పాత  చింతకాయ పచ్చడి కబుర్లు

ఎవరికో నేను చాగంటి గారి ప్రవచనాలు వింటాను అంటే,  ‘అబ్బా ఆయన  గొంతు, ఆ గోదావరి యాస  వింటేనే టీవీ కట్టేయాలన్పిస్తుంది’ అన్నారు.  ఒకసారి ఇంకోచోట  ఎక్కడో  కొన్ని వ్యాఖ్యలలో చదివాను ‘ ఆయన  టీవీలోకి రాగానే  మా  పిల్లలు ఆ మాటలు వినకుండా టీవీ కట్టేస్తాను,’ అని వ్రాసారు.  

ఈ మధ్య  ఎవరో ‘చాగంటి పాత  చింతకాయ పచ్చడి కబుర్లు వినటానికి ఎక్కడ నుంచీ  వస్తుందండీ ఓపిక’ అన్నారు.  ‘జ్వరం వస్తే కానీ తేలేదు కదా పాత చింతకాయపచ్చడి విలువ.  అందుకే కదా ఎప్పుడు రోగం వస్తుందో తెలీదు కాబట్టే ఇండియా వారయితే జాడీలలో పెట్టి దాచుకుంటారు. అమెరికా వారయితే packing  చేసి కస్టమ్స్ వారి కళ్ళు కప్పి మరీ తెచ్చుకుంటారు .’ అని సమాధానం చెప్పాను.

మొన్న ముఖపుస్తకం లో కొత్తగా వచ్చిన సినిమా బాలేదని,సెన్సార్ వారు ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదని ఓ  సినిమా మీద  ఓ నాలుగు ఠావుల  review లు వ్రాసారు కొంతమంది. ఎవరిష్టం వారిది. ‘పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి’ కాదనలేం కదా !!

అదే ముఖ పుస్తకం లో ఆ హీరో ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ  ‘ఎవరికి  నచ్చేది వాళ్ళకి నచ్చుతుంది. ఈ సారి  ఏదైనా religious  సినిమా తీసి మీకు చూపిస్తాను. అప్పుడు మీరు చూడండి. నేను కుర్చీలో పడుకుంటాను’ అని చెప్తున్నాడు. Exactly ఇవే మాటలు కాదు.  దాదాపుగా అదే అర్ధం వచ్చేలా ఉన్నాయి . ( నాకెందుకు ఆ వీడియో కనిపిస్తోందా  అనుకుంటే ఆ వీడియో పైన  ‘Popular video’  ‘perfect  answer’ అంటూ గోల )!! ఒక పక్క కొన్ని కాలేజీలలో గురువులు చాగంటి గారిని, గరికపాటి గారిని పిలిచి తీసుకొచ్చి నాలుగు మంచి మాటలు విద్యార్థులకు చెప్పమని అర్థిస్తుంటే, ఇంకో పక్క  డబ్బులకోసం యువతనే  లక్ష్యంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తూ, ఇష్టం వచ్చినట్లు డైలాగులు వ్రాస్తూ సమాజాన్ని విషతుల్యం చేసే వారిని ఏమనాలి ?  సరే, ఈ సినిమాలలో ‘ప్రేమ’ అనే పదం గురించి రాసుకుంటూ పోతే పెద్ద గ్రంధాలే వ్రాయచ్చును కూడా !!

పైగా ప్రతీ అనైతిక పనిని సమర్థించేవారు వారు ఎక్కువ తయారయ్యారు. వారు అనే మాట  – ‘Its okay. You have to go with the flow’. ఒక రోజు ఒక వాట్సాప్ గ్రూప్ లో మద్యం గురించి, ఆడపిల్లల బట్టలు ఎంత పక్షపాతంగా డిజైన్ చేస్తున్న వైఖరి గురించి వాదించేసరికి, నాకు  మంచి స్నేహితురాలు అనుకునే వ్యక్తి  నా రాతలు వాదనలు చదివి, ‘నువ్వు కొంచెం తేడా అయ్యావే ‘ అంది.  

మా అమెరికాలో పిల్లల చేతిలో smart phone లేకపోతే బడిలో తోటివారు  వారిని ఏడిపిస్తున్నారు ( Bullying). మా అమ్మాయికి చాలా రోజులు phone కొనలేదు. ఇంటికి వచ్చి రోజూ  ఏడుపే – ‘ అందరికీ  ఉంది నాకు లేదు’ అని. ఇద్దరికీ తలా  ఒకటి కొనిచ్చాక వాళ్ళకోసం కాకుండా వాళ్ళ ఫోన్ లు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటున్నాము. గురువులేమో మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టండి అంటారు. మరి బళ్ళలో ఎందుకు ఇలా cell phones అనుమతిస్తున్నారు, అంటే  సమాధానం ఉండదు. ఈ మధ్య bring your  own  device  అంటూ ipad లు , laptop లు పట్టుకొచ్చుకోండి అంటారు. ఈ పిల్లలు వాటిల్లో ఏ ఆటలు ఆడతారో ఏం  చేస్తారో ఆ భగవంతుడికే ఎరుక !! ఇంట్లో పనులే చేసుకుంటామా 24 గంటలు వీళ్ళు ఏం  browse  చేస్తున్నారో చూస్తామా ? ఇవన్నీ చూసి మొన్న బడులు మొదలవ్వగానే  ‘Say  NO to Smart phone’ అనే క్లబ్ మొదలపెడతాను అని చెప్పాను మా పిల్లలతో. బ్లాగు మొదలు పెట్టినట్లే అన్నంత పనీ చేస్తానేమో అని ఇద్దరూ  ‘దయచేసి మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు’ అన్నారు.

ఏం  చేస్తాం? మంచి మాటలు కాస్త గట్టిగా చెప్తే పాత  చింతకాయ పచ్చడి, లేదా తేడా మనుష్యులం  అయిపోతున్నాం.  చాగంటి గారు ఒక పాత  చింతకాయ పచ్చడి!! ‘Religious’ అంటే మనుష్యులకు నిద్రపోవాలి అనిపించేంత చిరాకు.  అది ‘perfect  answer’!! మనం ఎక్కడా దేవుడిని చూడము కానీ అన్నీ  చోట్లా  దేవుడు కన్పించాలి అనుకోవడం అత్యాశ కాదూ ……

ఇదంతా  ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఎప్పుడూ  చెప్పే గోలే !! ప్రతిదానికి మనుష్యులు మారాలి. సమాజం లో మార్పు రావాలి అంటాము.  మార్పు ఎందుకొస్తుంది?మొక్క గా ఉన్న  చెడు  విషయాన్నీ ఖండించము. చూసి చూడనట్లు ఊరుకుంటాము. మనం చేసే పనులు దేనికి ఆమోదముద్ర వేస్తున్నామో చెప్పకనే చెప్తాయి. మొక్క గా ఉన్న ఆ  చెడే  మానై ఎదిగి కాటు వేసాక , అందరం కలిసి కాసేపు ఏడవటం  అనేది ఎలాగూ ఉండనే ఉన్నది !!

 

4 thoughts on “పాత  చింతకాయ పచ్చడి కబుర్లు”

 1. మీ అభిప్రాయాలతో, వేదనతో ఏకీభవిస్తూ కొన్ని వ్యక్తిగత ఆలోచనలు, ఇండియన్లకి సంబంధించినంత వరకూ, – > సనాతన అంటే పాత అని, అధునాతన అంటే కొత్తదనం అనీ అర్ధాలు తీసే కొందరు; పాతవన్నీ పనికిరానివనీ, కొత్తవన్నీ కోరదగినవే అని కొందరు; పాత మాత్రమే మంచి, కొత్తదనం అంతా పాపం అని కొందరు; అసలు ఏ అభిప్రాయం లేక మూవ్ విత్ ద ఫ్లో అనుకునే కొందరు; రెండుపక్కలా అర్ధమైనా వాటిని బాలన్స్డ్ గా ఆచరణలో పెట్టేందుకు పరిస్థితులు అనుకూలించని కొందరు; మధ్యలో ఇవన్నీ తెలియని పిల్లలు – ఇలా డివైడ్ అయిపోయివున్నామని నాకు తోస్తోంది. బెస్ట్ ఆఫ్ ది బోత్ వరల్డ్స్ అనేదాన్ని మేనేజ్ చెయ్యడం మనకి చేతకావట్లేదేమో / కుదరట్లేదేమో. అఫ్‌కోర్స్ మార్పు అనేది ఇంత వేగంగా వస్తుంటే కష్టమే. కాదనలేం. కానీ మార్పుని ఆపేదెలా? వ్యక్తిగతంగా అనుసరించే విలువలకి, బాహ్యప్రపంచంలో ఎదురయ్యే పరిస్థితులకి మధ్య అంతరం మన తరానికి వచ్చేప్పటికి సడెన్‌గా పెరిగిపోయింది. ముఖ్యంగా పిల్లలకి, ఇంట్లో ఒక ప్రపంచం, బయట మరో ప్రపంచం కనిపిస్తున్నాయి. కొన్నేళ్ళ క్రితం ఎన్నారైలకే ఇది పరిమితమైనట్టు అనిపించినా, ఇప్పుడు ఇండియాలోనూ ఈ పరిస్థితి తలెత్తుతోంది. ప్రపంచం అంతటా ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అనేది మొదటి ప్రాధాన్యత పొందితే ఒకటి రెండు తరాలకి పరిస్థితి మారుతుంది, కొంతైనా. నేను చెప్పేది జనరల్‌ సింప్టమ్స్ మాత్రమే. వీటిని అధిగమిస్తున్న వ్యక్తులున్నారు, కుటుంబాలున్నాయన్నది కూడా వాస్తవం.

  మెచ్చుకోండి

  1. ఒక్క వ్యాఖ్యలో బాగా చెప్పారండీ మీరు. వేగాన్ని అందుకోలేకపోతున్నాం అనేది వాస్తవం. ఒక్క తొమ్మిదేళ్లల్లో ఎంతమార్పో !! మీరు చెప్పినట్లు, అన్ని విధాలా balance చేసుకుంటూ ఉన్నవారూ ఉన్నారు. అటువంటివారిలో నేను గమనించింది ఏంటంటే ఆధ్యాత్మికత, సమాజ సేవ లో నిమగ్నులయి ఉండటం.

   మెచ్చుకోండి

   1. వేగం ప్రచండంగానే ఉందని అందరూ ఒప్పుకుంటారు. ఐతే దిశ అన్నది పురోగమనం అని కొందరి ఆనందం. కాదు తిరోగమనం అని కొందరి ఆందోళన. ఎటు పోతున్నామౌ తెలిసి చావటం లేదని మిగిలిన వారిలో గందరగోళం.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: