శిక్ష వేస్తే సమస్య తీరిపోదు

చాలా రోజుల తరువాత స్నేహితురాలి దగ్గరనించి సందేశం. ‘ఏ వీడియో నో ఏ  సూక్తి ముక్తావళి’ పంపిందో అని చూసా.  ఒక కారు ప్రమాదం వార్త.  పేపర్ లో ఎప్పుడూ చదివే వార్త ల్లాగా పక్కన పెట్టా. కాసేపయ్యాక ఇంకొక సందేశం ‘ఎవరో గుర్తు పట్టావా ‘ అంటూ.  ఎవరో గుర్తు చెప్పేసరికి, బాధ మొదలయింది.  ఆ వార్త మొత్తం మళ్ళీ గబా గబా చదివాను. గుండె ని పిండేసినట్టయింది.  ఆ రోజు ఇక ఏ పని చేయబుద్ధి కాలేదు. ఏం  చేస్తున్నా ఆ వార్తే గుర్తు వస్తోంది. పెళ్ళై అమెరికా కి వచ్చేసాక  పెద్దగా మాట్లాడింది లేదు తనతో. తనకి ఇంతటి  కష్టం ఏంటి అని మనసు తొలిచేసింది. ఆ వార్త ఇటీవలే జరిగిన  పంజాగుట్ట లో జరిగిన కారు ప్రమాదం.  అందులో మరణించిన ఆ చిన్నారి రమ్య, తల్లి రాధిక నాకు స్నేహితురాలు.

మీడియా లో వచ్చిన వార్తలని బట్టి  నాకు అర్ధం అయింది ఏంటంటే –  కొందరు  కుర్రవాళ్ళు మిట్ట మధ్యాహ్నం బార్ కి వెళ్లి మద్యం సేవించారు. అందులో డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని ఒక ఇరవయ్యేళ్ళ కుర్రవాడు ఇంకొకరి కారు నడిపాడు. మద్యం త్రాగి నందు వల్ల  కారు అదుపు తప్పి, రాధిక  కుటుంబం  ప్రయాణిస్తున్న కారు మీద ఎగిరిపడింది.  ఇది వింటే ఎన్నో ప్రశ్నలు :

 • ఇంజినీరింగ్ చదువుతున్న వాళ్ళు  బార్ల వెంట తిరగటం ఏంటి ?
 • అసలు మిట్ట మధ్యాహ్నం తాగడం ఏంటి ?
 • వీళ్ళ కి మద్యం అమ్మిన ఆ బార్ వాళ్ళు ఎవరు?
 • అంత డబ్బు కుర్రవాళ్ళకి ఎక్కడిది?
 • లైసెన్స్ కూడా లేకుండా తనది కాని  కారు నడపడటం ఏంటి ?
 • ఎంత వేగం తో వచ్చి ఉండకపోతే  కారు గాల్లో ఎగిరిపోతుంది?  

ఇటువంటి వారికి కఠిన శిక్ష పడాలనే అంటాను.  కానీ ఇతన్ని ఒక్కడ్ని శిక్షించినంత మాత్రాన  సమస్యలు తీరి పోతాయా ? రేపు ఇంకొకరు చేస్తారు. నేను పైన చెప్పిన  ప్రశ్నలకి  ఈ కుర్రవాడు ఒక్కడే నా  బాధ్యుడు? చుట్టూ ఉన్న సమాజం బాధ్యత కూడా లేదంటారా ?  చట్టాలు ఎంత కఠినం గా ఉన్నా,   ఈ పరిధిని అతిక్రమించకూడదు అన్న సామాజిక స్పృహ, నైతిక విలువలు మనలో ఉన్నపుడే  ఏవైనా పనికి వస్తాయి.  లేకపోతే పుస్తకాలకే పరిమితం అవుతాయి అని నా అభిప్రాయం.

మరి యువతకి  సామాజిక స్పృహ, నైతిక విలువలు ఎవరు నేర్పిస్తారు ? తల్లి తండ్రులా ? ఉపాధ్యాయులా ? అన్ని వేళలా  ‘Live’  అందించే మీడియా వారా? పోలీసులా ? చట్టమా?

