ఒక Ipad కథ

క్రిందటి శనివారం మా దగ్గర ఉన్న గుళ్లో హైదరాబాద్ బ్రదర్స్ లో ఒకరైన శ్రీ శేషాచారి గారి కచేరి. నిజం చెప్పాలంటే వాళ్ళ కచేరీలకి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. యూట్యూబ్ లోనూ వినలేదు. వాళ్ళు ఎలా పాడతారు అన్నది zero knowledge నాకు. ఓ మూడు గంటల సేపు జరిగిన ఆ కచేరీలో ఆయన పాడిన మొదటి రెండు పాటలు తెలుసు. మిగిలినవి తెలీదు. ఒకటో రెండో తప్ప రాగాలు గుర్తు పట్టడం రాదు నాకు. నాతో పాటు కచేరి కోసం వచ్చిన మా అమ్మాయి ముందుకి వెళ్లి వేరే పిల్లలతో కూర్చుంది. పొద్దున్నే లేచి అలసిపోయానో ఏమో నిద్ర ముంచుకుని వచ్చేస్తోంది. నిద్రపోతే అంత పెద్ద విద్వాంసుడిని అవమానించడం కాక ఏంటి అని ఆపుకోడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాను. చుట్టుపక్కల అందర్నీ గమనించడం మొదలు పెట్టాను. మా అమ్మాయికి దగ్గర్లో వయోలిన్ వాయించడం వచ్చిన ఓ ముగ్గురు హై స్కూల్ పిల్లలు కూర్చున్నారు. శేషాచారిగారు కృతి మొదలు పెట్టిపెట్టగానే ఏ రాగమో, ఏ కృతో guess చేయడం మొదలు పెట్టారు వాళ్ళు. వారి guess correct అవ్వగానే నవ్వుకుంటూ నెమ్మదిగా high -five ఇచ్చుకుంటున్నారు. వచ్చిన సంగీతరసికులు తాళం వేస్తూ, బుర్ర ఊపేస్తూ అందులో తేలియాడిపోతున్నారు.

నా పక్కన ఓ పిల్లవాడు కూర్చున్నాడు.వయసు పది- పన్నెండేళ్ళ లోపు ఉండచ్చు. చేతిలో Ipad పట్టుకున్నాడు. కాసేపు కుర్చీ కింద పెడ్తున్నాడు. కాసేపు ఒళ్ళో పెట్టుకుంటున్నాడు. కాసేపు ఆడుతున్నాడు. నిజంగా ఈ electronic gadget లు వచ్చి ప్రపంచాన్ని ఎంత నాశనం చేశాయా అనుకుని తిట్టుకుంటూ నా iphone లోవాట్సాప్ చూసుకోవడం మొదలు పెట్టాను. వాడు మళ్ళీ కుర్చీ కింద పెట్టిన ipad తీసాడు. ఏం ఆట ఆడుతున్నాడా అని తొంగి చూసాను. Notes లో ఏదో వ్రాసుకుంటున్నాడు. పక్కన వాళ్ళ నాన్నగారు అనుకుంటాను. ‘తప్పు వ్రాసావు’ అంటూ ఆయన ipad తీసుకుని ఆయన వ్రాసారు. కుతూహలం తట్టుకోలేక ఏంటా అని మళ్ళీ ఇంకోసారి చూసాను(లా చూడకూడదు. కానీ ఎవరో ఒప్పుకోరుగా 🙂 ) . (అలా చూడకూడదు. కానీ ఎవరో ఒప్పుకోరుగా 🙂 ) . ఏం చేస్తున్నాడో తెలుసా ?? కచేరిలో ఆయన పాడుతున్న కృతులన్నీ ఒక list లాగా వ్రాసుకున్నాడు ఆ అబ్బాయి. మూడు గంటల కచేరి, 12 ఏళ్ళ లోపు వయసు, చేతిలో ipad – ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో ఏ పురాణం చదవకుండానే/వినకుండానే ఆ కాసేపట్లో నేర్చేసుకున్నాను. సరుకుల జాబితా కోసం iphone లో notes తెరిచినపుడల్లా ఆ అబ్బాయే గుర్తొస్తున్నాడు 🙂

ప్రకటనలు

12 thoughts on “ఒక Ipad కథ”

 1. స్మార్ట్ ఫోన్ లు వచ్చి ఈ తరం పిల్లలని నాశనం చేస్తున్నాయని నేను గాఢం గా నమ్ముతాను. దీనిలో పిల్లల కంటే, వాళ్ళకి సమయం ఇవ్వలేని తల్లిదండ్రులదే దోషమనిపిస్తుంది. మీరు చూసిన పిల్లవాడు, అతడి తల్లిదండ్రులు అభినందనీయులు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. సెల్ ఫోన్లకు బానిసలై పోతున్న తరం గురించి

  “Notes to an offiline self” అనే వ్యాసం (దాంట్లో “The useless class” అనే పేరుతో ఒక పేరా కూడా ఉందండోయ్ 🙂)

  http://deccanchronicle.in/

  నిన్న ఆదివారం October 29, 2017 తేదీ Deccan Chronicle డెయిలీ పత్రిక వారి ఆదివారం అనుబంధం Sunday Chronicle లో వచ్చింది. చాలా ఆసక్తికరంగా ఉంది. (మనలో మన మాట, ఇది ఎంతమంది చదువుతారు, చదివినవారిలో ఎంతమంది పట్టించుకుంటారు అన్నది వేరే సంగతి. పైగా గతంలో ఇతర పేపర్లలోనూ, ఇతర దేశాల్లోనూ కూడా ఇటువంటి వ్యాసాలు వచ్చే ఉంటాయి / ఇప్పుడూ వస్తూనే ఉంటాయి కదా)

  గమనిక:- నేను ఎంత ప్రయత్నించినా పైన చెప్పిన వ్యాసం పేజ్ కి లింక్ దొరకలేదు 🙁. మొత్తం పేపర్ కి లింక్ మాత్రమే ఇస్తోంది. కాబట్టి చదవదల్చుకున్నవారు కాస్త శ్రమ తీసుకుని పైనిచ్చిన లింక్ లో కుడివైపు పైన బార్ లో కనిపించే More లోకి వెడితే అక్కడ Sunday Chronicle అని కనిపిస్తుంది. దాంట్లో (October 29, 2017) పైన చెప్పిన వ్యాసం చూడచ్చు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. మాధవ్ గారూ, సెల్ ఫోన్ల గురించి మీరన్నది కొంత వరకు కరక్టే. అయితే తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్లకు బానిసలైపోవడం వలన పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారని, దానికి ముఖ్య కారణం బతుకుదెరువు కోసం వాళ్ళు పెడుతున్న ప్రస్తుత ఉరుకులూపరుగులూ అనీ నా అభిప్రాయం. తమ ఉద్యోగుల్ని పీల్చి పిప్పి చేస్తున్న కార్పొరేట్ సంస్ధల వలన ఈ ఉరుకులూపరుగులూ. కాస్త టైమంటూ దొరికినా (అదిన్నూ “వర్క్ ఫ్రం హోమ్” లో హరించుకు పోకుండా ఉంటే) (భవిష్యత్తులో “వర్క్ ఫ్రం హాస్పిటల్” పరిస్ధితి కూడా రావచ్చేమో – అస్వస్ధతగా ఉన్న ఉద్యోగులకు 😀) దాన్ని పిల్లలకు కేటాయించలేని నిస్త్రాణగా ఉండే పరిస్ధితే ఎక్కువగా ఉంటుందనీ, అందువల్ల ఆ టైము తమ వినోదం కోసం ఉపయోగించుకుంటున్నారనీ నా అనుమానం.

  టెక్నాలజీకి బానిసలై పోయిన ఇప్పటి కుటుంబాలు, కుటుంబమంతా కలిసి గడిపిన పాతరోజుల కొన్ని ఉదాహరణలు ఈ క్రింది లింక్ లలోని ఫొటోలలో కనపడతాయి.
  ————-
  Present addiction to the cell phone in entire family (this caption by me 🙂)

  http://www.dailymail.co.uk/sciencetech/article-3550241/Do-spend-time-phone-family-Parents-children-exchange-5-800-texts-260-emails-year.html
  ————

  Those were the times : Family playing together upto 1970s, 1980s etc in contrast to the present obsession with the cell phone (this caption by me 🙂)

  http://www.alamy.com/stock-photo-1960s-mother-father-children-2-kids-boys-playing-board-game-parcheesi-12657890.html

  http://www.alamy.com/stock-photo-1970s-family-playing-parcheesi-on-living-room-floor-orange-shag-carpet-52274750.html

  http://www.fotosearch.com/CLT001/kj7487/
  ————-

  మంచి టపా చంద్రిక గారూ. లలితమ్మ చెప్పినట్లు ఈ టపాలోని “ఐ-పాడబ్బాయి” మంచి బాలుడులాగానే ఉన్నాడు లెండి 👌.

  మెచ్చుకున్నవారు 2 జనాలు

   1. బ్లాగేల? బ్లాగే ఏల? వ్యాఖ్యలు చాలవా? అనే మీమాంసలో ఉన్నాను. తేలిన తరువాత మీ “డిమాండ్” సంగతి చూస్తాను 😀😀. మీ “ప్రోత్సాహానికి” ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s