ఇది సేవ అంటారా ?

నేను ఏ దేవుడిని పూజించినా, ఎదుటివారి నమ్మకాలని తప్పకుండా గౌరవించాలి అనుకుంటాను. అందుకే జీయర్ గారు చెప్పినమాట అంటే చాలా ఇష్టం ‘ Worship Your Own – Respect All’ అందుకోసం ఎదుటివారి ఆచారాలను పాటించడం/ వారిలాగా పూజ చేయనక్కర లేదేమో కానీ, నాకు నచ్చలేదని దూషణచేయడం/ హేళన చేయడం అనేది మాత్రం సరియైన పద్ధతికాదు అని ఖచ్చితంగా అనుకుంటాను. కాబట్టి ఈ పోస్టులో నేను ఏ మతాన్ని దూషించట్లేదు అని నా మనవి .🙏🙏

పాస్టర్ ప్రవీణ్ అనే అతని వీడియో ఒకటి ఈ మధ్య వైరల్ అయింది. ‘ హిందూ దేవుళ్ళని కాళ్ళతో తన్నటం నాకు ఆనందాన్ని ఇస్తుంది’ అని చెప్పాడు ఆ వీడియో లో. ఆ వీడియో ఆధారంగా మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు అని ఈ మధ్య అతన్ని అరెస్ట్ చేసారు అని కూడా వార్తలు చదివాను.

రెండు నిమిషాల వీడియోలు చూసి నిజమోకాదో ఎప్పుడూ తేల్చుకోలేను.. చాలా casualగా గూగుల్లో ఇతనిపేరు వెతికాను. ఆశ్చర్యకరంగా ఓ fundraising website ఇచ్చింది.ఈ పాస్టర్ గారు ఎన్నో ఊళ్ళలో త్రాగునీరు అందచేస్తున్నారు కాబట్టి విరాళాలు ఇవ్వండి అనేది సారాంశం. అక్కడ నుండి ఆ లంకె set free అనే ఒక website కి పట్టుకెళ్లింది. ఆ website చూసి నివ్వెరపోయాను. సేవ చేస్తూ లక్షల సంఖ్యల్లో మనుష్యుల్ని baptize చేయడం & వేల కొద్దీ చర్చీలను స్థాపించడం మా పని అంటూ చెప్తున్నారు వీరు. నాకు అర్ధం కానిది ఏంటంటే, సేవ అంటే ఈ ప్రవీణ్ గారు చిన్నపిల్లల్ని బానిసత్వంనుండీ విముక్తి చేస్తున్నారు అంటున్నారు. ఇతడు చెప్పినట్లు ఈ సంఖ్య నిజమే అనుకుంటే , 70 ఏళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా భారత దేశంలో, అదీ ఆంధ్రాలో ఇన్ని లక్షల మంది పిల్లలు బానిసత్వపు సంకెళ్లలో ఉన్నారు అంటే ప్రభుత్వం కానీ , వేరే NGO సంస్థలు కానీ ఏమీ చేయట్లేదనేగా అర్థం. అంటే ఈ పిల్లలందరూ చదువుకోవడానికి బడులకే రాకుండా క్వారీల్లో రాళ్ళూ మోస్తున్నారనే అర్థం. ప్రభుత్వం బళ్ళలో టీచర్లు ఉన్నారో లేదో. ఒకవేళ ఉన్నా టీచర్లు కూడా ఏమీ చేయట్లేదనే అర్థం. అమ్మ ఒడి అనే ప్రభుత్వ పథకాలు అక్కర్లేదని అర్థం. భారతదేశంలో కాకినాడ లో ఉంది ఈ సంస్థ అంటున్నారు.. అమెరికాలో ఈ సంస్థ వారు మంచినీటి కోసం విరాళాలు పాస్టర్ ప్రవీణ్ గారికి ఇస్తున్నారు అంటే, గోదావరిజిల్లాల్లో ప్రభుత్వం పేదలకి మంచినీరు కూడా ఇవ్వట్లేదని అని అర్థం. ‘ ఆంధ్రాలో ప్రభుత్వం ఏ పనీ చేయలేదా/చేయట్లేదా/ చేయదా? ‘ అనేదే నా ప్రశ్న.

‘భారతీయ సంస్కృతి అంటే హిందూ సంస్కృతి. ఆ హిందూ సంస్కృతి లో అంటరానితనం కూడా ఒక భాగమే’ అంటూ కూడా అమెరికాలో ప్రచారం చేస్తోంది ఈ సంస్థ. హిందూమతం అంటే ఏమిటో కూడా వీళ్ళే చెబుతున్నారు.

ఈ సంస్థ వారి ఒక ఆడియో రికార్డింగ్ లో ఈ ప్రవీణ్ గారు ‘ ఝార్ఖండ్ & బీహార్ ‘ రాష్ట్రాలలో 0.01% కూడా క్రిస్టియానిటీ లేదని అందుకని అక్కడ కూడా తన ప్రచారాన్ని చేయాలనుకుంటున్నాడని చెబుతున్నాడు. ఆ ఆడియో లో కూడా హిందూ దేవతలని kick చేస్తాను అని చెబుతున్నాడు.

భగవంతుడి పేరు మీద సేవ చేయడం మంచిదే . విరాళాలు సేకరించడం మంచిదే. గతంలో సేవ చేసే అక్షయపాత్ర, SVYM లాంటి సంస్థల గురించి కూడా వ్రాసాను. కానీ సేవపేరుతో ఏంటి హిందూమత మీద ఈ ద్వేషం? సేవ చేస్తున్నాం అని ఎవరైనా చెప్తే నాలాంటి వారు ఏమిటో తెలీకుండా ఇటువంటి సంస్థలకు విరాళాలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భారతదేశంలో హిందువులు ముఖ్యంగా ఆంధ్రాలోని వారు ఆవేశాలకు పోకుండా ఇటువంటి దుష్ప్రచారాలని ఎలా అడ్డుకోవాలో ఆలోచించుకోవాలి.

కొసమెరుపు: –> 98% హిందువులు ఉన్న ఊరిని Christ ఊరుగా మార్చడానికి రెండేళ్ళు కష్టపడ్డారట. చీదరించుకుంటున్నా, ఛీత్కారాలు పొందినా వారు వారి పట్టు విడవలేదట. దీని నుంచీ హిందువులు నేర్చుకోవలసినది ఏమీ లేదా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s