మా నాన్న గారు మార్చి 29, 2022న శరీరాన్ని విడిచి వెళ్ళారు .
క్లుప్తంగా చెప్పాలి అంటే ఆయనకి తెలియని విషయం అంటూ ఉండేది కాదు. అది బ్యాంకు ఉద్యోగం వల్ల కొంత, స్వతహాగా ఉన్న ఆసక్తి వలన.
కంప్యూటర్ లు వచ్చాక ఆ రోజుల్లోనే ఓ పక్క ఉద్యోగం చేస్తూనే COBOL నేర్చుకున్నారు. Internet వచ్చాక email ఎలా వ్రాయాలో మొదలు పెట్టి , networking దాకా నేర్చేసుకున్నారు. ఇంట్లో ఎవరిదైనా సరే తనే ఆ computer fix చేసేవారు. ఎప్పుడూ అందరికీ hard drive ఒకటి తెచ్చుకుని backup చేసి ఇచ్చే వారు. ఇక smart phones తో కూడా అలాగే చేసేవారు. BSNL వాళ్ళ కంటే మా నాన్నకే బాగా తెలిసేది .
ఆ BSNL అంటే మహా ఇష్టం. ‘public sector ని అంటే ఊరుకోను’ అని ఖచ్చితంగా మొహాన చెప్పేవారు. Facebook లో కూడా చాలా active గా ఉండేవారు. తెలుగు బ్లాగులు నాకు పరిచయం చేసింది మా నాన్న గారే . ‘కూడలి’ చూపించారు. ‘కష్టేఫలి’ శర్మ గారి బ్లాగు గురించి , శర్మగారి చెప్పే విషయాలు చాలా నచ్చేది ఆయనకి. ‘ భండారు’ వారు ఆయనకి ముఖపుస్తకంలో పరిచయమే.
‘మోదీ’ ఇష్టమే కానీ ‘opposition లేకపోవడం పెద్ద drawback. భక్తుల్లా మాట్లాడతారు మీరంతా. అసలు విమర్శించకూడదు అన్నట్లు ఉంటే ఎలా’ అని మాతో పెద్ద వాదనలు వాదించేవారు.
ఎంత ఓపిక లేకపోయినా లేచి ఆ కంప్యూటర్ కుర్చీ దగ్గరికి వెళ్ళి ఓ అరగంట సేపు ముఖపుస్తకం లో గడిపేవారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి మనవళ్ళు , మనవరాళ్ళు analysis ఇవ్వమని అడిగారు. ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని మాట్లాడారు.
అందుకే ఆయన వెళ్ళిపోయాక ఆ 13 రోజులు మేము ‘ Celebrating Life of Mr.Google’ అనే title ఇచ్చాము. ఆయన లేని మా జీవితాలని మాములుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాము.
నా పాత టపాల లంకెలు :
మా అక్కయ్య ముఖపుస్తకం లో వ్రాసిన టపా కూడా పదిలంగా బ్లాగులో దాచుకుందామని ఇక్కడ post చేస్తున్నాను.
చూస్తుండగానే నాన్న వెళ్ళిపోయి 3 వారాలు కావస్తోంది.
ఆయన లేరు అనే నిజం ఇంకా జీర్ణం అవట్లేదు.
మరి కన్న తండ్రి కదా అలాగే ఉంటుంది అన్నారు ఎవరో.
నాన్న just నాన్న మాత్రమే కాదు కదా.
మా Facebook friend. సంగీత, సాహిత్య మిత్రులు. , a curious learner , a mischievous kid who would change all our gadget passwords and watch fun.
అందుకే ఎన్నో విధాలుగా ప్రతి నిమిషం నాన్న ని miss అవుతున్నా.
అమ్మ అనేది ” ఎప్పుడు ఆ పుస్తకాలు కంప్యూటర్లు తప్ప పిల్లలకు ఏం పెట్టాలి ఏంఇవ్వాలి అని ధ్యాస లేదు” అని.
