ఈ సంస్కృతిని రక్షించుకోవడానికి ఏమి చేయగలను?

హిందూ మతం/హిందూ సంస్కృతి/భారతీయత /సనాతన ధర్మం అనేది ప్రపంచంలోని  అన్ని సంస్కృతుల్లోకెల్లా ప్రాచీనమైనది.  ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. కానీ చరిత్రలో కనుమరుగయ్యాయి.  ఇంకా ప్రాణంతో ఉన్న సంస్కృతి ఇదొక్కటే. ఈ సంస్కృతి  రక్షించుకునేందుకు  తమదైన రీతిలో అనేక ధార్మిక సంస్థలు పోరాడుతున్నాయి.  అందులో  ఒక సంస్థ గురించి చెప్తాను.  వారు  చేస్తున్న దైవసేవ  ఏ ఆర్భాటము లేకుండా ఏదో చిన్నదిగా  ఉన్నట్లు కనిపించినా ,  భావితరాలని హిందూ మతం పాటించేటట్లు చేస్తుంది అని నాకు అనిపించింది.  అదే కదా సంస్కృతిని  కాపాడటం అంటే? 

 హిందూ మతం అనగానే అందరూ మాట్లాడేది  కులము & కుల వివక్ష.  ‘నిర్వాణ శతకం వంటివి చెప్పిన ఈ మతంలో  వివక్ష లేదు.   భగవంతుడికి అందరూ ఒక్కటే’ అని ఎన్ని చెప్పినా , పాటించేది మానవ మాత్రులం కాబట్టి కుల వివక్ష లేదు అని ఎవరం అనలేము. కానీ దానినే ఒక అవకాశంగా తీసుకుని  మత  మార్పిడులు చేస్తున్నారు అన్నది అందరికీ తెలిసిందే.  వారి నమ్మకం వారిది.  వారు మారుస్తారు.  మరి , ఎవరైనా  మతం ఎందుకు మారతారు ? 

ఏదైనా సమస్య  వచ్చినపుడు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు. ఎవరైనా ఆ సమయంలో  దైవాన్నే నమ్ముతారు.  ఆ దైవాన్ని తలచుకునే వ్యవస్థే లేకుండా పోతే? ఏ ప్రార్థనా స్థలం కనిపిస్తే అక్కడికి వెళతారు. ఆ విధంగా చాలా మంది హిందువులు మతం మారిపోతున్నారు.  చాలా చోట్ల  ఈ గుళ్ళు  అంటే  గ్రామ దేవత వ్యవస్థ అనేది కనుమరుగు అయిపోతోంది.. అన్నీ ఆలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండే ఆలయాలు కావు. ఓ రావి చెట్టు కిందో/ ఊరవతల నో ఉంటాయి.    కొన్ని గుళ్ళు physical గా ఉన్నా పాడుబడిపోయి దీపారాధనకు కూడా నోచుకోవడం లేదు.   ఈ వ్యవస్థ ఇలా దూరం అవ్వడం వల్ల,   ఏదైనా సమస్య వచ్చినవాడికి వారి కుల దైవం అందుబాటులో లేనట్లే. అంతే కదా?  సమస్య వచ్చినపుడే కాదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం పెళ్లి , బారసాల లాంటివి  కావచ్చు.  ముందు కులదేవత కి పూజ చేస్తారు. చాగంటి గారు  ఓ ప్రవచనం లో చెప్పారు గ్రామదేవతల విశిష్టత గురించి. ఒక ఊరులో మొదట వచ్చినవారు ఇల్లు కట్టుకునే ముందు  ఊరి  మొదటిలో  ఓ దేవత ని ప్రతిష్టించి  ఆ దేవతకి  పేరు పెట్టె వారు. పోలేరమ్మ అనో, తలుపులమ్మ  అనో అలా . అటువంటి అమ్మ మనకి అండగా ఉంది అన్న నమ్మకం వారిలో కలిగించాలి కదా?

దానధర్మ అనే ఒక సంస్థ తెలుగు రాష్ట్రాలలో  ఈ గ్రామదేవతల గుళ్ళు  పునరుద్ధించడం, ప్రతిష్టించడం అనే కార్యక్రమం చేపట్టారు. Venkat Vutukuri  గారు దానిని స్థాపించారు. వారు అమెరికాలోనే ఉంటారు.  సంస్థ  website లంకె ఇస్తున్నాను.  అన్నీ వివరాలు చూడవచ్చు.   వారు ఈ కార్తీకమాసంలో Pooja kit  లను ఇటువంటి 2500 దేవాలయాల లో అందజేస్తారు.  ఒక్కొక్క kit  లో ఆ నెలకు సరిపడా నూనె, ఒత్తులు, పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తీలు ఉంటాయి. ఒక్కొక్క kit  516/- రూపాయలు  మాత్రమే.   మీ ఎన్ని గుళ్ళకి ఇవ్వగలిగితే అంత ఇవ్వవచ్చు. ఈ గుళ్ళలో భక్తులు ఎంత శ్రద్ధగా చేస్తారో చూస్తే అద్భుతం అనిపిస్తుంది.  మన సంస్కృతిని వదిలివేయకుండా కాపాడుతున్నందుకు ఈ గ్రామాలలో ప్రజలకు  చేతులెత్తి నమస్కరించచ్చు.  ఎన్ని kits  సహాయం చేయగలిగితే అన్ని చేయండి.  అమెరికా వారికీ కేవలం $8. ఎంతమందికి ఈ సందేశం చేరవేయగలితే అంత బావుంటుంది.  ఆ గుళ్ళలో దీపాలు వెలిగించిన వారం  అవుతాము. 

Myindmedia లో Venkat Vutukuri గారి  ప్రసంగాలు విన్నాను. సంస్థ  facebook  పేజీలో ఏమి చేస్తున్నారో చూసాను. వారితో మాట్లాడితే ‘ మీరు విన్నారండీ. అదే సంతోషం. మీరు ఎంత వీలవుతే అంతే  సహాయం చేయండి’ అన్నారు.  ఆశ్చర్యం వేసింది నాకు . కనుమరుగవుతున్న సంస్కృతిని రక్షించుకోవాలన్న తపన వారి మాటలలో వినిపించింది.  

ఇంత కంటే ఏమీ చెప్పలేను.  తరువాత మీ ఇష్టం 🙂 

For USA Friends

https://www.donatekart.com/MB/Support-Daana-Dharma?fbclid=IwAR1cXl0i54Tg-qQHNOmYM5M0FXONSKSnynIP81fgEDJGzYOhEPteL2dh7b8

https://daanadharma.org/

One thought on “ఈ సంస్కృతిని రక్షించుకోవడానికి ఏమి చేయగలను?”

  1. మంచి ప్రయత్నం 👌. ఇటువంటి సత్కార్యాలకు విస్త్రృతమైన ప్రచారం జరగాలి.

    హిందూయిజమ్ గురించి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో పలుచోట్ల పెద్ద పెద్ద billboards 👇 వెలిసాయట కదా? ఇంతకాలానికి హిందువుల వాణి కూడా వినిపించడం మొదలయింది అన్నమాట. గుడ్.

    https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcSTCFDQqRCfy2uOoIOGwpVFh4oL213NxzfPrw&usqp=CAU

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: