దీపావళా ? సూక్తి ముక్తావళా ?

అమెరికా లో…

halloween తో మొదలయ్యి valentines day  వరకూ చాక్లెట్/క్యాండీ, పిల్లలకి గుప్పిళ్ళతో పంచుతుంటారు (ఏ మినప సున్నుండలో, పూత రేకులో అయినా బాగుండును!!). అమెరికా కి వలస వచ్చిన రోజునుంచీ  ఈ రోజు వరకూ  – ఒకటి కాదు రెండు/ మూడు ఏళ్లయినా సరే చెక్కు చెదరకుండా ఉండే ఈ పదార్థాలని ‘పిల్లలకి ఇవ్వకండి. మీ పిల్లల ఆరోగ్యాలు పాడయ్యి మందబుద్ధుల్లా తయారవుతారు’ అని చెప్పే వీడియోలు,  ads టీవి & ఇతర మాధ్యమంలో చూసిన గుర్తులేదు నాకైతే.  నోరూరించే ఆ చాక్లెట్ ని గబగబా నోట్లోవేసుకోవడం  కోసం , చాక్లెట్ చుట్టూ అందంగా ఉన్న ప్లాస్టిక్ తగరంని  చెత్తడబ్బాలో పడేయమని తొందరపెట్టే బుర్ర ,  ఆ చిన్ని తగరం భూమాత భారాన్ని ఎంత పెంచుతుందో గురించి ఎక్కడా,ఎప్పుడూ చెప్పదు. ఏంటో మరి!!   

Thanks giving పండగైనా,  Christmas  పండగైనా అమెరికా లో ప్రతి ఇంట్లో సీమకోడి కోయాల్సిందే, దానిని వండీవార్చి  ఓ నాలుగు రోజుల పాటు  తినాల్సిందే !! చలికాలంలో  వచ్చే ఈ పండుగలలో భుజించే  ఆ సీమకోడిని  వసంతకాలం నుంచే పెంచుతారట!! సీమకోడి రుచి గురించి & అది ఎన్ని రకాలుగా, ఏ గిన్నెల్లో వండుకోవాలి అని అన్ని రకాల మాధ్యమాలలో చెప్తారే కానీ సీమకోడిని తినడం జీవహింస అంటూ ఎవరూ  ఎవరికీ నీతులు చెప్పడం నేనైతే చూడలేదు మరి!! ముఖ్యంగా పండగ జరుపుకునే  రోజుల్లో !!

ఇక  Chritsmas!!  అందరూ పెద్దా చిన్నా తేడా లేకుండా కోరికల చిట్టాలు విప్పేవేళ  !! అమెరికా వారికేమో గానీ ముందు  చైనా  వారికి పండగే పండగ !! ఒక్క Chritsmas ఏం  ఖర్మ? చైనా వారికి అమెరికాలో ఏ పండగైనా  వారికి పండగే!! ప్రతి ఇంట్లో అఖండాలు గా వెలిగినే విద్యుద్దీపాలు  అలంకారాలు, gift లు , ఆ gift లు చుట్టబెట్టడానికి అందమైన తగరాలు, tape లు అన్నీ వారే కదా ఎగుమతి చేయాలి!! ఇక ఈ పండగ హడావిడి ఎంతలా ఉంటుందంటే, భూమాత, కాలుష్యం, ‘ Go  Green’ అన్నమాటలేవీ ఎవరికీ  గుర్తుకు రావు ఎవరూ  గుర్తు చేయరు అంటే  అతిశయోక్తి కాదు !!

భారత దేశం లో….

హిందూ మతము అంటే  చాదస్తం అంటారు భారత మేధావులు !! అటువంటి చాదస్తాలు ఉన్న   భారతదేశంలో ప్రజలు, ఈ రోజున  ఆలోచిస్తున్న విధానాలు  వింటుంటే ఆశ్చర్యం వేస్తోంది !!

అక్టోబర్, నవంబర్ మాసాలలో వాట్సాప్ డబ్బాలలో  నీతి సూక్తాల వల్లింపు కార్యక్రమం మొదలవ్వగానే అర్ధమయ్యి పోతుంది – ‘ఓ దీపావళి దగ్గరికి వచ్చేస్తోందన్నమాట’  అని.  టపాకాయలు  కాల్చకండి, వాటి వలన  కాలుష్యం &  పొగ !!  ఆ పొగ పీల్చడం ఆరోగ్యానికి హానికరం అంటూ ఆ దీపావళి రెండు రోజుల్లో ఆరోగ్యాన్ని, డబ్బు ని కాపాడుకోవడానికి కావాల్సినన్ని  నీతి సూత్రాలు ఎన్ని దొరుకుతాయో ఆ డబ్బాలలో !!

నాకు ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే –    ఇదే నీతి సూక్తాల వల్లింపు,  క్రొత్త సంవత్సరం వేడుకలు చేసుకుంటూ  మద్యపానం సేవించే వారికి, వీరికోసం కష్టపడి అర్ధరాత్రి వరకూ తలుపులు తీసి ఉంచే పబ్బుల  వారికీ చెప్పరు పాపం !! ఏ వైద్యుడు కూడా వీరికి ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అంటూ ఎటువంటి ఆరోగ్య సూత్రాలు వల్లించడేంటబ్బా అని అనుకుంటాను కూడా !! భారత దేశం లో హిందూ పండగలప్పుడు మాత్రమే కనిపించే/వినిపించే   ఇటువంటివి ఎన్నో సూక్తిముక్తావళులు, వేరే పండగలప్పుడు కానరాకుండా  నా లాంటి వారిని ఆశ్చర్యపరుస్తాయి.  ఆశ్చర్యపరచడం వారి వంతు !! ఆశ్చర్యపోవడం నాలాంటి వారి  వంతు !!

ఇంతకీ విషయం  ఏంటంటే …

దీపావళి రోజు కాలుష్యపు పొగ, POP  వినాయకుళ్ళు , POP  దుర్గా దేవి  ఇవన్నీనిజంగా పర్యావరణానికి హానికరమే.  దేనికైనా ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఆయాసం ఉన్నవారు దీపావళి పండగ రెండు రోజులు ఎంత ఇబ్బంది పడతారో ప్రపంచంలో అందరికంటే మా కుటుంబానికే బాగా తెల్సు. కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే దీపావళి పర్యావరణానికి చేసే హాని సంవత్సరం అంతా హాని చేసే వాటితో పోలిస్తే ఎంత? టపాకాయలు మితంగా కాల్చండి అని చెప్పడానికి బదులు, అసలు పూర్తిగా మానేయమని, నిరోధించమని చెప్పడం ఎంతవరకు సమంజసం ?

టపాకాయలు లేని దీపావళి –>  బక్రీ లేని బక్రీద్, సీమ కోడికూర లేని Thanks  Giving,  Christmas tree  లేని Christmas  ఎలా ఉంటాయో అలాగే ఉంటుందిపర్యావరణ రక్షణ  గురించి నీతి సూక్తాలు వల్లించేవారు దీపావళికి మాత్రమే కాదు, సంవత్సరం అంతా  అన్నీ పండగలకి వల్లిస్తూనే ఉండండి. ఎంతమంది మీ నీతి సూక్తాలు వింటారో  చూద్దాం !!

ప్రకటనలు

4 thoughts on “దీపావళా ? సూక్తి ముక్తావళా ?”

  1. మీ తో పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. నా బాధ ని లాస్టియర్ ఇలాగే వెళ్ళగక్కేను కూడా. https://anaganagaokurradu.blogspot.co.uk/2016/10/sree-ranga-neetulu.html
    “ఆయాసం ఉన్నవారు దీపావళి పండగ రెండు రోజులు ఎంత ఇబ్బంది పడతారో ప్రపంచంలో అందరికంటే మా కుటుంబానికే బాగా తెల్సు” మా కుటుంబ విషయం లో కూడా ఇది నిజమే.

    మెచ్చుకోండి

    1. ఏమి చేయలేకే కదండీ బ్లాగు వ్రాసుకుంటాము 🙂 ఇలా మీలాగా ఎవరైనా కామెంటితే నా లాగా ఆలోచించేవారు ఉన్నారు అన్పిస్తుంది. మీ పోస్టు బావుంది నాలుగు ముక్కల్లో చెప్పాల్సింది చెప్పారు. మీ పాత పోస్టులన్నీ చదివేసాను

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s