ఆ పేర్లు చదువుతూనే……………………………………………………………..ఉన్నారు పొద్దున్నుంచీ. 🙏🙏🙏.
సెప్టెంబర్ 11, 2001 అమెరికా చరిత్ర మర్చిపోలేని రోజు. గడిచి 20 ఏళ్లయినా ఆ రోజు పొద్దుటే వార్తలు చూసిన నా లాంటి వారికి నిన్న జరిగినట్లే అనిపిస్తుంది.
మా అమ్మాయిలు బళ్ళో వ్యాసం కోసం రెండు మూడు సార్లు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసారు ఆ రోజు జ్ఞాపకాలని తమతో పంచుకొమ్మని. అదే క్లుప్తంగా కొన్ని మాటల్లో. ..
మా వారు ఉద్యోగ రీత్యా ఇంకో ఊర్లో ఉండేవారు. ఒక్కోసారి తను 3 వారాలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చేది. సరే నేను కూడా ఇక్కడే ఉండి ఏం చేయాలి అని తనతో వెళ్తూ ఉండేదాన్ని. ఎప్పుడూ drive చేసేవాళ్ళము. ఆ వారం విమానంలో వెళదాం అని ఆదివారం నాడు బయలుదేరి విమానంలో వెళ్ళాము. ఓ హోటల్లో చిన్న స్టూడియో room లో ఉండేవారం. మంగళవారం సెప్టెంబర్ 11, 2001. ఎప్పటిలాగే తను ఆఫీస్ కి వెళ్ళి పోయారు. వెళ్లిన కాసేపటికే తనే ఫోన్ చేసి చెప్పారు ‘ వార్తలు చూడు ఏదో flight accident అంటున్నారు ‘ అని. టీవీ పెట్టిన వెంటనే అసలు ఒక దాని వెంట వార్తలు. ఇక్కడో విమానం, అక్కడో విమానం అంటూ. చూస్తుండగానే రెండు భవనాలు కుప్పకూలిపోయాయి. వణుకు పుట్టింది. ఏమవుతోంది అమెరికాలో ? నెమ్మదిగా అర్ధమయ్యింది ఏంటంటే ఒక విమానం Pentagon ని కూడా కొట్టింది అని. వర్జీనియా స్నేహితులకి ఫోన్లు చేసి క్షేమసమాచారాలు అడిగాను.
మా వారు నేను వార్తలు చూసి బెంబేలెత్తి పోయాను అని పొద్దున్నించీ రూములోనే ఉన్నాను అని కాస్త బయటికి వెళితే బావుంటుందని పక్కనే ఉండే grocery దాకా వెళ్ళాము. అన్నీ నిర్మానుష్యం. అటువంటి భీకర వాతావరణం అమెరికాలో ఎప్పుడూ, ఎప్పుడూ చూడలేదు నేను . .
ఆ తరువాత , మేము రెండు రోజుల క్రితం వచ్చిన విమానాశ్రయం నుండే fight 77 వెళ్ళింది అని తెలిసినపుడు చాలా భయం వేసింది. విమానం పడిపోతున్నట్లు, దూసుకొస్తున్నట్లు పీడకలలు కొన్ని నెలల వరకూ వెంబడించాయి నన్ను. పైగా నేను గర్భిణీని కూడా . కొన్ని సార్లు కొన్ని flight నంబర్లు చూసి భయం వేసేది. ఈ రోజుల్లో లాగా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి ఆ anxiety పంచుకోవడానికి వసతి కూడా ఉండేది కాదు. చేస్తే వందల డాలర్ల బిల్లు మరి.
ఈ రోజుకి ఆ airport వెళ్ళినపుడు తలచుకుంటే భయము & బాధ రెండూ కలుగుతాయి. ఆ ఉగ్రవాదులు మా చుట్టుపక్కలే మాములు మనుష్యులుగా తిరిగారు అంటే మన చుట్టూ ఎటువంటి మనుష్యులు ఉన్నారో కదా అని బాధేస్తుంది కూడా. fight 77లో మూడేళ్ళ చిన్నారి కూడా ఉంది. ఏ పాపం చేసిందని ఆ చిన్న జీవితాన్ని బలి చేసారు అనిపిస్తుంది.
చరిత్రలో ఆ రోజుని ఎప్పటికీ మరచిపోదు అమెరికా.
ఆ రోజున ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు, అందరి ప్రాణాలు కాపాడుతూ తమ ప్రాణాలనే అర్పించిన అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీస్ అమరవీరులకి నా శ్రద్ధాంజలి🙏🙏🙏.
Photo Source: Washington Post live today

అదొక ఉన్నాదపు చర్య.
ఆ మరణించిన అమరులకు (ఆ విమానాల్ని నడిపిన ఆ ఉగ్రవాదులను మినహాయించి) 🙏🙏
https://www.snopes.com/fact-check/tear-drop-monument/
మెచ్చుకోండిమెచ్చుకున్నవారు 1 వ్యక్తి