ఈ విగ్రహం అవసరమా?

భారత సంతతి/హిందువులు అనగానే ప్రపంచానికి తెలిసింది ‘Caste’ అంటే కులము అన్నమాట. ఆ మాట తప్పించుకుని అమెరికా వచ్చేసాం అనుకున్నా అమెరికాలో ‘caste based discrimination’ అంటూ పెట్టి , ఇది ‘ south Asians’ కి మాత్రమే apply అవుతుంది అని చెప్తున్నారు. కాలేజీల్లో మొదలు పెడుతున్నారు. ఇక నెమ్మదిగా corporate ప్రపంచంలో కూడా మొదలుపెడతారు. అమెరికాలో చాలా మంది తల్లితండ్రులు పిల్లలకు కులం అనేది చెప్పరు . బడిలో History తరగతిలోనో , World religions తరగతిలోనో చాలా మటుకు ‘caste’ అన్న పదం వింటారు. ఇక పై అందరం పిల్లలకి ఏ కులం లో పుట్టామో చెప్పాలేమో. ఒక వేళ కులం తెలిసినా ఏ కులం పెద్దదో , ఏ కులం చిన్నదో చెప్పుకోవాలేమో మరి. మా నోటితోనే మా చరిత్రని వక్రీకరించి/ హీనంగా చెప్పాల్సిన సందర్భం వచ్చేసిందేమో.

దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. రామానుజాచార్యులు వారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎందుకు జీయర్ స్వామి వారి వీడియోలు చూపించి నానా యాగీ చేయడం మొదలు పెట్టారో. . ప్రపంచంలో నీచమైన జాతి ఉన్నది అంటే ఈ వీడియోలు చూపించి, నీచాతి నీచంగా స్వామి గారి గురించి మాట్లాడే మనుష్యుల జాతి మాత్రమే.

ఇంకొందరు ఇంత ఖర్చుతో ఈ విగ్రహం అవసరమా అని అంటున్నారు. ప్రపంచంలో ప్రతీ హిందువు ఐడెంటిటీ అద్వైతం/ద్వైతం అన్న సిద్ధాంతం ఏది ఎక్కడా చెప్పకుండా కులం అనేది ఓ identity చేసారు. దారుణం ఏంటంటే కర్మ ఫల సిద్ధాంతాన్ని కూడా కులముతో ముడి పెడతారు. హిందూ మతంలో పుట్టిన భావి తరాలవారు ‘నా identity నా కులం కాదు’ అని ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా చెప్పుకునేందుకు ఏదీ వద్దా? ‘మానవులంతా సమానమే ‘ అంటూ చెబుతూ ఇప్పుడు ఈ విగ్రహం ముందు ముందు చెప్పుకునే చరిత్ర అవ్వబోతోంది. కాబట్టి ‘ ఈ విగ్రహానికి అవసరమా ? ఇంతా ఖర్చా ‘ అని అడిగేవారు దయచేసి అలా మాట్లాడవద్దు మనవి 🙏🙏🙏. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా అవసరం ఉంది

ఇది వరకు పటేల్ గారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంలో వ్రాసిన టపా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: