పాఠశాలలే దొరుకుతాయి

ఒక ప్రభుత్వ అధికారి  ప్రభుత్వం  నడిపే పాఠశాలలో  పిల్లలతో ఒక మతానికి ( లేదా నమ్మకం)  సంబంధించిన  ప్రతిజ్ఞ  చేయించటం, అది కూడా ఇంకో మతం వారి నమ్మకాలను క్రించపరుస్తూ  చేయడం  అనేది ఒక ప్రజాస్వామ్య దేశంలో  అనైతికం  అంటాను  నన్ను అడిగితే.    

‘దళితులను గుళ్ళలో రానివ్వలేదు.  వారిని  పూజారులుగా  చేస్తారా మరి ? అందుకని ఇంకొక మతం/నమ్మకాన్ని  వారు  నమ్ముతున్నారు’  అనే వాదనలు  వస్తున్నాయి.  ఈ వాదనలు & ప్రశ్నలు నిజాలే అవ్వచ్చు.  ఇందులో  ప్రశ్నించడానికి  ఏమీ లేదు. ఆ వాదనలు & ప్రశ్నలు  వేరే  టాపిక్ .   ఈ విషయంలో  అటువంటి వాదనలు   అనవసరం అంటా నేనైతే .  

కాస్తో కూస్తో  పిల్లల్ని చదివించుకుని  బాగుపడదాం  అనుకునే  ఆ గిరిజన తల్లితండ్రుల పరిస్థితి  ఏంటి? బుద్ధుడు, రాముడు, కృష్ణుడు ఎవరైతే ఏంటి వాళ్ళకి ? 

ఎవరికి   కావల్సిన బడులు వారు పెట్టడం &  వారి నమ్మకాన్ని (భావజాలం)  భావి తరాల మీద రుద్దుకుంటూ పోతారు.  వాటి వల్ల  వచ్చే ఫలితాలని  ఎవరు  భరించాలి ? ప్రవీణ్ కుమార్  గారు  బుద్దుడిని/అంబేద్కర్ ని నమ్మారు. . సరే . అది  ఆయన  ఇష్టం.  అవి పిల్లలకి  చెప్పడంలో  ఏంటి ప్రయోజనం ? ఇంకో ప్రవీణ్  గారు  ‘అనాధ పిల్లల్ని చేరదీసాను డబ్బులివ్వండి’   అని అమెరికాలో  అందరికి చెప్పి చందాలు వసూలు చేసి ఓ  ప్రభువా అనిపిస్తారు పిల్లలతో. వేరే వారి దేవుళ్ళని  కాళ్ళతో  తంతానని  చెప్పుకుంటారు.  అదీ బానే  ఉంది. పాకిస్తాన్లో మదరాసాల్లో  ఇంకోటి  చెప్తారుట . ఇలా  ఎవరి నమ్మకం వాళ్ళు చెప్పుకుంటే వచ్చిన నష్టం లేదు.  కానీ నష్టం  వచ్చేది ఎప్పుడంటే  ఇంకొక మతాన్ని/ నమ్మకాన్ని  క్రించపరుస్తూ/అగౌరవపరుస్తూ   పిల్లల మనస్సులో  విషబీజాలు నాటినప్పుడే . మనిషిని మనిషిగా చూడకుండా  చంపే  యుద్ధాలు వచ్చాయంటే ఇందుకు  కాదా ? అందులో  సందేహం ఉందా ? 

ఆ ప్రతిజ్ఞ  విన్నాక  ఓ హిందువుగా  నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ సభలో  ఉన్నట్లయితే ఉన్న పళంగా  బయటికి వచ్చేసేదాన్నేమో  కూడా .  ఈ మాట అనగానే ఒక  భాజపా/ RSS  వారిని మద్దతు ఇస్తున్నట్టు  కాదు .

సద్గురు  చెప్పినట్టు ‘ So many children in this country postpone their dinners’ . ఎంత బాధాకరమైన విషయం ? తరాలు  తరాలు   గడిచిపోతుంటాయి.  ఇంకొకడి ఆకలి అనేది ఏ రోజున అది గుర్తిస్తాం ?

తెలుసుకోవలసిన చరిత్ర


చరిత్రలో ఏదైనా మారణహోమం గురించి చర్చ వచ్చినపుడు, చరిత్రలో ఆ భాగాన్ని ఎందుకు చదవాలి. మర్చిపోవచ్చు కదా. గుర్తుకు తెచ్చుకుని లేనిపోని గొడవలు సృషించాలా అనే ప్రశ్నలు అనేకం వస్తాయి.


