ఓ హిందువుపై వివక్ష

‘తన్ను మాలిన ధర్మం’ అనేది హిందువులు అనే వారు మానేసి కొన్ని దశాబ్దాలో శతాబ్దాలో అయి ఉంటుంది అనుకుంటా బహుశా. ఈ మధ్య కాలంలో ఎంతో మంది భారతీయ అమెరికన్లు ‘వేరే ధర్మాలకి చాలా అన్యాయం జరిగిపోతోంది’ అని గొంతులు చించుకు అరవడం కనిపించింది సోషల్ మీడియాలో. మంచి పరిణామమే. కాదనను. వేరే వారి కష్టాలు మన కష్టాలు గా భావించి వారికి మద్దతుగా నిలవటం అనేది మంచిదే. అటువంటి అన్యాయమే మనకి జరిగినపుడు, వారు కూడా మనకి మద్దతు పలికేలా చేయగలగాలి కదా మరి? చేస్తున్నామా? పోనీ ‘అన్యాయం’ జరిగిన సంగతులన్నా గుర్తిస్తున్నామా లేదా?

ఓ రెండు రోజుల క్రితం ఓ హిందూ విద్యార్థిని అదే సోషల్ మీడియా లో హేళన, వివక్షలకి గురైందన్నవార్త వచ్చింది. విషయం జరిగి చాలా రోజులయినా వివక్షల గురించి మాట్లాడే ఒక్క ప్రధాన మీడియా వారు కూడా గట్టిగా (పదేపదే) మాట్లాడకపోవడం ఆశ్చర్యం. మీడియా చెప్పాక, ఏదైనా ‘వివక్ష’ అనగానే మాట్లాడే నాకు తెలిసిన పరిధిలోని స్నేహితులు కూడా ఎవ్వరూ ఈవార్తను సోషల్ మీడియా లో పంచకపోవటం ఇంకా ఆశ్చర్యపరచింది. అందుకే నేనే ఆ వార్త ఏంటో క్లుప్తంగా వ్రాస్తాను. తప్పుడు సమాచారం అని ఎవరికైనా అనిపిస్తే చెప్పండి. తప్పక సరిదిద్దుతాను. విషయం అర్ధమయితే మీ పరిధిలో మీరు చేయగలిగింది చేయండి.

కర్ణాటకలోని ఉడిపికి చెందిన Rashmi Samant అనే అమ్మాయి నుంచి UK లోని University of Oxford లో పైచదువులు చదువుకోవడానికి వెళ్ళింది. వారి కుటుంబంలో కాలేజికి వెళ్లిన మొట్టమొదటి విద్యార్థి Rashmi Samant. వెళ్లిన రోజులకే President of Oxford Student Union పదవికి పోటీ చేసి నిల్చుని ఎన్నికలు గెలిచి ఆ పదవిని గెలుచుకుంది. భారతదేశం నుంచీ వచ్చిన వారిలో గెలిచిన మొట్టమొదటి మహిళా అభ్యర్థి ఈ అమ్మాయే అట. గెలిచిన కొన్ని రోజులకే ఈ అమ్మాయి సోషల్ మీడియాలోని పాత పోస్టులని (ఎప్పుడో టీనేజి ఉండగా వ్రాసినవి) వెలికి తీసి వాటిని గురించి హేళన చేయడం మొదలుపెట్టారు కొందరు. అంతే కాదు వాళ్ళ అమ్మ, నాన్నలని కూడా విడవకుండా, వారు అయోధ్య మందిరం తీర్పు వచ్చినపుడు మార్చుకున్న profile picture ని viral చేసి, దాని మీద రకరకాల వ్యాఖ్యలు చేసారు. screenshots చూడవచ్చు.ఇంత తీవ్ర వివిక్షకి గురయిన ఆ అమ్మాయి చాలా కలత చెంది ఆ పదవికి రాజీనామా చేసి భారతదేశంకి వెళ్ళిపోయింది. ఈ విషయాలన్నీ ఎన్నికల్లో గెలిచాకే జరిగాయని చెప్పింది ఆ అమ్మాయి.

అందరం ఈ అమ్మాయిలాగే విదేశాలకి వలస వచ్చినవారమే. ముందు ముందు ఇటువంటివి మన పిల్లలకే జరగవని నమ్మకం ఏమిటి? త్యాగరాజ కృతులు పాడుకునే పిల్లల్ని రాముడి పాటలు పాడే హిందుత్వవాదులు అన్నా అనవచ్చు. ఎన్నెన్నో జరగొచ్చు.. వారి ఉనికిని వారు ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తున్నామా ? నుదుట బొట్టు పెట్టుకుంటే ‘నువ్వో హిందువువి’ అంటూ హేళనకి గురయితే ‘బొట్టు పెట్టుకోవడమే మానెయ్’ అని తేలిగ్గా చెప్పే మనం, ఇటువంటి పెద్ద సమస్యలు వచ్చినపుడు ఈపిల్లల పక్కన ‘మేము ఉన్నాము’ అని చెప్పగలమా? మన ఉనికి కోసం తాపత్రయపడుతూ మనం ఎప్పుడైతే నిలబడతామో మనల్ని చూసి గౌరవించాలన్న భావం అవతలవాడికి కలుగుతుంది. పిలిచినా పిలవకపోయినా పదిమంది మన వెనకాల ఉంటారు. మనకి ఆ తాపత్రయం లేనంతవరకూ ప్రపంచంలో ఎవరికీ మన విషయం అక్కరలేదు అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి.

Screenshots:

వీలైతే వంశీ జూలూరి గారి వ్యాసం కూడా చదవండి

https://vamseejuluri.medium.com/today-in-hinduphobia-march-2-2021-rashmi-of-udupi-versus-the-racists-and-hindu-haters-of-oxford-c443c68f699b

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s