అమెరికా లో పిల్లల సంరక్షణ

నేను ఈ మధ్య ఒక వ్యాసం చదివాను. అమెరికా లో ఉండే తెలుగు వారి మీద వ్యాసం. కొన్ని విషయాలు  చెప్పారు వ్యాసకర్త. అమెరికా లో కూడా నక్షత్రం,వారం చూసి పిల్లల్ని కనేవారు , పుట్టబోయేది ఆడపిల్ల  అని  తెలియాగానే  ఏడ్చే వాళ్ళు ఉంటారు అని…  ఆ వ్యాసం చదివాకా  అమెరికా లో ఇలాంటి చాదస్తులు ఉంటారా అన్పిస్తుంది. కానీ ఉన్నారు అందునా మన తెలుగు వాళ్ళే!!  అమెరికా లో పై చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడి  ఉండేవారి లో  ఇటువంటి వారు కూడా ఉంటారు అని చెప్పడం  మంచిదే. మంచి విషయం ఎంచుకున్నారు వ్యాసానికి అన్పించింది. అంత వరకూ  వ్యాసం బాగానే ఉంది. 

వ్యాసం లో నాకు కన్పించిన లోపం ఏంటంటే వ్యాసకర్త అవసరం లేని విషయాలు కూడాప్రస్తావించారు. అమెరికాలో ఉద్యోగాలు చేసే కొందరు భారతీయ తల్లులు,   పిల్లల్ని డే కేర్ సెంటర్ ల లో విడిచిపెట్టడం ఇష్టం లేక భారతదేశం లో ఉండే తల్లితండ్రుల దగ్గరికి పంపుతుంటారు.  లేకపోతే  తల్లితండ్రుల్ని పిలిపించుకుంటారు పిల్లల్ని చూసుకోవడానికి.  అటువంటి కుటుంబాల  గురించి ఆ  వ్యాసం లో వ్రాసారు  ఆ వ్యాసకర్త.  పిల్లలు పుట్టాకే తల్లితండ్రులు గుర్తొస్తారని, తల్లులకు సమన్లు పంపుతారని, జీతం బాగా పొదుపుచేయచ్చని  ఇలా తల్లుల్ని ఉచిత బేబీ సిట్టర్ లాగా చూస్తారని, పిల్లల ఎదుగుదల స్కైప్ లో చూసి ఏడుస్తుంటారని, అత్యాశ అని ఇలా అనవసర విషయాలతో ఒక రకమైన వ్యంగ్యం తో కూడుకున్న వ్యాసం లాగా అన్పించింది నాకు.    

డబ్బుల సంగతి పక్కన పెడితే, డేకేర్ లో పిల్లల్ని డే కేర్ లో పెట్టడానికి ఎందుకు ఇష్టపడరో, ఆ సాధక బాధకాలు ఏంటో నాకు తెలిసినంత వరకూ  చెప్తాను.   ఎముకలు కొరికే చలి లో, ఒక్కోసారి మంచు లో మంచి నిద్రలో ఉండే  చంటి పిల్లల్ని పొద్దుటే లేపి, డే కేర్ లో దింపాలి.  ఆహారం ఎంత చక్కగా వండిచ్చినా  డేకేర్ వాళ్ళు  శ్రద్ధగా పెట్టరు. పిల్లలు ఒక్కోసారి తింటారు ఒక్కోసారి తినరు. అమెరికన్ డే కేర్ ల లో అయితే పిల్లలకి ఏడాది దాటగానే  వాళ్ళంతట వాళ్ళే తినాలంటారు. మన పిల్లలు తినరు. సాయంత్రం వరకు ఒక్కోసారి తిండి లేకుండా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే –  ఏడాది లోపు పిల్లలకయితే  రోగ నిరోధక శక్తీ తక్కువ ఉంటుంది. వారిని తీసుకెళ్లి డేకేర్ లలో పెడితే, చీటికీ మాటికీ జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి డే కేర్ వాళ్ళు కూడా, వేరే పిల్లలకి కూడా అనారోగ్యాలు వస్తాయని  తగ్గు ముఖం పట్టే  వరకు రానివ్వరు. పిల్లలకి జలుబు వచ్చింది అనే దానికంటే ఆఫీస్ కి సెలవు పెట్టాలి అన్న బాధ ఎక్కవయిపోతుంది. దానితో  అటు ఆఫీస్ లోను సరిగ్గా పని చేయలేరు. ఇటు పిల్లలని సరిగ్గా చేసుకోలేరు.  నాకు తెల్సిన స్నేహితురాలికి తల్లి లేదు. అత్తగారు చేయలేని మనిషి. ఆరువారాల పాపని తీసుకెళ్లి డేకేర్ లో పెట్టారు భార్యాభర్తలు. ఉద్యోగం వదలుకోలేని పరిస్థితి లో వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ఇవన్నీ ఆలోచించే  చాలా మంది పిల్లలని చూసుకోవడానికి (ముఖ్యం గా ఏడాది లోపు ఉన్న పిల్లలని) ఇండియా నుంచి తల్లితండ్రుల్ని రమ్మని అడుగుతారు. వాళ్ళు రాలేని  పక్షం లో పిల్లలని ఇండియా కి పంపుతారు.  నేను ఇప్పటివరకు చూసిన  కుటుంబాలలో, ఓపిక లేని తల్లితండ్రులు  అమెరికా కి రాలేము అంటున్నారు.  ఓపిక  ఉన్న వారు అత్యంత ఉత్సాహం తో  మనువల ని, మనవరాళ్ల ను చూసుకుంటున్నారు.  అంతే కానీ అమెరికా లో నివసించే తెలుగు వారు వ్యాసకర్త చెప్పేంత వ్యాపార ధోరణి లో మాత్రం లేరు.