మన సినిమాలలో కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకుని, వేగం గా కారు/బైకు  నడుపుతూ   హీరో ప్రవేశించడం  జరుగుతుంటుంది. అలా  హీరో ని చూడగానే హాలులో ఈలలు మొదలవుతాయి.  ఇలా చేస్తే అమ్మాయిలు మనవెంట పడతారు కదా అనిపిస్తుంటుంది.  సినిమా నిజజీవితం లో ప్రవేశిస్తుంది.  దురదృష్టవశాత్తు  సినిమా హీరోలని  ఈ విధం గా అనుకరణ చేయడం మొదలుపెడతారు యువత!!

‘నేను తాగను. నాకు అలవాటు లేదు ‘ అన్న మాటలు ఎవరైనా చెప్తే, ‘అప్పుడప్పుడు కొంచం ఫార్మాలిటీ కి అన్నా తాగాలండి. ఇలా చేతులు ముడుచుక్కూర్చుంటే బాగోదు’  అంటూ హేళన ధ్వనించిన  మాటలు వినపడతాయి. లేదా  ‘మందు తాగని వాడు దున్నపోతై పుట్టున్’  అన్న రీతి లో హాస్యోక్తులు ఉంటాయి .  పైగా అటు పక్కకి వెళ్లి  ‘వీడొక పెద్ద మమ్ముగాడ్రా!!’ అంటుంటారు కూడా !! వేడుక ఏదైనా సరే మద్యం తాగితేనే ఆ వేడుక పూర్తయినట్లు  కొందరికి. ఇంకా సినిమాలలో , వాట్సాప్ , ముఖపుస్తకాలలో ‘మందు బాబులు’ అంటూ హాస్యోక్తులు సరే సరి!! ఇటువంటి మాటలు  చాలవా  యువత peer pressure కి లోనవ్వటానికి?

0.08% Blood alcohol చాలు మనిషి మెదడు ని మందగింపచేయడానికి  అంటారు ఇక్కడ DMV( Department of Motor Vehicles) వారు .  దీన్ని బట్టీ, పూర్తిగా మత్తు లోకి వెళ్లిన మనిషి కారు నడపడటం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.   తుపాకీ పట్టుకు పేల్చే వాడికి, మద్యం తాగి నడిపే వాడికి ఏమీ తేడా లేనట్లే లెఖ్ఖ. తన జీవితమే కాదు ఇంకొకరి జీవితాన్ని కూడా ప్రమాదం లోకి త్రోస్తున్నాడు కదా . అంతే కాదు, మద్యం త్రాగిన వాడు విచక్షణా జ్ఞానం కోల్పోయి  క్రూర జంతువు కంటే హీనం గా ప్రవర్తిస్తాడు కూడా. అందుకు  భయంకరమైన ఉదాహరణ ఢిల్లీ నిర్భయ కేసు.  ఇప్పుడు భారతదేశం లో కూడా దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంట్లో కారు ఉంటోంది.  కాలేజీ కి వెళ్ళడానికి పిల్లలు  కారు/ బైకు నడుపుతున్నారు. విద్యాలయాలు తమ వంతు బాధ్యతగా  పిల్లలకి  Driver’s Education విషయం లో తప్పనిసరిగా  తరగతులు నిర్వహించాలి.   

నేను భారతదేశం వచ్చినపుడు గమనించిన కొన్ని విషయాలు చెప్తాను  –

ఏ షాప్ కి వెళ్లినా విపరీతమైన రద్దీ. చీరలు, నగలు అన్ని ఎందుకు కొంటారో అర్ధం కాదు. నేను మూడేళ్ళకి ఒకసారి వెళ్లి కొనుక్కునే సరుకు వీరు రోజూ  కొంటారా అన్పిస్తుంది.   ఒక బ్లౌజ్ మూడు వేల రూపాయలు పెట్టి కొనుక్కుంటారు.  ఏ రెస్టారంట్ కి వెళ్లినా  లైన్ లో నిల్చునేటట్లు ఉంటారు. ఇంక పెళ్లి అంటే చెప్పలేము. ఎక్కడ లేని ఆర్భాటం!!  నూరు రకాల వంటలు, ఫుడ్ కోర్టులు (ఒక ఆడపిల్ల తండ్రి జీవితమంతా కూడబెట్టిన డబ్బు ఒక్క రోజు లో నీళ్ళల్లాగ ఖర్చు చేయటం).  ఇంత విచ్చల విడి గా డబ్బు ఖర్చుపెట్టడం నేను అమెరికా లో ఎక్కడా  చూడలేదు అంటే అతిశయోక్తి కాదేమో. భారత దేశం నిజం గా  బీద దేశమేనా  అన్పిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. డబ్బు ఉంటే ఖర్చుపెట్టడం తప్పు కాదు. ఇంత డబ్బు, సమయం ఇటువంటి వాటికి  వెచ్చించే  వారు సమాజ సేవ కి కొంత కూడా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. 