ఒక మతం/సంస్కృతి/భాష ఆధారంచేసుకుని ఆ మనుష్యజాతిని అణగద్రొక్కడానికి ఎన్నో మారణహోమాలు జరిగాయి. ఆ చరిత్ర తెలియడం,తెలుసుకోవడం, తెలియజేయడం ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే అటువంటి మారణహోమాలు ఇక పైన జరగకూడదు. ప్రపంచంలో ఏ జాతైనా అంతరించిపోకుండా ఉండాలి. ఈరోజున ప్రపంచం ఒక global village అంటున్నాము. మరి మానవహక్కుల ఉల్లంఘన కాకుండా భావితరాలకు పాఠ్యాంశాలుగా కూడా బోధించాలి.


యూదుల మీద జరిగిన మారణహోమం ప్రపంచంలో అందరికీ తెలుసు. ప్రతీ చోటా ప్రపంచయుద్ధం గురించి చెప్పే భాగంగానే అది కూడా బోధిస్తారు. ఆఫ్రికా జాతి వారిని బానిసలుగా మార్చారన్న విషయాన్నీ కూడా మనం పాఠ్యాంశాలలో తెలుసుకుంటాము. మరి భారతదేశ చరిత్రలో హిందువుల మీద జరిగిన మారణహోమాల గురించి ప్రపంచంలో ఎంతమందికి అవగాహన ఉంది?ఎంతమంది పాఠ్యాంశాలుగా చదువుకుంటున్నారు? ప్రవాసభారతీయుల హిందూ పిల్లలకి తెలుసా? అసలు భారతీయులకే ఎంతమందికి తెలుసు? కేవలం ఈ ‘అవగాహన’ అనేది కల్పించడం కోసం శ్రీకారం చుట్టారు Hindu American foundation వారు. వారి ప్రయత్నాలు చాలా చాలా హర్షణీయం. కాబట్టి అమెరికన్ హిందువులు ‘మనకెందుకులే’ అనుకోకుండా వారి websiteకి వెళ్లి ఏమి చేయాలో చూసి వారు సూచించింది చేయమని నా మనవి🙏🙏.

1971 Bengali Hindu Genocide:


1971 లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ (పూర్వం తూర్పు పాకిస్తాన్) స్వాతంత్య్రం వచ్చింది అన్నది అందరికీ తెలిసిందే. పశ్చిమ పాకిస్తాన్ వారు తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లో కూడా ఇస్లాం మరియు ఉర్దూ భాషలని బెంగాలీయుల మీద రుద్దేప్రయత్నం చేసారు. ఈ ప్రక్రియలో, వారు తూర్పు పాకిస్తాన్ లో ఉన్న బెంగాలీ సంస్కృతి మరియు భాషను అణచివేశారు, ఇది పూర్తిగా హిందూ మతంతో ముడిపడి ఉందని అందువల్ల, ఇది ఇస్లామిక్ దేశమైన తమ దేశానికీ ముప్పు అని వాళ్ళు భావించారు.


1971 లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణగద్రొక్కడానికి పాకిస్తాన్ సైన్యం అత్యంత దారుణమైన హింసాకాండకి పాల్పడింది. ఈ వివాదం ఫలితంగా కొన్నిలక్షల మంది ఊచకోత కోయబడ్డారు. అందులో ప్రధానంగా హిందువుల పైననే దాడులు జరిగాయి.. ఇక మహిళలపై అత్యాచారాలు కూడా లక్షల్లో జరిగాయని అంచనా. దాదాపు కోటిమంది పైన refugee campలలో ఉన్నారని అంచనా. ఇన్నివేలమంది శరణార్ధుల భారం భారతదేశం మీద పడింది.


మార్చి 25, 1971 ఇప్పటి బంగ్లాదేశ్‌లో హిందువుల మారణహోమం ఆపరేషన్ సెర్చ్‌లైట్‌తో ప్రారంభమైంది, ఇది బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణిచివేసే సైనిక చర్య. మొదటి రోజు రాత్రి, పాకిస్తాన్ సైన్యం హిందూ పొరుగు ప్రాంతాలను మరియు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని, ఢాకా విశ్వవిద్యాలయంలోని హిందూ వసతిగృహమైన జగన్నాథ్ హాల్ వద్ద మొదట ప్రారంభమైంది. ఆ రాత్రి 5,000-100,000 మంది మధ్య మరణించారు.


