగెడతారు.

    మెచ్చుకోండి

  6. ఆయన యువత కి మంచి ప్రేరణ ఇస్తున్నారు.

    రేపు గెల్చిన తరువాత డోనాల్డ్ ట్రంప్ కూడా ప్రేరణ ఇస్తున్నాడు అని మీరు వ్రాసినా నేను ఆశ్చర్యపోను. 1992 లో ఏమి జరిగిందో నాకొడుకు చూడలేదు వాడికి మోడీ ఒక ఇన్స్పిరేషన్ ! నా అభిప్రాయం వాడి అభిప్రాయం కలవాలని లేదు.

    మెచ్చుకోండి

    1. నేను రాజకీయ పార్టీల గురించి చెప్పాలనుకుంటే ఒక పెద్ద జాబితా విప్పగలను. వాదించగలను. నా టపా ఉద్దేశ్యమే అది కానప్పుడు నేను మీతో వాదించను. నా బ్లాగు లో నా అభిప్రాయాలు చెప్పబడతాయి. మీ అభిప్రయాలేవో మీ బ్లాగు లో చెప్పండి. చదువుతాము.

      మెచ్చుకోండి

Leave a reply to నీహారిక స్పందనను రద్దుచేయి