అందమైన ఆకాశం

701968_1041400002619396_8214060848905847950_o“సెగెట్రీ ,ఆకాశం లో ఎవరో మర్డర్ చేసినట్టు  లేదూ.  మనిషన్నాక  కాసింత కళా  పోషణ ఉండాలోయ్!!” ముత్యాల ముగ్గు లో రావుగోపాలరావు డైలాగ్ . ఈ చిన్న డైలాగ్  బట్టి చెప్పచ్చు ఆ మనిషి యొక్క మనస్తత్వం. అందమైన ఆకాశాన్ని చూస్తే  ఒక విలన్ పాత్ర  ఇంత  వికృతం గా  ఆలోచించడమే  కాదు  ఆయన  సెక్రటరీ ని కూడా అలా  ఆలోచింపచేయిస్తున్నాడు.

ఈ రోజు ఆఫీస్ నుంచి వస్తుంటే చూసాను.  ఆకాశం మేఘావృతం అయ్యేలా అయింది. ఒకతను పెద్ద కెమెరా పట్టుకుని  ఆ మబ్బుల్ని తన కెమెరా తో బంధించాలని చూస్తున్నాడు. అప్పుడు అన్పించింది  – అందమైన ఆకాశం చూస్తే కవి కవిత్వం అల్లుతాడు, చిత్రకారుడు  చిత్రం గీసేస్తాడు, రచయిత కథలు అల్లేస్తాడు, విలన్ పాత్ర ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచిస్తాడు అని ముళ్ళపూడి వారు చిన్న డైలాగ్ తో ఎంత బాగా చెప్పారో  కదా అని !!

అందుకే ఆ చలన చిత్రాలు ఇప్పటికీ  అలా గుర్తుండిపోయాయేమో

 

ఇంతకీ చెప్పేదేంటంటే ఇటువంటి చిత్రాలు  నా లాంటి బ్లాగరు అయితే బ్లాగు ద్వారా ప్రపంచానికి చాటి చెప్తారు  

ప్రకటనలు

6 thoughts on “అందమైన ఆకాశం”

  1. నిన్న (జూన్ 28) ముళ్ళపూడి వెంకట రమణ గారి జన్మదినం. ఓ టీవీ ఛానెల్ వారు వేసిన “ముత్యాలముగ్గు” సినిమా తప్ప ఎవరూ పెద్దగా ఆయన్ని తలుచుకున్నట్లులేదు.

    మెచ్చుకోండి

  2. చంద్రిక గారు,
    నా బ్లాగ్ లో మీ కామెంట్ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. మీ బ్లాగు లోని ఒక్క అక్షరం కూడా చదవక ముందే నాకు మీ బ్లాగు గురించి సదభిప్రాయం ఏర్పడిపోయింది, తులసి మొక్క్స్ చిత్రం చూసి.
    కామెంట్ల గురించిన మీ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.

    మెచ్చుకోండి

  3. ఫొటోస్ సూపర్ గా ఉన్నాయి మేడం.
    ప్రధాన చిత్రమైతే అచ్చం ఓ చిత్రకారుడు
    కుంచెతో వేసిన వర్ణ చిత్రం లా ఉంది.
    ప్రకృతి కన్నా అద్భుతమైన చిత్రకారులెవరూ
    ఉండరన్నది మాత్రం నిజం.
    🙂

    మెచ్చుకోండి

    1. ధన్యవాదాలండి . అక్టోబర్ నెలలో ఆకాశం ఈ విధం గా బాగా కన్పిస్తుంది. మరి ఎందుకో తెలీదు. ఇక ఉండబట్టలేక ఒక రోజు సిగ్నల్ దగ్గర ఆగి ఫోటో తీయడం జరిగింది.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s