నేను షాపింగ్ కి వెళ్తున్నాను అంటే అందులో పెద్ద వింత కన్పించదు. రామకృష్ణ మఠం  వెళ్తున్నాను భోజనాలు పెట్టడానికి, అక్షయపాత్ర వంటిల్లు చూడ్డానికి వెళదామనుకుంటున్నాను అని చెప్తే నన్నొక తేడా మనిషి లాగా చూస్తారు.  సేవ  లేక service hours అన్న ప్రసక్తి  సామాన్య కుటుంబాలలో అంతగా లేదు. సేవాభావం  ఎప్పుడైనా ఎవరికైనా  ఒక బాధ అనుభవించినపుడు లేదా బాధ పడ్తున్న వారిని చూసినపుడో వస్తుంది. దాని నుంచే బాధ్యత అన్నదీ వస్తుంది. ఎప్పుడూ  పిల్లలకి ఏ  కష్టమూ లేకుండా సుఖమయమైన జీవితం చూపిస్తుంటే వారు మాత్రం ఏమి చేస్తారు ?  సామాజిక స్పృహ అన్నది లేకుండా  బాధ్యతా రహితంగానే తయారవుతారు.  అందరూ తల్లితండ్రులు అలా ఉన్నారని  చెప్పను కానీ  పిల్లల లో సేవాభావం కలుగజేస్తున్న తల్లితండ్రుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటోంది.

ఇలాంటి  ప్రమాదాలు జరిగినపుడు మనకి నేరస్తుడి మీద ఆగ్రహం కలగటం సహజం.  కానీ వారి చుట్టూ ఉన్న సమాజం కూడా ఒక మనిషిని నేరస్థుడి గా తయారు చేస్తుంది అని అంటాను నేను.  

ఈ వార్త చదివిన ప్రతి కుటుంబం,  వారి పిల్లలతో –  బాధ్యతారహిత  ప్రవర్తన ఒక ఆనందమయమైన జీవితం గడుపుతున్న కుటుంబాన్ని ఎంత  చిన్నాభిన్నం చేసిందో,  ఎంతటి దుష్పరిణామాలు కలుగచేస్తుందో తెలియజెప్పాలి.

ప్రకటనలు

7 thoughts on “శిక్ష వేస్తే సమస్య తీరిపోదు”

 1. చాలా బాగా చెప్పారు.

  నేను మందు తాగను అని ఒక సారి ఆఫీస్ పార్టీ లో అంటే నన్నేదో వింత జంతువును చూసినట్లు చూసారు అందరూ. అలా చూసిన వాళ్లలో ఆడవాళ్లు కూడా ఉన్నారు. నీకు సోషలైజ్ అవ్వడం తెలీదా ఇలా మందు తాగితేనే సోషలైజ్ అయినట్లు అని లెక్చర్ కూడా దంచింది ఒకావిడ అయితే మందు తాగుతూ.

  మెచ్చుకోండి

  1. ధన్యవాదాలండి. ‘ఎందరో మహానుభావులు’ గారు అన్నట్లు ఇది వరకు వంద లో ఒక్కరు తాగేవారు. ఇప్పుడు వందలో ఒక్కరే తాగని వారు ఉంటున్నారు. మీ బ్లాగు చదువుతున్నానండి. హాస్యభరితం గా బాగా వ్రాస్తున్నారు.

