ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు

‘ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు?’

‘ మా బాలవికాస్ లోనే. పిల్లలు 11 గంటలకి  భజనలు  మొదలు పెడ్తారు.  సరిగ్గా పన్నెండు గంటలకి ధ్యానం  చేస్తాము. తరువాత గణపతి భజన తో భజనలు మళ్ళీ  మొదలుపెట్టి  ఒక అరగంట చేస్తారు. పిల్లలే పాడాలి. పెద్ద వాళ్ళు అనుసరించాలి .  ఈ సారి  మా ఇంట్లోనే  చేస్తున్నాము. వస్తారా? ‘

‘భజనలా ??? చూస్తాం లెండి’ – అవతల వెక్కిరింత కూడిన ఓ నవ్వు!!

కష్ఠాలు వచ్చినపుడో , అవతల వారు ప్రాణాంతకం లో ఉన్నపుడు ‘Our prayers are with you’ ‘ Amen’ అనో  దేవుడిని గుర్తు చేసుకోవాలి కానీ, మా లాగా ఎప్పుడు పడితే అప్పుడు అందునా నూతన సంవత్సరం వేడుకప్పుడు  గుర్తు చేసుకోవడం  ఒక వింతే  కదా 🙂

అమెరికా లో అయినా భారత దేశం లో అయినా ఏ పండగ ఎలా చేసుకున్నా పర్వాలేదు . భజనలు చేస్తే పుణ్యం వస్తుందని కాదు. వైన్ తాగితే పాపం వస్తుందనీ  లేదు. ఎవరి ఇష్టం  వారిది. కానీ ఎంత మటుకు ? సమాజానికి ఎక్కడా ఏ హానీ  జరగనంత మటుకు!!

దీపావళికి ముందర  బ్లాగుల్లో, వాట్సాప్ లో , ముఖ పుస్తకం లో  ‘పర్యావరణానికి హానీ  కలిగించే పనులు చేయకండి. బాణాసంచా కాల్చద్దు’ అంటూ  సందేశాలు. ఒక వీడియో కూడా చూసాను. అందులో ఒకతను  కరెన్సీ నోట్లు(డబ్బులు)   కాల్చేస్తుంటాడు. అదేమిటి అంటే బాణాసంచా కొని ఇదేపని  చేస్తున్నాం కదా, దాని బదులు పేదవారికి ఇవ్వచ్చు కదా అంటాడు.  ఈ  ఆలోచనా ధోరణి మంచిదే. బాలకార్మికులని ఉపయోగించి తాయారు చేసే బాణాసంచా కాల్చనక్కర్లేదు. మట్టి దీపాలు కొని చేతి వృత్తుల వారిని ప్రోత్సహించవచ్చు.  

మరి ఇదే ధోరణి లో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకి మద్యం  తాగద్దు, ఎగిరి గెంతులు వేయద్దు అని ఎన్ని సందేశాలు వచ్చాయి అందరికీ ? గత ఏడాదే  హైదరాబాద్ లో పంజాగుట్ట లో పట్టపగలే తాగిన  మైకం లో కారు నడిపిన వారి వలన   ఒక కుటుంబం ( రమ్య)  చిన్నాభిన్నమయిన సంఘటన కూడా సందేశాలు పంపేవారికి గుర్తురాకపోవడం శోచనీయం.   నాకు మటుకు బాణాసంచా పేలుస్తూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్న సందేశాలు వచ్చాయి.  

ఈ మధ్యవార్తల్లో, మీడియాలో అన్ని చోట్లా  ఈ నోట్ల మార్పిడి గురించే. ATM  లైన్ లో నిలబడి చనిపోయారు  అంటూ రోజుకో టపా లు. పేదవారికి ఎంత కష్టం అంటూ మాటలు.

బెంగళూరు లో జరిగిన విషయం చదివాకా  నాకు అన్పించింది – భారత దేశం లో  ఇన్ని వేల మంది  యువత ఒక్క చోట ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడానికి డబ్బు (నగదు)  ఎక్కడ నుంచి వచ్చింది ? ఒక పల్లెటూరికి వెళ్లి  ఒక నిర్యక్ష్యరాస్యుడితో ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ తెరిపించలేని ఈ యువత కి అర్ధరాత్రి ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకి సమయం, ఓపిక, ఉత్సాహం  ఎక్కడనుంచి వచ్చేసాయి ? ఇంత మంది కోసం  అంటే పోలీస్ బలగాల రక్షణ కూడానా ?  ప్రభుత్వ నిధులని ఎంత వృధా చేస్తున్నారు  ? రోజుకో పేద రైతు చనిపోయే  భారత దేశం లో  కావాల్సింది ఇటువంటి వేడుకలా ?  చదువుకున్న యువత చేయవలసిన పనులేనా ఇవి ? ఎందుకు సంస్కారం లేని ఆ  చదువు? ఉన్న మానవవనరులు ఈ విధం గా నిరుపయోగం లేకుండా అయిపోవడం ఎంత శోచనీయం ?

