వివేకానందుడు చెప్పిన బాట లో… (పునఃప్రచురణ)

‘Is that ‘Chaganti?’

‘No. You know him. Come and see!!’

‘Oh….  !! Dr.Balooo!!’  

ఈ చివరి మాట వింటే ఆయన ఎవరికో దగ్గరి చుట్టమో లేక స్నేహితుడో అనుకుంటారు.  ఇది నేను ఒక వీడియో చూస్తున్నపుడు నాకు మా పదేళ్ళమ్మాయికి జరిగిన సంభాషణ.

మనం అందరం, స్వామి వివేకానంద గురించి మాట్లాడతాము, ఆయన సూక్తులని (quotes) ముఖ పుస్తకం లో, whatsapp లో  స్నేహితులతో పంచుకుంటాము. మహా అయితే ఆయన  వ్రాసిన పుస్తకం చదువుతాం.  మనలో ఎంత మంది ఆయన  చెప్పినది పాటించడానికి ప్రయత్నిస్తున్నాము? అటువంటి వారు ఎక్కడుంటారు లేరు అంటారేమో !!  స్వామి వివేకానంద చెప్పింది అక్షరాలా పాటించి దేశానికి  సేవలందిస్తున్న వారు  ఉన్నారు.  అటువంటి వారిని చూసి మాట్లాడే భాగ్యం కూడా మా బాలవికాస్ బడి ద్వారా నా లాంటి సామాన్యులకి లభించింది.

ఈనాడు ఆదివారం పత్రిక లో సచిత్ర కథనాలు భాగం లో ప్రతి వారం ఒక లాభాపేక్ష లేని సంస్థ  గురించి వ్రాస్తుంటారు. ఆ విధం గా బహుశా 2005/2006 మధ్యన , ఈనాడు ఆదివారం  Online పత్రిక తిరగవేస్తుంటే ఒక సంస్థ  గురించిన వ్యాసం కనపడింది. ఆ వ్యాసం సారంశం ఏంటంటే  స్వామి వివేకానంద  చెప్పినది అక్షరాలా  పాటించడానికి  కొంత మంది డాక్టర్లు కర్ణాటక లో మారుమూల గ్రామాలలో ఒక సేవా  కార్యక్రమం ప్రారంభించారు అని.  సాధారణంగా గవర్నమెంట్ కాలేజీలలో మెడిసిన్ చదువుకున్న డాక్టర్లు అంటే అమెరికా కో  వెళ్లి  స్థిరపడతారు. లేదా  ఏదైనా మంచిప్రైవేటు ఆసుపత్రులలో పని చేస్తారు. మంచి మెరిట్ తో చదువుకున్నవారు అయి ఉంటారు కాబట్టి డబ్బు గడించడం పెద్ద సమస్య కాదు వారికి.  ఏదో సినిమాలలో పల్లెల్లో వైద్యం చేసే హీరోలని చూస్తాము.  కానీ నిజజీవితం లో జీవితాన్ని ఈ విధం గా దేశసేవ కి  అంకితం చేయడం మనం సాధారణం గా  చూడము కదా !! అందుకని ఆ సంస్థ బాగా గుర్తుండిపోయింది. ఒక రోజు వారంతం లో పిల్లల ‘activities’ భాగం లో మా వారు మా అమ్మాయిని  బాలవికాస్ బడికి  కి తీసుకెళ్ళారు. ఇద్దరూ ఇంటికి రాగానే కర్ణాటక నుండి ఒక డాక్టర్ గారు  వచ్చారని,  గిరిజనులకి సేవ చేస్తున్నారని చెప్పారు.  నాకు వెంటనే ఈ వ్యాసం స్ఫురించింది.  నా అంచనా నిజమైంది !! ఈనాడు లో చదివిన సంస్థ  ఆ వచ్చిన వారిది  ఒకటే సంస్థ !! అదే  Swami Vivekananda Youth Movement – SVYM!! ఈ సంస్థను స్థాపించినవారు డాక్టర్ బాల సుబ్రహ్మణ్యం.  ఈ సంస్థ వివరాలు, వారు చేసే సేవలు  http://www.svym.org/  లో చూడవచ్చు. 2015 సంవత్సరం లో Best NGO in India Award కి ఎంపిక అయింది.

ఈ సంస్థ ఎలా ఆవిర్భవించిందో మా బాలవికాస్ బడికి విచ్చేసిన  డాక్టర్ బాలు ఈ విధం గా  మా పిల్లల కి చెప్పారు:

అందరి లాగే ఒక మాములు మధ్య తరగతి కుటుంబం పుట్టిన ఆయన  మంచి మార్కులతో PUC పాస్ అయి ఇంజనీరింగు కాలేజిలో  చేరారు.  చేరిన మొదటి రోజే  సీనియర్సు చేసిన రాగింగు తట్టుకోలేక పోయారుట. మరుదినం ఇంట్లో కూర్చోలేని స్థితి.  ఏం  చేయాలో తోచలేదు ఆయనకి.  కాలేజి వెళదామని బయలుదేరారు. కానీ కాలేజి దగ్గరవుతున్నకొద్దీ భయం!! కాలేజికి వెళ్ళకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా కాలక్షేపం చేయాలి. ఎదురుగుండా రామకృష్ణ ఆశ్రమం కన్పించింది.  ఇంక రోజు అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టారుట.  అక్కడ  ఆశ్రమ సన్యాసి ఒకరు  ఈయనని గమనించసాగారు. ఆ సన్యాసి ముందు  కాస్త బుద్దిమంతుడిలా కన్పించడానికి  అక్కడి గ్రంధాలయం లో స్వామి వివేకానంద వ్రాసిన పుస్తకాలూ చదవటం మొదలు పెట్టారు. అదే తన జీవితాన్ని మార్చేసింది అంటారు డాక్టర్ బాలు.  ముఖ్యం గా ‘His call to the Nation’ ,  మరియు ‘To the Youth of India’.  మెడిసిన్ లో సీట్ వస్తే తప్పకుండా  స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపు మేరకు గ్రామీణసేవ కే  తన జీవితం అంకితం చేస్తాను అని మనసు లో సంకల్పించుకున్నారు.  ఆశ్చర్యకరం గా ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి  మెడిసిన్ లో సీటు వచ్చినట్లు ఒక టెలిగ్రామ్ వచ్చిందట.  ఆ విధం గా మెడిసిన్ చదవటం, SVYM  ఆవిర్భవించబడటం  జరిగింది.  “Such is the power of Swamiji’s works, that no person who reads and comprehends his nationalistic message can sit quiet without responding”  అని చెప్తారు డాక్టర్ బాలు.

IIT , VIT, Cornell వంటి విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు ఇచ్చే ఆయన  మా పిల్లలు కోసం, వచ్చిన ప్రతిసారి దాదాపు రెండు గంటలు సమయాన్ని కేటాయించి పిల్లలు  వేసే ప్రశ్నలన్నీ చాలా  ఓర్పు గా సమాధానాలు చెప్తారు.  ఇప్పుడు అర్ధం అయిఉంటుంది  మా అమ్మాయి ‘ఈయన నాకెందుకు తెలీదు’ అన్నట్లు మాట్లాడిందో.  వారు మా పిల్లలకి కథల రూపం లో చెప్పిన గాధలు మనసుని కదలించి వేసాయి. ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపుతున్న డాక్టర్ బాలు గారి లో  అటువంటి ధృడసంకల్పాన్ని కలిగించిన స్వామి వివేకానంద నిజం గా ఒక అవతార పురుషుడే కదా అన్పిస్తుంటుంది!!

డాక్టర్ బాలు గారి ప్రసంగం ఒకటి ఈ వీడియో లో చూడండి. ఈ పదిహేను నిమిషాల వీడియో లో ఈనాటి యువత  చేయాలో గుర్తు చేసారు. వీడియో లో డా. బాలు ఒక విషయం లో స్వామి వివేకానంద చెప్పినది తప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. స్వామి వివేకానంద చెప్పినది తప్పు ఎలా అవుతుంది?ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది !!

https://www.youtube.com/watch?v=KzJs0Kgrp8A

ఈ ఒక్క  వీడియో షేర్ చేస్తే సరిపోతుంది గా ఇంత టపా,  ఇంత ఉపోద్ఘాతం అవసరమా అని అన్పించవచ్చు. డాక్టర్ బాలు లాంటి వ్యక్తుల గురించి చదివి – ఈ దేశం నాకు ఏమిచ్చింది, ప్రభుత్వం ఏమిచ్చింది అని అనుకోకుండా నేను ఈ దేశానికీ, ఈ సమాజానికి ఏమిస్తున్నాను అన్న ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకుంటారన్న ఆశ తో మీ ముందుకి ఈ టపా !!

5 thoughts on “వివేకానందుడు చెప్పిన బాట లో… (పునఃప్రచురణ)”

  1. భండారు శ్రీనివాసరావు గారి బ్లాగులో మీరిచ్చిన లింక్ ద్వారా ఈ వ్యాసాన్ని చూశానండి, ధన్యవాదాలు.

    మెచ్చుకోవలసిన కార్యక్రమాలు. కర్ణాటకకే చెందిన మరొక వైద్యులు డాక్టర్ సుదర్సన్ (అనుకుంటాను) కూడా గిరిజనులకి సేవాకార్యక్రమాలు చేస్తుంటారని కొంతకాలం క్రితం చదివినట్లు గుర్తు (“ఈనాడు” లోనేనా??🤔). ఇటువంటి వ్యక్తులు exception rather than the rule అనిపిస్తుంది. మరికొంతమంది డాక్టర్లు కూడా అటువంటివారిని చూసి స్ఫూర్తి పొందితే బాగానే ఉంటుంది.

    మెచ్చుకోండి

  2. మంచి వ్యాసం అందించారు. పిల్లలో చిన్నతనం నుంచి జిజ్ఞాసని పెంచే విధంగా, దేశానికి ఉపయోగపడే విధంగా సన్మార్గంలో నడుస్తున్న డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారికి అభినందనలు. మీరు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: