ముఖపుస్తకం లో వ్రాసిన పోస్టులలో బ్లాగులో వ్రాసి భద్రపరచడం మర్చిపోయిన పోస్టు ఇది .
09/15/2021
‘మాటిమాటికి ఈ వామపక్ష ప్రొఫెస్సర్ల గురించి చెప్తారు. వాళ్ళకి ఎందుకు అంత attention ఇస్తున్నారు. వదిలేయండి. Just ignore them’ ఇది చాలా మంది చెప్తున్న మాట. ‘వదిలేయలేం’ అనేది నా మాట .
భారతదేశంలో పిల్లలు కాలేజీకి వచ్చాక, ‘నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు’ అంటూ Arts & Humanities అంటూ పెద్దగా ప్రోత్సహించము . వాటిల్లో చేర్చము. ఇప్పుడు ఇంజనీరింగ్/మెడిసిన్ కి మొత్తము Intermediate GPA చూస్తున్నారేమో కానీ మేము చదివినపుడు కేవలం ఎంసెట్ rank మాత్రమే చూసేవారు. చదివే ఆ నాలుగు ముక్కల భాష కూడా పక్కన పడేసేవాళ్ళం. ఇది ఒక విధంగా నష్టం అనే చెప్పాలి. భాష మీద పట్టు ఉండదు. social studies ఉండదు కాబట్టి చరిత్ర , civics లాంటివి తెలీదు విద్యార్థులకి. ఇక ఇంజనీరింగ్ లాంటివి చదివితే ఎక్కడా ఇటువంటివి ఉండవు. వామపక్ష ధోరణి అనేది ఉంటుంది అన్న పరిజ్ఞానం కూడా ఉండదు.
కానీ అమెరికాలో అలా కాదు. హైస్కూల్ లో భాష కనీసం మూడేళ్ళు చదవాలి. సోషల్ స్టడీస్ 4 ఏళ్ళు , ఇంగ్లీష్ 4 ఏళ్ళు తప్పనిసరిగా చదవాలి. అప్పుడే హై స్కూల్ డిప్లొమా ఇస్తారు. మంచి కాలేజీల్లో చదవాలి అంటే AP courses కూడా తీసుకోవాలి. ఈ సోషల్ స్టడీస్ లో World History , US Gov , US History ఉంటాయి. World History లో Religions లో అన్నీ మతాల గురించి చెప్తారు. హిందూ మతం, ఇస్లాం, బౌద్ధం తక్కువ చెప్తారు అంటారు ఈ పిల్లలు. ఈ తక్కువలో హిందూ మతం & భారత దేశం అంటే Aryan invasion , సతీ సహగమనము , కులం . కులవివక్ష . మొగలుల పరిపాలన వంటివి ఉంటాయి. వచ్చిన టీచర్ ని బట్టి ఆ interpretation ఉంటుంది.
ఇంక కాలేజీలో వీళ్ళు ఏ మెడిసిన్/సైన్స్/ఇంజనీరింగ్ చదివినా General Education అని తప్పనిసరి courses ఉంటాయి. అప్పుడు కొంత మంది పిల్లలు South Asian studies ఉన్నాయి కదా అని వాటిల్లో courses చేస్తారు. అప్పుడు తప్పనిసరిగా ఈ Audrey Truschke లాంటి వారు ఉంటారు. చాలా మటుకు ఈ South Asian studies అన్నీ వామపక్షపు ధోరణే. హిందుత్వ అంటూ హిందువులని తిట్టిపోయడం. ఇస్లాం వారిని గొప్పగా చెప్పడం/లేదా జాలిగా చూపించడం.
‘Hindutva harassment field manual ‘ అనేది తయారు చేసి ఆవిడ university website లో పెట్టింది Audrey Truschke గారు. అందులో అసలు హిందూఫోబియా అనేది కూడా ఒక హిందుత్వవాదులు చేసే ఆరోపణ అని ఉంది. ఈవిడ భగవద్గీత ని విమర్శించింది. శ్రీరాముడిని ‘ misogynist pig’ అన్నది. ‘అసలు ఇంత మంది దేవుళ్ళని పూజించేవాళ్ళని అసలు ఎలా నమ్ముతాం ‘ అన్నది. నాకు అర్ధమయినంతవరకూ ఈవిడ ఒక ఉదాహరణ మాత్రమే .
పిల్లలు పుట్టినప్పటినుండీ వీరి కాలేజీ చదువులకి నోరు కట్టుకుని డబ్బు దాచుతాము. లేదా పిల్లలు స్కాలర్షిప్ తెచ్చుకునేలా చదువుకోమని ప్రోత్సహిస్తాము. ఇది ప్రతీ భారతీయుడు చేసే పనే. ఇన్ని ఆశలు పెట్టుకుని పంపుతుంటే, విషాన్ని చిందించే గురువులు ఉంటే తరగతిలో ఉన్న విద్యార్థికి ఎలా ఉంటుంది ? అసలు ఇటువంటివి అమెరికాలో కాలేజీలో చెప్తారు అని భారతదేశం నుంచీ వచ్చిన ఆ తల్లితండ్రులకి ఏమాత్రం clue కూడా ఉండదు.
ఈ ప్రొఫెసర్లు రాజకీయ నాయకులూ కాదు ఓటు వేసి పక్కకి తప్పుకోమని చెప్పడానికి . సభలు పెట్టి ఈ మాటలు చెప్తే వాళ్ళని సోషల్ మీడియాలో నుంచీ వెళ్లగొట్టచ్చు. ఈ ప్రొఫెసర్ లు సోషల్ మీడియాలోనే ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఆ యూనివర్సిటీలోనే తిష్ట వేసుకుని కూర్చుని నాలుగు గోడల మధ్యా ఏమి మాట్లాడుతున్నారో ఎవరికీ తెలుసు ? వీరిని ఒక తరం నమ్మకుండా వదిలేస్తుందేమో. ఇంకో తరం నమ్ముతుంది. వారి పూర్వికులని చీదరించుకోవడం మొదలు పెడుతుంది. సంస్కృతి అక్కడితో ఆగిపోతుంది. కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వారందరూ హిందువుల మీద వేసిన ముద్రలకి ఆమోదముద్ర వేసాయి ఈ విశ్వవిద్యాలయాలు. వదిలేయాలా ఇప్పుడు చెప్పండి?