పెసర పచ్చడి

ఆరోగ్యకరమైనదీ, పొయ్యి జోలికి పోకుండా సులువుగా  చేసుకోగలిగినదీ  అయిన  తిండి పదార్థం అంటే,  చారు తరువాత ‘పెసరపచ్చడి’  అంటాను నేను.  సాధారణంగా సాయంత్రాలు పప్పు తింటే అరగదని ఇటువంటి రోటి పచ్చళ్ళు చేస్తుంటారు.   మా నానమ్మ చాలా అద్భుతంగా చేస్తుంది ఈ పచ్చడి. రెసిపీ చదివాక ఇందులో ఏముందండీ చేయటం అంటే నేను చెప్పలేను. ఆ పచ్చడి రుబ్బే విధానంతోటే రుచి వస్తుంది. .ఆవిడ చేసినట్లు రానే రాదు నాకు.

చాలా మంది చేస్తారు. గూగుల్ అంతా గాలించినా సరియైన ‘పెసరపచ్చడి’ ఫోటో కానీ రెసిపీ కానీ కనిపించలేదు నాకు. అందుకే తెలీని వారికి  తెలుస్తుంది అని ఈ రెసిపీ మరియు ఫోటో :

కావలసినవి:

నానబెట్టిన పెసరపప్పు (నీళ్లు వాడ్చేయాలి)

ఎండుమిర్చి

జీలకర్ర

తగిన ఉప్పు

పోపు (optional) :

ఓ చెంచాడు నూనె లోకి

జీలకర్ర

ఆవాలు

మినపప్పు

ఇంగువ

ముందు  ఎండుమిర్చి రెండు, మూడు ముక్కలుగా విరిచేసి కచ్చాపచ్చాగా (అంటే crushed  red  pepper flakes లాగా) దంచాలి.

నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, తగిన ఉప్పు  చేర్చి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి.  నేను food processor  వాడతాను. అందుకే మరీ మెత్తగా రాదు.

తరువాత  కావాలంటే పోపు పెట్టుకోవాలి.

అన్నంలో కలుపుకుని  నెయ్యి  వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. ఎండుమిర్చి తగ్గించి పిల్లలకు పెట్టచ్చు. వడపప్పు ఎక్కువగా ఇష్టపడని వాళ్ళకి మిగిలిన వడపప్పు ఇలా చేసేసుకోవచ్చు.

గూగుల్ లో రెసిపీలుచూస్తే మామిడికాయ లేకపోతే నిమ్మకాయ/ చింతపండు రసం పిండినట్లు  చెప్పారు. నన్నుఅడిగితే వద్దనే అంటాను. ఎందుకంటే పులుపు పదార్థాలు కలిపితే ఈ పచ్చడికి ఉన్న చక్కటి కమ్మటి రుచి పోతుంది.

2 thoughts on “పెసర పచ్చడి”

 1. (1). పెసర పచ్చడి ఫొటో పెట్టానన్నారు, కనబడలేదే.
  (2). పోపు పెట్టకపోతే మజా ఏముంటుంది? ఎవరిష్టం వారిదనుకోండి.

  (3). // “ ఆరోగ్యకరమైనదీ, పొయ్యి జోలికి పోకుండా సులువుగా చేసుకోగలిగినదీ అయిన తిండి పదార్థం అంటే, చారు తరువాత ‘పెసరపచ్చడి’ అంటాను నేను.” //
  పొయ్యి జోలికి పోకుండా చారు ఎలా కాస్తారండి 🤔🤔?

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  1. ధన్యవాదాలండీ. చారు అనేది కూడా చాలా సులువైనది అనే నా ఉద్దేశ్యం 😀 చేసే విధంగా చేయాలే కానీ పోపు పెట్టకపోయినా బావుంటుందండీ. ఫోటో update కాలేదు. ఇప్పుడు పెట్టాను

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s