బొమ్మల కొలువు 2021

Covid -19 మూలంగా ఎక్కడికీ వెళ్లలేకపోవడంతో  సంవత్సరంలో ఉన్న సెలవలన్నీ మిగిలిపోయాయి. అందుకని డిసెంబర్ 2020లో అన్నీ వాడేసుకున్నాను. సెలవలు అంటే ఇల్లు కదిలే ప్రసక్తి లేకుండా నిజంగా సెలవల్లగా అనిపించాయి. దేవుడి గది, వంటిల్లు చాలా చక్కగా సర్దేసుకున్నాను.  ఇక బొమ్మలకొలువు కి theme ముందే ఎప్పుడో అనుకోవడం వలన , కావాల్సిన వస్తువులు సమకూర్చుకుని పెట్టుకున్నాను. Facebook, వాట్సాప్ లాంటి వాటి జోలికి వెళ్ళడానికి సమయం కూడా దొరకలేదు. మా తమ్ముడొకడు  గరికపాటి గారి ప్రవచనాలు వినమనిసలహా ఇచ్చాడు వాట్సాప్లో. అవి విందామని మొదలు పెట్టాను. భాగవతం వింటూ  project చేసుకుంటూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో.

ఫోటోలు,  వీడియో చూస్తే మీకు అర్ధమయ్యే ఉంటుంది నేను ఏది theme ఎంచుకున్నానో 🙂 గత ఏడాది సంక్రాంతి కొలువుల్లో సింగపూర్లో ఒకావిడ తిరుపతి పెట్టారు. అది చూడగానే అనుకున్నాను మా బిట్రగుంట పెట్టాయాలి  అని.

అందుకు తగ్గట్టుగా  కొన్ని కొండపల్లిబొమ్మలు అంటే బోరింగ్, వీరివీరి గుమ్మడిపండు ఆట, హరిదాసు, రైతు, తొక్కుడు బిళ్ళ ఆట దొరకడం కూడా అదృష్టం..  రైలు బండి, ఇంజిన్ ,  రైల్వే బ్రిడ్జి, రైలు పట్టాలు, Platform, Turntable, ఆవరణ కాంపౌండ్ గోడ,  అరటిచెట్లు ,  ఇంటిముందు పూల పందిరి, వడ్లకొట్టు, రాములవారి గుడి,  చెక్కల మీద ముగ్గులు అన్నీ నేనే చేశాను.కొన్ని బాగా వచ్చాయి. కొన్ని బాగా రాలేదు. చేయాలన్న తపనే కదా ఎప్పుడూ. మా అమ్మాయి పేర్లు వ్రాయడంలో  కొంచెం సహాయం చేసింది. Michaels, Dollar tree కొట్లకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎక్కువ popsicle sticks వాడాను. పెద్ద ముగ్గులు & కలశం అవి నేను చేయలేదండీ. మా అమ్మచేసి పెట్టింది నాకు.

ఈ Covid -19  సమయంలో ఇంట్లోనే ఉంటూ బోలెడు విద్యలు నేర్చుకున్న వాళ్ళని, నేర్పిస్తున్న వాళ్ళని చూసాక ఏదో ఒకటి చేయాలి అన్న తపన తో చేసిన ప్రయత్న ఫలితమే ఇది. 

అంతా virtual పేరంటమే 🙂

ఇది సేవ అంటారా ?

నేను ఏ దేవుడిని పూజించినా, ఎదుటివారి నమ్మకాలని తప్పకుండా గౌరవించాలి అనుకుంటాను. అందుకే జీయర్ గారు చెప్పినమాట అంటే చాలా ఇష్టం ‘ Worship Your Own – Respect All’ అందుకోసం ఎదుటివారి ఆచారాలను పాటించడం/ వారిలాగా పూజ చేయనక్కర లేదేమో కానీ, నాకు నచ్చలేదని దూషణచేయడం/ హేళన చేయడం అనేది మాత్రం సరియైన పద్ధతికాదు అని ఖచ్చితంగా అనుకుంటాను. కాబట్టి ఈ పోస్టులో నేను ఏ మతాన్ని దూషించట్లేదు అని నా మనవి .🙏🙏

పాస్టర్ ప్రవీణ్ అనే అతని వీడియో ఒకటి ఈ మధ్య వైరల్ అయింది. ‘ హిందూ దేవుళ్ళని కాళ్ళతో తన్నటం నాకు ఆనందాన్ని ఇస్తుంది’ అని చెప్పాడు ఆ వీడియో లో. ఆ వీడియో ఆధారంగా మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు అని ఈ మధ్య అతన్ని అరెస్ట్ చేసారు అని కూడా వార్తలు చదివాను.