ఢాకాలోని American Consul-General and the senior US diplomat , Archer Blood వాషింగ్టన్ లోని ప్రభుత్వ అధికారులకి చెప్పిన నోట్ ఈ విధంగా ఉందిట ‘ Genocide’ applies fully to naked, calculated and widespread selection of Hindus for special treatment…From outset various members of American community have witnessed either burning down of Hindu villages, Hindu enclaves in Dacca and shooting of Hindus attempting [to] escape carnage, or have witnessed after-effects which [are] visible throughout Dacca today…


ఇతరదేశాల జర్నలిస్టులు తూర్పు పాకిస్తాన్ రాకుండా కట్టుదిట్టం చేసింది ఆనాటి పాకిస్తాన్ ప్రభుత్వం. తమకి అనుకూలంగా రిపోర్టులు వ్రాయమని ఒక ఎనిమిది మంది పాకిస్తానీ జర్నలిస్టులకి బాధ్యత అప్పజెప్పారు. అందులో ఏడుగురు వారికి అనుకూలంగా వ్రాసారు. ఒక్కరుతప్ప. ఆయన పేరు Anthony mascarenhas. ఆయన UK పారిపోయి అక్కడ ‘Sunday times’ అనే పత్రికకి తన వ్యాసం “Genocide” పంపారట. ఆ వ్యాసం ప్రపంచంలో ఓ చరిత్రనే మార్చేసింది. అది ఇందిరా గాంధీ గారు చదివి సైన్యాన్ని పంపాలన్న నిర్ణయం తీసుకున్నారట. ఆయన వ్యాసం net లో ఎక్కడైనా చదవచ్చు. pdf format లో లభ్యమవుతుంది.


ఇది హిందువుల మీద జరిగిన దాడి అంటూ అప్పట్లో న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ Sydney H. Schanberg కూడా వెల్లడించారు.


ఆశ్చర్యం ఏంటంటే భారతదేశంలో తూర్పు పాకిస్తాన్ లో ఇదొక civil war అన్నట్లు చిత్రీకరించి పాఠాలు బోధించినట్లు గుర్తు. ఈరోజుకి నాలాంటిది అదే నమ్ముతోంది. ఇలా ఎన్ని వక్రీకరించి చెప్పారో కదా అనిపిస్తుంది. హైదరాబాద్ లోని రజాకార్ల గురించి చెప్తారు కానీ ఇంత దారుణాన్ని ఎవరూ చెప్పగా వినలేదు. బహుశా బెంగాలీయులకి ఏమైనా తెలిసి ఉండవచ్చు.


ఇది జరిగి సరిగ్గా 50 సంవత్సరాలు. నిజనిజాలను తెలుసుకోవడానికి ఆనాటి ప్రత్యక్ష సాక్షులయిన ఆ తరం వారు ఇంకా ఉండే ఉంటారు. ఏది ఏమైనా ఆ దారుణహింసని అనుభవించిన వారికి క్షమాపణలు లభిస్తే కొద్దిలో కొద్దిగా ఊరటే కదా

ఓ హిందువుపై వివక్ష

‘తన్ను మాలిన ధర్మం’ అనేది హిందువులు అనే వారు మానేసి కొన్ని దశాబ్దాలో శతాబ్దాలో అయి ఉంటుంది అనుకుంటా బహుశా. ఈ మధ్య కాలంలో ఎంతో మంది భారతీయ అమెరికన్లు ‘వేరే ధర్మాలకి చాలా అన్యాయం జరిగిపోతోంది’ అని గొంతులు చించుకు అరవడం కనిపించింది సోషల్ మీడియాలో. మంచి పరిణామమే. కాదనను. వేరే వారి కష్టాలు మన కష్టాలు గా భావించి వారికి మద్దతుగా నిలవటం అనేది మంచిదే. అటువంటి అన్యాయమే మనకి జరిగినపుడు, వారు కూడా మనకి మద్దతు పలికేలా చేయగలగాలి కదా మరి? చేస్తున్నామా? పోనీ ‘అన్యాయం’ జరిగిన సంగతులన్నా గుర్తిస్తున్నామా లేదా?

ఓ రెండు రోజుల క్రితం ఓ హిందూ విద్యార్థిని అదే సోషల్ మీడియా లో హేళన, వివక్షలకి గురైందన్నవార్త వచ్చింది. విషయం జరిగి చాలా రోజులయినా వివక్షల గురించి మాట్లాడే ఒక్క ప్రధాన మీడియా వారు కూడా గట్టిగా (పదేపదే) మాట్లాడకపోవడం ఆశ్చర్యం. మీడియా చెప్పాక, ఏదైనా ‘వివక్ష’ అనగానే మాట్లాడే నాకు తెలిసిన పరిధిలోని స్నేహితులు కూడా ఎవ్వరూ ఈవార్తను సోషల్ మీడియా లో పంచకపోవటం ఇంకా ఆశ్చర్యపరచింది. అందుకే నేనే ఆ వార్త ఏంటో క్లుప్తంగా వ్రాస్తాను. తప్పుడు సమాచారం అని ఎవరికైనా అనిపిస్తే చెప్పండి. తప్పక సరిదిద్దుతాను. విషయం అర్ధమయితే మీ పరిధిలో మీరు చేయగలిగింది చేయండి.

కర్ణాటకలోని ఉడిపికి చెందిన Rashmi Samant అనే అమ్మాయి నుంచి UK లోని University of Oxford లో పైచదువులు చదువుకోవడానికి వెళ్ళింది. వారి కుటుంబంలో కాలేజికి వెళ్లిన మొట్టమొదటి విద్యార్థి Rashmi Samant. వెళ్లిన రోజులకే President of Oxford Student Union పదవికి పోటీ చేసి నిల్చుని ఎన్నికలు గెలిచి ఆ పదవిని గెలుచుకుంది. భారతదేశం నుంచీ వచ్చిన వారిలో గెలిచిన మొట్టమొదటి మహిళా అభ్యర్థి ఈ అమ్మాయే అట. గెలిచిన కొన్ని రోజులకే ఈ అమ్మాయి సోషల్ మీడియాలోని పాత పోస్టులని (ఎప్పుడో టీనేజి ఉండగా వ్రాసినవి) వెలికి తీసి వాటిని గురించి హేళన చేయడం మొదలుపెట్టారు కొందరు. అంతే కాదు వాళ్ళ అమ్మ, నాన్నలని కూడా విడవకుండా, వారు అయోధ్య మందిరం తీర్పు వచ్చినపుడు మార్చుకున్న profile picture ని viral చేసి, దాని మీద రకరకాల వ్యాఖ్యలు చేసారు. screenshots చూడవచ్చు.ఇంత తీవ్ర వివిక్షకి గురయిన ఆ అమ్మాయి చాలా కలత చెంది ఆ పదవికి రాజీనామా చేసి భారతదేశంకి వెళ్ళిపోయింది. ఈ విషయాలన్నీ ఎన్నికల్లో గెలిచాకే జరిగాయని చెప్పింది ఆ అమ్మాయి.

అందరం ఈ అమ్మాయిలాగే విదేశాలకి వలస వచ్చినవారమే. ముందు ముందు ఇటువంటివి మన పిల్లలకే జరగవని నమ్మకం ఏమిటి? త్యాగరాజ కృతులు పాడుకునే పిల్లల్ని రాముడి పాటలు పాడే హిందుత్వవాదులు అన్నా అనవచ్చు. ఎన్నెన్నో జరగొచ్చు.. వారి ఉనికిని వారు ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తున్నామా ? నుదుట బొట్టు పెట్టుకుంటే ‘నువ్వో హిందువువి’ అంటూ హేళనకి గురయితే ‘బొట్టు పెట్టుకోవడమే మానెయ్’ అని తేలిగ్గా చెప్పే మనం, ఇటువంటి పెద్ద సమస్యలు వచ్చినపుడు ఈపిల్లల పక్కన ‘మేము ఉన్నాము’ అని చెప్పగలమా? మన ఉనికి కోసం తాపత్రయపడుతూ మనం ఎప్పుడైతే నిలబడతామో మనల్ని చూసి గౌరవించాలన్న భావం అవతలవాడికి కలుగుతుంది. పిలిచినా పిలవకపోయినా పదిమంది మన వెనకాల ఉంటారు. మనకి ఆ తాపత్రయం లేనంతవరకూ ప్రపంచంలో ఎవరికీ మన విషయం అక్కరలేదు అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి.

Screenshots:

వీలైతే వంశీ జూలూరి గారి వ్యాసం కూడా చదవండి

https://vamseejuluri.medium.com/today-in-hinduphobia-march-2-2021-rashmi-of-udupi-versus-the-racists-and-hindu-haters-of-oxford-c443c68f699b