అసలేం జరిగిందంటే …. 

నాకు చిన్నప్పటి నుంచీ పుస్తకాలు చదవడం అనే అలవాటు  కొంచెం ఉంది. చందమామలు, పత్రికలు,  యద్దనపూడి/మల్లాది గారి నవలలు.  బాలానందం లాంటి కార్యక్రమాలు. దానికి తోడు ఇంట్లో వాతావరణం కూడా.  మా తాత గారు నా ఊహ తెలిసేసరికి లేరు. కానీ  ఆయన  ఇంట్లో  ఓ చిన్న లైబ్రరీ maintain  చేసేవారు.  ఆ అలవాటు మా తాత  గారి చిన్న చెల్లెలు ( మా నాన్న మేనత్త) , మా  నానమ్మకి ,   మా నాన్నకి వచ్చింది.  వీళ్లంత కాకపోయినా కాస్తో కూస్తో పుస్తకం చదవాలి అన్న ఆలోచన ఎప్పుడూ ఉండేది. ఎండాకాలం సెలవల్లో అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తే అక్కడా చందమామ, కొన్ని వార పత్రికలూ ఉండేవి. 

 అమెరికా వచ్చేటపుడు  బరువు అని  ఒక్క పుస్తకం తెచ్చుకోలేదు. కొత్తల్లో  పెద్దగా realize  కాలేదు. తరువాత ఏదో  miss  అవుతున్నాను అనిపించి, అనుకోకుండా ‘ఈమాట’ పుస్తకం కనిపించింది.  అన్నీ గబగబా చదివేసాను. అప్పట్లో ఇలా అమెరికాలో తెలుగు రచయితలు ఉంటారని కూడా  తెలీదు.  తరువాత సుజన రంజని,  అదే  కౌముది అయ్యింది. క్రమం తప్పకుండా చదివేదాన్ని. ఇప్పటికీ  చదువుతాను. అలా ఈ ప్రయాణంలో 2015లో  కనిపించిన పత్రిక ‘సారంగ ‘ . 

India’s Daughter డాక్యుమెంటరీ మీద ఓ వ్యాసం చదవడంతో మొదలయింది ‘సారంగ ‘ తో పరిచయం.  అమెరికా  రచయితలే  ఉన్నా, ఎక్కడో తేడా అనిపించింది. కలాం గారు పోయిన మరునాడే ‘ఛస్తున్నాం ఈయన చెప్పిన  కలలు కనలేక’ అంటూ ఆయన మీద బోలెడు విమర్శలు, విమర్శలతో కూడుకున్న కవిత్వాలు. మనుష్యులా లేక వీళ్ళు రాక్షసులా అనిపించింది. 

తరువాత  దాద్రి లో  lynching incident  అయింది. చాలా బాధాకరం.  నేనూ అది ఖండిస్తాను.  దాన్ని glorify  చేస్తూ international  media  మాట్లాడటం, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు మాట్లాడటం  ఒక వంతు అయితే,  ఆ lynching incident  మీద కవిత్వాలు, కథలు వ్రాసారు ఈ పత్రికలో. అప్పుడే చందు తులసి అనే రచయిత గోమాంసం గురించి కథ వ్రాసారు.  ఆ కథ పేరు గుర్తులేదు.  మొట్టమొదటి సారి  ఒక public  platform  లో చాలా వాదన చేసాను. అప్పుడర్ధమయ్యింది  నాకు ఇలా వామపక్ష వాదులు ఉంటారు. వారి ఆలోచనాధోరణి ఇలా ఉంటుంది అని.  

 బ్రాహ్మణులను తిడుతూ కథలు, బ్రాహ్మణ రచయితలను విమర్శిస్తూ వ్యాసాలు చాలా వచ్చేవి.  ఎడిటర్లు వ్యాఖ్యలతో సంబంధం లేదు అంటూనే కొన్ని moderate  చేసేవారు. కొన్ని సగం పబ్లిష్ చేసేవారు. 

ఈ వ్యాఖ్యలన్నీ తెలుగు బ్లాగు అగ్గ్రిగేటర్ లో వచ్చేవి. ఆ సంగతి కూడా నాకు తెలీదు.  ఇవన్నీ నాతో పని చేసే కిషోర్  కి చెప్తే , ఈ లోకాన్ని విడిచి ఎక్కడున్నాడో కానీ ఓ సలహా పడేసాడు. ‘ నువ్వే feed  create  చేస్తున్నావు. వాళ్ళకి పాపులారిటీ  కావాలి.  అందుకే నీలాంటి వాళ్ళని పట్టుకోవడమే కావాలి వారికి. నీ వాదన వినిపించాలి అంటే నువ్వే బ్లాగు మొదలుపెట్టు. ’ అన్నాడు. 

అది అర్ధమయ్యి ‘నిజమే ఈ గోలంతా ఎందుకు, నా పాటికి  నేను బ్లాగు వ్రాసుకుందాం’ అని ఆ పత్రికలో వ్యాఖ్యానించడం మానేసాను. అలా బ్లాగుకి శ్రీకారం చుట్టడం అయింది. 

కథలు, నవలలు చదవటం  ఎప్పుడూ ఇష్టమే. ఊర్లో ఉన్న బుక్ క్లబ్ లో చేరాను.  అందులో కొందరు వామపక్షం. ఎక్కువ  వామపక్ష సాహిత్యం suggest  చేసేవారు. వామపక్ష సాహిత్యం  ఎలా ఉంటుంది అంటే హిందూ ధర్మం/ బ్రాహ్మణులు అంటే మూఢ ఆచారాలు,  కుల వివక్ష, అస్పృశ్యత , స్త్రీల పట్ల  గౌరవం లేకపోవడం, రాముడు ఆర్యుడు. .. ‘విముక్త కథలు’ , ‘రామాయణ విషవృక్షం’  ఇందులో ఉదాహరణలు. ఈ సాహిత్యం  చదువుతున్నపుడు  notice చేసింది ఏంటంటే ఎంతసేపూ ఈ వాదన exclusion కే కానీ inclusion కి కాదు. సరే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నాణానికి ఇంకో వైపు చూడాలి అన్న ఆలోచనలో ఉండేదాన్ని..   అభిప్రాయాలు  వేరు అయినా అందరమూ చదివేది  ఒకటే కదా అని చాలా రోజులు సమయం కుదిరినా కుదరకపోయినా వెళ్లేదాన్ని. ఈ కరోనా వచ్చాక  commute  కూడా కలిసి రావడం తో online  లోనే చక్కగా నడిచేవి. 

క్లబ్ లో  గొల్లపూడి వారి ‘సాయంకాలమైంది’ నవల మీద చర్చ చేసాం.  అది అంతటితో ఆగకుండా   గొల్లపూడి వారిని  తిట్టడం పనిగా  ఇంకో group  వారు FBలో  చర్చ చేసారు. ఆ పుస్తకం suggest  చేసింది నేనే.  అంతటి మహా రచయితని  అనవసరంగా అవతలి వారికి  గుర్తు చేసి మహాపరాధం చేసానా అని చాలా బాధ వేసింది. 

 తరువాత  సారంగలోని A matter of little difference కథ మీద  FB లో  బోలెడు వాదనలు వచ్చాయి.  ఆ వాదనలలో  బ్రాహ్మణులు విలన్లు  అన్న ధోరణిలో మాట్లాడటం జరిగింది. 

ఇన్ని రకాల పుస్తకాలు చదివి ఎన్నో అన్యాయాలు  ఖండించే నాతోటి  బుక్ క్లబ్ వారు, సారంగలోని A matter of little difference కథ గురించి  ‘జంధ్యా మూర్ఖులు’ అన్న ఒక ప్రఖ్యాత రచయిత మాటని కనీసం ఖండించను  కూడా లేదు. నాలాగా  నాణానికి ఇంకో వైపు  అన్న ప్రసక్తి  వీరికి లేదు అనిపించింది. అవతల వైపు నుండీ ఏ వాదన ఉండదు. .  దానితో క్లబ్ లో ఉండాలా వద్దా అన్న ఆలోచన మొదలయింది. 

ఇలాంటి తర్జన భర్జనలో Esther  గారి బైబిల్ చరిత్ర  చెబుతున్న వీడియో ఒకటి  కనిపించింది. బైబిల్  చదవటం మొదలు పెట్టాను.(దాని గురించిన పాత టపా చూడవచ్చు) అంతే కాదు హైదరాబాద్ బుక్ క్లబ్ వారు కళావంతుల గురించి నిర్వహించిన కార్యక్రమం విన్నాను.  యశోదా ఠాకూర్ గారి ఆరుగంటల podcast  విన్నాను.  

ఇవన్నీ చూసాక  ఈ వామపక్ష ధోరణి కేవలం  హిందూ మతానికే  వర్తిస్తుంది అని స్పష్టంగా అర్ధమయ్యింది. కొంత మంది స్వార్థపరులు ఉన్నాయా , కొంతమంది నిజంగా పూర్తిగా  నమ్ముతారు.   విషయం అర్ధమయ్యాక అటువంటి పుస్తకాలూ, కథలు  చదవలేదు/ చదవలేను.  

క్లబ్ కి  good  bye  చెప్పేసాను.

అతి సామాన్యమైన ఓ గృహిణిని నేను.  ఈ అసలు విషయం తెలుసుకోవడానికి నాకు దాదాపు ఆరేళ్ళు పట్టింది. అంటే తెల్సుకోవాలనుకునేవారు నాకంటే ఇంకా తొందరగా తెలుసుకుంటారు. 

సత్యం అనేది ఒకటే ఉంటుంది. అది తెలుసుకోవాలంటే బోలెడు దారులు. ఆ వెళ్తున్న దారినే సత్యం అనుకుంటే …  

బంగ్లాదేశ్లో ఇంత దారుణంగా  దాడులు జరుగుతుంటే ముందు గుర్తొచ్చిన వారు ఈ వామపక్ష వాదులు. మాములుగా కాలక్షేపానికి  యద్దనపూడి నవలలు చదువుకునే  నన్ను  ఇలా మార్చిన  వామపక్ష వాదులకి సదా రుణపడి ఉన్నాను అని చెప్పడానికే ఈ టపా.  

6 thoughts on “అసలేం జరిగిందంటే …. ”

  1. మీ ఆవేదన అర్ధమయింది. ఈదేశంలో వామపక్షవాదులు మేధావులుగా చెలామణీ అవుతున్నారు. వారి ఎజండా ఆర్షధర్మాన్ని నాశనం చేయటమే. వారు అందుకోసం అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలుకోరు. అలాగే ఇతర మతాలజోలికి పోరు – వాటిలోనూ సహజంగా ఏవైనా లోపాలూ కాలానుగుణంకాని అచారాలూ భావాలూ ఉన్నా అవి తమదృష్టికి వచ్చినా – ఎన్నడూ కించిద్విమర్శనూ చేయరు. ఈ దేశాన్ని ఆర్షధర్మం నుండి తప్పిస్తే వామపక్షతూపాకీ ప్రజావిప్లవరాజ్యం వస్తుందని వారి పేరాస.

    వారిసాంగత్యం వదిలి సుఖంగా ఉన్నారు కదా. అది చాలు

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. నేనూ కూడా సారంగలో (పునః ప్రారంభిచక ముందు) ఈ విపరీత ధోరణి, విషపు రాతలతో విసిగిపోయి ఇలాటి చెత్త రాతలు ఆపాలని కామెంట్ పెట్టినవాడినే.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: