తెలుగు సభలట…

వెంకయ్య నాయుడుగారు  ప్రపంచ తెలుగు మహాసభల  సందర్బంగా  కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు !!అవి విన్నాకా నాకు కొన్ని విషయాలు స్ఫురించాయి.

హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కాకముందు నైజాం  పాలనలో ఉండేది. ఆ రోజుల్లో మా ముత్తాత గారు, (అంటే మా నానమ్మ తండ్రి గారు)  హైదరాబాద్ మహబూబ్ కాలేజీ లో పని చేసేవారు.  నైజాం  కొలువు కాబట్టి ఆంధ్రా వాళ్ళలాగా పంచె కట్టుకునేవారు వారు కాదుట. అదొక నియమం !!  అంటే వీళ్ళ కట్టుబొట్టూ  నిజాం  వారి సంప్రదాయంలో ఉండాలి అన్నది నియమం !!  మా నాన్నగారు పుట్టే సమయానికి హైదరాబాద్లో రజాకార్ల గొడవలతో అల్లకల్లోలంగా ఉండేదిట. ఆడవారికి భద్రత అనేది చాలా భయంకరంగా ఉండింది అని చెబుతుంటుంది మా నానమ్మ !!  అందుకని  మా ముత్తాతగారు ఈవిడ పురిటి సమయానికి అప్పటికప్పుడు ఇంట్లో  వారందరినీ  రైలులో ఆంధ్రా కి పంపేసారుట. ఇవి ఆరోజున నైజాం  వారి పాలనలో సామాన్య ప్రజలు పడ్డ కొన్ని బాధలు !!

నైజాం ప్రభువు పాలనలో  ‘తెలుగు’ , ‘ఆంధ్ర’ అలాంటి  పదాలు వినపడకూడదు కూడా. వాటిని గురించిన సభలు కూడా పెట్టకూడదు. అంతటా కూడా ఉర్దూనే !! ప్రజలు మాట్లాడే భాష తెలుగు. మాధ్యమం మాత్రం ఉర్దూ!! ఆనాడు ఆ ఆంక్షలకి తలవంచుతూనే, సభలు పెట్టి, శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం లాంటివి ఎన్నో స్థాపించి తెలుగు భాషని రక్షించిన వారి గురించి చెప్పాలంటే బోలెడంత !!  నిజాం  పాలన ఎటువంటిదో పైన చెప్పాను  కదా!! అంటే ఇటువంటి వారు తెలుగు  భాష కోసం ఆ రోజుల్లో ఎంత risk  తీసుకుని ఉంటారో ఆలోచించండి !! ఆంధ్రా నుంచి వచ్చామా, తెలంగాణా నుంచి వచ్చామా అన్న ప్రశ్న లేదు.

దాదాపు 80 ఏళ్ళ క్రిందట  ‘బాలికలు కూడా చదువుకోవాలి’ అంటూ తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో నారాయణ గూడ లో  స్థాపింపబడిన మాడపాటి హనుమంతరావు గారి బడిలో పైసా ఖర్చు   లేకుండా చదువుకున్న ‘మాడపాటి అమ్మాయి’ ని నేను ( అక్క కి  సంవత్సరానికి 20/- రూపాయలు. చెల్లి కూడా అక్కడే చదివితే  10/- రూపాయలు !!).  నాకు , మా అక్కకే  కాదు కొన్ని వేల మంది స్త్రీలకి విద్యాదానం చేసింది ఆ బడి!! ఇంజినీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు !!   

కొంతమంది,  వారు చేసేపని నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంటారు. కీర్తికండూతి అనేది వారికి  తెలీదు. అటువంటి వారిలో పద్మభూషణ్ ఆంధ్ర పితామహ  మా మాడపాటి హనుమంతరావు తాత గారు ఒకరు !!  

ఆ నాటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు సేవ చేసిన  ఇటువంటి మహనీయుల(గురువుల) గురించి, తెలంగాణా ముఖ్యమంత్రి ఈనాటి ప్రపంచ తెలుగు మహాసభలో  ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం  చాలా శోచనీయం !!

ప్రకటనలు

9 thoughts on “తెలుగు సభలట…”

  1. తెలుగు భాష కూడా రాష్ట్రం లాగే రెండు చెక్కలైనది. మాది తెలుగు – మీది ఆంధ్రం అని తెలంగాణా వారెన్నడో ప్రకటించుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలంటే ఉభయప్రాంతాల భాషనూ భావించుకొని ఇబ్బంది పడన సరం లేదేమో.

    మెచ్చుకోండి

    1. ఒకప్పటి రాష్ట్రం రెండుగా విడిపోయింది. అంతటితో అయిపొయింది. ఆ పదవిలో కూర్చుని కూడా మనుష్యుల్ని విడతీయటడం దేనికి ? ఎందుకా పదవి? ఇంక ప్రపంచ తెలుగు సభలు, అని పేరు పెట్టడం దేనికి ? నైతిక విలువ అనేది ఏ స్థాయివాడికి కూడా ఉండట్లేదు అని స్పష్టంగా తెలుస్తోంది. అదీ బాధపడవలసిన విషయం 😦

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s