అమెరికా నుంచి అనకాపల్లె దాకా అంతా ఒక్క తానులో ముక్కలేనా

హిందూ ధర్మంలో అందరు దేవుళ్ళు ఒక్కటే. అందుకే ‘క్రైస్తవం తీసుకుంటే తప్పేంటి . ఏ దేవుడైతే ఏమిటి. అందరూ ఒక్కటే’ అనే ధోరణిలోనే ఉంటారు భారత దేశంలో హిందువులు. ఆ విధంగా అనుకుని క్రైస్తవంకి మారతారు. క్రైస్తవం తీసుకున్నాక హిందువుల ప్రసాదాలు తినటం మానేస్తారు. దేవుడి పటాలు పడేయటం. స్త్రీలు బొట్టు, మంగళ సూత్రాలు తీసేయడం. ఎలా మొదలవుతుంది అంటే → ఒక నిజ దేవుడిని పూజించడం అనే ఒక నమ్మకం అనే సూత్రంతో మొదలయి సంస్కృతి లోని కట్టు, బొట్టు మార్చేదాకా వెళ్తుంది. ఆ తరువాత కట్టు, బొట్టు మార్చాక అంతకుముందు తమ పూర్వికులు పూజించిన దేవుళ్ళు ఒక రాక్షస దేవుళ్ళలాగా కనిపిస్తారు వీళ్ళకి. సొంత వారు ఇక శత్రువులుగా తయారవడం మొదలవుతుంది. ‘నీ దేవుడు నిజ దేవుడు కాదు. నా దేవుడే నిజ దేవుడు ‘ అని వాదన. ‘అయ్యా కుటుంబాలలో గొడవలు మొదలయ్యాయి. మీరు ప్రచారం ఆపండి’ అంటే క్రైస్తవులు ‘మమ్మల్ని దేవుడు ప్రచారం చేయమని చెప్పాడు. మాకు రాజ్యాంగ హక్కుంది’ అంటారు. చివరకి జరిగేది ఏంటి ? ఇలా కుటుంబాల్లోననే గొడవలు ఉంటే దేశంలో Integrity అనేది తప్పకుండా దెబ్బతింటుంది. ఇది తాను ముక్కలో ఓ భాగం.

Leftists/ liberals/ Intellectuals భారత దేశంలో వేరే మతాన్ని దూషించకుండా హిందూ మతాన్నే దూషిస్తున్నారు అని మాములు వాళ్ళకి కూడా అర్ధమయింది. వీళ్ళు ఏమంటారో చూద్దాం. రాముడిని పూజించేవారు ఆర్యులు. ఎక్కడినుంచో వచ్చారు. రాముడు ఆర్యుడు. ఆదివాసీ ద్రవిడుడు అయిన రావణాసురుడిని చంపాడు. ఈ ఆర్యులు దళితులపై చాలా కుల వివక్ష చూపారు. దళితులుదే ఈ భారత భూమి. కాబట్టి ఈ ఆర్యుల్ని వెళ్ళగొట్టాలి. రాముడు భార్యని వెళ్ళగొట్టాడు, అగ్ని ప్రవేశం చేయించాడు. కృష్ణుడు 16 వేలమందిని పెళ్ళాడాడు . అంటే ఆర్యులకు స్త్రీ వివక్ష చాలా ఉంది. ‘ వీరికున్నంత క్రూరత్వం ప్రపంచంలో ఎవరికీ లేదు చూసారా?’ అని చెప్తారు. కుల వివక్ష , స్త్రీ వివక్ష గురించి మాట్లాడే ‘లిబరల్’ గా మాట్లాడే వీరు బైబిల్ లో ఉన్న బానిసత్వం గురించి , స్త్రీకి ఎంత స్వేచ్ఛ ఇచ్చారో ఏ మాత్రం చెప్పరు . మాట్లాడరు. ఇది తాను ముక్కలో ఇంకొక భాగం.

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ హిందువులు ప్రశ్నించడం మొదలు పెట్టేసరికి ఈ వ్యవహారం అంతా ఇంకో మలుపు తీసుకుంటోంది. ఏమిటి అంటే RSS అనే సంస్థ ఉగ్రవాదం . హిందువులు వేరు. హిందుత్వ వేరు. ఇది కూడా కొంచం పాత పాటే అనుకున్నా, ఈ పాట పల్లవి ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లతో సమానం అంటూ ట్విట్టర్ లో ఎక్కువయింది. చరణం అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో DISMANTLING GLOBAL HINDUTVA అంటూ మొదలయింది. ఈ లోపల Audrey Truschke గారికి ‘Indus Valley civilization’ మీద చరిత్ర వ్రాయమని ఆవిడకి ఫండింగ్ వచ్చింది. అదొక రాగం పెట్టారు పాటలో. దీనిని బట్టి ఇంకో చరణం కూడా వచ్చేసింది. నిన్న రక్షణ టీవీ లో కూడా తాలిబన్ పల్లవి పాడి కొత్త చరణం పాడాడు ఒకాయన. ఏంటంటే ఆది శంకరాచార్యుడు AD 788 లో హిందూ మతం తెచ్చారట, అప్పటికే భారత్ లో క్రైస్తవం, ఇస్లాము ఉన్నాయట. శంకరాచార్యుల వారు వాదనలు చేసి బౌద్ధులందరినీ చంపేశారుట . ‘Indus Valley civilization’ మీద ఆయన ఎవరితో అయినా వాదించ గలరట . ఇప్పుడు తానులో ముక్కలు కలపండి. ఇంకా ఈ పాట చరణాలు ఎన్ని ఉన్నాయో ఏంటో ?

ఎవరి ధర్మం వారు పాటించుకుంటే ఏ దిగులు లేదు. ఇలా హిందువులని & వారి ఆచారాల్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక విధాలుగా విమర్శిస్తూ ఉంటే ప్రశ్నించకుండా ఎలా ఉంటాం?అసలు తమ మానాన తాము బ్రతికే హిందువులు ప్రపంచంలో ఎవరిని బాధ పెట్టారు? ప్రపంచంలో ఏ మతంలో కూడా విభజన లేనట్లు హిందూ మతం లో కులాలు ఉన్నాయి అంటూ అదొక పెద్ద బూచిగా చూపిస్తూ దాని ఉనికినే లేకుండా చేద్దామని వీరు చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఒక హిందూ ధర్మం అంటేనే ఉగ్రవాదం అంటే ఏమి చేయాలి ?

ఇది చదవండి. ఆడ్రీ గారి మావగారు విశాఖపట్నం లో ఏం చేస్తున్నారో చూడండి .

Audrey Truschke’s pastor father-in-law caught violating Indian visa laws

లిబరల్స్ అంటారో ప్రొఫెసర్లు అంటారో వీళ్ళని. వీళ్ళ రాముడిని , హిందూ గ్రంథాలని, పండగలని ఎలా మాట్లాడుతారో చూడండి

6 thoughts on “అమెరికా నుంచి అనకాపల్లె దాకా అంతా ఒక్క తానులో ముక్కలేనా”

 1. సనాతనధర్మాన్ని అవలంబించే‌ ఈదేశంలో పరిస్థితి ఇలా దిగజారటానికి ఇతరులను నిందించి ప్రయోజనం లేదు. ఆత్మగౌరవహీనులను అందరూ గేలిచేస్తారు. ఒకప్పుడు గజనీమహమ్మదు ఎన్నోదండయాత్రలలో చిత్తుగా ఓడి వెనక్కు వచ్చినా చివరకు విజయం ఎలా సాధించాడు? దుష్టుల్ని క్షమించే మన అమాయకత్వం కాదా దానికి అసలు కారణం? ఇతరమతాలను దూషించమని సనాతనధర్మం చెప్పటంలేదు – కాని దూషణలను తిరస్కరించి నిజానిజాలని వెల్లడించి బుధ్ధి చెప్పవద్దని కూడా చెప్పటం లేదు. మరి మనం నిష్క్రియాపరులుగా ఎందుకున్నాం‌ అంటే ఆత్మగౌరవం అన్నది ఒకటుంటుందన్న మాట కూదా మనం మరచిపోవటం వలన. ఇప్పుడు తక్షణకర్తవ్యం ఆ అత్మగౌరవప్రబోధమే. కార్యాచరణ రెండు భాగాలుగా ఉంది. మొదటిది. సనాతనధర్మాన్ని అందరకూ తేలిగ్గా బోధపరచి దుర్మార్గపుప్రవారాల నుండి రక్షించే సాహిత్యమూ ప్రచారమూ చేపట్టటమే. విమతీయులు లక్షల నిందావాక్యాలు బహిరంగంగా అవమానకరంగా ప్రేలుతుంటే నోరెత్తని చట్టవ్యవస్థ ఒక్క మాట సనాతన ధర్మావలంబకుడు విమతఖండనంగా అంటే మాత్రం విరుచుకు పడుతుంది – దీనికి కారణం కూడా మన ఆత్మగౌరవలోపమే – ఏమి అందరూ ఒక్కటిగా ఉంటే అంతటి దుస్థితి ఎందుకుంటుంది? కార్యాచరణలో రెండవభాగం ఆధునికమైన ఈ కుహనా కువవివక్షను రూపుమాపటమే. ప్రత్యామ్నాయాలు వెదక్కండి. ఐకమత్యమూ – అత్మగౌరవమూ కలిగి ఉండండి అని చెప్పటం సులువే. కాని ఆచరణలో ఎవ్వరూ కలిసి వచ్చేలా లేరు. ప్రవచనాలకు పొలోమని వెళ్ళి ఏదో పుణ్యం మూటకట్టుకోవాలని దురాశతప్ప అదేదో ఒక మంచి కాలక్షేపం అన్న ఆలోచన తప్ప -నిజంగా మనవాళ్ళకు చిత్తశుధ్ధి లేదన్నది పచ్చినిజం. జనాన్ని పోగేసే‌ ప్రవచన కారులు కూడా ఈవిషయం ఏదో రాజకీయం అన్నట్లుగా దూరం పెట్టి కాలక్షేపంగా అథ్యాత్మికబోధనలు చేస్తూ పరవశిస్తూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి- సనాతనధర్మం స్వదేశంలోనే త్వరలో మైనారిటీ స్థాయికి పడిపోతే ఏమీ ఆశ్చర్యం లేదు. కూర్చున్నకొమ్మను నరుక్కున్న మన బుధ్ధితక్కువ మాత్రమే కారణం అవుతుంది.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. ఎంతో మంచి విలువైన పోస్ట్ రాశారు. ఎన్నో తెలియబి విషయాలు తెలుసుకున్నాను.

  మీరు ప్రస్తావించిన ఆ హిస్టరీ టీచర్ ఒక సాధారణ అకాడెమీషియన్ – గుంపులో గోవిందమ్మ. కానీ కెరీర్ నిచ్చెన మెట్లు ఎక్కడానికి సనాతన ధర్మాన్ని గురించి చెత్త రాయడమే బెస్ట్ షార్ట్ కట్ అని అతి తొందరగా గ్రహించింది ఆవిడ. ఇక పేరుకు పేరు, డబ్బులే డబ్బులు (గ్రాంట్స్).

  మన భారతీయులు, ముఖ్యంగా హిందువులు మొద్దునిద్రలో ఉన్నారు. చాలామందికి మన ధర్మం, సంస్కృతులమీద జరుగుతున్న కుట్రలపై కనీస అవగాహన కూడా లేదు. రాజీవ్ మల్హోత్రా గారిలాంటి ఒకరిద్దరు మహనీయులు సర్వశక్తులు ఒడ్డి ఈ కుట్రలపై పోరాడుతున్నారు.

  మన ధర్మాన్ని తాలిబన్లతో పోల్చే ప్రయత్నం దుర్మార్గానికి పరాకాష్ఠ. ఈ కాన్ఫరెన్స్ చూడండి 9/11 న పెట్టారు. ఆఫ్ఘన్ తాలిబాన్ల చేతిక్రిందకు వచ్చి మొత్తం ప్రపంచం మతం పేరుతొ వాళ్ళు చేస్తున్న దురాగతాలను గమనిస్తున్నారు. ఆ ఫోకస్ ను మరల్చేందుకే ఈ సమావేశాలు.

  మెచ్చుకున్నవారు 2 జనాలు

 3. “ఇక్కడ మెజారిటీ హిందువులు కాబట్టి హేతువాదులం హిందూ మతాన్ని గురించే మాట్లాడతాం.”

  కాలేజీ రోజుల్లో నేను హేతువాదులతోనే తిరిగాను, చాలా ఏళ్ళు హేతువాదిగానే ఉన్నాను. మీరు చెప్తున్న (పైని) మాటలు ఆ రోజులనించి వింటూనే వస్తున్నాను. నాకు ఈ మాటల్లో ఎంతమాత్రం హేతువు కనపడదు, పలాయన వాదమే కనిపిస్తుంది.

  మైనారిటీస్ అయినా కూడా సంఖ్యాపరంగా గణనీయంగా ఉన్నారు, హేతువుకు కట్టుబడేవాళ్లు వీళ్ళ సమాజాలలోని లోపాలని, అహేతుకాలని కూడా ప్రశ్నించగలగాలి. ఎంతకూ కేవలం హిందువులనే విమర్శించడం వలన, హిందూమతం ఒక్కటే లోపలపుట్ట అనే అపోహలు (కొందరిలోనైనా) హేతువాదులు కలిగిస్తున్నారు. ఇది మతమార్పిడులకు ఒక ఉత్ప్రేరకంగా మారుతోంది.

  హిందూమతం ప్రమాదంలో పడితే హేతువాదుల ఉనికికే ముప్పు వస్తుంది. మన ప్రక్కనున్న పాక్, బాంగ్లాదేశ్ లలో హేతువాదుల గతి ఎలా ఉందొ గమనించండి.

  మెచ్చుకోండి

 4. మీరు ఈ వ్యాసం వ్రాసిన విషయాలు అక్షర సత్యాలు. Very good article.

  హిందూ ధర్మం పై ముప్పేట దాడి జరుగుతున్నది. The two proselytising abrahamic faiths and the third one is the Marxist LE-LIs -urban naxals. Add to this the dhimmitude of sickular Hindus.

  It is also inexplicable why RSS and BJP choose to be mute spectators when the poster and agenda of the DGH event is to dismantle Hindutva and RSS.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: