ప్రియవ్రతుడు -క్రౌంచ ద్వీపం

ఈ మధ్య భాగవతం వింటూ  ఒక విషయాన్నీ గమినించి, నేను ముఖ పుస్తకంలో  ఒక టపా వ్రాసాను. అదే ఇది :

మా అమెరికా లో సంకల్పం – క్రౌంచ ద్వీపే , రమణక వర్షే – అంటూ చెప్పుకుంటాం.  ప్రపంచానికి ‘అమెరికా ఖండం అనేది ఒకటి ఉంది’ అని కొలంబస్ కదా చాటి చెప్పాడు!! మరి ఈ క్రౌంచ ద్వీపం అనేది  ఎక్కడనుంచీ వచ్చింది? మన వాళ్ళు ఈ పదం బావుంది అని చెప్పుకుంటున్నారా సంకల్పంలో ? కాదుగా !! భాగవతంలో ప్రియవ్రతుడి కథ వింటే/చదివితే క్రౌంచ ద్వీపం ఎక్కడ నుంచీ వచ్చిందో తెలుస్తుంది. ప్రియవ్రతుడు గృహస్థాశ్రమం అనేది ఎంత గొప్పదో నిరూపించడానికి ఏడు  రోజులలో మేరు పర్వతం చుట్టూ భూప్రదక్షిణం చేసాడుట. ఆ రధపు జాడల వలన ఏడు సముద్రాలూ, ఏడు ద్వీపాలు ఏర్పడ్డాయిట. అంటే లెక్క ప్రకారం ఈ మేరు పర్వతం అనేది  ఎక్కడో భూమధ్య భాగం లో ఉండాలి. నాకు వెంటనే గుర్తొచ్చింది ‘కౌముది’ లో చదివిన గొల్లపూడి వారి వ్యాసం ‘టాంజినియా ట్రావెలాగ్ ‘.  Tanzania లో ఒక పర్వతం ఉంది. దాని పేరు మౌంట్ మేరు. భూమధ్యరేఖ కి సరిగ్గా 200 మైళ్ళ దూరం లో ఉంది ఆ పర్వతం!!

చిన్నపుడు మనం  సాంఘిక శాస్త్రం లో చదువుకున్నాము. అమెరికా వచ్చాక మా పిల్లలకి కూడా  చెప్పాను ” There are seven continents in the world ” అని. Seven  continents  అంటే  సప్త ద్వీపాలు.  ఎవరు చెప్పారు ఇవన్నీ పుక్కిటి పురాణాలూ అని? వ్యాసుల వారు కాలక్షేపం కోసమో, సాహిత్య అవార్డుల కోసమో, ఫేస్బుక్/వాట్సాప్ లో లైక్ ల కోసమో ,TRP రేటింగ్ కోసమో వ్రాసుకోలేదు ఈ కథలన్నీ!!

 

ప్రకటనలు

12 thoughts on “ప్రియవ్రతుడు -క్రౌంచ ద్వీపం”

  1. నమస్కారమండీ🙏.చెప్పిన ద్వీపాలు:
   Courtesy: telugubgagavatam.org

   రథపు గాడి మధ్యలో జంబూ, ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు అను ఏడు ద్వీపములు ఏర్పడ్డాయి.

   మెచ్చుకోండి

 1. ధన్యోస్మి. మరీ లాగుతున్నాను అనుకోకపోతే.. క్రౌంచ ద్వీపం అమెరికా అని ఎలా తెలుస్తుంది? (ఉత్తరమా, దక్షిణమా) ఆ ఏడు ద్వీపాలనూ ఇప్పటి ఏడు ఖండాలతో ఎలా కోరిలేట్ చేసుకోవాలి? మంచుఖండం అంటార్కిటికాకు‌ ఆనాటి పేరు ఏది అయి ఉంటుంది? జంబూ ద్వీపం గురించి చిన్నప్పటి నుంచీ వింటున్నామనుకోండి.. మిగతా వాటికి ఏ పేరు ఏదో తెలుసుకునే మార్గమేది? విన కౌతూహలంబయ్యెడిన్!

  మెచ్చుకోండి

  1. ఇవన్నీ నేను ఒకదానికి ఒకటి లంకె వేస్తూ connecting dots లాగా గమినించానండీ . నాకూ తెలియదు. సంకల్పం ఎలా చదువుతున్నారో వేరే ఖండాలలో నివసిస్తున్న మన వారు చెప్పాల్సిందే. దీని మీద చాలా చర్చలే ఉన్నాయి గూగులమ్మ లో వెతికితే 🙂 . UG Sriram, హరిబాబు గారి లాంటి వాళ్ళు చెప్పాల్సిందే 🙂

   మెచ్చుకోండి

   1. నా మెడకి ఒక సుదీర్ఘ పోష్టుకి సరిపడా రీసెర్చిని చుట్టారన్నమాట!
    పోష్తు వేసి,చాల్రోజులైంది – అయినా ఇప్పుదే చూశా,దీని అంతూ చూడాలి!

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s