ఏది విజయం?

“Go on bravely. Do not expect success in a day or a year. Always hold on to the highest. Be steady. Avoid jealousy and selfishness. Be obedient and eternally faithful to the cause of truth, humanity, and your country, and you will move the world.” – Swami Vivekananda

వివేకానందుల వారు చెప్పవలసినది చాలా సులభంగా పైన రెండు ముక్కల్లో చెప్పేసారు. అసలు ఈ పదం ‘Success’ అంటే ‘విజయం’ అనే దానికి ఏది ప్రామాణికం గా తీసుకుంటున్నాం ?పోటీప్రపంచంలో కప్పులు గెలుచుకోవడమా ? మంచి కాలేజీలో చదవటమా ? డబ్బు సంపాదించడమా ? ఉద్యోగమా ? పదవులా ? సంబంధ బాంధవ్యాలా ? ఏది చెప్పాలి మన పిల్లలకి ? వివేకానందుల వారు చెప్పినట్లు ‘స్వార్ధము’ & ‘అసూయ ‘ లేకుండా, ఏ విషయంలో అయినా ‘Success’ అంటే ‘విజయం’ సాధ్యమవుతుందా? అదీ ఈ రోజుల్లో ??

ఉరుకులు పరుగులు!! 24 గంటలలో 36 గంటల పనులు చేయాలి. పిల్లల్ని మంచి కాలేజీలలో చేర్చాలి అన్న తపన!! అందుకు ఏ పోటీ కనిపిస్తే అది!!. ఏ కోర్సు కనిపిస్తే అది!! ఎవరు ఏం చేస్తే అది !! గొఱ్ఱెలమందలో ఒక గొఱ్ఱె ఏం చేస్తే మిగితా గొఱ్ఱెలు అదే చేసినట్లు !!మనబడి చెప్పే వేమన శతకాలు వద్దు. పంచతంత్ర కథలు అసలొద్దు. బాలవికాస్ లాంటి తరగతులు మాలాంటి వాళ్ళకి కానే కాదు. Volunteer గంటలు కావాలి కానీ volunteering వద్దు. Parenting classes మాకోసం కాదు.

‘ఏమిటి ఇలా వింతగా మాట్లాడుతున్నారు’ అంటే –

అమెరికాకి వలస వచ్చి మా లాంటి తలితండ్రులు పిల్లలకి చక్కటి చదువులు చెప్పించి తీర్చిదిద్దటంలో చాలా ‘విజయా’లు సాధిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల కొన్ని అపశృతులు కూడా వినిపిస్తున్నాయి. ముందు ముందు ఇటువంటివి ఇంకా ఎక్కువ వింటామేమో అన్న భయం కూడా వేస్తోంది.

దానికి తోడు, ఈ సోషల్ మీడియా పుణ్యమా అని, మాయ బజార్ సినిమాలో సత్యపీఠమల్లే, కొన్ని సార్లు మనుష్యుల నైజాలు తెలిసిపోతున్నాయో ఏంటో మరి!! జరిగిన ఘటనలు / విషయాల గురించి చర్చించడం నా ఉద్దేశ్యం కాదు. నన్ను చాలా బాధ పెట్టిన అంశం ఏంటంటే, ఏమాత్రం sensitivity అన్న sense కూడా లేకుండా ప్రవర్తించిన/ప్రవర్తిస్తున్న సాటి తల్లితండ్రుల తీరు. ‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు’ కదా !!

ఈ రోజు ఎక్కడో దాచుకున్న వివేకానందుల వారి ఈ సూక్తి కనిపించి, అసలు ‘విజయం’ అనే మాటకి అర్ధమేంటా అనిపించింది. పిల్లలకి ఏం నేర్పిస్తున్నామా అనిపించింది అంతే !!

ప్రకటనలు

2 thoughts on “ఏది విజయం?”

  1. // “24 గంటలలో 36 గంటల పనులు చేయాలి. ” //

    మా దేశంలో అయితే అంతకన్నానండి – ఇవాళ్టి పని మొన్ననే అయిపోయుండాలి. నిన్నటి పని వారం క్రితమే ఎందుకవలేదని బాధ. చిన్నపిల్లల చదువులో కూడా – కార్పొరేట్ కల్చర్ (మీరన్న ఉరుకులూ పరుగులూ అన్నమాట).

    అమెరికా వారిని చూసి మా దేశంలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అలాగే పరుగులు పెట్టిస్తున్నారు. Aping the West మనకి మామూలేగా. నా అభిప్రాయం తప్పో ఒప్పో తెలియదు గానీ – అసలు అమెరికాలో ఉంటున్న భారతీయుల్లోనే ఈ గోల ఎక్కువని, పోటీ పడడం ఇతర భారతీయ కుటుంబాలతోనే (చాలా మటుకు) ఎక్కువనీ నాకనిపించింది. మీరేమో సుమతీ శతకం, పంచతంత్రం అంటారు …. చాలామంది తల్లిదండ్రులకే తెలియదు.

    మా దగ్గర మాత్రం తల్లిదండ్రులు పిల్లల్ని హింస పెట్టేస్తున్నారనిపిస్తుంది – స్కూళ్ళల్లో పెట్టే హింసకి ఇది అదనం.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s