సీత దేవి అగ్ని ప్రవేశం చేసింది. రాముడు భార్య ని విడిచిపెట్టాడు……  ధర్మరాజు భార్య ని జూదం లో పెట్టాడు… . ఆడవారిని అవమానించాయి పురాణాలూ…. .   జీయర్ స్వామి నామాలు వేయించుకోమంటాడు..  చాగంటి గారు ఆడవాళ్ళని బట్టలుతకమన్నారు…. . జగ్గీ వాసుదేవ్ ఇంగ్లీష్ లో సోది చెప్తాడు కానీ చేసేవన్నీ మంచి పనులు కావు….  Art of living రవి శంకర్  కార్యక్రమం పర్యావరణాన్ని నాశనం చేసింది…  రాందేవ్ బాబా పతంజలి ఉత్పత్తులని చెప్పి బోలెడు డబ్బు గడిస్తున్నాడు…తినడానికి తిండి లేకపోతే అబ్దుల్ కలాం కలలు కనమంటాడు ….    యోగా అంటూ విన్యాసాలు చేస్తున్నాడు తుగ్లక్ ప్రధాన మంత్రి…   మంచి మాట మాట్లాడే  ప్రతి ఒక్కరిని ఏదో ఒక దూషణ, విమర్శ.  ఆఖరికి  కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు, నడిచే దైవం అయిన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని కూడా విమర్శించే వారు తయారైన సమాజం మనది. ఎక్కడా మంచి అనే దాన్ని చూడలేకపోతే Spirituality అనేది ఎక్కడ నుంచి వస్తుంది ?  Spirituality లేనిదే మనిషిలో ethical thinking, morality ఎక్కడ నుంచి వస్తుంది ?సమాజం లో morality  లోపిస్తుంటే  ఎవరు మార్గదర్శకత్వం చూపిస్తారు  యువతకి ?

10 thoughts on “ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు”

 1. బాలవికాస్ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నట్లుందే. మెచ్చుకోతగినదే. మీరు పిల్లల్లో సృజనాత్మకత ప్రోత్సహిస్తున్నారన్నమాట. బాగుంది.
  దీపావళి టపాకాయలు కాల్చడమంటే రూపాయి నోటుని కాల్చినట్లే అంటుండేవారు మా నాన్నగారు కూడా. కానీ టపాకాయల మోజు, మోత అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది దేశంలో.
  గ్రీటింగ్స్ మాటకొస్తే కొత్త సంవత్సరానికీ, పుట్టినరోజులకీ ఉదయించే సూర్యుడున్న గ్రీటింగ్ కార్డులే పంపడం నా అలవాటు, పోలసీ. చూడడానికి ఆహ్లాదంగా ఉంటుందని, కొత్త అధ్యాయం మొదలవుతోందని చెబుతుందనీ నా అభిప్రాయం. బాణసంచా కార్డులు నేనూ ప్రిఫర్ చెయ్యను.
  ఎంతో అట్టహాసంగానూ ఒక్కోసారి వికృతంగానూ సంబరాలు జరుపుకుంటే అంత ఎంజాయి మెంట్ అని, ఆధునికంగాను ఫాషనబుల్ గానూ గుర్తిస్తారని యువతని ఎగదోస్తున్నది వ్యాపారులు, మీడియా. యువత ఆ మోజులో లోతుగా పడిపోయింది. భారతదేశంలో ఈ ఆలోచనా ధోరణి బాగా వెర్రితలలు వేస్తోంది.
  ఇహ సోషల్ మీడియా పైత్యానికి అంతే లేదు. అదో లోకం. దాన్ని గురించి వింటుంటే ఒక్కోసారి జీసస్ శిలువ మీద నుంచి అన్న మాటలు గుర్తొస్తాయి – ఫాదర్ ఫర్ గివ్ దెమ్, ఫర్ దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్.

  మెచ్చుకోండి

  1. మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. పిల్లలకి విత్తనం నాటుతున్నామండీ. బాధ్యత అంత వరకే. దాన్ని వృక్షం చేసే బాధ్యత మాత్రం నెత్తిన వేసుకోలేం కదా. ‘యువతని ఎగదోస్తున్నది వ్యాపారులు, మీడియా ’ అది గుర్తించట్లేదండి ఎవరూ కూడా. నాగరికత నుంచి అనాగరికత కి వెళ్తున్నామో. అనాగరికత నుంచి నాగరికత కి వెళ్తున్నామో అర్ధం కావట్లేదు

   మెచ్చుకోండి

  1. ధన్యవాదాలు పవన్ గారు. ఇంతకీ మీరు సినిమా చూసారా లేదా ? సినిమా సస్పెన్స్ కంటే మీ బ్లాగ్ లో సస్పెన్స్ ఎక్కువయిపోయిందండీ 🙂

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: