ఇవి తింటే చాలదా?

బరువు  తగ్గించుకోవడానికి  అందరం ఎన్నుకునే  ఓ మార్గం డైటింగ్. అంటే మితంగా ఆహారాన్ని తీసుకోవడం. ఇదొక యజ్ఞం/దీక్ష  అనే అంటా నేనైతే. ఒక విధంగాఈ కరోనా వలన వారాంతం పార్టీలు/పూజలు లేకపోవడం బాగానే ఉంది అనిపిస్తోంది. లేకపోతే 5 రోజులు చేసిన diet అంతా రెండురోజుల్లో మాయం అయ్యేది. పార్టీలలో తినకపోతే ‘చూస్తున్నాము.ఏమీ తినట్లేదు.అబ్బో diet చేస్తున్నారే. పరవాలేదండీ. ఒక్క రోజుకి ఒక్క స్వీట్ కి ఏమీ కాదులెండి’ అంటారు. అది చెప్పినంత సులువు కాదు.  ఓ దీక్షలో ఉన్నవారిని దీక్ష విరమించుకోమని చెప్పడమే. 

— ముందు diet  చేస్తున్నపుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఆ ఆహారం అనే దాని మీద మనసు ఎక్కువగా పోకుండా ఉండాలి. అంటే  ‘అయ్యో తినట్లేదే’ అని మన మీద మనమే జాలి చూపించుకోకూడదు. 

— విపరీతమైన  ఆకలి వేయకుండా ఎక్కువ సార్లు  కొంచెం కొంచెం  తినాలి. Gap ఇస్తే ఆకలివేసేస్తుంది. వేస్తే  బాగా  తినేస్తాము.అందుకని  దానికో ప్రణాళిక ముందే తయారు చేసి పెట్టుకోవాలి. ఓ వారంకి  సరిపడా అనుకోవచ్చు. మూడుపూటలా భోజనము , కాఫీ/టీ , మధ్యలో కాస్త  తీపి/కారం  ఉండే  చిరుతిండ్లు. ఇవన్నీ ముందే చూసి పెట్టుకోవాలి (మాలతీ చందూర్ పుస్తకంలో లాగాచెప్తున్నానా 🙂 ) 

— processed food  వీలయినంత మటుకు తగ్గించుకోవాలి. 

— ఏదైనా పార్టీకి వెళ్తున్నా ముందే కొంచెం తినేసి వెళ్ళాలి. 

నేను ఎన్నో రకాల diet పద్ధతులు విన్నాను. నేను అనుసరించిన  పద్ధతి  చెప్తాను. అన్నిటిలోకి నాకు నచ్చినది  weight  watchers.  ఎందుకంటే మన ఆహార పద్ధతి ఏ మాత్రం మార్చుకోనక్కరలేదు. దాంతో ఇంట్లో వాళ్ళకి  ఒకటి, మనకి ఒకటి అక్కరలేదు. నోరు కట్టుకుని కూడా ఉండనక్కరలేదు. Points  ఉంటాయి. వాటి ప్రకారం తింటే చాలు. మనమే మన recipeని  app లో పెట్టుకుంటే, ఎన్ని  points  చెబుతుంది. పళ్ళకి, కూరలకి  సున్నా points. అంటే ఎన్ని కావాలో అన్ని తినచ్చు. ఓ అరగంట నడక చేస్తే  చాలు. ఈ పద్ధతి అందరికీ పని చేయవచ్చు. చేయకపోవచ్చు. నేను ఆరోగ్యంగా అయితే ఉన్నాను.  అంత మటుకు ఖచ్చితంగా చెప్తాను.  ఉన్నట్టుండి బరువు తగ్గిపోము. సమయం తీసుకుంటుంది.  దాదాపు రెండు నెలల్లో ఓ 20  పౌండ్లు తగ్గాను. పెరిగాను అనుకున్నపుడల్లా ఈ డైట్ చేసాను . 

ఆ డైట్ చేసినపుడు నేను తిన్నవి చెప్తాను. మన దక్షిణ భారతీయ వంటలు తాజాగా చేసుకుని తింటే చాలు. రోటి పచ్చళ్ళలో నూనె తక్కువగా వేసుకుని చేసుకుని పెసరట్టు తో తింటే ఓ పూట  చక్కటి భోజనమే.  పెరుగులో( 1% పాలు ) మామిడి పండో, అరటి పండో వేసుకుని ఓ రెండు బాదం పప్పులతో తింటే దాన్ని మించిన snack/breakfast  లేదు. నువ్వుల చిమ్మిలిలో iron. మినప సున్ని నెయ్యి తగ్గించి చేసుకుంటే మంచి protein & iron. పులుసు కూరల్లాంటివి, చారు లాంటివి  తింటే చాలా తిన్నాం అనిపిస్తుంది. తిన్న తృప్తి ఉంటుంది. అలాంటివి WW లో recipe  తయారు చేస్తే 1 point  అని చూపిస్తుంటుంది. 

ఆ డైట్ చేసినపుడు నేను తిన్నవి చెప్తాను అన్నాకదా? ఇదిగో ఇవే: 

ఇవి  పూర్తిగా మానేయడం / లేదా  చాలా మితంగా తినడం.

ఇవి  మూడు తగ్గిస్తే చాలు. అన్ని విధాలా బాగుపడిపోతాం 🙂 .

అన్నం/చపాతీ/ oats/ millets 

Deep fried food

Sweets Especially deep fried sweets like gulab jam, jilebi, mysore pak 

తక్కువ నూనె తో ఇటువంటివి తినడం:

పెసరట్టు – 2-3 

దోశ (1:1 ratio తో ) – 2  దోశలు  

ఇడ్లి (పెసరపప్పు, మినప్పప్పు తో మాత్రమే చేయచ్చు)

దిబ్బ రొట్టె 

చోలే

పప్పు

సాంబార్ /పులుసు

పాలకూర/గోంగూర/బచ్చలి/తోటకూర  పులుసు కూరలు

నీళ్ళ మజ్జిగ పులుసు

చారుపొడి వేసి చారు

కూరలు :

Beans

Cabbage

Cauliflower

Broccoli

సొరకాయ

వంకాయ

చిక్కుడు

అవియల్ 

కాకర కాయ పులుసు పెట్టి చేసిన కూర. 

రోటి పచ్చళ్ళు:

సొరకాయ

వంకాయ

టమాటో

దోసకాయ

Zuchini

పెసర పచ్చడి

చింతకాయ

 ఉసిరి కాయ 

పళ్ళు:

అరటి పండు

Apple

Pear

Persimmon

బొప్పాయి

Cantaloupe

ఈ పళ్ళన్నీ filling గా ఉంటాయి. breakfast , lunch  లాగా తినచ్చు. 

మిగితా పళ్ళు snacks  లాగే  తినచ్చు. 

Sweets తినాలనిపిస్తే deep fried  కాకుండా ఇటువంటివి తింటే కాస్త నాలిక ఏడవకుండా పడి ఉంటుంది. 

Date & nuts  laddu/roll 

రాగి లడ్డు

రవ్వ లడ్డు

మినప సున్ని 

Almonds Laddu 

నువ్వుల చిమ్మిలి 

తాజా పళ్ళతో  చేసిన popsicles 

Snacks తినాలనిపిస్తే :

Wheat mamra – SWAD

Oven roasted అటుకులు, పుట్నాలు, పల్లీలు, కరివేపాకు తో  చుడువా  

మరామరాలతో bhelpuri  లాంటిది

గమనిక: ఇది  నేను చాలా general గా చెప్పాను. అందరికీ పని చేయవచ్చు. చేయకపోవచ్చు. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s