हे अपना दिल तो आवरा

ఈ పాట విన్నప్పుడల్లా కాలేజీ రోజులు గుర్తొచ్చేస్తాయి. పైగా ఈ పాట కూడా నా FB స్నేహితులు ఒకరు పాడుతూ అల్లరి చేసేస్తూ వీడియో ఒకటి పెట్టారు. అదీగాక మాలికలో బ్లాగుల నిండా కాలేజీ కబుర్లే చెబుతున్నారు.
మా కాలేజీకి వెళ్ళాలంటే ఓ రెండు గంటల ప్రయాణం ఉండేది. మెహదీపట్నం నుంచీ గండిపేట్ వెళ్ళే ఏదో ఒక బస్సు పట్టుకుని వెళ్ళాలి. RTC వారివే కాలేజీ బస్సులు రెండు ఉండేవి. Girls special & Boys special (ఆ రోజుల్లోనే మా కాలేజీ వారు ఆ విధంగా సమానత్వం అన్నారు 🙂 )
ఆ ప్రయాణ కష్టాన్ని మర్చిపోవడానికి కొంతమంది అమ్మాయిలు పాటలు/ అంత్యాక్షరి పాడేవారు. చివరగా ఈ పాట అందుకుని ముగించేవారు. బస్సంతా అమ్మాయిలకే కాబట్టి కొంతమంది వెనకాల foot-board మీద కూర్చునేవారు. అమ్మాయిల బస్ ముందు బయలు దేరేది. overtake గట్రా అయినప్పుడు కేకలు గోలలు!! పరీక్షలు లేని సమయంలో రోజూ picnic అన్నమాటే. నేను పాడేదాన్ని కాదుగాని, అంత్యాక్షరికి సహాయం చేస్తుండేదాన్ని. మేం ఐదుగురం ఉండేవాళ్ళం. మాకు మా కబుర్లు చెప్పుకోవడం సరిపోయేది. మధ్యలో మా లీడర్ సుధీర్ Boys special లో కనిపించాడా లేదా చూసుకుని, కనిపిస్తే మురిసిపోయేవాళ్ళం. ఎందుకు మురిసిపోవడం అంటే సమాధానం ఏం లేదు. అదో తుత్తి మాకు.
ఇప్పుడు కాలేజీ సంగతి కాసేపు పక్కనబెట్టి ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాను.
మా అక్క కూడా నా కాలేజీలో నాతో బాటే చదివింది. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేది అది. ఒకటే బడి. ఒకటే కాలేజీ. నాకంటూ ఒక identity లేకుండా చేసింది!! ఇంక MBA కూడా ‘నువ్వెక్కడికి వెళ్తే అక్కడ వస్తాను’ అంది. దీని సంసారం అంతా వేసుకుని నా వెనకాలే ఎక్కడ వచ్చేస్తుందో అని భయపడి అప్పుడు మాత్రం నేనే దాన్నొదిలి ఉస్మానియా నుంచీ కాకతీయకి పరిగెత్తి పారిపోయా !! సంసారం ఏంటి అంటారా? ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అయిపోగానే దానికి పెళ్లయిపోయింది. అంటే అప్పటినుండీ అది free bird!! అమ్మ, నాన్న మాట వినక్కర్లేలేదన్న మాట!!
మా తమ్ముడు, అక్క చాలా కలిసికట్టుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకరిని మించిన వారు ఒకరు !! మా తమ్ముడు నాలుగో తరగతిలో ఉండగా లంచ్ బాక్స్ ఇచ్చి బడికి వెళ్ళమని చెప్తే, క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడల్లా మాసబ్ ట్యాంక్ లో ఉన్న బడికి వెళ్లకుండా లక్డికాపుల్ టీవీ షోరూం దగ్గర బస్ దిగేసి మ్యాచ్ మొత్తం చూసి, ‘బడికి వెళ్ళాను. కానీ హోంవర్క్ ఇవ్వలేదు’ అని మా అమ్మ దగ్గర గారం చేసేవాడు. మా అక్క పాలిటెక్నిక్ లో బోలెడుక్లాసులు ఉంటే ఆ stress తట్టుకోలేక స్నేహితులతో కలిసి కొత్తగా వచ్చిన సినిమాలు చూస్తూ కాలం గడుపుతూ ఉండేది.
ఇక మళ్ళీ కాలేజీలోకి వచ్చేయండి.
ఒక రోజు ఇలాగే పాటలు పాడుతూ అందరూ కాలం గడుపుతూ ఉండగా, నాకు ఒంట్లో బాగోలేక కాలేజికి వెళ్ళలేదు. ఆ రోజు కండక్టర్ కి వీళ్ళని చూసి చూసి ఒళ్ళు మండిపోయి పాటలు ఆపమన్నాడు. వీళ్ళు పాడటం ఆపలేదు. పైగా పోట్లాడారు. స్త్రీల హక్కులకి భంగం వాటిల్లింది కదా!! ఇక మా అక్క వీరవనిత కూడా విజృభించి ఆ కండక్టర్ తో బాగా పోట్లాడింది. ఆ కండక్టర్ కాలేజీకి వెళ్లి ఏకంగా ప్రిన్సిపాల్ గారితో ‘అమ్మాయిలు రోజూ అబ్బాయిలని చూసి పాటలు పాడుతున్నారు. వద్దంటే పోట్లాడారు’ అంటూ అమ్మాయిల లిస్ట్ చదివి, మా అక్కని కూడా అందులోకి చేర్చేసాడు. ప్రిన్సిపాల్ గారు ‘పాపం ఆ కండక్టర్ మీ అందర్నీ సురక్షితంగా తీసుకెళ్తుంటే, మీరు ఇలా పోట్లాడతారా? మీ అందరి అమ్మానాన్నలని పిలిపించి మాట్లాడతాను’ అన్నారు. అందులో ఫోన్లు ఉన్నవారికి ముందు ఫోన్ చేస్తామని చెప్పారు.
ఆ రోజు ఇంటికి రాగానే మా అక్క నాతో కాకుండా, తన కష్టసుఖాన్ని మా తమ్ముడితో పంచుకుంది. తరువాత ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసారు. మా నాన్న గారు ఫోన్ ఎత్తి ‘ ఈ ఒక్కసారికి అమ్మాయిని క్షమించేయమని’ అడిగారు.
ఈ విధంగా మా నాన్నగారికి ఆ సంఘటన గుర్తు  భలే ఆనందంగా ఉంది
ఫోను ఎవరు ఎత్తి ఉంటారో అర్ధమయ్యిందనుకుంటాను!!
ప్రకటనలు

