పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణుల పరిస్థితి

ఇదండీ పౌరోహిత్యం/ వైదిక కర్మలు చేసుకునే బ్రాహ్మణుల పరిస్థితి.

వీడియోలో రాంబాబు గారి చెప్పినట్లు, పరిస్థితి ఇలాగే ఉంటే మన తరువాత ఇంకో రెండు తరాలు చూస్తారేమో . ఎన్నో రోజులు పట్టదు ఇది అంతరించి పోవడానికి. మరీ అతిగా చెప్తున్నారు ఆయన అంటారేమో. విపరీతమైన మార్పు అనేది గత రెండు దశాబ్దాలుగా జరిగిపోయింది. మనం నిద్ర లేవకుండా తెల్లారలేదు అంటే ఎలా ? ‘ఎందుకు చాదస్తం’ అంటూ సగం వదిలేసాం మనం. ఉన్నది కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.

బ్రాహ్మణులు వారి వృత్తి చేపట్టకపోతే ?

ముహుర్తాలు పెట్టే వారు ఉండరు.

పంచాంగాలు వ్రాయడం ఉండదు.

గుళ్ళలో పూజలు ఉండవు. గుళ్ళు విహార స్థలాలు గా మారిపోతాయి.

పెళ్ళిళ్ళు , బారసాలలు, అన్న ప్రాసనలు , పుట్టువెంట్రుకలు , షష్టిపూర్తి , గృహప్రవేశాలు , వ్రతాలు అన్ని రికార్డులు పెట్టి చేసుకోవాల్సిందే.

ఏది చేసినా చేయకపోయినా అపరకర్మలు అనేవి అందరికీ Sentiment. అవి చేసే వారు కరువయిపోతారు.

బ్రాహ్మడి ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అన్ని క్రతువులు చేసుకోవాలి అనుకునే మన అందరికీ ఆ వృత్తి మీద నమ్మకం /గౌరవం లేకపోవడం. ఇహ సినిమాల్లో వీళ్ళ మీద జోకులు చెప్పనే అక్కరలేదు. ఆహారం, కట్టు, బొట్టు దగ్గర నుంచీ ఎన్నో నియమాలు పాటించాలి అంటే ఏ ఆడపిల్లలు ముందుకి రారు. అందులోనూ సమానత్వం / నా బట్టలు నా ఇష్టం/ స్త్రీ బానిస కాదు అంటూ మాట్లాడేవాళ్ళు ఈ వృత్తి లో వారిని వివాహం చేసుకుంటారా ? చాలా సార్లు చెప్తుంటాను సంస్కృతిని ఏ విధంగా direct గాను/ indirect గాను కూకటి వేళ్ళతో ఎలా పీకుతారు అని . ఈ రోజు స్పష్టంగా కనిపిస్తోంది. వీరేదో నా కులం వారు అని ఇలా చెప్పడం లేదు. ఈ క్రతువులన్నీ ఆగిపోతే హిందూ ధర్మం అనేది పుస్తకాలకి పరిమితం అవుతుంది. ‘ఉండేదిట ‘ అని చెప్పుకుంటాం. ప్రపంచంలో ఎన్నో తట్టుకుని ఈ రోజు వరకూ నిలిచి ఉన్న సంస్కృతి ఇదొక్కటే. దాన్నిగర్వంగా చెప్పుకుంటూ ‘celebrate ‘ చేసుకోవాల్సింది పోయి వదిలేస్తూ గర్వపడుతున్నాం

3 thoughts on “పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణుల పరిస్థితి”

 1. నిజంగా నిజం మా వాళ్ళు లోనే చాలా మంది పెళ్లి కాకుండా ఉండిపోయారు కారణాలు తెలిసినవే మంచి విషయం ధన్యవాదాలు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. విడియోలో చెఱువు రాంబాబు గారి ఆవేదన సమంజసమే. చాలా మాట్రిమోనియల్ లిస్టుల్లో కూడా పాపం వయసు మీరిన ఇటువంటి వారి పేర్లు కనిపిస్తాయి.

  పౌరోహిత్యపు పెళ్లికొడుకు వైపు వారు దైనందిన జీవితంలో కూడా చాదస్తపు పనులు తగ్గించుకోవాలి, కుటుంబం మొత్తం మీద రుద్దడం ఆపాలి. సంబంధాలు వెతుక్కునేటప్పుడు సంసారపక్షపు చదువులతో ఆగిపోయిన అమ్మాయిల సంబంధాలే చూసుకోవాలి ఉభయతారకంగా ఉంటుంది.

  నాకో సందేహం అండీ – సమాజం మారాలి అంటున్న ఈ రాంబాబు గారు తన కూతురిని (ఒక వేళ చదువుకోని అమ్మాయి అయి ఉంటే) అటువంటి సంబంధానికిచ్చి చేస్తారా ?

  మెచ్చుకోండి

  1. ‘అటువంటి సంబంధానికిచ్చి చేస్తారా’ → చేస్తారండీ :). నాకు వారు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా. అయినా మాములు వారినే పెళ్ళిళ్ళు చేసుకోరు ఈ ఆడపిల్లలు. వేదం చదువుకున్న వారిని చేసుకుంటారా? చులకనా భావం కదా . మనం చేసిన పనే అది. పౌరోహిత్యం అనేది చాలా గొప్పది అని మనం ఆడపిల్లలకి చెప్పగలగాలి. ఈ సోషల్ మీడియా లాంటివి influence చేయకుండా ఉండేంత చెప్పాలి.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: