ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు

ఫిలడెల్ఫియా లో నివసించుదాం అనుకున్నాను. ఎందుకంటే న్యూజెర్సీ, డెలావేర్, ఫిలడెల్ఫియా ప్రాంతాలలో భారతీయులు ఎక్కువ కదా . అంటే ఎంతో మంది హిందువులు ఉంటారు. వాళ్ళకి gospel చెబుదామనుకున్నాను. కానీ దైవం ఇంకొకటి తలచాడు. టెక్సాస్ లో భూటాన్ & నేపాల్ నుంచీ వచ్చిన refugees ఉన్నారంటూ పిలుపు వచ్చింది. 700 మందికి బోధించాను . వాళ్లలో చాలా మంది బ్రాహ్మణ కుటుంబాల నుంచీ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఒక చర్చి కట్టుకుంటున్నారు. ఏది ఏమైనా నా mission పూర్తయింది. అదే సంతోషం. హిందువులకి అన్ని మతాల వారికంటే చాలా పరమత సహనం చాలా ఎక్కువ. ఎందుకంటే పూర్వం ఇస్లాం మతస్థులు, ఆర్యన్ లు ఇలా అందరితో కలిసి బ్రతికారు . ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని పూజిస్తారు. అలా 33 మిలియన్ల దేవుళ్ళు ఉన్నారు. ఏసుక్రీస్తు కూడా వాళ్ళకి ఒక దేవుడే. కానీ ఆయనొక్కరే నిజ దేవుడు అంటే అక్కడే గొడవ వస్తుంది. చాలా భక్తి కలవారు. చాలా తెల్సుకోవాలి హిందూ ధర్మం అంటే. ముఖ్యంగా ఏసుక్రీస్తుని వాళ్ళకి పరిచయం చేయాలనుకునే వారు. వాళ్ళ వేదాల్లాంటి గ్రంథాలు చదవాలి. వాళ్ళతో నెమ్మదిగా చర్చించి అప్పుడు ఏసుక్రీస్తుల వారు నిజ దేవుడు అని చెప్పాలి. రాత్రికే వాళ్ళు మారిపోతారు అనుకోకూడదు. వాళ్ళు నమ్మాలంటే చాలా సమయం పడుతుంది. దానికి చాలా ఓర్పు అవసరం. ‘అంటూ ఈ వీడియోలో చెబుతున్నారు డేవిడ్ గారు.

ఇదిగో ఇంకొక మాజీ నేపాలీ హిందువు కూడా దాదాపుగా ఇలాగే చెబుతున్నాడు.

https://www.bethinking.org/eastern-religions/sharing-jesus-with-hindu-friends

“Feel free to pray with your friend; Hindus are comfortable with public acts of devotion. But be careful how you explain the gospel. Hindus appreciate it when you acknowledge there are things you don’t understand. If you are not serious about growing as a disciple of Jesus, you will not impress your friend. Why should they listen to you when they have such great examples in their own history? If you are committed to knowing God and honoring him in your life that will be a great witness. Then you can pray and look for opportunities to share your heart’s desire with your friend.”

ఎంత చక్కగా ఇంట్లోకి వెళ్లి ఇనపెట్టె తాళం ఎక్కడుందో తీసుకుని సొమ్ము ఎలా దోచుకుపోవాలో ఎంత అందంగా చెబుతున్నారో చూడండి. హిందువులు ఎంత వెర్రివాళ్ళో , ఎన్ని దెబ్బలు తగిలినా అలాగే ఎలా ఉంటారో చక్కగా వివరిస్తున్నారు. హిందువుల ఉనికినే లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నారు అని అర్ధమయిపోతోంది.

అమెరికాలో కూడా మన వెనకాల గోతులు తవ్వే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎదుటి వాడు పదే పదే మోసగిస్తున్నాడు అంటే ఆ తప్పు మనదే.

మన తరవాతి తరాలకు మన పూర్వీకుల గురించి , సంస్కృతి గురించి చెప్పకపోవడం, మన బాష నేర్పించకపోవడం ఒకటి. ఒక వేళ నేర్పించినా వారు అనుసరించకపోవడం చూస్తుంటే ప్రాచీన గ్రీకుల గురించి, రోమన్ల గురించి చరిత్ర చెప్పుకున్నట్లు హిందువుల గురించి కూడా చరిత్రలో చెప్పుకోవడానికి ఇక ఎన్నో తరాలు పట్టదు.