చరిత్ర పునరావృతం కాకూడదు అంటే ఏం చేయాలి?

ఈ మధ్య  కెనడాలో  751 పిల్లల సమాధులు కనుగొన్నట్టు వార్తలలో చూసాము. అక్కడ  Catholic చర్చి వారు Indian  Residential Schools లో  చేసిన  దారుణాలకి  సంబంధించిన వార్త. ఏమిటా ఈ వార్త అని  వాటి మీద కొన్ని డాక్యూమెంటరీలు  చూసాక మనసు కలిచివేసింది.  ‘ మీ పిల్లలకి చదువు నేర్పుతాం’ అంటూ  అక్కడ  ఉన్న  native  జాతి వారి భాష, కట్టు, బొట్టు  అన్నీ మరుగున పడిపోయేలా చేసారు చర్చి వారు . వారి మతాన్ని మార్చేశారు.  ఆ  పాఠశాలలలో తప్పనిసరిగా చేరాలి అని అప్పటి ప్రభుత్వం ఒక Act  పెట్టిందిట. ఆ విధంగా తల్లిదండ్రులకి , తోబుట్టువులకి దూరమయిపోయారు పిల్లలు.  ఆ హింసని తట్టుకోలేక  చనిపోయిన పిల్లలు ఎంతో మంది ఉన్నారట.  ఇందులో చాలా మెచ్చుకోవలసిన అంశాలు  ఏంటంటే అక్కడ native జాతి వారు కలిసికట్టుగా  ప్రభుత్వాన్ని ప్రశ్నించడం.  ప్రభుత్వం వారు క్షమాపణలు చెప్ప డమే  కాదు. నష్టపరిహారం కూడా ఇచ్చారు.  పిల్లల సమాధులు కనుగొన్నట్టు వార్త రాగానే Pope  గారు కూడా స్పందించారట. 

ఇవన్నీ చూస్తున్న క్రమంలో .. 

ముఖ్యంగా ‘Goa  Inquisition ‘ గుర్తొచ్చింది. జలియన్ వాలా బాగ్  సంఘటన గుర్తొచ్చింది.  ప్రపంచ యుద్ధాలలో  బ్రిటిష్ వారి తరఫున పోరాడిన ప్రాణాలు కోల్పోయిన  భారతదేశ సైనికులు…. 

… అలా  చాలా చాలా గుర్తొచ్చాయి.  

భారత దేశ చరిత్రలో 450 ఏళ్ళ  క్రితం  హిందువుల మీద మతం అన్న పేరుతో  జరిగిన  అత్యంత దారుణమైన హింసా కాండ  ‘Goa  Inquisition ‘.  గూగుల్ లో ఈ  అంశం మీద  బోలెడు వీడియోలు ఉన్నాయి. పుస్తకాలూ ఉన్నాయి.  అయినా కొన్ని మాటలలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. 

Inquisition  అనేది  కాథలిక్ చర్చి వారు చేసిన మతపరమైన విచారణ.  పోర్చుగల్, స్పెయిన్  దేశాలని  పరిపాలనించిన రాజులూ , రాణులు  వారి వారి  colonies లో ప్రజలు ప్రతి ఒక్కరూ  క్రైస్తవం పాటించేలా చూసేవారు. ముఖ్యంగా  యూదులు, ఇస్లాము మతస్థులని target  చేసేవారు.  క్రైస్తవం లో  మారలేని వారు వారి వారి స్థలాలు వదిలేసి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళేవారు .  మారిన  ప్రజలు  తిరిగి పాత మతం లో వెళ్లకుండా చూడటమే ఈ  Inquisition.  మతం మారటమే  కాదు. కట్టు, బొట్టు, భాష  అన్నీ మార్చుకోవాలి. తిండి  విషయాలలో కూడా వీరు చెప్పిన నియమ నిబంధనలే పాటించాలి.  ఇలా మారిన  వారి మీద ఎల్ల  వేళలా నిఘా ఉండేది. వారు ఏమాత్రం  ఏమరుపాటుగా ఉన్నా/ పాత  ఆచారాలు పాటించినా విచారణ ఉండేది.  విచారణ అంటే మాములుగా కాదు.  యమభటులు నరకంలో వేసే శిక్షలు కూడా అంత దారుణంగా ఉండవు.   

భారత దేశంలో గోవా మొట్ట మొదట Portugal  colony  అయ్యింది.  కొద్ది  కాలానికే గోవా ప్రజల మీద ఈ  Inquisition రుద్దబడింది. . ఈ portugal వారు గోవాలో  మత  ప్రచారం చేయడానికి ముందే, గోవాలో  ప్రజల్లో  క్రైస్తవులు ఉండటం వారిని చాలా ఆశ్చర్యపరచింది.  చెప్పా కదా వారి target యూదులు. ఆ యూదులతో పాటు  హిందువుల మీద కూడా ఈ Inquisition రుద్ధి వారిని  కూడా యూదులతో పాటూ చాలా హింసించారు. ఈ Inquisition బాధలు తట్టుకోలేక  ప్రజలు  గోవా వదిలి  చుట్టూ ఉన్న ప్రాంతాలకి వలస వెళ్లారు.  Shefali  vaidya  గారి videoలు   చూస్తే తెలుస్తుంది. ఆ వలసలు ఎలా జరిగాయో చాలా బాగా చెప్పారు ఆవిడ .  

మొట్ట మొదటి సారి నేను 1994లో  గోవా వెళ్ళాను. మనుష్యుల కట్టు, బొట్టు & ఇళ్ళు చూసి ఇది ఇండియానా అని అనుమానం వచ్చింది మాకు.  హిందూ సంస్కృతి  చాలా తక్కువ కనిపిస్తుంది. అంత  అందమైన  గోవాలో మన పూర్వీకుల కన్నీటి గాధలు ఉన్నాయి అంటే నమ్మబుద్ధి కాదు .

Shefali గారు చెప్పినది నమ్మకపోతే ఈ లంకెలో పుస్తకం ఉంది.  చదుకోవచ్చు

https://quod.lib.umich.edu/e/eebo/A37503.0001.001?view=toc

ముఖపుస్తకంలో నా పోస్టులలో  ఒకసారి  30 ఏళ్ళ  క్రిందట జరిగిన కాశ్మీరీ హిందువుల మీద దాడి  గురించి వ్రాసాను.  ఈమధ్య  50 ఏళ్ళ  క్రిందట బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరిగిన హత్యాకాండ గురించి రుజువులతో  కూడా  వ్రాసాను. పట్టుమని  పాతిక  వేలిముద్రలు  కూడా  రాలేదు ఆ  పోస్టులకి.   30 ఏళ్ళ  క్రితం జరిగిన వాటి గురించే మాట్లాడము. ఇక  450 ఏళ్ళ  క్రిందట అంటే చాలా చాలా  light  మనకి. అంటే  మనం అసలు దేనికీ కూడా  స్పందించమా అంటే అలాంటిదేం లేదు.   ట్రంప్  గారి గురించి ఒక మాట అనగానే  పెద్ద జాత్యహంకారి అని ఎంతో మంది ఖండించారు. ఏ జాతి వారికి  అన్యాయం జరిగినా మనకే జరిగినంత స్పందించే మనం, మన జాతికి  & మన  పూర్వికులకి జరిగిన అన్యాయాల గురించి ఒక మాట కూడా అనలేమా ?మాట  అనటం పక్కన పెట్టండి. ఏమి  జరిగిందో కూడా తెలుసుకునే  ప్రయత్నం కూడా చేయము.  ఓ వీడియో  చూడటానికి కూడా సమయం ఉండనంత బిజీ మనం. 

హిందువులు/భారతీయులు  ‘మేము ఎవరి మీద  దాడులు చేయలేదు.  కానీ  మా  మీద మత  మార్పిడులు , హింస, దురాక్రమణలు  ఇవన్నీ జరిగాయి’ అని చెప్తాము/చెప్తారు/చెప్తూనే ఉంటారు . చెప్పడం మంచిదే. కానీ అది చరిత్రలో పునరావృత్తి కాకుండా ఉండాలి అంటే, ప్రపంచానికి  తెలియజేసే ప్రయత్నాలు చేయాలి.  తెలియజేయడం అంటే ఇతర మతస్థులని దుమ్మెత్తి పోయడం కాదు. వారిని అగౌరవపరచకకూడదు.   ఇటువంటివి పాఠ్యాంశాలలో ప్రవేశ పెట్టేలా చేయాలి. Pope గారు క్షమాపణలు చెప్పేలా చేయాలి. అడగనిదే  అమ్మైనా పెట్టదు  అని  సామెత. నీ సంస్కృతి మీద  జరిగిన దాడి  గురించి నువ్వు చెప్పకపోతే Pope గారో / బ్రిటిష్ వారో  వచ్చి “అయ్యో! ప్రపంచంలో అందరికీ  క్షమాపణలు చెప్పాము.  మీకు చెప్పడం మరిచాము “ అనరు కదా  .

కెనడాలో ఏడు తరాల పాటు  వారి జాతి అంతరించిపోయేలా చేస్తే వారు కూడగట్టుకుని వచ్చి ప్రశ్నిస్తున్నారే ? హిందువులు  ఇన్ని కోట్లమందిమి ఉన్నాము.

ఆ మాత్రం ప్రశ్నించలేమా ?    

4 thoughts on “చరిత్ర పునరావృతం కాకూడదు అంటే ఏం చేయాలి?”

 1. // “ చరిత్ర పునరావృతం కాకూడదు అంటే ఏం చేయాలి?” //

  చరిత్ర చదవాలి.
  కానీ, అబ్బే మాకు అంత టైము, ఆసక్తి లేవండీ.

  మరో పోర్చుగీసు యాత్రికుడు వాస్కో డి గామా కూడా భారతీయుల మీద అకృత్యాలు సాగించాడండి. మన దేశంలోని రాజే అయిన టిప్పు సుల్తాన్ కూడా తక్కువ తినలేదు.

  పోన్లెండి మీ లాంటి వారు ముఖ పుస్తకం వంటి మాధ్యమాల్లో వ్రాయడం మంచిదే లెండి. కొంత మందైనా చదువుతారు. మీ ప్రయత్నం కొనసాగించండి.

  మెచ్చుకోండి

 2. మీరు పుట్టిన తరువాత హిందువులు ఏ తప్పు చేయలేదా ? మరి 1992 లో జరిగిన మారణ హోమానికి బాధ్యత ఎవరిది ? ఎవరు ఎవరికి క్షమార్పణ చెప్పాలి? వాళ్ళు క్షమార్పణలు చెపుతారా ?
  చరిత్ర చదవడం, ఆవేశం తెచ్చుకోవడం , ప్రశ్నించడం అంత అవసరం లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు నోరుమూసుకుంటే మరీ మంచిది అనేది నా ఉ బో స !

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: