ఎప్పుడూ అమ్మనే మెచ్చుకుంటే ఎలా?

 

‘ఎనిమిదయినా ఆ నిద్దర్లేంటి లేవడమ్మా ‘

‘వీకెండ్ కదా పడుకుంటారు. మరీ చాదస్తం ఎందుకు’

‘లేటుగా లేస్తే brain పని చేయదట. తమరు కూడా లేవచ్చు. లేవండమ్మా!!’

****

‘ Did you wash my PE clothes?’

‘మడత పెట్టి నీ backpack దగ్గరే పెట్టానే  సరిగ్గా చూసుకో’

****

‘ఈ రోజు పిల్లల lunch  కి PBJ sandwich పెట్టేయమంటావా ? లేదా దోసెలు  వేయాలా ?’

****

‘రేపు SOL  exam ఉంది కదా. తొందరగా పడుకోండమ్మా .  పదండి ఇద్దర్ని హనుమాన్ చాలీసా పాడుతూ పడుకోబెడతాను’.

****

‘బస్సు వచ్చేస్తుంది. తొందరగా రామ్మా . జడ వేసేస్తాను.’

****

‘దాన్ని క్లాసులో దింపి Costco  కి వచ్చా. ఏమయినా కావాలా ?’

‘Walmart  కి వెళ్తున్నా. ఇంతేనా లిస్టు?’

****

‘పిల్లలకి  ఆకలి వేసేస్తుందేమో.   అన్నం, పప్పు వండేయనా ?’

***

‘రేపు teachers working  day బడి లేదు కదా. ఇంటినుంచే  పని చేస్తాలే’

***

పోన్లే పాపం సరదాగా మాల్ కి తీసుకెళ్తా. ఐస్క్రీమ్ తింటారు.  ఎప్పుడూ చదువు అంటే వాళ్ళకీ బోర్ కదా.”

***

 

ఇవన్నీ నేను చేస్తున్నా అనుకుంటున్నారా ? కాదు గాక కాదు. Mother’s  Day అయితే ఆ పనులు చేసింది నేనే అని వ్రాసుకునేదాన్నేమో. ఎవరైనా కవులు పైన వ్రాసింది చదివితే అమ్మ గురించి ఎన్నో పనులు చేస్తుంది అంటూ కవిత్వం వ్రాసేస్తారు.  కానీ ఇవన్నీ ఒక Father చేస్తారు. అంటే ఎవరో ఈ పాటికి అర్ధమయ్యి ఉండాలి!!

మా పెద్దమ్మాయి పుట్టిన మూడోరోజుకి jaundice  వచ్చి hospital లో మూడు రోజులు ఉంది. నన్ను డిశ్చార్జ్ చేసేసారు(అదొక Insurance  తలనొప్పి)నేను ఇంటికి వచ్చేసాను. మా వారే ఆ మూడు రోజులు నిద్రాహారాలు మాని చూసుకున్నారు. ఈరోజు కి కూడా పిల్లలకి ఒంట్లో బాలేదు అంటే ఇంటివైద్యం అంతా తానే  చేస్తారు. తల్లి నేనా ఈయనా అన్న సందేహం వస్తుంటుంది నాకు.

అమ్మలే పిల్లల్ని చూసుకుంటారు అన్నట్లు మాట్లాడుతాము.  ఎంతో మంది నాన్నలు కూడా అమ్మతో సమానంగానే పిల్లల్ని చూసుకుంటున్నారు. అదనపు బాధ్యతలు ఆనందంగానే స్వీకరిస్తున్నారు.   

 

నాన్నలందరికీ  Happy Father’s day!!

కొసమెరుపు: ఈ రోజు పొద్దున్న కూడా మేలుకొలుపు ఇంకా జరుగుతోంది.

 

  అన్నీ పనులు చేసే  నాన్న లకి సరదగా 🙂 ( Whatsapp  నుంచి )

 

5dcaf36e-8590-4ed8-bd1d-4c9c8963e9ed

ప్రకటనలు

6 thoughts on “ఎప్పుడూ అమ్మనే మెచ్చుకుంటే ఎలా?”

 1. అందరూ మీలాగా ఆలోచిస్తారా /
  అంత తేలిగ్గా ఒప్పుకుంటారా చంద్రిక గారూ? No. మా వారు ఇంటిపనుల్లో ఏమీ సహాయం చెయ్యరండీ, కాలు మీద కాలు వేసుకునీ టీవీ చూస్తూ కూర్చుంటారు …. అనేవాళ్ళే ఎక్కువ☺. పోన్లెండి, మీరు మినహాయింపులా ఉన్నారు good 👏.

  మీ వారికి Happy Father’s Day అండి👍.

  మెచ్చుకోండి

 2. నాన్నల గురించి చక్కగ
  కొన్నైనా మంచిగ పలుకుల తెలిపిరిగా
  మిన్నగ రాసేరండీ
  వెన్న,అములుబట్టరున్ను విదురులు పొగడన్ 🙂

  జిలేబి

  మెచ్చుకోండి

 3. చంద్రిక గారు, కాలం మారింది. ఇండియాలోనే ఇంట్లో మొగవాళ్ళు అన్నిపనులు చేసేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు. అమెరికాలో వాళ్ళు ఒక చేయి వేయటం ఆశ్చర్యం కాదు. అలాకాకపోతేనే ఆశ్చర్యం. ఆలా చేసుకోకపోతే ఉద్యోగాలు, పిల్లలు, ఇల్లు సవురించుకోవటం జరిగే పని కాదు.

  అందునా అయ్యరు గారి కాఫీ త్రాగుతూ, కవిత్వం వ్రాసే జిలేబిగారు అలా అనటం మాత్రం చిత్రమే.

  మెచ్చుకోండి

  1. మీరు చెప్పినట్లు చేస్తే వింత లేదు. కానీ ఇంకా పనులన్నీ అమ్మలే చేస్తున్నట్లు కొందరు అలాగే మాట్లాడుతున్నారు. అందుకే ఈ టపా !! జిలేబి గారి గురించి చెప్పేదేముంది 🙂 ?

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s