   మెచ్చుకోండి

 2. bharata desanni chinnapuchatam kaadu kaani ikkada sampadaana elaa vachchindi ani evariki akkaraledu, entha sampadinchamanedi maatrame mukhyam. ilantidedo jaragagaane kaasta hadaavidi cheyyatam kaasta saddu managagaane marachipovatam, saamaanyudu koodaa adedo cinemaa laa choosi vadileyatame tappa tamadaaka vaste paristhithi enti ani alochana ledu. inthaku munde spandinchalsi vundi, mana daggara raithulu ilaa cheste vallu laabha pade kanna nashta poyede ekkuva, mana vaariki oorike vachchevi ante moju, anduke kg lekkalo cheeralu ammakaalu ante inti panulu maanukoni mareee kontaaru. evarini nindinchatam naa abhimatam kaadu. vyavastha lo lopaalu choopinchataaniki prayatnam. ide praja systems vunna chotiki velthe khachitamgaa paatistaaru, mari mana desamlo enduku paatincharo artham kaadu, mana ante marintha jaagrathagaa vundaali kadaa. nirlakshyam enduko?

  మెచ్చుకోండి

 3. * మరి యువతకి సామాజిక స్పృహ, నైతిక విలువలు ఎవరు నేర్పిస్తారు ? తల్లి తండ్రులా ? ఉపాధ్యాయులా ? అన్ని వేళలా ‘Live’ అందించే మీడియా వారా? పోలీసులా ? చట్టమా? *

  నేర్పటానికి ఇంట్లో ఎవరు ఉన్నారు? తల్లి పాత్రే మాయమైపోయింది. ఎదైనా గేటేడ్ కమ్యునిటి కి వెళ్ళండి. ఉదయం 10గంటల తరువాత కర్ఫ్యు పెట్టినట్లు ఉంట్టుంది. ఇంట్లొ భార్య భర్త అందరు ఉద్యోగాలకు పోతారు. కాలని అంతా ఖాళి అయిపోతుంది. సెక్యురిటి గార్డ్ లు, చిన్న చిన్న పనులు చేసుకొనే వారు, ప్లంబర్ లు తప్పించి ఎవ్వరు కనపడరు.

  అలా అని పిల్లలు ఎమీ తక్కువ తినలేదు. తల్లిదండ్రులు ఎప్పుడైనా మందలిస్తే జవాబుగా టివి, సినెమాలు, సోషల్ మీడీయాలో వచ్చే డైలాగులు టక్కుమని చెపుతారు.

  మెచ్చుకోండి

  1. ఈ రోజుల్లో ఉండేదే ఎక్కువైతే ఇద్దరు పిల్లలు. చాలా మందికి ఒకరే. ఈ ఒక్క పిల్లల వారందరు ఇంటెర్ నెట్ చూసుకొంట్టు పెరిగి పెద్దయ్యే తరం. మాత్రుభాష ముక్క రాదు. నేర్చుకోవాలనే ఆసక్తి తల్లిదండృలకే ఉండదు. అందరు ఇంగ్లీష్ లో పుట్టి, మునిగి, భారత దేశం తో సంబందమే లేని ఒక ప్రత్యేక ప్రపంచంలో ఓలలాడుతూంటారు. తల్లిదండ్రుల మాట వినరు. పెద్దలంటే గౌరవం ఉండదు. స్కూల్ లో టిచర్లను వీళ్లే దబాయిస్తూంటారు. ఆ టిచర్ పొట్ట కూటికోసం నోరు మూసుకొని పనిచేస్తూంటాడు( కాలేజి లో లెక్చరస్ ను నన్ను అనేంతటివాడా? మా ఇంట్లో మా అమ్మానాన్నలే ఎమి అనరని కౌంటర్ ఇస్తారు.మార్కులు వేయకపోతే లక్షలు కట్టింది ఎందుకు అని ప్రశ్నిస్తారు. ఒత్తిడి చేస్తారు. వాడు ఎక్కువ మాట్లాడితే వాడి ఉద్యోగం పోతుంది. మా బంధుమిత్రులలో ఒకరు పెళ్లైన తరువాత సాఫ్ట్ వేర్ కంపెనిలో పని ఒత్తిడి గా ఉందని, టిచర్ ఉద్యోగం చేరితే అక్కడ పిల్లలు చేసే పనులను చూసి తట్టుకోలేక రాజినామ చేసి ఇంట్లో కూచోవటమే ఉత్తమం అని నిర్ణయించుకొంది.) వీళ్ళకి ప్రతి ఒక్కపని చిటికలో కావాలి. వీళ్ళు సామాజిక బాధ్యతలు తీసుకొంటారని ఎవరైనా ఆశిస్తారా?

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s