ఈసారి నిజంగానే బాహుబలి-2 చూసాం

‘కొంచం మహాభారతం లా ఉంది’ బాహుబలి-1 చూసాక  మా వారి వ్యాఖ్య. రోజు మహాభారతం చూసే ఈయనకి  అలానే ఉంటుంది అని సరిపెట్టుకున్నా. మా పిల్లల పట్టుదల మీద ఈ రోజు మొత్తానికి బాహుబలి-2 చూసాం. యూట్యూబ్ కాదండీ బాబు !! సినిమా హాలు లోనే $15 టికెట్ పెట్టి చూసాం. కేవలం పిల్లల కోసం, మూడు గంటలు ఎలాగో అలా  భరిద్దాం అనుకున్నాను. ‘బావుందా’ అని అడిగితే ‘బావుంది’ అనే చెప్తాను. చిన్నపిల్లలని ఇంత ఆకర్షించింది. అది నేను గమనించింది . పిల్లలు కళ్ళు అప్పగించి చూస్తున్నారు. అందుకు ఆ సృజనాత్మకతని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను.

నేనూ  కళ్ళు అప్పగించి చూసాను..   బహుశా ఏ కళ్ళు పెట్టి చూస్తే అవే  కన్పిస్తాయేమో. ‘ఇందుగలడు  అందులేడని’ .  చెప్పా కదా ఇదివరకే. ఏదైనా నేను  ‘text to text’ లంకె పెట్టి చూస్తాను అని.

చాగంటి గారి భాగవతం వింటున్నాను. 25/120, 57:00 దగ్గర కర్దమ ప్రజాపతి వివాహం గురించి చెబుతూ  స్వయంభూమనువు  యొక్క రాజ్యం  పేరు బహిష్మతి/బ్రహిష్మతీ అని చెప్పారు.  యజ్ఞవరాహమూర్తి భూమి కోసం వెతుకుతున్నపుడు అయన వెంట్రుకలు పడి  వచ్చిన భూమి అట అది.  ‘మహిష్మతి’ అంటే వెంటనే  అదే గుర్తు వచ్చింది నాకు. సినిమా లో చాలా సృజనాత్మకం  గా అన్పించిన  అంశం ఏంటంటే – సినిమా మొదలు పెట్టి పెట్టగానే చాలా వైవిధ్యం గా వినాయకుడికి చేసిన పూజ.

సినిమాలో నేను ధర్మరాజుని, భీముడిని, అర్జునిడిని చూసాను. ద్రౌపది కూడా   కన్పించింది. ధృతరాష్ట్రుడు,  దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వారు కన్పించారు. ఇంతమంది ఉంటే  భీష్ముడు కనిపించకుండా ఉంటాడా ? ఆయన  కూడా కనిపించాడు. మధ్యలో రామాయణం కూడా కన్పించిందండి. ఎక్కడో చెప్పను. చూసినవారే  కనిపెట్టగలగాలి. అయితే  రావణాసురుడు లేడు.

అక్కడక్కడా పిల్లలు చూడనటువంటివి ఉన్నాయేమో అన్పించింది. వెంటనే దానికి మా అమ్మాయి సమాధానం – ‘ భీముడు దుర్యోధనుడిని చంపిన రోజు, అందరు భయపడతారు. గుర్తు లేదా’ అంది.  నిజమే కదా  Gettysburg field trip  తీసుకెళ్లి, అమెరికా లో  అంత్యంత భయంకర యుద్ధం జరిగింది ఇక్కడే అంటూ పోయిన సైనికుల సమాధులను చూపిస్తున్నాం కదా అన్పించింది.

Last but not least  –  హీరోయిన్ అంటే అసహ్యంగా చిత్రీకరిస్తూ , కేవలం పాటలకు మాత్రమే వారిని చూపిస్తూ ఆడవారు అంటే ఇంతే దిగజారుడు గా సినిమాలు చూపిస్తున్న తరుణం లో,  స్త్రీ అంటే రామాయణ , మహాభారతాలు ఏ విధం గా చూపించాయో  ఈ తరానికి కొత్త సీసాలో పోసి అదే విధం గా చూపించిన రాజమౌళి గారికి నా వందనాలు _/\_

అందుకే మళ్ళీ  అదే చెప్తాను – రామాయణభారతాలు చదవండి & చదివించండి !!

ప్రకటనలు

4 thoughts on “ఈసారి నిజంగానే బాహుబలి-2 చూసాం”

  1. నేను చూడలేదు కాబట్టి మీ పోలిక గురించి నో కామెంట్ చంద్రిక గారు.
    నేను తప్ప అందరూ చూస్తున్నట్లున్నారు. ఎలాగైనా ఇంకో రెండు మూడేళ్ళలో చూసేయాలి, ఇదే నా భీష్మ ప్రతిజ్ఞ.

    మెచ్చుకోండి

    1. హ హ !! బావుంది మీ ప్రతిజ్ఞ. సినిమా చూస్తున్నపుడు మధ్యలో, నా పక్కన కూర్చున్నావిడ వాళ్ళ పాపతో రెండు సార్లు లేచి మిమ్మల్ని గుర్తు చేసింది పవన్ గారు :). సకుటుంబం గా వెళ్ళాలి అని పెట్టుకోకుండా వంతులు వేసుకుని చూడండి.పాతాళ భైరవి, మాయాబజార్ ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ వాడారు. అంతే సృజనాత్మకత ని ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ వాడి తెలుగు వారి జెండాని ఎగురవేశారు. ఆ సృజనాత్మకత ని మెచ్చుకోవడానికైనా ప్రతి తెలుగు వారు చూడవలసిన చిత్రం. మొదటి భాగం కంటే రెండో భాగం నాకు బావుంది అన్పించింది.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s