నా కర్తవ్యం 

శనివారం,  అక్టోబర్ 23 న ఇస్కాన్ వారు బంగ్లాదేశ్  లో దేవాలయాలపై జరిగిన  దాడులకు నిరసన వ్యక్తం చేయడానికి  ప్రపంచవ్యాప్తంగా కీర్తనలతో కూడిన నిరసనకు పిలుపునిచ్చారు.

నాకు ఈ నిరసన గురించిన message  వాట్సాప్ లో వచ్చింది. facebook  లోనూ వచ్చింది.  కాబట్టి చాలా మందికి తెలుసు అనే అనుకున్నాను. ఆ నిరసనలో చాలా మంది నాకంటే ముందరే వచ్చేసి ఉంటారు అనుకుంటూ DC వెళ్ళాను.  ఎందుకంటే DC Metro  లో ఏ celebration  అన్నా protest  అన్నా తప్పకుండా వెళ్తారు  చాలా మంది.  అంతకు ముందు BLM protests, Women’s march కి కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు.  నేనెప్పుడూ దేనికీ  పెద్దగా వెళ్ళను. అది  celebration  కావచ్చు. protest  కావచ్చు. 

ఒకరిద్దరు స్నేహితులని అడిగాను.  పనుల వత్తిడి రాలేము అని చెప్పారు. నేను  మాత్రం చాలా పట్టుదల గా వెళ్లి పాల్గొనాలని  నిశ్చయించుకున్నాను.   ఎందుకో  కారణాలు చెప్తాను. 

ఇస్కాన్ వారి కమ్మటి భోజనం తిన్నాను. Steve  Jobs  అంతటి వారు ఇస్కాన్ వారు పెట్టిన ప్రసాదాన్ని మర్చిపోలేదు.  ఇక ఇస్కాన్ వారి సంస్థ అక్షయపాత్ర రోజూ వేలమందికి వేడి వేడి గా వడ్డిస్తూ అన్నం పెడుతోంది. నేను కూడా ఆ సంస్థకి  కొద్దో గొప్పో విరాళం కూడా ఇచ్చాను.  ‘నువ్వు ఎవరు ? ఏమిటి? ఎక్కడ నుంచీ వచ్చావు  ‘ అని ప్రశ్నలు వేయకుండా  భోజనం పెట్టడం అనే పుణ్యకార్యాన్ని మించినది ఇంకొకటి లేదు.  అటువంటి వారి గుడిని attack  చేసి,  ఆ భక్తులని చంపేసి ఓ బావిలో పడేయటం అంత దుర్మార్గం ఇంకోటి లేదు అనే చెప్తాను.  వాళ్ళు చేసిన సేవకు డబ్బుతో విరాళం ఇచ్చి డబ్బుతో  కొలవలేం కదా ? వెళ్ళి  భజన లో  పాల్గొని మద్దతు తెలపడమే  కదా చేయాల్సింది.  చేద్దాం అనుకున్నాను.  

ఇస్కాన్ వారి గుడితో పాటు  కొన్ని వందల గుళ్ళు పగలగొట్టారు.  అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేసారు.  నవరాత్రుల్లో రోజూ అమ్మవారిని పూజించాను.  క్రమం తప్పకుండా  మహిషాసురమర్దని  స్తోత్రం,  సౌందర్యలహరి , దేవీస్తుతి , లలిత సహస్రం  చదివాను.  బాలవికాస్  పిల్లలతో సరస్వతీ పూజ చేయించాను. అటువంటి  ఆ అమ్మని, అదే విజయదశమి రోజు అంత దారుణంగా అవమానిస్తే హాయిగా ఎలా నిద్రపోగలను ? అంటే  ఆ ‘అమ్మ’ నిజం కాదా ? ఆవిడో  విగ్రహం మాత్రమేనా ? సరే  ఆవిడ  కేవలం విగ్రహమే.  ఆంధ్రా లో ఎన్నో విగ్రహాలని పగలగొడుతూనే ఉన్నారు  ఇదీ ఒకటి లే అని వదిలేయనా ? అమ్మవారు ఓ విగ్రహమే అనుకుంటే ,  అదే రోజు, మరి కేవలం ‘ఆ అమ్మని పూజించారు’ అని  ఎంతో మంది అమ్మలని మానభంగాలని చేసి అవమానించారు .  వారిలో బాలా త్రిపుర సుందరి అని భావించి మనం పూజించే చిన్న చిన్న ఆడ పిల్లలు కూడా ఉన్నారు. 

మా పిల్లలు విన్నా వినకున్నా నేను చెప్పేది ఒకటే ’ఈ వైదిక సంస్కృతి ని మర్చిపోవద్దు. ఏ రూపం లో అయినా దాన్ని  ముందు తరాలకి అందించండి’  అని. బాల వికాస్ లో పిల్లలకి కొద్దో గొప్పో అదే మాట చెప్తున్నాను. నా మాతృభాషని తరువాత తరాల వారికీ అందించే  ప్రయత్నమూ చేస్తున్నాను. మరి బంగ్లాదేశ్ లో   ఉన్న హిందువులు ఎవరు ? నా లాగా వలస వెళ్ళినవారా ? కాదుగా .  కొన్ని వందల సంవత్సరాల నుంచీ అక్కడే ఉంటూ  భాషను, సంస్కృతి ని కాపాడుకుంటున్నవారు. ఒక్క మాట లో వారి గురించి  చెప్పాలి అంటే ‘Indigenous’. కాశ్మీర్ పండితులు  కాశ్మీరు వదిలి వెళ్లిపోయారు. .  పాకిస్తాన్ లో  2017 వరకూ హిందూ పెళ్ళి  చట్టప్రకారం అంగీకారం కాదు.  ఈమధ్య ఓ హిందూ పిల్లవాడు ఆకతాయిగా ప్రార్థనా స్థలంలో  ఏదో  చేసాడని వాడిని ఉరి తీయలేదని హిందూ దేవాలయాన్ని బద్దలు కొట్టారు పాకిస్తాన్ లో extremists. ఆఫ్గనిస్తాన్ లో  తాలిబన్లు తిరిగి పాలనలోకి రాగానే  ప్రపంచమంతా వణికిపోయింది అక్కడి వారి బ్రతుకులు తలచుకుని. ఇటువంటి దేశాలలో  ఇంకొక సంస్కృతి తో బ్రతకడం అనేది కత్తి  మీద సాము లాంటిదే. అవునన్నా కాదన్నా నిజం ఇది.  ఓ సోషల్ మీడియా పోస్టుకి చూసి అంత దారుణంగా react  అవ్వటం అనేది ప్రపంచమంతా  ఆలోచించవలసిన విషయం. ఎంతో మందిని నిరాశ్రయులని చేసారు.  ఆలయాలను ధ్వంసం చేసారు.  హత్యలు, మానభంగాలు.  ఎంతో స్నేహంగా ఉండే పక్కింటి వాడు ఎలా మారతాడో అన్న భయంతో  బంగ్లాదేశ్ లోని హిందువులు  ఇంకొకరిని నమ్మలేరు. అయినా కూడా ఇవన్నీ పక్కన బెట్టి ,నిలదొక్కుకుని గుళ్ళలో పూజలు చేసారు కొందరు.  సోషల్ మీడియాలో ఇంత పోస్టులు పెట్టి ఇన్ని నీతులు చెప్పే నేను ఏం పనికొస్తాను వాళ్ళ ముందర ?

భారత్  లో పుట్టాను.  అమెరికాకి వలస వచ్చాను.  ఈ రెండు దేశాల్లో ఉండటం అనేది  ఏదో  పూర్వజన్మ సుకృతం అనుకోవాలి.  ఈ దేశాల్లో ఎవరికి నచ్చిన  మతం, సంస్కృతి పాటించచ్చు.  శాంతియుతమైన రీతిలో   కష్టం చెప్పుకునే హక్కు కూడా ఉంది  ఈ దేశాల్లో. ఇస్కాన్ వారి పరమ శాంతియుతమైన  నిరసన  కూడా నేను నమ్ముకునే ఆ పరమాత్మ నామాన్ని ఉచ్చరించడమే.  పైగా తప్పు చేసిన వాడు మారణ హోమాన్ని సృష్టించి రెండు స్నేహ సంబంధమైన దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించి తప్పించుకున్నాడు. . అటువంటి వాడికి శిక్ష పడకపోతే ఎలా ?  ఇవన్నీ ఆలోచించాక ఈ నిరసన లో పాల్గొనకపోతే నన్ను నేనే మోసగించుకుంటున్నాను అని అనిపించింది. వెళ్లి వచ్చాక నా కర్తవ్యం నేను చేసాను అన్న సంతృప్తి.

4 thoughts on “నా కర్తవ్యం ”

 1. నిరసన కార్యక్రమంలో పాల్గొని మంచి పని చేశారు. మీలాగా మరింత మంది ముందుకు రావాలి.

  నాకు చాలా .. చాలా ఆశ్చర్యం కలిగించేది మన పట్ల బంగ్లాదేశ్ వారి ప్రవర్తన. అసలు ఆ దేశం ఏర్పడిందే భారతదేశ సహాయంతో. అటువంటిది కృతజ్ఞతాభావం లేకపోగా మన మీదే దాడి చెయ్యడం కృతఘ్నతకు పరాకాష్ఠ. 40 యేళ్ళు గడిచిపోయాయి, ఒక తరం మారిపోయింది. అయినా చరిత్ర కొంతైనా తెలిసుండాలి కదా? వెనక నుండి రాజకీయ శక్తులు, మత శక్తులు. ఎగదోస్తున్నాయి అనుకోవాలి.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  1. ‘అయినా చరిత్ర కొంతైనా తెలిసుండాలి కదా?’ తెలియక కాదు. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్,కాశ్మీర్ లాగా అవ్వాలి. అంటే ethnic cleansing మొదలయ్యింది. 1947, 1971 దారుణాలు జరిగినా హిందువులు ఉన్నారు. ఆ కొద్దిపాటి వాళ్ళు కూడా తుడిచిపెట్టుకోవాలి. ఇంతకంటే సాక్ష్యం ఏమీ లేదు.

   మెచ్చుకోండి

 2. మీ పోస్ట్ లు అన్నీ చదువుతాను. ఇవ్వాల్టి పోస్ట్ చూసాక మీమీద గౌరవం ఎన్నో రేట్లు పెరిగింది. 🙏

  సోషల్ మీడియాలో ఎందరో కీబోర్డు వారియర్స్ ఉన్నారు, నాతో సహా. బయటికి వచ్చి, ప్రజాస్వామ్యం ఇచ్చిన ధర్నాహక్కు వినియోగించుకొని సమస్యపై స్పందించేవారు చాలా తక్కువ. నాతొ కూడా.

  నేను ఒకసారి ఆర్టికల్ 370 ఫై UN ముందు ఇండియా కోసం ధర్నాలో పాల్గొన్నాను. ధర్నాకి వెళ్తూ చాలా చేసేస్తున్నాను అనుకొన్నాను. అక్కడికి వెళ్ళాక, ఆ ధర్నాకు శ్రమపడ్డ వాలంటీర్స్ ను చూసి సిగ్గుతో తలదించుకున్నాను. మూడు రోజులపాటు అహోరాత్రాలు కష్టపడ్డారు.

  ఈ పోస్ట్ చదివాక మీలోకూడా ఉన్న ఆ నిబద్ధతకు చేతులెత్తి మొక్కుతున్నాను. 🙏🙏

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  1. నేను చెప్పింది ఎక్కువేమో చేసింది తక్కువే. నేనే చేయగా లేనిది ఇంకో పది మంది చేయాలనే తపన. మీరు చెప్పినట్లు చేసేవాళ్ళు చాలా చాలా బాగా చేస్తున్నారు ఈ ధర్మానికి. వాళ్ళని చూసి సిగ్గేసి ఏదో చేద్దామన్న తపన. అవతల వాళ్ళు నాకు పిచ్చి పట్టుకుందేమో అనుకుంటున్నారేమో తెలీదు కానీ, మనిషి కనిపిస్తే చాలు. ఏదో ఒకటి చేయమని చెప్తున్నాను. కనీసం నాలుగు యూట్యూబ్ వీడియోలు చూసినా చాలు కదా educate అవ్వడానికి అని.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: