బాహుబలి సినిమా యూట్యూబ్ లో చూసేసామోచ్

మొన్న ఆదివారం బట్టలు లాండ్రీ లో వేసి, గబగబా నాలుగు చేతులతో మడత పెడుతూ బాహుబలి యూట్యూబ్ లో చూడటం మొదలుపెట్టాము నేను, మావారు. నిన్న సోమవారం తో బట్టలు మడత పెట్టడం, బాహుబలి చూడటం రెండు పూర్తయిపోయాయి. మా పెద్దమ్మాయి మంగళవారం పరీక్షకి గది తలుపు వేసుకుని చదువుకుంటోంది. సినిమా అయ్యాక మా వారు గట్టిగా అరిచినట్లే పెద్ద పిల్లని పిలిచారు. నాకు అర్ధం కాలేదు ఎందుకు అంత కంగారుపడుతూ పిలిచారో !! అది ఏమయ్యిందో అనుకుంటూ పాపం పరిగెత్తుకు వచ్చింది. పిల్ల రాగానే, చాలా ఆత్రం గా “అంతేనా ? అదే ending ఆ? అదేవిటే కట్టప్ప అలా బాహుబలిని చంపేశాడు? ఎందుకు చంపాడు ?” అని ప్రశ్నల పరంపర కురిపించారు మా వారు. దానికి ఏం చేయాలో తెలీక తలపట్టుకుంది. ఆ సమయం లో మా అమ్మాయిని చూస్తే స్వర్ణకమలంలో ఎద్దుబండి లో కూర్చున్న భానుప్రియ గుర్తొచ్చింది. వెంటనే చెప్పింది “అది తెలుసుకోవడానికే గా నాన్నా అందరూ చూస్తున్నారు !!నా పరీక్ష అవ్వగానే అందుకేగా తీసుకెళ్లండి అని అడుగుతున్నాను” అని. ఇంతకీ నేను, మా వారు యూట్యూబ్ లో చూసిన సినిమా ఏంటంటే బాహుబలి-1!!

తెలుగు సినిమాల విషయంలో మా వారి టైం మెషిన్ అమెరికా వలస వలన పాత version లో నడుస్తోంది. అందుకే “మగధీర సినిమానా ? హీరో ఎవరు ? రాంచరణ్ తేజా నా ? అతనెవరు ?పెద్ద యాక్టరా ఏంటి ? “ అన్న ప్రశ్నల నుండి, ఏడాది క్రితం కొన్న స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ పుణ్యం తో ఇప్పుడిప్పుడే ఇలా బాహుబలి చూడటం మొదలయ్యి update అవుతోంది!!

నీతి : సినిమా అంటే పిచ్చి లేని మాలాంటి పిచ్చివాళ్ళు కూడా ఉంటారు

9 thoughts on “బాహుబలి సినిమా యూట్యూబ్ లో చూసేసామోచ్”

  1. మగధీర,బాహుబలి ఈ మాటలు వినడమే! ఏ సినిమా చూడనే లేదు,చూడను కూడా. సినిమా చూడడం మానేసి నలభై ఏళ్ళు దాటింది. ఇటువంటి వాళ్ళూ ఉంటారు గా 🙂

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. చంద్రిక గారూ! భలే! మా ఇంట్లో కూడా సేమ్ సీన్! మేం కూడా సినిమా పిచ్చి లేని పిచ్చి వాళ్ళమే.
    ఈ మధ్యనే మేం కూడా బాహుబలి సినిమా చూశాం. సినిమా మధ్యలో రెండు సార్లు సినిమా అయిపోయిందనుకుని, నిజంగానే సినిమా అయిపోయినప్పుడు ఇదేం ముగింపని కంగారు పడ్డారు మా వారు. ఈ అనుభవాన్ని ఒక పోస్ట్ గా రాయాలని మొదలుపెట్టాను గానీ ఇంకా రాయడం సాగుతోంది.
    మీకు సేమ్ పిన్చ్.
    మాకూ సేమ్ పిచ్చి. ☺

    మెచ్చుకోండి

    1. మీరు వ్రాసింది అర్ధమయ్యింది. కానీ మెచ్చుకుంటున్నారో ఆటపట్టిస్తున్నారో అర్ధం కాలేదు. నిన్న నా స్నేహితురాలు తలపట్టుకుని చెప్పింది ‘బాహుబలి చూసిరమ్మంటే అందులో కూడా భారతం కనిపించిందా’ అని. అదీ సంగతి జిలేబి గారు 🙂 !!

      మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి