మహాభారతం – కర్ణుడు

మా ఇంట్లో  మా వారికి కాలక్షేపం కాకపోతే మహాభారతం పాత  సీరియల్  చూస్తారు. నెమ్మదిగా ఆయనతో పాటు పుస్తకాలూ, హోంవర్కులు పక్కన పెట్టి మా అమ్మాయి కూర్చుంటుంది.  ఆ నేపథ్యం లో ఒకరోజు ‘దుర్యోధనుడి అసూయ కి  ఆజ్యం పోసిన వాళ్ళు ఇద్దరు  ఒకరు ధృతరాష్ట్రుడు , ఇంకొకరు కర్ణుడు’ అన్నాను.  ఆమాట కి మా వాళ్ళు ఇద్దరూ  ‘కర్ణుడు ఇంత నిక్కచ్చి గా చెడ్డవాడు’ అని  చెప్పడం ఎక్కడా  వినలేదని (ఇద్దరు కలిసి ఎన్ని పుస్తకాలూ చదివారో తెలీదు. మహాభారతం టీవీ సీరియల్ మాత్రం బాగా చూస్తారు) వాదన మొదలు పెట్టారు.  

ఈ వాదన అయిన కొన్ని రోజులకే కష్టేఫలి వారు వారి బ్లాగులో కర్ణుడి గురించి వ్రాయటం మొదలు పెట్టారు.  నా వాదన తో ఇంకొకరు ఏకీభవిస్తున్నట్లనిపించింది.  

రామాయణం కానీ, భారతం కానీ ఏ పుస్తకం  అయినా కావచ్చు కాక.  పుస్తకం చదివాకా అన్వయం చేసుకోవలసినది మనమే. ఇదివరకు నా ముందు టపా లో చెప్పినట్లు connect Text to Self, Text to Text, Text to World  చేసుకుని అన్వయించుకోవాలి. అలా భారతం విన్నాకా, కొంచం చదివాకా –  కర్ణుడి గురించి నేను అన్వయించుకున్నది  & నాకు వచ్చిన అభిప్రాయమే ఈ టపా.

కర్ణుడు కుంతీ దేవి కి పుట్టిన సంతానమే  కానీ ధర్మ సంతానం కాదు. అవునన్నా కాదన్నా నిజం. కర్ణుడి స్వభావం కూడా ఈ విషయం తో ముడిపడి  ఉన్నది  అన్న సంగతి కూడా  ఒక వాస్తవం.

మహాభారతం లో కర్ణుడి ని అసలు క్షమించకూడదు అని అనిపించిన ఘట్టం  ఇది:

ధర్మరాజు జూదం లో  ఓడిపోయాక , దుర్యోధనుడు దుశ్శాసనుడిని పంపుతాడు ద్రౌపది ని తీసుకు రమ్మని.  దుశ్శాసనుడు ఆవిడని జుట్టు పట్టుకు ఈడ్చుకుని రాగా, వికర్ణుడు  లేచి ఇది అన్యాయం అని  చెబితే,  కర్ణుడు వికర్ణుడి తో ఈ విధం గా అంటాడు.

karna1

పైగా ద్రౌపది ని గురించి ,  ‘ఈవిడ బంధకి కాబట్టి వివస్త్ర ను చేసినా తప్పు లేదు’ అంటాడు  కూడా !!
karna2

దుశ్శాసనుడ చేత అవమానించబడి ద్రౌపదీ  దేవి దుఃఖపడుతుంటే ఈ మాట కూడా అంటాడు :

karna3

ఈ మాట విన్న దుర్యోధనుడు తన తొడ చూపించాడు.  ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు కూడాను. అసలు దుర్యోధనుడిని ఈ విధం గా రెచ్చగొట్టేందుకే ఆ మాట అన్నట్లు కూడా అన్పిస్తుంది.

పైన చెప్పిన పద్యాలూ ఈ లంకె లో చూడవచ్చు.

మహాభారతము – సభా పర్వం – ద్వితీయాశ్వాసము. http://ebooks.tirumala.org/Product/Book/?ID=1874

కర్ణుడు తన సహజ కవచకుండలాలు దానం ఇవ్వటం మూలాన,  కుంతీ దేవి సంతానం అని మహాభారతం లో అతనికి చివర వరకు తెలియకపోవడం వలన  –  ఒక విధమైనటువంటి  జాలి కర్ణుడు మంచివాడే అనిపించేలా చేస్తుంది.

ఎప్పుడో జరిగినది  మహాభారతం.  అయినా  వస్త్రాపహరణం  ఘట్టం చదువుతున్నా, సీరియల్ లో చూస్తున్నా, మనసు ఈ అన్యాయాన్ని భరించలేదు. మరి ఆ రోజున కళ్లెదుట కనిపిస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోగలమా ? ద్రౌపది అంత దుఃఖిస్తుంటే  ఆ సభ లో సంతోషపడుతూ ఆనంద పడ్డవారు దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు. ఏమి మాట్లాడకుండా వారి మౌనం తో దానికి ఆమోద ముద్ర వేసిన వారు గాంధారీ ధృతరాష్ట్రులు.  పైన చెప్పిన ముగ్గురితో సంతోషపడటమే కాకుండా ఇన్ని మాటలు మాట్లాడుతూ  రెచ్చగొడుతూ  ఆజ్యం పోస్తూ పైశాచిక ఆనందాన్ని పొందిన వాడు కర్ణుడు.  మన  నిజ జీవితం ఇటువంటి వాడిని ఏమని అంటాము ? శాడిస్ట్  అని కాదా ?

మన నిజ జీవితం లో  సంఘటనలు ఆలోచిస్తే , ఎక్కడైనా  రేప్ కేసు జరిగితే ఏమంటున్నాము ? తాత్సారం చేయకుండా  వాడికి ఉరిశిక్ష వేయాలి అని. ఎందుకు  ఉరిశిక్ష ? క్షమించరాని నేరం చేసాడు కాబట్టి !! ఢిల్లీ నిర్భయ కేసు చూడండి . అందులో  ఒక మైనర్ కూడా  ఉన్నాడు. చిన్న వాడు అన్న ఒక నెపం ఉంది. అంత మాత్రం చేత అతనిని వదిలి పెట్టగానే,  ఎంత మంది మనసు దానికి  అంగీకరించింది ? తప్పు ఎవరు చేసినా తప్పే  చిన్న, పెద్దా అనే తేడా లేదు అనే గా అనుకున్నాము?  జాలి పడ్డామా?  లేదే?  మరి మహాభారతం లో చివర కర్ణుడు బాధ  పడ్డాడు, కవచ కుండలాలు ఇచ్చాడు  అనుకోగానే ఎందుకు మంచివాడు అనుకోవాలి ? ద్రౌపది ని అవమానించిన వాడు దుశ్శాసనుడే  అయినా అంతటికి సూత్రధారి కర్ణుడు.

నాకు అందుకే  దుర్యోధనుడి కంటే మహాభారతం లో కర్ణుడే మహా ప్రమాదకారమైన  వ్యక్తి గా అనిపిస్తాడు.

6 thoughts on “మహాభారతం – కర్ణుడు”

 1. కర్ణుడి చావుకి చాలా కారణాలు చెబుతారు. అలాగే కర్ణుడి ప్రవర్తనకి కూడా చాలా కారణాలున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఒక సినీ నాయకుడి విన్యాసాల కారణంగా మనకి కర్ణుడి పాత్ర మీద సానుభూతి ఏర్పడింది. కానీ పెద్దల వ్యాఖ్యానాలని పరిగణలోనికి తీసుకొంటే కర్ణుడు దుష్టుడనే తీర్మానించాలి. ముఖ్యంగా ఆత్మన్యూనత (lack of self esteem) వల్ల అతనలా మారేడని నాఅభిప్రాయం. “connect Text to Self, Text to Text, Text to World చేసుకుని అన్వయించుకోవాలి” – నాకు నచ్చిన వాక్యం.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. మీరు చెప్పినవన్ని కర్ణుడు దుర్యోధనుడి మీద ప్రేమతోనో, భక్తితోనో, కృతజ్ఙతతోనో, అతని మెచ్చుకోలు కోసమో చేసాడు.

  వాటికి మించినవి ఇంకా ఉన్నాయి. వాటిలో కొన్ని:

  1. కృష్ణ రాయబారమో కృష్ణుడు సర్వనాశనం ఎందుకు, ఒక్క అర్జునితో ఎవరైనా యుద్ధం చేయమంటే, దుర్యోధనుడు పాండవులందరూ మాపై క్రోధం వహించి ఉన్నారు (అంటే మాకు అందరూ శత్రువులే, ఒక్క అర్జునుడే కాదు) అనే అర్థంతో మాట్లాడుతాడు.

  2. కానీ కర్ణుడు మాత్రం, కుంతికి ఒక్క అర్జునుడిని మినహా అందరినీ వదిలేస్తానని వరం ఇస్తాడు. ఇది దుర్యోధనుని మీద భక్తికి / స్నేహ ధర్మానికి వ్యతిరేకం. పోనీ ఎవరైనా అడిగినది లేదనకుండా ఇస్తాననే ప్రతిజ్ఙ కోసం అనుకుంటే మరి అర్జనుడిని కూడా వదిలివేయాలి కదా.

  3. కర్ణుడు కృష్ణునితో, దురోధనుని వదిలేయడం ధర్మం కాదని చెపుతూనే మళ్ళీ ధర్మాజు ఈ రాజ్యం పాలించటానికి అర్హుడు అంటాడు.

  4. ఈ యుద్ధంలో కౌరవలు హతులవుతారు అని అన్ని శకునాలూ సూచిస్తున్నాయి అని కృష్ణుడితో చెప్తాడు కానీ దుర్యొధనుడికి చెప్పడు. కానీ మిగిలిన పెద్దలు మాత్రం ఎంతో చెప్పి చూసి విసిగిపోయి చివరకి మేము నీ వైపే యుద్ధం చెస్తామని చెప్తారు దుర్యొధనునితో. ఆఖరికి భీష్ముడు కూడా అర్జునుని గెలవలేనని చెప్తాడు.

  5. చివరకి భీష్ముడు తనని అర్థరథుడన్నాడని, ఆయన ఉన్నతవరకూ యుద్ధం చేయనంటాడు.

  ఇవన్నీ కర్ణుడికి దుర్యోధనుడి మీద అత్యంత భక్తి కానీ, స్నేహభావం కానీ ఉన్నాయనటానికి వ్యతిరేకంగా ఉన్నాయి.

  వీటికి సంబంధించిన పద్యాలు మాత్రం ఇక్కడ copy అవడం లేదు.

  మెచ్చుకోండి

  1. మీ స్పందన కు ధన్యవాదాలు రాజ్యలక్ష్మి గారు. చాలా సంతోషం. కష్టేఫలి శర్మ గారు చాలా బాగా వివరించారు 8 భాగాలలో . వీలైతే చూడగలరు. నేను దీని మీద ఇంకో టపా వ్రాస్తున్నాను.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: