అమ్మ కి చదువుకొమ్మని పుస్తకం ఇస్తే….

ఓ అమ్మ కి వాళ్ళ నాన్న ప్రేమగా  పుస్తకం ఒకటి చదవమని పంపారు. ఒక ఆదివారం పుస్తకం చదువుదామని తొందరగా  నిద్ర లేచింది……  తేనీరు సేవిస్తూ చదవచ్చులే అనుకుంది….   తేనీరు   చేసుకుందామని పాలకోసం ఫ్రిడ్జ్ తెరవగానే  ఫ్రిడ్జ్ లో రాత్రి తరిగిన కూర కన్పించింది… వెంటనే  కూర వండటం మొదలుపెట్టింది… . కూర పోపు లో వేస్తుంటే తోడు పెట్టిన  పెరుగు కన్పించింది…  అరటి పండు వేసి  పెరుగు కలిపి చిన్న అమ్మాయికి   smoothie చేయడం మొదలు పెట్టింది….  చిన్న అమ్మాయికి   smoothie  ఇచ్చి మనబడికి తీసుకువెళ్ళింది…  మనబడి అవ్వగానే మొన్న ఎప్పుడో చేయవలసిన పని చేద్దామనుకుంది….  భోజనం మర్చిపోయింది…. కారు ఎక్కింది…   కారు  బయట వాతావరణం వెచ్చగా తగిలేసరికి ఈ రోజే  విత్తనాలు నాటేసేద్దాం, మొక్కలు వేసేద్దాం  అనుకుంది…. మట్టి కొనడానికి కొట్టు కి బయలుదేరింది… ఇంటికి తిరుగు ముఖం పడుతుంటే స్నేహితురాలు గుర్తొచ్చింది….  కొన్న మట్టి కారులో వదిలేసి స్నేహితురాలి తో వాకింగ్ కు బయలుదేరింది…..  వాకింగ్ నుంచి వచ్చాక నాన్న ఇచ్చిన తేనీరు సేవిస్తూ పుస్తకం కోసం చూసింది.  పుస్తకం నాన్న చేతిలో ఉంది !!!ఈ పుస్తకం ఇక ఎప్పటికి చదువుతానో అనుకుని ఏం  చేయాలో తెలీక ఫేస్బుక్ లో, బ్లాగ్ లో , వాట్సాప్ లో  పోస్ట్ పెట్టింది 😦  !!

ఆ అమ్మని నేనే 🙂 ఇదొక్క పుస్తకమే కాదు !! వేయి పడగలు కూడా చదివేయాలన్న ఆత్రం ఈ అమ్మకి.  

IMG_2690

ఇక్కడ అమ్మ జీవితం గురించి ఇంగ్లీష్ లో ఓ పద్యం చెప్తారు . ఇదిగో ఇలా :

If you give a mom a muffin,

she’ll want a cup of coffee to go with it.

She’ll pour herself some.

Her three year-old will come and spill the coffee.

Mom will wipe it up.

Wiping the floor, she will find dirty socks.

She’ll remember she has to do laundry.

When she puts the laundry into the washer,

she’ll trip over shoes and bump into the freezer.

Bumping into the freezer will remind her she has to plan supper.

She will get out a pound of hamburger.

She’ll look for her cookbook

(How to Make 101 Things With a Pound of Hamburger.)

The cookbook is sitting under a pile of mail.

She will see the phone bill, which is due tomorrow.

She will look for her checkbook.

The checkbook is in her purse,

which is being dumped out by her two year-old.

Then she’ll smell something funny.

She’ll change the two year-old.

While she is changing the two year-old, the phone will ring.

Her five year-old will answer and hang up.

She’ll remember she was supposed to phone a friend

to come over for coffee.

Thinking of coffee will remind her that she was going to have a cup.

She will pour herself some more.

And chances are,

if she has a cup a coffee,

her kids will have eaten the muffin that went with it.

6 thoughts on “అమ్మ కి చదువుకొమ్మని పుస్తకం ఇస్తే….”

  1. చాలా చాలా బాగుంది, అమ్మ అంటే అంతే మరి ,నాలాంటి ఎందరికో ఇది వర్తిస్తుందేమో,మీరు త్వరలోనే వేయి పడగలు చదివేయాలని కోరుకుంటూ ,మీరు అనుమతి ఇస్తే మీ టపా ని నా వాట్సాప్ లో షేర్ చేస్తాను.

    మెచ్చుకోండి

  2. ఎందరో అమ్మలు అందరికి వందనాలు. నిజమే అమ్మకి తనపని చూసుకోవడానికి తీరికే ఉండదు. పిల్లలు, భర్త, కుటుంబం ముందు తర్వాతే మిగిలినవన్నీ.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: