అన్వేషి ఛానల్ వారి వీడియో ఒకటి చూసాను. దాని సారాంశం ఏమిటంటే ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు కనుమరుగు అయిపోయినా , ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర కలిగి & బ్రతికి ఉన్న ఒకే ఒక సంస్కృతి భారతీయ సంస్కృతి అని. కానీ బాధ ఏంటంటే ఈ సంస్కృతిని రక్షించాల్సింది/రక్షించుకోవాల్సింది పోయి దీనిని కనుమరుగు చేయాలనే కంకణం కట్టుకున్నారు చాలా మంది. ఇది వరకు పరాయిదేశం నుంచీ/ పరాయి వారి నుంచీ భౌతిక దాడులు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని వింటుంటే సంస్కృతి మీద దాడి రకరకాల రూపాలు సంతరించుకుంటుంది అనిపిస్తోంది. మొన్న పిల్లలకి పాఠాలు చెప్పే వంకతో తమ భావజాలాన్ని వారికి నేర్పించే కొన్ని వీడియోలు చూసాను.
మేము హైదరాబాద్ లో మాడపాటి హనుమంత రావు గారి బళ్ళో చదువుకున్నాము. ఆ బళ్ళో చదివాను కాబట్టే ఈ మాత్రం తెలుగు చదువుతున్నాను. సంస్కృతి అంటూ ఏదో ఒకటి చెప్తుంటాను. మా బళ్ళో భోజనాల సమయంలో భగవద్గీత బోధించేవారు. గాంధీ గారి వర్ధంతి రోజు తప్పనిసరిగా గీత చదివేవారు.
Final exams ముందు ప్రతీ తరగతి వారితో సరస్వతీ దేవి పూజ చేయించేవారు. మా బళ్ళో భవనాల పేర్లు మొల్ల, ఝాన్సీ , గార్గి, సరోజినీ దేవి, లీలావతి, మయూరి ఇలా ఉండేవి. మా బడి బ్యాడ్జి సూర్యోదయం లో విచ్చుకుంటున్న తమ పూవులతో ‘సత్యం, శివమ్ , సుందరం’ అని వ్రాసి ఉండేది. చక్కగా జడలు వేసుకుని , పూవులు, బొట్టు పెట్టుకుని వెళ్ళే వాళ్ళం. ఒక మతాన్ని/సంస్కృతిని దూషించడం అనేది నా గురువుల దగ్గర వినలేదు. ఈ ఫలానా సంస్కృతే పాటించాలి అన్న నియమం కూడా ఉండేది కాదు. అన్ని బళ్ళలో లాగే ఎన్నో పోటీలు ఉండేవి. ‘పైసా fund’ అంటూ ప్రతి తరగతిలో గల్లా పెట్టె ఒకటి పెట్టి , వచ్చిన డబ్బులతో పేద విద్యార్థులకి యూనిఫామ్ కుట్టించేవారు. లైబ్రరీ,Labs ఉండేవి ఆ రోజుల్లో. ఉన్నత తరగతి నుంచి పేద విద్యార్థుల వరకు అందరం కలిసి చదువుకునేవారం. మా యూనిఫామ్ లంగా & ఓణీ లేదా చుడీదార్.
ఇప్పుడంటే choice పెద్దగా లేదు కానీ, ఆ రోజుల్లో తెలుగు/ఆంగ్ల మాధ్యమం అనే choice ఉండేవి. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోలేని చదువు ఓ చదువే కాదనుకునేవారు చాలా మంది తల్లితండ్రులు (మా నాన్న గారు ఈ బడి బావుంటుంది అంటే చేదు మొహం పెట్టిన వారిని కూడా చూసాను నేను) ‘St. ‘ అన్న మాట ఉంటేనే ఆ బళ్ళలో చేర్చే వారు. కొన్ని బళ్ళలో తెలుగు నేర్పేవారు కాదు. Rosary convent ఒకటి అనుకుంటా అందులో. Please correct me if I am wrong. దానితో తెలుగు భాష అనేది ఆ తరంలోనే ఆగిపోయింది కొందరి కుటుంబాలలో. ఆ బళ్ళలో తెలుగులో మాట్లాడితే fine, పూలు & గాజులు వేసుకుంటే fine కట్టేవారు. పైగా కొంతమంది అదొక గొప్పలా చెప్పుకునేవారు. ఆ అమాయకత్వాన్ని తల్చుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది. ఒకటి రెండు సార్లు Inter school competitions/field trips వెళ్ళినప్పుడు మేము ‘మాడపాటి ‘ అని పేరు చెప్పగానే వెంటనే ‘మీ మొహంలే ‘ అన్నట్టు ఆంగ్లంలో మాట్లాడుకుంటూ ఉండేవారు. వాళ్ళు తెలుగు చదవకపోవడం వల్ల నష్టం ఏముంది అని ప్రశ్నిస్తే , నా సమాధానం ‘ వాళ్ళకి ఆంగ్లం ఒక్కటే వచ్చు. నాకు ఆంగ్లంతో పాటు తెలుగు కూడా వచ్చు’ . తెలుగు నేర్చుకోవడం అంటే నాకు తెలియకుండానే నా ఉనికి నేను తెలుసుకున్నాను. ఇంకో తరానికి కాస్తో కూస్తో నేర్పిస్తున్నాను. ఓ విశ్వనాథ అంటే ఎవరో తెలుసు. ఆయన ఏమి వ్రాసారో తెలుసు. ఇంకో తరం వారికి కాస్తో కూస్తో ఆయన గొప్పతనం చెప్పగలను. ఆయన రచనల భండాగారం తలుపులు తీసే తాళంచెవి ఖచ్చితంగా అందివ్వగలను. ఆ రోజుల్లో తెలుగు నేర్చుకోలేని వారికి వారి జీవితకాలం లో ఓ రైలు తప్పిపోయినట్లే.
సంస్కృతిని బ్రతికించాలా చంపేయాలా అనేది మన చేతుల్లో ఉంటుంది అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం చెప్పగలను? మన పిల్లలు తెలుగు చదవి దాన్నేం ఉద్దరించక్కర్లేదు లేదులే అని అనుకుని చేసిన పని వలన, తెలుగు సినిమాలకే పరిమితం అయిపొయింది.
ఆ వీడియోల్లో వారికి కావలసిన భావజాలం నేర్పుతున్నారు. పిల్లలు రేపు అదే నేర్చుకోని అదే భస్మాసుర హస్తం వారి మీదే పెడతారు.
భారత దేశం పుణ్యభూమి కావడం వలననేమో కొందరు మహానుభావుల పుట్టారు. అందువలననే ఎంత నరికేద్దాం అని ప్రయత్నాలు చేసినా, అటువంటి వారి వల్ల ఈ మాత్రం కట్టు, బొట్టు, భాష మిగిలాయేమో అనిపిస్తోంది ఈ రోజు .
అవునండి చంద్రిక గారు, ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుకోకపోవడం వల్ల నేనిలా హాయిగా తెలుగులో రాయగలుగుతున్నాను. ఎన్ని ఎక్కువ భాషలు వస్తే అంత మేలు, ఇంగ్లీషుతో పాటు మన తెలుగు పుస్తకాలు చదువుకోవచ్చు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
కామెంట్ చెయ్యట్లేదు కానీ మీ టపాలు చదువుతున్నాను పవన్ గారు. క్రమం తప్పకుండా వ్రాస్తున్నారు
మెచ్చుకోండిమెచ్చుకోండి