2 thoughts on “हे अपना दिल तो आवरा”

 1. మీరంతా హైదరాబాద్ వారు కాబట్టి హిందీపాటలు పాడుకునేవారేమో? అదే ఆంధ్రాలో అయితే ఎక్కువగా తెలుగుపాటలే పాడుకునేవారు. మా రోజుల్లో అమ్మాయిలు ఏం పాడుకునేవారో తెలియదు కానీ (మా కాలేజ్ కోఎడ్ కాదు 😢), జనరల్ గా అబ్బాయిలకు మాత్రం బయటకు వెళ్ళినప్పుడు “నిలువవే వాలుకనులదానా, వయారీ హంసనడకదానా” ఫేవరైట్ పాట అని జ్ఞాపకం 🙂.

  కాలేజ్ నుండి వచ్చిన ఫోన్ కాల్ మీ తమ్ముడు బాగానే మేనేజ్ చేసినట్లున్నాడే. సినిమాల ప్రభావమా, మజాకా 🙂.

  మీ అక్కగారు చెల్లెల్ని ఫాలో అవడమేమిటి? సాధారణంగా రివర్స్ లో జరుగుతుంది కదా? అయితే మీ కుటుంబంలో మీరే రోల్ మోడల్ అన్నమాట.

  మొత్తానికి మాకు కూడా మా పాత సంగతులు గుర్తుకు తెచ్చారు, థాంక్స్.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  1. క్షమించాలి. ఈ మధ్య ఒక వారం అసలు సోషల్ మీడియా వైపు వెళ్ళలేదు.
   భలే కనిపెట్టారు మా తమ్ముడ్ని 🙂 ‘అయితే మీ కుటుంబంలో మీరే రోల్ మోడల్ అన్నమాట.’ రోల్ మోడల్ అంత కాదండీ . ఎంబీఏ లో కాలేజీకి వెళ్లకుండా నా నోట్సు లు లాగేసుకుందామని దాని ప్లాన్

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s