నాన్న ఇచ్చిన ఆస్తి దేనికి కొలమానం.???
మంగళంపల్లి వారి “నగుమోము” enjoy చెయ్యటం నేర్పింది నాన్న. త్యాగరాజ పంచమికి పంచరత్నాలు live తిరువాయుర్ నుంచి చూడటం, ఎక్కడ మంచి కచేరి వున్నా తీసుకెళ్లడం. దాదాపు ప్రతి పెద్ద కళాకారులని లైవ్ లో చూడగలగటం నేర్పింది నాన్నే .
రేడియో వినిపించడం మాత్రమేనా, ఆలిండియా రేడియో కి పట్టుకెళ్లి అక్కయ్యలని, మామయ్యాలని ఏకాంబరాన్ని చూపించింది మా మొహల్లో excitement తెచ్చింది నాన్న.
రైల్ అందరూ ఎక్కుతారు. ఇంజిన్ ఎక్కించారు, స్టేషన్ లో సిగ్నల్ రూమ్ కి పట్టుకెళ్లారు.
తమిళనాడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో A/C First class ఎక్కించారు, just ఆ feel కోసం.(డబ్బు వుండి కాదు, LTC లో మరి కాస్త వేసుకుని), ఒకసారి రామేశ్వరం.నుంచి మద్రాసు దాకా Heritage Compartment లో పట్టుకెళ్లి మా ముగ్గురికి రాజుల కాలం ఫీల్ తెప్పించారు.
LTC లో కాస్త డబ్బు చేర్చి మొదటి సారి మాకు flight ఎక్కిన అనుభవం నాన్న వల్లే.
చాలమంది మా తోటి స్నేహితుల parents డబ్బులు దాచుకుంటే, నాన్న మమ్మల్ని దేశం లో తిప్పని ప్రదేశం.లేదు.
ముగ్గుర్ని తీసుకుని పెరేడ్ గ్రౌండ్స్ లో రంజీ ట్రోఫీ మాచ్ కి పట్టుకెళ్లి, స్టాండ్స్ లో కూర్చుని మాచ్ చూడటం లో థ్రిల్ చూపించారు.
పానిపురి తినాలన్న మిర్చి బజ్జి అయినా , మంచి కాఫీ అయిన నాన్నే.
Survey of India లో మాప్ లు తెచ్చి how to read maps చెప్పింది నాన్నే.
పుస్తకాల విషయంలో చెప్పనక్కర్లేదు.
నాకు పుస్తకాల పిచ్చి నాన్న వల్లే. చిన్నపుడు మొగల్ లైబ్రరీ కి వెళ్లడం తో మొదలయింది మా book friendship.”ఇదిగో ఈ bookచదువు” అంటూ ఇంటికి వెళ్ళగానే ఒకటి విసిరేసేవారు.
‘దుమ్ము ఉంటుంది, ఆయాసం వస్తుంది’ అని అమ్మ అరుస్తున్నా, నా ఆఫీస్ కి వచ్చి ‘Book Exhibition కి వెళ్దాం అమ్మకి చెప్పకు’ అంటూ ఆ పుస్తక వ్యసనానికి మూలం నాన్న.
అమ్మ అనేది “ఆడపిల్ల వచ్చింది ఒక చీర పెట్టామా లేదా అక్కర్లేదు, ఆ పుస్తకాలు ఇస్తే చాలా?” అని. చాలాదా!!కోట్ల రూపాయల విలువ . పుస్తకం కాదు. అది చదివి ఆయనతో చేసే డిస్కషన్. ఆయన reasoning. In this society emotions are over rated than practicality అని నవ్వేవారు.
ప్రతి విషయం మీద ఒక view ఉండాలి అని అనేవారు.
అటు politics అయిన, ఇటు మతపర విషయం అయినా, సాంఘిక విషయాలు అయినా చర్చ జరగలసిందే. నాకు తెలిసి మా ముగ్గురికి ఒక్కసారి కూడా text booksచదవమని చెప్పింది లేదు. అయినా మెమెప్పుడు చదువు నిర్లక్ష్యం చేసింది లేదు.
