విజయవాడ జంక్షన్

విజయవాడ రైల్వే స్టేషన్ లో  రైళ్లు ఆగిపోయాయి అన్న వార్త చదివాకా , ఈ రోజు భండారు శ్రీనివాస రావు గారి బ్లాగు చదివాకా  కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

ఎండాకాలం సెలవల్లో ఒక్కోసారి మేము పిల్లలం ముగ్గురమే కృష్ణా ఎక్స్ ప్రెస్ లో బిట్రగుంట కి వెళ్లేవారం.  పగటి పూట  ప్రయాణం కాబట్టి మా నాన్న గారు కూడా బాగా ప్రోత్సహించేవారు మమ్మల్నే వెళ్ళమని.  పొద్దున్న 6 ఆరింటికి సికింద్రాబాద్ లో ఎక్కితే సాయంత్రం 5:40 కి బిట్రగుంట చేరుకునేవాళ్ళం. అస్సలు పడుకోకుండా అన్ని స్టేషన్లు లెక్కపెట్టేవాళ్ళం.  అందుకే  ప్రతి స్టేషన్ పేరు బాగా గుర్తుంది పోయింది ఈ రోజు వరకూ  కూడా.  విజయవాడ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే అమ్మమ్మ గారి ఊరికి సగం ప్రయాణం అయినట్లు లెక్క.  దగ్గరికి వచ్చేసినట్లేగా !! విజయవాడ రాగానే భోజనాలు మొదలు పెట్టేవాళ్ళం.  ఒకవేళ మంచినీళ్లు లేకపోయినా విజయవాడ లో దిగి పట్టుకోవచ్చు ట్రైన్ ఎక్కువ సేపు ఆగుతుంది అని.   ఒక్కోసారి విజయవాడ లో ఉండే  మా పిన్ని కుటుంబం కూడా కృష్ణా ఎక్స్ ప్రెస్ లో  మాతో కలిసేవారు. మా తమ్ముడు తిట్టుకుంటూ , మమ్మల్ని కొరకొరా చూస్తూ,  చిన్నవాళ్ళయిన పిన్నికొడుకులకి కిటికీ సీటు ఇచ్చేవాడు. విజయవాడ స్టేషన్  దాటగానే కృష్ణ బ్రిడ్జి చూడటం,  నాణాలు విసరటం!!  ఆ బ్రిడ్జి చూడటం ఈ రోజు కి కూడా ఒక మధుర అనుభూతి లా అన్పిస్తుంది. మా అమ్మాయి కూడా  మొన్న భారత దేశం వెళ్ళినపుడు  మొదటిసారి ఆ బ్రిడ్జి చూసి ఒక్కసారిగా  ‘wow’ అంది. అర్ధరాత్రి ఎంత నిద్ర మత్తులో అయినా బ్రిడ్జి  శబ్దం రాగానే  తెల్సిపోతుంది విజయవాడ దాటిందో లేదో !!   

ఎండాకాలం ముగియగానే, బిట్రగుంట నుంచి తిరిగి వచ్చేటపుడు హైదరాబాద్-మద్రాస్ ఎక్స్ ప్రెస్ లో వచ్చేవాళ్ళం. ఆ బండి లో  రిజర్వేషన్ దొరక్కపోతే , మా నాన్న గారు హైదరాబాద్ లో నే విజయవాడ  నుంచి నరసాపూర్  ఎక్సప్రెస్  లో టిక్కెట్లు కొనేవారు. అదెలా చేసారో ఆ రోజుల్లో నాకైతే తెలీదు. ఆ విషయం టెలిగ్రామ్/ఉత్తరం ద్వారా మా తాతయ్య కి చెప్పేవారు.  మేము  బిట్రగుంట నుండి లింక్ ఎక్స్ ప్రెస్ (ఇప్పుడు చెన్నై-హౌరా ఎక్స్ ప్రెస్  అనుకుంటా)  లో  విజయవాడ వెళ్లి అక్కడ  నరసాపూర్ ఎక్స్ ప్రెస్ ఎక్కేవారం.  ఆ విజయవాడ ప్లాటుఫారం మీద క్యారేజీ తీసి భోజనాలు పెట్టేది మా అమ్మ.  లేకపోతే టైం ఉంది అనుకుంటే గాంధీనగర్ లో మా నాన్న స్నేహితుడయిన మావయ్య వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం . అప్పుడు మాత్రం విజయవాడ స్టేషన్, బ్రిడ్జి చూస్తే మహా చిరాకుగా ఉండేది. మరి ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా  !! ఒకసారి నేను, నా స్నేహితురాలు వరలక్ష్మి  ఆరోజు  ఏదో ఆడుకోవాలని   ప్లాన్ చేసుకున్నాం. ఉన్నట్టుండి మా తాతయ్య వచ్చి బయలుదేరాలి అన్నారు. గబగబా భోజనం చేసి మధ్యాహ్నానికల్లా లింక్ ఎక్స్ ప్రెస్  ఎక్కాము .  మా నాన్న మీద ఆ రోజు ఎంత కోపం వచ్చిందో !!

1980 లో అనుకుంటా.  విజయవాడ-గూడూరు సెక్షన్ మాత్రమే ఎలక్ట్రిక్ ఇంజిన్లు ఉండేవి. సికింద్రాబాద్ వెళ్లే బళ్ళు విజయవాడ లో ఎలక్ట్రిక్ నుంచి డీజిల్ ఇంజిన్ కి మారేవి. బిట్రగుంట నుంచి విజయవాడ వరకు చాలా  ఫాస్ట్ గా వచ్చినట్లు అన్పించేది.

ఎప్పుడూ  ప్రయాణీకులతో 24 గంటలు అనౌన్సమెంట్ లతో  కళకళలాడిపోయే  నిశ్శబ్దం గా  విజయవాడ జంక్షన్ ఎలా ఉంటుందా అన్పించింది ఈ రోజు.

ప్రకటనలు

3 thoughts on “విజయవాడ జంక్షన్”

  1. విజయవాడ స్టేషన్ వచ్చేముందు ఔటర్ లో ఓ ఇరవైకు పైగా tracks మెలికలు తిరుగుతూ, criss cross గా, గజిబిజిగా ఉన్నా, మంత్రదండం చేతిలో ఉన్నట్టుగా సిగ్నల్ మాన్, cabin లో ఏవో తీగలు కలిపితే, విడివిడిగా ఉన్న రైలు పట్టాలు కలిసి, అంతంత పెద్ద రైళ్ళూ అలవోకగా పట్టాలు మారుతూ, బుద్ధిగా వెళ్ళవలసిన ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళడాన్ని చూడ్డం…. ఓ మాయలా ఉండేది.
    మీకూ నాకూ రైళ్ళు common memory point లా ఉన్నట్టుంది. 🙂

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s