‘సీత శీలాన్ని అనుమానించడం, నిండు గర్భిణిని అడవులకు తోలడం …ఇవి మన పిల్లలకు నేర్పిద్దామా? ‘

ఈ మధ్య వచ్చిన  ‘కాలా’ చలనచిత్రం గురించిన ఒక వాదనలో,  రావణుడుని సమర్థిస్తూ ‘రావణుడు తప్పు చేసాడు. అయినా పీడిత జనుల కోసం పోట్లాడాడు’ అన్నారు ఒకరు.  ‘అయితే రావణాసురుడి గురించి పిల్లలకి నేర్పుదామా ‘ అన్న నా ప్రశ్న కి సమాధానంగా ఇంకో ప్రశ్న వేశారు. ఇది వారికే కాదు. సామాన్య మానవులకి కూడా వచ్చే సందేహం.

ఈ పోస్ట్ రామాయణం మీద వితండవాదన చేసేవారికి మాత్రం కాదు. రామాయణం ఎంత సహృదయం తో  విన్నా, వితండవాదన చేసేవారి వాదనలు విని సామాన్యులకి సందేహాలు వస్తూనే ఉంటాయి. ఆ సామాన్యుల కోసమే ఈ టపా. ఎవర్నీ  నమ్మించాలన్న ఆతృత నాకేమాత్రం లేదు. నమ్మితే నమ్మచ్చు లేకపోతే లేదు. వితండవాదన కోసం వ్యాఖ్యలు చేస్తే అవి ప్రచురించను. రాముడి మీద వాదోపవాదాలు చేయడానికి ఎంతటి వారం మనం ?

ఇవన్నీ నా ఆలోచనలు మాత్రమే. రామాయణంని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేదు అనుకుంటే నన్ను క్షమించండి _/\_

దశరథుడు రాముడిని పిలిచి ‘పొద్దుటే నీ పట్టాభిషేకం’ అన్నాడు. అలా చెప్పిన  కాసేపటికే ‘మీ నాన్నగారు నాకు మాటిచ్చారు నువ్వు అడవులకి వెళ్ళాలి ’ అని కైకేయి చెప్పింది.  రాముడు తనకి పట్టాభిషేకం చేస్తానన్నపుడు ఒకేలా ఉన్నాడు. రాజ్యం నీకు కాదు అన్నపుడు ఒకేలా ఉన్నాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన విషయం. రామాయణం ఏదో  కథగా వింటూ రాముడు దేవుడు అనుకుంటే పెద్ద ప్రభావం ఉండదు మనకి. మన నిజజీవితంలో ఆ విధంగా ఉండటం అంత సులభమేం కాదు. ఈ చిన్న ఉదాహరణ ఆయనకి రాజ్యకాంక్ష లేదు అని చెప్తోంది. అంత రాజ్యకాంక్ష ఉన్నవాడైతే ఆ రోజే తండ్రిగారి మీద తిరగబడి లాక్కునే వాడే కదా ?

మరి వనవాసం నుంచీ వచ్చాక పట్టాభిషేకం చేసుకున్నాడు!! ఎందుకు ?

రాముడు వనవాసంలో ఉండగా   భరతుడు వచ్చాడు. రాముడి పాదుకలు పట్టుకెళ్ళి , తాను నందిగ్రామంలో ఉన్నాడు. తనకి రాజ్యం వద్దు గాక వద్దు అన్నాడు.

యుద్ధం ముగిసాక , సీతాదేవిని అందరి ముందర పిలిచి చెప్పాడు.అప్పుడే సీతాదేవి ఎన్ని అడగాలో అన్నీ అడిగిందట ఆయనని.  అగ్నిప్రవేశం చేయమని రాముడు అడగలేదు. కానీ ఆవిడ అగ్నిప్రవేశం చేస్తుంటే అడ్డుకొనలేదు కూడా. ఎందుకలా ??

భరతుడు రాజ్యం తీసుకోడు. ప్రజలందరూ రాముడికే  ఓటు వేశారు. కాబట్టి ఆయనే రాజు అవుతాడు. రాముడు అయోధ్య చేరిన వెంటనే పట్టాభిషేకం జరుగుతుంది. ఆయన  ఏకపత్నీ వ్రతుడు. కాబట్టి సీతాదేవి పక్కన ఉండాలి. కాబోయే పట్టపురాణిని ఒక్కరు కూడా పల్లెత్తు మాట అనకూడదు అనేది ఆయన  ఉద్దేశ్యం. అది avoid చేయడానికి లంకలోనే ఈ తంతు జరిగింది.

