August 14th

 Partition Horrors Remembrance Day

 ఆలస్యమైనా ఈ పోస్టు పెట్టాలి అనుకున్నాను.

రామాయణంలో అద్భుతమైన ఘట్టం గంగావతరణం. గంగావతరణం ఎలా జరిగింది అనేది రాముడికి విశ్వామిత్రుడు వివరిస్తాడు. రామచంద్రుడి పూర్వికులైన సగరచక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నపుడు కపిల మహర్షి ఆగ్రహాగ్నికి గురై సగరచక్రవర్తి కుమారులు బూడిద కుప్పలైపోతారు. వారికి తర్పణం ఇవ్వటం కోసం భగీరథుడు చేసిన ప్రయత్నమే గంగావతరణం. గంగ స్వర్గం నుంచీ భూమి మీద పడి పాతాళంలో వెళ్ళే క్రమంలో బోలెడు ఇబ్బందులు. అవన్నీ కూడా ఓర్పుతో ఎదుర్కొంటాడు భగీరథుడు. ఇది అందరికి తెలిసిన కథ. తన పూర్వీకుల గురించి తెలుసుకున్న రాముడు అటువంటి వంశంలో పుట్టినందుకు చాలా ఆనందం పొందుతాడు. ఆయన పూర్వీకుల గురించి చెప్పి రాముల వారి వ్యక్తిత్వాన్ని చెక్కుతాడు విశ్వామిత్రుడు అని చాగంటి గారు తరచూ అంటూ ఉంటారు. సరే ఇది రామాయణం. కథ బావుంది. చాగంటి గారు చెప్తే చాలా చాలా బావుంటుంది. విందాం. పుణ్యం తెచ్చేసుకుందాం. చాలా ? సరిపోతుందా అది?

ఇప్పటికే నేను చాలా సార్లు అనిన మాట ‘మన రాబోయే తరాలు మన చరిత్ర తెలుసుకోవడం ముఖ్యం’ అని . ‘Past is Past’ అని వదిలేయచ్చు. పైన రామాయణం కథలో భగీరథుడు కూడా ఆ విధంగా వదిలేస్తే గంగ భూలోకంలోకి రావడం ఉండదు. శ్రీరామచంద్రుడికి విశ్వామిత్రుడు వివరించడం ఉండదు. కదా? భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు. అంటే మూడో తరం వారు వచ్చారు. మరి ఈ మూడో తరానికి వారి ముత్తాతలు, ముత్తవ్వలు చేసిన త్యాగాలు ఎవరు చెప్తారు? అసలు బ్రిటిష్ వారు అనే కాదు. అంతకుపూర్వం ఎన్నో విదేశీయుల దాడులు. వాటిని ఎదురుకుంటూ → ఒక్క రోజు కాదు. రెండు రోజులు కాదు. కొన్ని వందల ఏళ్ళ పాటు భారతదేశం లోని మన పూర్వికులు చేసిన త్యాగాలు అంతా ఇంతా కాదు. ఏది ఏమైనా, ఎన్ని బాధలు వచ్చినా ఈ ధర్మాన్ని వదల్లేదు (Goa Inquisition is the best example ). ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనం గర్వంగా చెప్పుకుంటున్నాము అంటే వారు చేసిన త్యాగఫలితమే. భారత దేశ విభజన ఎన్నో లక్షలమందిని పొట్టన పెట్టుకుంది. మతం ఏదైనా కానీ అంతా భారత జాతే కదా? ఆ విభజనని కళ్ళారా చూసిన వారు ఇంకా కొందరు బ్రతికే ఉన్నారు. ఎంత పెద్ద Psychological trauma వారికి అన్న సంగతి మనం ఆలోచించామా ? ఆగష్టు 14ని ఆ విధంగా గుర్తించడం వారికి కొంత స్వాంతన. అందులో రాజకీయాలు ఉండవచ్చు/ఉండకపోవచ్చు. కానీ ఆనాడు బ్రిటిష్ వారు చేసిన అల్లకల్లోలం గురించి ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇంతకంటే సరియైన మార్గం ఇంకొకటి ఉన్నది అని నేను అనుకోవడం లేదు. భారత ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించాల్సిందే అంటాను కూడా .

ఇంకొక మాట కూడా. ఎవరికి తోచిన రీతిలో వారు, మన పూర్వికులు మన కోసం ఇంత భద్రంగా కాపాడి ఇచ్చి వెళ్లిన హిందూ ధర్మాన్ని రక్షిద్దాం. . అదే మనం మన పూర్వికులకి త్యాగానికి ఇచ్చే నివాళి🙏🙏

#PartitionHorrorsRemembranceDay

మన వేళ్ళ తోటే మన కళ్ళు పొడుస్తున్నారు…. తెలుసుకోండి

Christianity/Bible/Abrahamic religions గురించి పెద్దగా ఏమీ తెలీదు నాకు. దాదాపుగా ఓ ఆరు నెలల నుంచీ తెలుసుకుంటున్నాను.

1)ఆ మతం యొక్క చరిత్ర తెలుసుకోవాలన్న కుతూహలం ఒకటి.

2)ప్రపంచంలో ఎక్కువ శాతం అనుసరించే మతం ఎలా అయింది అన్న కుతూహలం ఇంకొకటి.

3) భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రాలో (Google map ఆధారంగా) చర్చిలు వెలుస్తున్నాయి, ఇంతలా వ్యాప్తి చెందుతోంది. 600 ఏళ్ళ క్రితం వచ్చిన బుడతకీచులని , ఆ తరువాత వచ్చిన ఆంగ్లేయులను అబ్బుర పరచిన వైదిక సంస్కృతిని వదిలేసి, మన భారతీయులుఆ ధర్మాన్ని ఆచరిస్తున్నారు అంటే ఏముంది అని కూడా ఒకటి.

అలా బైబిల్ చదవటం మొదలుపెట్టాను.

బైబిల్ గ్రంథం :

మొదటి భాగం అంటే First Testament లో మొదటి నాలుగు భాగాలు చదివాను( తెలుగు బైబిల్లో ఒక ఒక్కో భాగాన్ని ఓ ‘కాండ’ అని పేరు వ్రాసారు. ‘ గోత్రాలు’ అనే పదం కూడా బాగా వాడతారు. ). Numbers(సంఖ్యా కాండము) , Deuteronomy కూడా కొంచెం చదివాను. Genesis కి ‘ఆదికాండము’ అనిపెట్టారు. అందులో భూమి, పగలు రాత్రి పుట్టుకలు. మొదటి మానవులు Adam & Eve. మధ్యలో సర్పం రావటం… Noah Ark & great flood ఇది ఇదివరకూ కూడా విన్నాను. తర్వాత చదివిన రెండిటిలో (Exodus నిర్గమకాండం , Leviticus లేవీయకాండం) ఎన్నో బలి ఆచారాల గురించి, దేవుడి మహిమ గురించి, దేవుడి పెట్టిన పది నిబంధనల గురించి చెప్తారు. చదివిన వెంటనే చాలా ప్రశ్నలు వచ్చాయి. దేవుడేంటి, తన మాట వినకపోతే/తనని నమ్మకపోతే మనుష్యుల్ని నరికివేయడం/ రాళ్లతో కొట్టి చంపేయడం ఏమిటి అని చాలా ఆశ్చర్యం వేసి సమాధానం వెతికాను. తెలిసీ తెలియకుండా ఒక నిర్ధారణకు రాకూడదని ఆ విన్న/ చదివిన సమాధానాలు కూడా పక్కన పెట్టేసాను. చాలా చాలా ఆశ్చర్యం వేసినవి బానిసత్వం, ఆడవారికి పురుడు/నెలసరి వచ్చినపుడు కానీ ఎన్ని రోజులు అపవిత్రులు అవుతారో కూడా చెప్పడం. యాజకులు అనే వారు ఎవర్ని పెళ్లిచేసుకోవాలో కూడా చెబుతాయి నిబంధనలు. (ఎందుకంత ఆశ్చర్యం అంటే హిందూ స్త్రీలకే చాలా నియమనిబంధనలు అన్నట్లు మాట్లాడుతారు కదా. ఎన్నో ప్రవచనాలు విన్న నాకే అనిపించేది ఇతర మతగ్రంథాలలో ఇవన్నీ ఉండవు కాబోలు అని . అందుకే స్త్రీ వాదులంతా ఇలా మాట్లాడతారు అని) . అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే 40 ఏళ్ళు అలా అడవులు పట్టుకు తిరగడం ఏమిటి అని.

ఏసుక్రీస్తుల వారి గురించి తెలుసుకుందాం అని First Testament ఆపేసి Second Testamentలో Mathew చదివాను. ఇందులో Jesus పుట్టుక చెప్తారు కానీ ఆయన Jerusalem కి వచ్చేవరకు మధ్యలో ఏం జరిగిందో చెప్పరు. అదొక puzzle లాగా అనిపించింది. Mathewలో ఏసుక్రీస్తుల వారు చేసే ఉపదేశం పెద్దగా లేకపోగా ఆయన చేసే స్వస్థత(healing) గురించే ఎక్కువ చెప్పారు. మరి మిగతా బైబిల్ లో ఏమన్నా ఉందేమో తెలీదు. PBS లో Jesus Christ గురించి 1998 నాలుగు గంటల documentary చూసా. నేను ఆశించిన ఉపదేశం (అంటే తత్వబోధ లాంటిది అన్నమాట) చెప్పడం లాంటి విషయం అక్కడ కూడా దొరకలేదు.

భారతీయ తత్త్వం :

ఇక్కడ నేను ఏ మతాన్ని దూషించడం/ విమర్శించడం లేదు. అది గమనించమని నా మనవి. బైబిల్ చదువుతున్నంతసేపు నేను తెలియకుండానే హిందూధర్మంతో పోల్చుకుంటూ ఉన్నాను. హిందూ ధర్మంలో ప్రతీ దాంట్లో తర్కం వెతకడం, ఎందుకిలా చేయాలి అని ప్రశ్నించడం అనేది మనసుకి బాగా అలవాటయిపోయింది. పైగా ప్రవచనాలు చెప్పేవారు కూడా ‘నాకు తెలుసు మీలో ఈ ప్రశ్న వస్తోందని’ అని చెప్తూ ప్రతీదీ వివరిస్తారు. జగ్గీ వాసుదేవ్ సద్గురు గారు చెప్పినట్లు హిందూ ధర్మంలో ప్రతీదీ ప్రశ్నే. రామాయణం, మహాభారతం, భాగవతం అన్నీ ప్రశ్నలతోటే మొదలయ్యాయి. హిందూధర్మంలో ఏ భగవదస్వరూపమైనా సరే భక్తికి లొంగిపోవలసిందే. ‘నిన్ను మించిన శక్తీ ఏదీ లేదు’ అని చెప్తుంది హిందూ ధర్మం. బహుశా Abrahamic religions తప్ప ఇంకొకటి తెలియని వారికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా దేవుడేంటి, భక్తికి లొంగి పోవడం ఏమిటి అని. ఎందుకంటే బైబిల్ లో ‘దేవుడు’ అనే వాడికి మానవమాత్రుడు చాలా భయపడాలి. ఏసు క్రీస్తుల వారు జెరూసలేం లో బోధనలు మొదలు పెట్టకముందే భారతావనిలో బుద్ధుల వారు వచ్చారు & వెళ్లారు. ఆ వెంటనే ఆది శంకరుల వారు వచ్చి భరత ఖండం అంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని, ఎన్నో తార్కిక వాదనలు చేసి వేదాంతాన్ని చెప్పి పీఠాలు కూడా పెట్టేసి వెళ్ళిపోయారు. దేశంలో ఆ మూలా నుంచీ ఈ మూల వరకూ తిరుగుతుంటే భరతఖండంలో పరిపాలించే రాజులు వీరిని దండించినట్లు లేదు. అప్పటికే గురుకులాలు ఉన్నట్లు తెలుస్తోంది కదా?

ఈ smart ఫోన్లు వచ్చి మనం dumb అయ్యాం కానీ ఓ మారుమూల పల్లెటూర్లో పుట్టి , ఏ చదువు కూడా చదవకుండా బోలెడు వేదాంతం మాట్లాడేవారు. అందుకు చక్కటి ఉదాహరణ ఈమధ్య మంగ్లీ పాడిన ఓ తత్త్వం ‘నా గురుడు నన్నింకా యోగి గమ్మనెనే’ . మల్కి దాసు అనే వారు వ్రాసిన ఓ తత్త్వం. ‘అమర నారేయ ‘ అనే గాజులు అమ్ముకునే భక్తుడు కృష్ణుడి మీద తత్వాలు వ్రాస్తే అవి బాలమురళి వారు బాణీ కట్టి వెలుగులోకి తెచ్చారు. అంత అద్భుతమైన philosophy ఏ University కి వెళ్తే వస్తుంది? అంతా నరనరాలా జీర్ణించుకుపోయిన కర్మ సిద్ధాంతం కదూ?

ఎక్కడో పుట్టిన ఈ మతాలు ప్రపంచం అంతా వ్యాపించి, భారత దేశానికీ వచ్చి అన్ని దాడులు & బలవంతంగా మార్పిడులు చేసినా కూడా ఇంకా ఈ రోజుకి మిగిలి ఉంది అంటే మతం మారినా కూడా ఆలోచనాధోరణి అన్నది మారకపోవడం అతి ముఖ్య కారణం. పాపభీతి, కర్మ సిద్ధాంతం అనేవి నరనరాలా జీర్ణించుకుపోయి ఉండటం. అందుకు ఉదాహరణలు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, అబ్దుల్ కలాం, అయ్యప్ప స్వామిని తన హారతి పాటతో నిద్రపుచ్చే జేసుదాసు గారు.

ఇప్పుడు భారతదేశం :

బైబిల్ అనేది క్రైస్తవ ధర్మం గురించి చెబుతుంది. ఇష్టమయినవారు ఆ మతాన్ని స్వీకరిస్తారు లేకపోతే లేదు. ఎవరైనా హిందూ ధర్మం వదిలి క్రిస్టియన్ మత ధర్మం పుచ్చుకోవచ్చు. తప్పేమీ లేదు. అది భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మత ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉందిట కాబట్టి నేను దానిని ప్రశ్నించడం లేదు & విమర్శించడం లేదు. కానీ ఒక business model క్రింద తయారవుతోంది అని ఖచ్చితంగా చెప్పగలను. ‘నువ్వు మతం మారు . నీతో పాటు పది మందిని మార్చు ‘ అనేదే concept .

నేను గమనించింది ఏంటంటే తెలుగు వారిలో ఈ బైబిల్ బోధకులు హిందూ మతాన్ని ఎందుకూ పనికి రాని మతంలాగా చెబుతూ ద్వేషించేలా బోధిస్తున్నారు. ఏదో ఒక విధంగా విగ్రహారాధనని ఖండించడం, హిందువులని ‘అన్యులు’ అంటూ చాలా చులకన మాట్లాడటం. అసలు వీరు నిజంగా certified వారేనా అన్న అనుమానం కూడా. ఒకప్పుడు వీరు అందరూ హిందువులే. కానీ వీరి దూషణ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ‘అందరూ ఏసుక్రీస్తుని కొలవాలి ఆయనే నిజదేవుడు . కాబట్టి ఈ దేవుడినే పూజించాలి’ అని చెబుతూ , ‘భారతదేశం అంతటా దేవుని రాజ్యం విస్తరించాలి’అని బోధించడం చాలా వీడియోల్లో చూసాను. ఓ డాక్టరేట్ పాస్టర్ గారట. గొంతు చించుకుని అరుస్తున్నారు ‘మోదీ గారిని దేశం మొత్తం ఏసు ప్రభువుని నమ్ముకుంటుంది అని చెప్పమని చెప్పండి. వెంటనే కరోనా మాయం అవుతుంది. దేవుడికి కోపం వస్తే ఇలాగే జరుగుతుంది’ అని.

ఇక సాక్ష్యాలు వింటుంటే మతి పోతుంది. పైగా యువతని వినమంటారు వీళ్ళు. ఏసు ప్రభువు నీళ్ళలో కనిపించారు అంటుంది జయసుధ. ఇంకొకావిడ అలా పోతూ పోతూ చేయి ఊపారు అంటుంది. ఒక వీడియోలో ఒకావిడ సాక్ష్యం చెప్పటం మొదలు పెడుతూనే ‘ హిందువులు నిజ దేవుడిని తెలుసుకోలేని గుడ్డివారు’ అంటూ మొదలుపెట్టింది. మనకి కావలసిన విధంగా అన్నీ జరుగుతుంటేనే దేవుడా ? spirituality అంటే కష్టం వస్తే ఎలా manage చేసుకోవాలో చెప్పడం కదా ? దేవుడు అంటే మహిమలేనా ? మహిమలు చూపిస్తేనే దేవుడు దేవుడవుతాడా? మన పాపకర్మలతో పనిలేదా? పెద్ద కష్టం వస్తే తట్టుకునే వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నామే . అసలు వీళ్ళెవరు నిర్ణయించడానికి హిందువుల దేవుళ్ళు నిజమైన వారో కాదో ? అదే భారత రాజ్యాంగంలో ఇంకో మతం దూషించకూడదు అని లేదా?

ఇక ఈ బోధకులు షార్ట్ వీడియోలలో ఆడవారు ఏ బట్టలు వేసుకోవాలి , పెళ్ళిళ్ళు చేసుకునేటపుడు పసుపు, తమలపాకుల లాంటివి దేవుడి వాక్యంలో లేవు కాబట్టి వాడద్దు అని సందేశాలు పంపుతున్నారు. ‘అన్యులు’ చేసిన ఆచారాలు పాటించద్దు అని చెపుతున్నారు. అంటే వేషధారణ లాంటివి మార్చేస్తున్నారన్నమాట. consumersని attract చేయాల్సివచ్చినపుడు స్తోత్రాలు, సహస్రనామాలు చేయిస్తూ హిందూ మతం లాంటిది ఈ మతం అని చెబుతున్నట్లున్నారు. consumers commit అయ్యాక ఇక నువ్వు ఇదే product వాడాలి అన్నట్టు, ఇలా నియమనిబంధనలు ఉన్న వీడియోలు చూపిస్తున్నారా అనిపించింది. వీరందరూ ఒకప్పుడు హిందువులే. ఒకప్పుడు అంటే ఎప్పుడో కాదు. ఓ పది/ పదిహేనేళ్ళు అయి ఉంటుంది అంతే. అంటే మన వారే. కానీ ఎక్కడో ఇజ్రాయెల్ వారికి పుట్టినట్లు మాట్లాడుతారు. హిందూ మతంలో కుల వివక్ష గురించి చెప్పే వీరు బైబిల్ లో బానిసత్వం గురించి ఏ మాత్రం ప్రస్థావించరు . హిందూ మతంలో స్త్రీ వివక్ష అని చెప్పే వీరు బైబిల్ లో స్త్రీకి ఉన్న నియమ నిబంధనల గురించి ఏ మాత్రం చెప్పరు .

ఎలా ఉండే భారతీయులు ఎలా అయ్యారో చూడండి. ఇంత కంటే దారుణం ఏముంటుంది ?

నేను చెప్పిన వీడియోలు ఇవే