హిందూ ధర్మ పరిరక్షణలో స్త్రీలు

హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అంటూ మాట్లాడేవారిని బోలేడు మందిని చూస్తున్నాను భారత్  లో .  FB  లో కూడా request లు వస్తుంటాయి.  చాలా బాధ కలిగిస్తున్న అంశం ఏంటంటే మగవారే మాట్లాడుతున్నారు.  ఈ విషయం మీద మాట్లాడే ఆడవారు చాలా తక్కువ.  అసలు లేరు అనను. ఉన్నా బయటికి మాట్లాడాలి అని నియమం కూడా లేదు. కాబట్టి, నాకు కనబడక పోయి ఉండచ్చు కూడా.  ఏది ఏమయినా ఉన్నవారు మాత్రం చాలా తక్కువ శాతం. ఒక్కటి మాత్రం సత్యం. ఆ ఉన్నవారు  మాత్రం దుర్గ మాతలే . కాబట్టి నేను అనేది ఏంటంటే హిందూ ధర్మం  భూమి మీద  ఉండాలి  అంటే ఖచ్చితంగా ఈ శాతం పెరగాలి. 

కానీ  అందుకు భిన్నంగా ఈ విషయంలో ఆడవారు ఎందుకు ఇంత నిర్లిప్తతగా ఉంటున్నారు ?

ఇది వరకు రోజుల్లో ఆడవారు బయటికి వెళ్ళి చదువుకునే వారు కాదు.  ఇంట్లోనే  అన్నీ నేర్చుకునేవారు.  ఇందుకు గజేంద్ర మోక్షమో , పోతన పద్యాలూ ఉదాహరణలు.  మా అమ్మమ్మ కి తల్లి లేకపోయినా అన్నీ మేనత్త దగ్గర నేర్చుకుంది.  అందుకే ఈ రోజుకి కూడా Balanced గా మాట్లాడుతుంది. Time management, Human relationships, values ఇటువంటివి ఈ తరం ఏ బడికీ  వెళ్లకుండానే నేర్చుకుంది. తరువాతి తరం  క్రమంగా చదువుకోవడం ఉద్యోగాలు చేయడం మొదలయింది. అక్కడ నుంచీ మొదలయింది మార్పు!!  ‘సమానంగా డబ్బు సంపాదిస్తేనే తప్ప మనకి విలువ లేదు’ అన్న mindset  నుండీ →   ‘సంపాదిస్తున్నాను . అయితే ఏంటి? నీ మాట వినాలా? ఉంటే ఉండు.  పోతేపో ‘ (లేదా) ‘ నాకు డబ్బుంది పెళ్ళెందుకు ?’  వరకు. 

ఇది వరకు స్త్రీలకి సమయం దొరికితే :

టీవీ లు లేకపోవడం ఉన్నా ఛానెల్స్  లేకపోవడం వల్ల  పుస్తకాలు చదవడం ఉండేది. రేడియో వినడం ఉండేది. కబుర్లు చెప్పుకుంటూ  crafts  చేసుకునేవారు. బుట్టలు అల్లడం, పూసలతో బొమ్మలు చేయడం (ఇవి కూడా తులసి కోటలు ,  వెంకటేశ్వర  స్వామి , దేవుడి మందిరం వంటివి)  ఇప్పుడు టీవీ సీరియల్స్ చోటు చేసుకున్నాయి. వాట్సాప్ లో ఏ పూజలు ఎలా చేయాలి అంటూ చాదస్తం తో  కూడిన సందేశాలు,  వీడియోలు.  ఎందుకు చేస్తున్నాం అనే లాజిక్  పోయింది.  ( సరదాగా కట్టుకుందాం అని దసరాల్లో చీరల రంగులు పెట్టా ఒకసారి. లలితా  సహస్రనామం గుంపులో.  ఇక పండగ తేదీల గురించి, చీరల  రంగుల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కటి.  సరే పూజ చేసాక ఒక నామం  గురించి చెప్పినా వినే  స్థితిలో ఉండరు.) సరే. ఇక కిట్టీ పార్టీలు. అవి ఎందుకు  చేస్తారో అవి అర్ధం కాదు. ఒకప్పుడు డబ్బుల్లేక ఒక వస్తువు ఏర్పరుచుకోవడానికి ఇలాంటివి ఏవో పెట్టుకున్నారు. అవి కాస్తా ఇప్పుడు ఒక socializing  events లాగా అయ్యాయి. ఇదొక కోణం. “కట్టిన చీర కట్టకూడదు. పెట్టిన నగ  పెట్టకూడదు” సోషల్ మీడియా వల్ల ఒక రకమైన పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. అంతే కాదు ‘మా కిచెన్ చూడండి , ఈ చీర కొనుక్కోండి, ఈ కొత్త వంటకం చేయండి’ లాంటి వీడియోలు.    ఒకప్పుడు సమయాన్ని సద్వినియోగ పరచుకునే వారు crafts  అటువంటివి పూర్తిగా మర్చిపోయారు. ఉన్న కళలని  కూడా చంపేసాయి.  ఉన్న కొద్దిపాటి సమయం  వీటికే అంకితం చేస్తున్నారు. Basically , తర్కం తో కూడిన mindset పోయింది. 

 ఆడవాళ్లదేనా తప్పు . మగవారిది లేదా అంటే ఎందుకు లేదు? బోలెడు.  ఓ నవల వ్రాయగలిగినంత ఉంది.  భారత్ వచ్చాక కొంత మంది  స్నేహితురాళ్ళని  కలవాలనుకుని ‘walking  వెళదామా సరదాగా’ అని ఎవరిని అడిగినా ఆదివారం కూడా రాలేనంత తీరికగా  ఉంటున్నారు . మధ్యాహ్నం రెండు తరవాతే వస్తారు. ఇంట్లో వాళ్ళ పనులు ఉంటాయి. టిఫిన్లు, పూజలు, భోజనాలు,  మళ్ళీ సాయంత్రం వంటలు.  అందుకని  వాళ్ళ permissions  తీసుకోవాలి.  40 దాటిన  ఆడవారికి permission  ఏమిటి అసలు?  ఒక్క రోజుకి  త్యాగం చేయరు ఈ మగవారు . ఆశ్చర్యం వేస్తుంది.  దీన్ని బట్టి ఒక సామాన్య స్త్రీ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే ఎంత కష్టమో ఊహించచ్చు. స్త్రీ వాదం పుట్టింది అంటే పుట్టదా మరి ? అటువంటి స్త్రీలు ధైర్యం గా ముందుకి వెళ్లడం మాట పక్కన పెడితే ,  ఆత్మ నూన్యత కి  గురి కాకుండా ఉంటే  చాలు.    

ఒక సంస్కృతిని  తరవాతి తరానికి  అందించే విషయంలో  స్త్రీదే  ముఖ్య పాత్ర.  శివాజీ తల్లి కావచ్చు.  వివేకానందుడి తల్లి కావచ్చు. .  పురాణాల్లో సీతా దేవి,  ద్రౌపది,  కుంతీ దేవి ఒక్కొక్క స్త్రీ ఎంతటి  వ్యక్తిత్వం ?  అటువంటి భారత స్త్రీ, అసలు తన  కుటుంబ వ్యవస్థ నుంచీ  ఎన్నో విధాలుగా దూరం అయిపోతోంది. ఇంక సంస్కృతి కోసం పోరాటం ఏమి చేస్తుంది?