భారత దేశం నుంచి అమెరికా కి వచ్చే అమ్మాయిలు బాగా చదువుకున్న వారే అయి ఉంటున్నారు. అటువంటి వారు  ఉద్యోగం మానేయలేరు కదా. ఇంత చదువు చదువుకుని ఇంట్లో కూర్చోవటం ఏమిటి అన్పిస్తుంది.  

ఒకప్పుడు నేనూ  పైన చెప్పిన వ్యాసకర్త లాగే ఎందుకింత అత్యాశ అని ఆలోచించేదాన్ని. డబ్బు ఇంత అవసరమా అని అనిపించేది.  కనీసం పిల్లలు పెద్దవాళ్ళయ్యాక  ఉద్యోగాలు చేయవచ్చు కదా అనుకునేదాన్ని కూడా!!  కానీ,  కొన్ని స్వానుభవాలు, ఇతరుల అనుభవాలు చూసాక మరియు చూస్తున్నాకా,   నా అభిప్రాయం ఈ విధం గా మార్చుకున్నాను  :  అమెరికా లో ఎటువంటి పరిస్థితి లో అయినా సరే ఇద్దరు ఉద్యోగాలు తప్పనిసరిగా చేయాలి.  అమెరికా జీవితం పేక మేడ లాంటిది అని చెప్పవచ్చు. అన్నీ బాగా ఉన్నపుడు అందమైన జీవితం లాగే ఉంటుంది. చేస్తున్న ఉద్యోగం పోయినా, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం దెబ్బ తిన్నా ఒక్క సారి  జీవితం అంతా  తారుమారు  అయిపోతుంది. భారత దేశం లోను ఇదే పరిస్థితి వస్తోంది కూడా !! ఈ విషయాల గురించి ఇంకొక టపా  లో వ్రాస్తాను.

తోటి తెలుగు మాతృమూర్తులని  ఆ విధంగా క్రించపరచినందుకు చాలా  బాధ వేసి ఈ టపా వ్రాయడం జరిగింది.   ఏ తల్లయినా ఎప్పుడైనా  ఏ పని చేసినా  పిల్లల కోసమే చేస్తుంది అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశ్యం. డబ్బు కోసం అత్యాశ అనుకుంటే అసలు అమెరికాకే వలస రానక్కరలేదేమో కదా !!

ప్రకటనలు

3 thoughts on “అమెరికా లో పిల్లల సంరక్షణ”

  1. భారత్ లో కూడా పిల్లలని డే కేర్ సెంటర్ కి పంపుతున్నారు, ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారు. అది తప్పని సరైపోయింది. సమస్యలూ ఉన్నాయి. పెద్దలుంటే వారిని దగ్గరుంచుకోవడమే మంచిది, ఇది డబ్బు ఆదా కంటే పిల్ల భవిషయత్తుకు మంచిది. ఉమ్మడి కుటుంబాలలో వారు పిల్లల్ని అలాగే సాకుతారు. అక్కడికి రాలేని పెద్దవారి దగ్గరకి పిల్లని పంపదమూ తప్పూ కాదు. ఎవరి అవసరం బట్టివారు చేస్తారు, ఇందులో తప్పు పట్టవలసినదేంలేదు. ఇక ఆదపిల్ల పుడుతుందంటే ఏడ్చేవాళ్ళని భగవంతుడు కూడా రక్షించలేడు.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s