రెండు నిమిషాల వీడియోలు చూసి నిజమోకాదో ఎప్పుడూ తేల్చుకోలేను.. చాలా casualగా గూగుల్లో ఇతనిపేరు వెతికాను. ఆశ్చర్యకరంగా ఓ fundraising website ఇచ్చింది.ఈ పాస్టర్ గారు ఎన్నో ఊళ్ళలో త్రాగునీరు అందచేస్తున్నారు కాబట్టి విరాళాలు ఇవ్వండి అనేది సారాంశం. అక్కడ నుండి ఆ లంకె set free అనే ఒక website కి పట్టుకెళ్లింది. ఆ website చూసి నివ్వెరపోయాను. సేవ చేస్తూ లక్షల సంఖ్యల్లో మనుష్యుల్ని baptize చేయడం & వేల కొద్దీ చర్చీలను స్థాపించడం మా పని అంటూ చెప్తున్నారు వీరు. నాకు అర్ధం కానిది ఏంటంటే, సేవ అంటే ఈ ప్రవీణ్ గారు చిన్నపిల్లల్ని బానిసత్వంనుండీ విముక్తి చేస్తున్నారు అంటున్నారు. ఇతడు చెప్పినట్లు ఈ సంఖ్య నిజమే అనుకుంటే , 70 ఏళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా భారత దేశంలో, అదీ ఆంధ్రాలో ఇన్ని లక్షల మంది పిల్లలు బానిసత్వపు సంకెళ్లలో ఉన్నారు అంటే ప్రభుత్వం కానీ , వేరే NGO సంస్థలు కానీ ఏమీ చేయట్లేదనేగా అర్థం. అంటే ఈ పిల్లలందరూ చదువుకోవడానికి బడులకే రాకుండా క్వారీల్లో రాళ్ళూ మోస్తున్నారనే అర్థం. ప్రభుత్వం బళ్ళలో టీచర్లు ఉన్నారో లేదో. ఒకవేళ ఉన్నా టీచర్లు కూడా ఏమీ చేయట్లేదనే అర్థం. అమ్మ ఒడి అనే ప్రభుత్వ పథకాలు అక్కర్లేదని అర్థం. భారతదేశంలో కాకినాడ లో ఉంది ఈ సంస్థ అంటున్నారు.. అమెరికాలో ఈ సంస్థ వారు మంచినీటి కోసం విరాళాలు పాస్టర్ ప్రవీణ్ గారికి ఇస్తున్నారు అంటే, గోదావరిజిల్లాల్లో ప్రభుత్వం పేదలకి మంచినీరు కూడా ఇవ్వట్లేదని అని అర్థం. ‘ ఆంధ్రాలో ప్రభుత్వం ఏ పనీ చేయలేదా/చేయట్లేదా/ చేయదా? ‘ అనేదే నా ప్రశ్న.

‘భారతీయ సంస్కృతి అంటే హిందూ సంస్కృతి. ఆ హిందూ సంస్కృతి లో అంటరానితనం కూడా ఒక భాగమే’ అంటూ కూడా అమెరికాలో ప్రచారం చేస్తోంది ఈ సంస్థ. హిందూమతం అంటే ఏమిటో కూడా వీళ్ళే చెబుతున్నారు.

ఈ సంస్థ వారి ఒక ఆడియో రికార్డింగ్ లో ఈ ప్రవీణ్ గారు ‘ ఝార్ఖండ్ & బీహార్ ‘ రాష్ట్రాలలో 0.01% కూడా క్రిస్టియానిటీ లేదని అందుకని అక్కడ కూడా తన ప్రచారాన్ని చేయాలనుకుంటున్నాడని చెబుతున్నాడు. ఆ ఆడియో లో కూడా హిందూ దేవతలని kick చేస్తాను అని చెబుతున్నాడు.

భగవంతుడి పేరు మీద సేవ చేయడం మంచిదే . విరాళాలు సేకరించడం మంచిదే. గతంలో సేవ చేసే అక్షయపాత్ర, SVYM లాంటి సంస్థల గురించి కూడా వ్రాసాను. కానీ సేవపేరుతో ఏంటి హిందూమత మీద ఈ ద్వేషం? సేవ చేస్తున్నాం అని ఎవరైనా చెప్తే నాలాంటి వారు ఏమిటో తెలీకుండా ఇటువంటి సంస్థలకు విరాళాలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భారతదేశంలో హిందువులు ముఖ్యంగా ఆంధ్రాలోని వారు ఆవేశాలకు పోకుండా ఇటువంటి దుష్ప్రచారాలని ఎలా అడ్డుకోవాలో ఆలోచించుకోవాలి.

కొసమెరుపు: –> 98% హిందువులు ఉన్న ఊరిని Christ ఊరుగా మార్చడానికి రెండేళ్ళు కష్టపడ్డారట. చీదరించుకుంటున్నా, ఛీత్కారాలు పొందినా వారు వారి పట్టు విడవలేదట. దీని నుంచీ హిందువులు నేర్చుకోవలసినది ఏమీ లేదా?