ఇంత చేసాడు కదా మరి ఎందుకు పరిత్యజించాడు ? ఒక్కరెవరో అన్నమాటకే  అలా వదిలిపెట్టేయాలా ? (అసలు ఈ ఘట్టం వాల్మీకి రామాయణంలోని లేదు. ‘లవకుశ’ సినిమా చూసి అందరం మాట్లాడేవారమే !!)

ఈ రోజుల్లో మంత్రులకి గెలవాలి, ఆకుర్చీలో కూర్చోవాలి అన్న తపనే కానీ, 100 మందిలో 90 మంది ఓటు  వేస్తే 10 మందికి ఓటు ఎందుకు వేయలేదు అన్న సంగతి ఆలోచించరు . ఆ పది మంది గురించి ఆలోచించేవాడే రాముడు. 100% perfect  గా ఉండాలి ఆయనకి. అందుకే అది రామరాజ్యం అయింది.

విముక్త కథలలో అనుకుంటాను. రచయిత్రి ‘రాముడు ఆర్యుడు . రాజ్యదాహం అందుకే’ అని వ్రాసారు. ఒక ఆర్మీ ఆఫీసర్, fire  fighter , పోలీస్ ఆఫీసర్ మా కుటుంబాలే మాకు ముఖ్యం అనుకుంటే ఆ ఉద్యోగాలు ఎవరు చేస్తారు? అలాగే ఒక రాజుకి భార్య ముఖ్యమా? రాజ్యం  ముఖ్యమా ? భార్య కోసం రాజ్యం వదులుకుంటే ఆ రాజుని ఈ రోజుకి కూడా ఎందుకు గుర్తుంచుకుంటాము?

రాజు కదా ఆ విధంగా సీతని అన్నవాడిని  శిక్షించచ్చు . Sadhguru గారు ఈ మధ్య కవిత గారి ఇంటర్వ్యూ లో ఒక మాట చెప్పారు. ప్రతి నేరానికి శిక్షలు, చట్టాలు అంటూ పోతే అవేమి ఆడదానికి సహాయం చేయవు. మనుష్యులలో  ‘Sensitivity’ ని develop చేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది అని. రాముడు ఇక్కడ చేసింది అదే!!

రాముడు సీత అనుమానించడం, అవమానించడం ఏమీ  చేయలేదు. రంధ్రాన్వేషణ చేసేది మనము. ‘మోడీ భార్య ఏం  చేస్తోంది ? ట్రంప్ గారికి ఎంత మంది భార్యలు? ఒబామా గారి భార్య వేసుకున్న బట్టలేంటి ? లేడీ డయానా గారు భర్తని వదిలేసి ఎవరితో కారులో వెళుతున్నారు ?వెంటబడి పీక్కుతిందామా ? చిరంజీవి కూతురు రెండో పెళ్లి బాగా జరిగిందా ?రేణు దేశాయ్ గారు ఎవర్ని పెళ్లి చేసుకుంటున్నారు? ’  ఇలాంటివి మనకి కావాలి. ఆ లేకితనాన్ని ఖండించలేక, చేతగాక రాముడిని నిందిస్తున్నాము.

అసలు ఇవన్నీ కాదు. రాముడు విప్లవాత్మకంగా ఆలోచించి అవన్నీ  పట్టించుకోకూడదు అంటారా ? రాముడు మామూలు మానవుడిగా బ్రతికుదామని అనుకున్నాడు. అది గుర్తుంచుకోవాలి.  ‘అవతల వాళ్ళు ఏమి అన్నా పట్టించుకోకూడదు’ అనుకుంటాము. అది అంత సులభమా ? మనం పట్టించుకోకపోయినా పట్టించుకునేలా చేస్తుంది సమాజం. రాముడు ఏవి పట్టించుకోకుండా ఉండలేడు. ఎందుకంటే సీతాదేవి మీద ఉన్న అనురాగం అటువంటిది.

రాముడికి వచ్చింది పెద్ద ధర్మ సంకటం. ఆరోజుకి  ఏది ధర్మమో అదే చేసాడు ఆయన . రాముడు ధర్మం తప్పితే ఆయన  గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

కాబట్టి రాముడిని తప్పు పట్టడం మానేసి సీతని నింద  చేసిన వాడి గురించి పిల్లలకి నేర్పించి ఆలోచింపజేయండి. వాడికీ  మనకీ తేడా ఉండాలి కదా ??

ప్రకటనలు

5 thoughts on “‘సీత శీలాన్ని అనుమానించడం, నిండు గర్భిణిని అడవులకు తోలడం …ఇవి మన పిల్లలకు నేర్పిద్దామా? ‘”

 1. మూలసత్యాన్ని గ్రహించక, అవగాహన రాహిత్యంతో కుతర్క బుద్ధితో విమర్శించేవారికి ఓ నమస్కారం.
  ఓ పెద్దాయన అన్నట్లు –
  ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు, కానీ దానికున్న తుప్పు ఆ పని చేయగలదు.
  అలాగే, మనిషిని ఎవరూ పతనం చేయలేరు, కానీ ఆ వ్యక్తి ఆలోచనా విధానం ఆ పని చేయగలదు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. ఇటువంటి వ్రాతలు వ్రాసేవారు ఎక్కువగా ప్రచారం కోసం వ్రాస్తున్నారా అని సందేహం వస్తుంది. తెలుగు సినిమా వాళ్ళ పడికట్టు మాటల్లో చెప్పినట్లు తాము వ్రాసింది “డిఫెరెంట్ గా”, “వెరైటీ గా” ఉందని జనాలు అనుకోవాలనే దురద, వ్రాసిన దానికి ఎన్ని “లైక్”లు వస్తే అంత గొప్ప అని సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కువవుతున్న తపన … వెరసి ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి వివాదాస్పదం చెయ్యడం, అవకతవక వ్రాతలు, “రంధ్రాన్వేషణ” చెయ్యడం.

  మీ టపా లాంటిదే “నన్ను కాదు, దమ్ముంటే వాడిని కొట్టు” అని “వంశీ కలుగోట్ల – కథలు, వ్యాసాలు” అనే బ్లాగ్ లో ఈ రోజే 06-జూలై-2018 న ఒక టపా వచ్చింది.
  http://vamsikalugotla-stories.blogspot.com/2018/07/blog-post_6.html

  కొంతమంది లేవనెత్తే ప్రశ్నలకు మీరు సహేతుకమైన సమాధానాలు ఇచ్చారు 👌. //“అయితే రావణాసురుడి గురించి పిల్లలకి నేర్పుదామా”// అని సరైన ప్రశ్న వేసారు మీరు.

  రాముడు ఎందుకు గొప్పవాడంటారా కొందరు? “రామో విగ్రహవాన్ ధర్మః” అని ఒక రాక్షసుడైన మారీచుడే అన్నాడు … అదిన్నీ రావణాసురుడితో. దేవుడా కాదా అన్నది పక్కన పెడితే, ధర్మానికి కట్టుబడినవాడు రాముడు అని చెప్పక తప్పదు.

  ఇక చివరికి సరదాగా :- //“ అలాగే ఒక రాజుకి భార్య ముఖ్యమా? రాజ్యం ముఖ్యమా ? “// అన్న మీ స్టేట్మెంట్ కి సరదాగా చెప్పాలంటే అటువంటి పని చేసిన ఒక రాజు గారు కూడా చరిత్రలో ఉన్నాడండీ. మీరూ వినే/చదివే ఉంటారు … గత శతాబ్దపు మొదటి సగంలో అప్పటి ఇంగ్లాండ్ రాజు Edward VIII ఒక అమెరికన్ మహిళను వలచాను, పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. ఆవిడ Wallis Simpson అప్పటికి రెండుసార్లు విడాకులు తీసుకున్నదట. రాచకుటుంబం, పార్లమెంట్ ఆ పెళ్ళి ప్రతిపాదనకు అంగీకరించలేదు. దాంతో రాజు గారు ఠాఠ్ నాకు రాజ్యం అక్కర్లేదు, ఆవిడే కావాలి అని రాజ్యాన్ని వదులుకుంటున్నానని పత్రం మీద సంతకం చేసి పారేసాడు. ఆయన చేసిన ఈ abdication చరిత్రలో నిలిచిపోయింది. ఆయన్ని ఇప్పటికీ ఎవరన్నా తలుచుకుంటున్నారా లేదా అన్నది వేరే సంగతి లెండి, కానీ ఒక సామ్రాజ్యాన్ని అలా వదిలేసుకోవడానికి చాలా మనోధైర్యం కావాలి కదా (btw, ఆయన వదిలేసుకున్న రాజ్యానికి ఆయన తమ్ముడు George VI రాజయ్యాడు).

  మెచ్చుకోండి

   1. ఆ రోజుల్లో అదొక చరిత్రకెక్కిన నిజ రొమాంటిక్ కథ కదా. Anyway ఆ క్రమంలో అనుకోకుండా రాజైన George VI గారి కూతురే Elizabeth గారు … ప్రస్తుత ఇంగ్లాండ్ రాణి.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s