ఎప్పుడు తెలుగు సాహిత్యం, ఇంగ్లీష్ fiction, travelogues, national geographic magazines, readers digest. ఒకటేమిటి అన్ని రకాల బుక్స్.
నా ట్రావెల్ పిచ్చి కి, ఎప్పటికయినా జీవితం లో భూభ్రమణం చేయాలనే నా కోరిక కి బీజం నాన్నే.
బాపు రమణలని , బుడుగు ని పరిచయమ్ చేసింది నాన్న.
కున్నకుడి “కావేరి ” వయోలిన్ రుచి చూపించింది నాన్న.
Lalgudi violin కానీ “west meets east” by రవి శంకర్ కానీ , మంచి హిందీ పాటలు కానీ వినటం అలవాటు చేసింది నాన్న.
.
రిటైర్ అయిన వాళ్ళు , అమెరికా వెళ్లిన పెద్దవాళ్ళు ఎంతో మంది బోర్ బోర్ అంటుంటే, నాన్న మాత్రం లైబ్రరీ కో, మైక్రో సెంటర్ కో వెళ్లి అలా రోజులు గడిపే వారు. అలా ఒక కంప్యూటర్ ముందు వేసుకుని గంటలు గడిపేసే వారు
ఒక్క రోజు ఆయన నోట్లో బొర్ అనే.మాట వినలేదు.
enjoying life has nothing to do with physical assets అని అనడానికి నాన్నే నిర్వచనం.
కాదేదీ కవితకనర్హం లాగా
ఒక చిన్న రైల్ ప్రయాణం అయినా, ఒక పుస్తకం అయిన, ఒక పాట అయిన , స్నేహితులతో గడపటం అయిన జీవితాన్ని అంత enjoy చెయ్యచ్చు అని తెలుసుకుంది నాన్న వల్లే.
చిన్నతనం లొనే తండ్రిని పోగొట్టుకుని, పెద్దకొడుకుగా గంభీరంగా బాద్యతలు తీసుకున్న నాన్నే మా ఆదర్శం మరి.
జీవిత కాలం నాన్నతో ప్రాణస్నేహితులు గా ఉన్న శివరాం మామయ్య ,సోమశేఖర్ మామయ్య , రంగనాథ్ మామయ్య ల, అనుబంధంలాతో (uncle అనే పిలుపు లేవు అందరిని మామయ్య అనాల్సిందే) స్నేహం విలువ చెప్పారు నాన్న.
సక్సెస్ అంటే నాన్న definition వేరే.
Technologyఆంటే ప్రాణం నాన్నకి. అన్ని నేర్చికుని మనవళ్ళ computer passwords మార్చేసి వాళ్ళని ఏడిపించిన Modern తాత.. Computer time కోసం పిల్లలతో సమానం గా పొట్లాడిన చిన్న పిల్లాడు నాన్న.
అలాంటి నాన్న ఏదో కొత్త technology తో స్వర్గం నుంచి wifi లో contact లోకి తొందరగా రాకపోతారా!!!

చాలా ఆర్ద్రంగా వ్రాశారు. ఎంతో అపురూపంగా నెమరు వేసుకున్నారు మీ నాన్నగారి జ్ఞాపకాలను. అవును, ఆ లోటు భర్తీ చెయ్యలేనిది. మీకందరకూ నా ప్రగాఢ సానుభూతి.
మీ తండ్రిగారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏.
మెచ్చుకోండిమెచ్చుకోండి
ధన్యవాదాలండీ🙏🙏
మెచ్చుకోండిమెచ్చుకోండి
చాలా బాగా రాశారు చంద్రిక గారు మీ నాన్న గారి గురించి. మంచి నివాళి. ఆయన ఆత్మ కి శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నాను.
మెచ్చుకోండిమెచ్చుకోండి
ధన్యవాదాలు పవన్ గారు🙏🙏
మెచ్చుకోండిమెచ్చుకోండి
నాన్నగారిని స్మరించుకొంటూ మీరు వ్రాసిన వాక్యాలు అందరికి అనుభవైక్యమే. వారి లోటు ఎవ్వరు పూరించలేనిది. వారికి సద్గతులు కలగాలని ప్రార్థన.
మెచ్చుకోండిమెచ్చుకోండి
ధన్యవాదాలండీ
మెచ్చుకోండిమెచ్చుకోండి
జాతస్య మరణం ధృవం
పుట్టినవారు గిట్టక తప్పదు.
ఎవరెప్పుడో తెలియదు.
అందరం గమ్యం చేరవలసిన వాళ్ళమే! ఒకరు ముందు, మరొకరు వెనక అంతే తేడా!
పునరపి మరణం పునరపి జననం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహు దుస్సారే
కృపయా పారే పాహి మురారే
భజగోవిందం గోవిందంభజ
మరణం ఎప్పుడూ వ్యధే
అందునా ఆత్మీయుల మరణం తీరని వ్యధ
వ్యధతో నిరాశ, దానిలో కూరుకుపోవడం సహజం. మాన్చలేనివి,మానలేనివి.
కాని నిరాశలో కూరుకుపోయి ఉండిపోకూడదు, బయటికి రావాలి.
చనిపోయిన వారితో గడచిన మధుర క్షణాలు గుర్తుకు తెచ్చుకోవాలి.
వారి ఆశయాలను గుర్తుంచుకుంటూ,స్మరిస్తూ,ఆచరిస్తూ మన జీవితం గడపాలి.
ఎంతచెప్పినా తీరనిదే! ముఖ్యంగా జీవిత సహచరుణ్ణి కోల్పోయిన మీ అమ్మగారికి, మీ కుటుంబ సభ్యులందరికి నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను.
మీ తండ్రిగారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్ధిస్తున్నాను.
మెచ్చుకోండిమెచ్చుకోండి
ధన్యవాదాలండీ. పిల్లలం మా సంసారాల్లో మేము busy గా బానే ఉన్నాము. . ఇంతకాలం తోడుగా ఉన్న భాగస్వామి వెళ్ళిపోతే ఎంత prepared గా ఉన్నా కొంత కాలం సమయం పడుతుందేమో. అదృష్టం ఏమిటంటే ఆయన కంప్యూటర్లలో మునిగి ఉంటే ఈవిడ ఇంట్లో పనులు కాకుండా కుట్లు, crafts తో ఉండేది. ఆ బిజీ గా ఉండటమే రక్షిస్తోంది ఇప్పుడు
మెచ్చుకోండిమెచ్చుకోండి
Technologyఆంటే ప్రాణం నాన్నకి. అన్ని నేర్చికుని మనవళ్ళ computer passwords మార్చేసి వాళ్ళని ఏడిపించిన Modern తాత.. Computer time కోసం పిల్లలతో సమానం గా పొట్లాడిన చిన్న పిల్లాడు నాన్న.
అలాంటి నాన్న ఏదో కొత్త technology తో స్వర్గం నుంచి wifi లో contact లోకి తొందరగా రాకపోతారా!!!
చాలా బాగా వ్రాసారు. వారి ఆత్మకు శాంతి కలుగుగాక 🙏🙏🙏
మెచ్చుకోండిమెచ్చుకోండి
ధన్యవాదాలండీ నీహారిక గారు. మా అక్క వ్రాసింది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
అంత మంచి జ్ఞాపకాలని మీకు ఇచ్చి వెళ్ళిన మీ నాన్నగారిని గురించి తెలుసుకునే అవకాశమిచ్చిన మీకు థాంక్స్, చంద్రికా! మీ నాన్నగార్ని నవ్వుతూ తలుచుకోండి. ఆయన మీతోనే ఉన్నట్టుంటుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
thank you Lalitha garu
మెచ్చుకోండిమెచ్చుకోండి