ఎవరో జిలేబి Fans మరి!!

అబ్బే  మరేం లేదు.

ఈనాడు లో క్రిందటి ఆదివారం జిలేబి మీద వ్యాసం వచ్చింది. అది ఇక్కడ పంచుతున్నాను. చదువుతుంటే నాకెవరో గుర్తొచ్చారు మరి 🙂

నా టపా పేరు చూసి పరుగెత్తుకుంటూ వచ్చారంటేనే అర్థమయిపోతుంది మీకు ఏ ‘జిలేబి’  కావాలో !! కదా ??

eenadujilebi

http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=27301

వీరి వీరి గుమ్మడి పండు…గారు !!

బ్లాగులోకం లో మనుష్యులం ఒకరికి ఒకరం తెలియదు. కాసేపు కాలక్షేపానికి బ్లాగులోకానికి వచ్చి అందరూ బ్లాగులు వ్రాసుకుంటూ , కామింటుతూ, వాదనలు చేస్తూ, ఆ వాదనలు శృతిమించి వాతావరణం వేడిగాఅయిపోతూ ఉంటే   ‘ When its Hot its Really Cool’ అంటూ ఒక కార్టూన్ క్యారెక్టర్ లాగా వచ్చి ఒక కందం  విసిరిపోయే వారెవరో బ్లాగులోకం లో అందరికీ తెలుసు.

వారి కోసమే మాలికలో వ్యాఖ్యలు చూస్తుంటాను  !! వారు సరదాగా వ్రాసేవి, అందర్నీ ఆటపట్టించడం చూస్తుంటే  భలే సరదాగా అనిపిస్తుంది (విషయాన్నీ సీరియస్ గా తీసుకోకుండా)  ప్రతి బ్లాగు చక్కగా చదువుతారు. చదివిన వెంటనే వ్యాఖ్య పెట్టేస్తారు. అసలు కొన్ని సార్లు ఆ పద్యాలూ చూసి ఆ బ్లాగులుకి వెళ్లి చదివిన రోజులున్నాయి.

ఒకసారి ‘  మా హరిబాబు గారిలాగా ఇంకా కొంచం గరం మసాలా ఉండాలి. మీ వ్యాసం రిజెక్టెడ్ !!’ అంటూ   ‘ రౌడీ రాజ్యం’ బ్లాగులో వారి వ్యాఖ్య చూసి నాకు నవ్వగాలేదు. ఇంకోసారి  ‘శోధిని కామెంట్ల సెక్షన్ మూసివేసాం అని వ్రాయగానే, ‘మళ్ళీ ఎప్పుడు తెరుస్తారండీ’ అంటూ అమాయకంగా మొహం పెట్టి  అడగటం. విన్నకోట వారు, ‘ఇంకా నయం నామీద పద్యం కట్టలేదు’ అన్న వెంటనే, ‘ఇదిగో పద్యం అడిగారుగా ‘ అంటూ ఒక పద్యం విసిరారు 🙂  

అన్నిటికీ & అందరికీ  నవ్వు తెప్పిస్తూ … అందరికీ  ఆరోగ్యాన్ని పంచి ఇచ్చే ఈ గుమ్మడిపండు గారు ఎవరో కానీ నేను మాత్రం ఆవిడ /ఆయన  ఫాన్ ని (నన్ను తిట్టుకున్నా సరే!!) .

ఎక్కడెక్కడో , ఎన్నెన్నో జిలేబీలే గురించి చెప్పిన ఈ వ్యాసం  అసలు సిసలైన ‘జిలేబి’ గురించి చెప్పడం మరచిపోయినట్లున్నారు!!

Photo : ఈనాడు ఆదివారం మ్యాగజిన్

13 thoughts on “ఎవరో జిలేబి Fans మరి!!”

  1. జిలేబీ, ఓ.. జిలేబి..
    మీవల్ల ఎన్ని, ఎన్ని కంద దెబ్బలు తిన్నానో..
    నా కందిపోయిన ముఖాన్నడుగు చెపుతుంది.
    జిలేబీ, ఓ… జిలేబి.
    To be continued by mmraobandi.

    మెచ్చుకోండి

      1. ఒకచో గిల్లును నారదావహ గతి , న్నొక్కొక్కచో హాస్యమున్
        గికురించు , న్నొకచో విశేష ధిషణా గీర్వాణమున్ జూపుచున్
        సకలామోదము కూడగట్టు , నొకచో సాగించు కొట్లాట , యి
        ట్లొకటా రెండ యనేక చేష్టిత ఘనుల్ , రూపేది , పేరేమిటో ?

        మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి