పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు

నా బ్లాగు లో చాగంటి వారి ప్రవచనాల మీద చాలా సార్లు ప్రస్తావించాను. నేను వ్రాసింది చదివి కొంత మంది తప్పకుండా ఆయన  ప్రవచనం వింటాము అని కూడా వ్యాఖ్యలలో చెప్పారు. చాలా సంతోషం గా  అన్పించింది ఒక చిన్న మంచి పని చేశాను కదా అని. ఆయన  ప్రవచనం గురించే చెబుతూ చాగంటి వారు మరియు వారి ప్రవచనములు’  అన్న టపా లో ఒకసారి ఒక విషయం చాలా స్పష్టం గా   వ్రాసాను – “ఈ సోషల్ మీడియా లో కొందరు వీడియో లు తమకి  కావలసినంత మేరకి  కత్తిరించి పంచుతున్నారు. ఈ రెండు నిమిషాల వీడియో లు చూసి ఆయన ఎందుకు చెప్తున్నారో దేనికి చెప్తున్నారో అర్ధం కాదు మొట్ట మొదట చూసిన వారికి. చాగంటి వారి 2 నిమిషాల వీడియో లు చూడకండి “  అని.

నేను చాగంటి వారి ప్రవచనాలలో   శ్రీసంపూర్ణ రామాయణం  (42 భాగాలూ, ప్రతి భాగం దాదాపు 2. 5 గంటలు),   స్థలపురాణం కాశీ రామేశ్వరం (1. 5 గంటలు కావచ్చు), మహా భారతం( ఎంత సమయమో  ఎప్పుడూ  చూడలేదు ) ఆది పర్వము, సభా పర్వము , విరాట పర్వం  విన్నాను.   వారి ప్రవచనము దాదాపు ఒక సంవత్సరం నుండి ప్రతి రోజు వింటున్నాను.  ఏ  ప్రవచనం లో కూడా ఒకరిని దూషించడం, అసభ్యకరం గా మాట్లాడటం వినలేదు.  పైపెచ్చు ఏదైనా అన్నానేమో అనుకుని ఆయన  ‘నేను క్షమించబడెదను కాక’, ‘ నేను మన్నింపబడెదను కాక’  అని అనటం మాత్రం చాలా సార్లు విన్నాను.  ఎన్ని సార్లు విన్నానో లెక్కించలేదు. కాలేజి పిల్లల్ని ఉద్ద్యేశించి ప్రసంగించేటపుడు ‘నన్ను మీ మేనమామ గా అనుకోండి’ అంటూ మాట్లాడారు. ఎవరు అంత ప్రేమ గా చెప్తారు ? ఆయన  చెప్పే విధానం వింటే  వేరొకరిని పొరపాటున కూడా  దూషించాలని ఎవరికీ అనిపించదు. అది కూడా ఒక కులం, మతం పేరుతో దూషించాలని అసలు అనిపించదు.    Brain ని ఒక  thought process లోకి పట్టుకెళ్ళుతుంది ఆయన  ప్రవచనం. అటువంటి ప్రవచనాలు చెప్పే వారి  మీద ఈ దూషణ ఏంటి?   వారు చెప్పిన  మంచి మాటలు ఎంతమంది ఎంత  విన్నారో తెలీదు   కానీ  ఒక్క మాట పొరపాటు వస్తే ఇంత రాద్ధాంతమా ? చెప్పాలంటే  ఆయన  చెప్పే భారతం విన్నాకా నాకు శ్రీకృష్ణుడి మీద భక్తి పెరిగింది మాత్రం నిజం.  అలాగే రామాయణం విన్నాకా  రాముడి మీద కూడానూ.  

మనం ఆఫీస్ ల లో ఒక రెండు నిమిషాల presentation ఇవ్వాలంటేనే  వందసార్లు practice చేసుకుంటామే  అన్ని గంటలు అనర్గళం గా మాట్లాడినప్పుడు ఒక్కసారి తప్పు దొర్లటం సహజం కాదా? ఉద్దేశ్యపూర్వకం గా మాట్లాడిన మాట కాదు. ఉద్దేశ్యపూర్వకం కాకపోయినా ఇంకొకరి  మనోభావాలు దెబ్బతిన్నాయి  కాబట్టి  వారు క్షమాపణలు కూడా చెప్పారు కదా ? మరి ఆయన ప్రవచనం ని  ఖండించి మాట్లాడే వారు, రోడ్డు మీద చేసిన వికృత చర్యల మాటేంటి ? ఇంత వికృత చర్యలు చేస్తే కానీ ఆవేశం చల్లారదా ? ఒక మనిషి అనుకోకుండా తప్పు చేస్తే అంత క్షమించలేని పరిస్థితి లో ఉన్నామా?

మనోభావాలు దెబ్బతిన్నాయి.  అందుకే కోపాలు వస్తాయి.  అది సహజమే కదా అనుకుంటే, ఒక టీవీ ఛానల్ వారు ఈ వికృత  చర్యలు చేస్తున్న వీడియో చూపిస్తూ, ఆ విలేఖరి  అవతల వారిని రెచ్చగొట్టే విధం గా మాట్లాడిస్తున్నారు. టీవీ ఛానల్ కి  రేటింగ్ పెరగటానికి సమాజం లో సమైక్యత పోయేటట్లు చేస్తే సరిపోతుందా ? ఎందుకింత దిగజారుడు ?  నైతిక విలువలు ఎక్కడ పోతున్నాయి సమాజం లో? ఆఖరికి,నయా పైసా పుచ్చుకోకుండా సమాజం బావుండాలని నిస్వార్ధం తో  ప్రవచనాలు చెప్పేవారి  మీదే కేసులు పెడితే  ఇంక ధర్మం అన్న మాట కి విలువ ఏంటి ? అర్ధం ఏంటి ?

నేను ఎవరినో  బాధపెట్టడానికి ఈ టపా వ్రాయలేదు  అని విన్నవించుకుంటున్నాను. ఇటువంటి మహాపురుషులు మన తెలుగు వారవ్వటం, ఆయన నోటి వెంట వచ్చిన ప్రవచనం వినటం  నిజంగా మనం చేసుకున్న అదృష్టం.  అది ప్రతి ఒక్కరు గ్రహించుకోగలిగితే చాలు.

6 thoughts on “పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు”

 1. రాజకీయాల్లో ప్రవేశం కోసమో, ఎదుగుదల కోసమో ఇటువంటి గొడవలు లేవదియ్యటం ఈనాటి భారతంలో మామూలైపోయిందండి.

  మెచ్చుకోండి

 2. ఇది నిర్ద్వందంగా అందరు ఖండించవలసిన విషయం. గురువుగారు ఎవ్వరిని కించపరచలేదు. కించపరిచే ఉద్దేశం ఉన్నవారు కారు. ఆయన ఉన్నతి గిట్టనివాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది. మీకభ్యంతరం లేకపోతె మీ లింక్ ని నా బ్లాగ్లో వాడుకొంటాను.

  మెచ్చుకోండి

  1. తప్పు లేదు అని అనను. మనోభావాలు దెబ్బతిని ఉండచ్చు. కానీ, తెలియక చేసిన తప్పు కి ఒక సాటి మనిషిని మరీ అంత క్షోభ కి గురి చేయనక్కరలేదు అని నా ఉద్దేశ్యం. మీరు లింక్ ని వాడుకొనవచ్చు.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: