కాప్సికం కూర & కూర పొడి

అమెరికా వచ్చిన కొత్తల్లో , అంటే దాదాపు ఓ 21 ఏళ్ళ క్రితం అన్నమాట. food బ్లాగులు,  వీడియోలు అంటూ ఏవీ లేని రోజులు. మాకు దగ్గరలో ఇండియన్ restaurant  అంటే ఆంధ్ర భోజనం  అంటూ పెద్దగా ఏమీ ఉండేది కాదు. మాదేమో ఉల్లి వెల్లుల్లి లేని శాకాహార భోజనం. అది తినాలంటే  గుడికి వెళ్తేనే దొరికేది. ఇండియన్ గ్రోసరీ అంటే పటేల్ వారిది ఓ చిన్నకొట్టు ఉండేది. అక్కడ దొండ, బెండ , కాకర  వంటి కూరలు  ఓ చిన్న చిన్న  బుట్టల్లో  ఉండేవి.   ఇప్పటిలాగా  Deep  వారి frozen  veggies  కూడా ఉండేవి కాదు. వంట అంటే ఇక అమెరికాలో విరివిగా దొరికే  కూరలతోటే చేసుకోవాలి.  చెప్పొచ్చేది ఏంటంటే ఏమి కావాలన్నా మనం స్వయంగా ప్రయోగాలు చేసుకు తినాల్సిందే తప్ప వేరే ఏ ఆధారమూ ఉండేది కాదు  నా లాంటి దానికి. మావారికి అసలు వంట రాదు. ఇండియా కి ఫోన్లు  చేద్దామా అంటే నిమిషానికి 55 సెంట్ల చొప్పున మీటర్ తిరిగిపోయేది.

 ‘బాగున్నారా’  అనే సరికే అక్కడ ఏడుపులు మొదలయ్యేవి. ఇంక  కూర ఎలా చేయాలో అడిగటం  కూడానా? అప్పటికీ మా తమ్ముడు పాపం మా అమ్మ చెప్పిందని మైసూర్ పాక్ లాంటివి టైపు కొట్టి email చేసేవాడు. చేయడం వచ్చుకదా అని రోజూ మైసూర్ పాక్ తినలేం కదా . దిక్కులేనివారికీ దేవుడే దిక్కయినట్లు, లగేజీ లో పడేసుకుని తెచ్చుకున్నందుకు నాకు వంటంతా మాలతీ చందూర్ గారే నేర్పేవారు.

మా అమ్మ లాగా, నానమ్మ లాగా చేసేద్దాం అని కూరలు తెచ్చేదాన్ని. మా అమ్మ శనగపిండి వేసి క్యాప్సికం తో కూర చాలా బాగా చేస్తుంది. పైగా ఇండియాలో చిన్న చిన్న మిరపకాయలేమో ఇంకా రుచిగా ఉండేది.. ఆ కూరేమో  మా మాలతీ చందూర్ గారికి తెలీదు. అలా మొదలయింది క్యాప్సికం తో కూర.తో ప్రయోగం.

మొదట్లో ఆ రంగు రంగుల క్యాప్సికం చూడగానే ఏదో  ఆత్రంగా ఉండేది. తరవాత తెలిసొచ్చింది అమెరికాలో రుచీ పచీ లేని కూరగాయ ఏంటంటే క్యాప్సికం మాత్రమే అని. ఎలా చేసినా కూర నీళ్లలాగా శనగపిండి తేలుతూ గ్రేవీ కూరలా ఉండేది. కొబ్బరి వేసి కూడా చేసా. అయినా ఆ రుచి  రాదే. అట్లాంటాలో మా అత్తయ్య  వాళ్ళింటికి వెళ్ళాము. అక్కడ మా నానమ్మ వంట చేయడం చూసా ( మా ఇంట్లో ఎప్పుడూ తినడమే కదా) .కొంచెం నూనె పోసి బాగా చేస్తుందని  ‘ఈ అల్లుళ్ళు లొట్టలు వేస్తూ మెచ్చుకోడానికి ఎన్నిచేయాలో అన్ని చేస్తుంది’ అని మా అత్తయ్యలు ఏడిపిస్తారు మా నానమ్మని. మా వారు కొత్త అల్లుడు కదా. ఉన్న రెండు రోజులు తెగ చేసి పెట్టింది. ఆవిడ వంట చూసి నేర్చుకున్న మొదటి సూత్రం రుచి రావాలంటే కొంచెం నూనె వేయాలి అని.  నూనె వేసి చేశా . అబ్బే! అయినా రుచి లేదు.  తరువాత మళ్ళీ కలిసినపుడు ఒక రోజు మా అత్తయ్య  వంకాయ కూరపొడి వేసి గుత్తి వంకాయ చేసింది. పొడి ఎలా చేయాలో తనకి కూడా అంత బాగా తెలీదు అంది. అత్తగారు export చేసేదిట. 

కూర ఎలా చేయాలో క్లూ వచ్చింది. మాలతీ గారి నుంచీ తెలుసుకొని కొంత, నా ఊహాగానం కొంత,  నా ఇష్టం వచ్చిన దినుసులు వేసి పొడి  చేసాను. తంటాలు పడ్డాక మొత్తానికి పొడి అంటూ ఓ పదార్థం వచ్చింది. పొడులు చేసుకోవడానికి $12 కి braun వారి coffee seed గ్రైండర్ ఉండేది.   పొడులు అంటే చాలు  ఓ 18 ఏళ్ళ పాటు  అదే వాడాను. దానికీ పాపం బోలెడు రుణపడి ఉన్నాను.   ఇప్పుడు  దొరకటం లేదు.  కూర పొడి  వేసాక  కూర  కొంచెం ఓ పద్ధతి లో వచ్చింది. 

తరువాత  తరువాత ఎంత expert ని అయ్యాను అంటే, పార్టీ అంటే చాలు  ఓ పెద్ద tray  నిండా ఈ కూర చేసేస్తా. ఉల్లి, వెల్లుల్లి  లేకుండా  పూజలప్పుడు  కూడా పనికొస్తుంది. ‘మీరు చాలా బాగా చేస్తారు ఈ కూర . రెసిపీ చెప్పండి’ అంటుంటే  ఓ సెలబ్రిటీ లెవెల్లో ఫీలింగ్.  మా అమ్మాయిలకి కూడా చాలా ఇష్టం . నేను ఊర్లో లేకపోతే ఈ కూర చేసేస్తారు వాళ్ళ నాన్న.  అలా  చేసుకున్న ఈ కూరపొడి  కాకర, వంకాయ, చేమ దుంపలు, దొండ కాయ  ఇలా  అన్నీ  కూరల్లోకి వాడతాను. ఇప్పుడు నూనె వేయకపోయినా బాగా వచ్చేస్తుంది కూడా.   మా ఇంట్లో పొడులు ఏమీ లేకపోతే కూరపొడిలో ఉప్పేసుకుని అన్నంలో కలిపేసుకుంటారు మా వాళ్ళు. ఇడ్లిలో తినేస్తారు.

ఇంతకీ పొడిలో ఏం వేసానో చెప్తాను.

శనగ పప్పు 

మినపప్పు 

ధనియాలు

 జీలకర్ర 

ఎండుమిర్చి

2 thoughts on “కాప్సికం కూర & కూర పొడి”

  1. మీరు వేసిన దినుసులతో పాటు పల్లీలు, వెల్లుల్లి కూడా వేస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆలుగడ్ద, కప్సికం, టమాటా, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఒకదాని తర్వాత వరుసగా వేసి రెండు నిమిషాలు మగ్గించి కుక్కర్ మూత పెట్టి ఒకటే విజిల్ రానిచ్చి దింపేస్తాను. విజిల్ తీసాక పన్నీర్ ముక్కలు వేసి వెల్లుల్లి పొడి వేసి మరొక్క రెండు నిమిషాలు వేయించి దింపేస్తాను.
    చాలా బాగుంది అని మా అబ్బాయి అంటే సక్సెస్ అయినట్లే అన్నమాట !

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s