బొమ్మలకొలువు

క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సరం వేడుకలు అయిన వారానికే  మా ఇంట్లో బొమ్మల కొలువు హడావిడి మొదలు.  పేరుకి పిల్లలకోసం అని పెట్టినా వాళ్ళకంటే నాకే సరదా  ఎక్కువ అని చెప్పాలి.   బేస్ మెంట్  లో డబ్బాలలో  సర్దిపెట్టిన బొమ్మలు తీయటం, మెట్లు పేర్చటం, అలంకరించడం అంతా కలిపి ఒక వారం రోజులు పడుతుంది.  చాలా పెద్ద పని అనుకోవచ్చు.  ఉత్సాహాన్ని ఇచ్చే పనే కాబట్టి  పేర్చేటపుడు పెద్ద పని గా ఏమి అనిపించదు. అంత కష్టపడి పేర్చిన కొలువు వెనువెంటనే తీయాలా  అనుకుంటూ , మూడోరోజుకి శాస్త్రానికి ఒక బొమ్మ పక్కన పెట్టి దాదాపు ఒక నెల రోజులు కొలువు ని అలానే ఉంచేస్తాము.

img_2359

మా అత్తగారింట్లో బొమ్మలకొలువు ఆనవాయితీ ఉంది. అందుకే ప్రతి ఏడూ క్రమం తప్పకుండా పెట్టడానికే ప్రయత్నిస్తాము. ప్రతి ఏడాది కొత్తవి కొన్ని చేరుతాయి కొలువులో.  ఇండియా వెళ్లి వస్తే ఎక్కువ అవుతాయి.  ఈ సారి భారత దేశం వెళ్ళినపుడు   దక్షిణ భారత యాత్ర చేసాము. అందుకే కొన్ని గవ్వల బొమ్మలు కొలువు లో ప్రవేశించాయి.  వాటిని చూసి నేను, మా చిన్నమ్మాయి ఇక్కడే craft store లో  గవ్వలు కొని అటువంటివే ఇంకా కొన్ని బొమ్మలు చేసాము.  నా చిన్నప్పటి బొమ్మలు ఎగ్జిబిషన్ లో  కొనుక్కున్నవి, మా అమ్మమ్మ బొమ్మలాట కి నాకోసం కొన్న స్టీలు గిన్నెలు (నెల్లూరు వైపు బుడ్లు అంటారు) ఇంకా దాచుకున్నాను.

img_2344
నేను, మా చిన్నమ్మాయి చేసిన బొమ్మలు

ఇది వరకు బొమ్మలు ఒక క్రమం లో కాకుండా నాకు నచ్చిన రీతిలో పెట్టేసేదాన్ని. మనబడి గురువులొకరు ఈ విధం గా చెప్పారు. అప్పటినుండి ఆ విధం గా పెట్టడానికే ప్రయత్నిస్తుంటాను. బొమ్మలకొలువు మన జీవిన విధానం చెప్తుంది.  ఒక్కొక్క మెట్టు  ఎక్కి దైవ సాన్నిధ్యానికి చేరుకోవాలి అన్నదే జీవిత లక్ష్యం. అందుకే క్రింద నుంచి పైన వరకు మెట్లు ఇలా పెట్ట్టాలి .

 • జంతువులు,
 • రోజు వారి జీవితం – అంగడి, గిన్నెలు, ఇంట్లోని సామాగ్రి అటువంటివి,
 • మహా పురుషులు, యోగులు
 • దేవతా మూర్తులు, ఇంటి ఇలవేలుపు.

img_3135

img_3136

img_3137

img_3134

img_3139

 

బొమ్మల కొలువు విశిష్టత గురించి ఈమాట లో కూడా  ఒకసారి చదివాను.

ఇది లంకె : http://eemaata.com/em/issues/201511/7936.html

మా ఇంట బొమ్మల కొలువు వీక్షించిన వారందరికీ ధన్యవాదాలు _/\_

ప్రకటనలు

10 thoughts on “బొమ్మలకొలువు”

  1. ధన్యవాదాలు లలిత గారు. ‘గవ్వల బొమ్మలు’ – ఎలక్ట్రానిక్స్ పక్కన పెట్టాలి అంటే వాళ్ళకీ బాధ నాకు అంత కంటే బాధ. ఇటువంటి ఉపాయాలే ఏవో చేయాలి కదా మరీ 🙂

   మెచ్చుకోండి

   1. మీరు చేసిన బొమ్మలు బావున్నాయి. బుడ్లు అన్నది వంట పాత్రలకి మాత్రమే పరిమితం అని నాకు గుర్తు. పిల్లలు ఎలక్ట్రానిక్స్ దగ్గరికెళ్ళకుండా ఉండేందుకు మీరు వాడిన ఐడియా బావుంది.

    మెచ్చుకోండి

  1. ధన్యవాదాలండి chitralaxman గారు. మీ బ్లాగు లో ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు కానీ తప్పకుండా చదువుతుంటాను. బాగా వ్రాస్తుంటారు

   మెచ్చుకోండి

 1. బాగున్నాయండి మీ బొమ్మలు, అమర్చిన క్రమం. మన సంప్రదాయాలు మీ పిల్లలకి నేర్పించడానికి మీరు చేస్తున్న కృషి మెచ్చుకోదగినది.
  కృష్ణాజిల్లా వైపు బుడ్లు అంటే సీసాలు అనే అర్ధం ఉంది.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s