మధుర శ్రీకృష్ణజన్మభూమి పోరాటం వెనక వాస్తవాలు

ముఖపుస్తకం లో మిత్రులు Chadalavada Bharadwaj గారుమధుర పైన వ్రాసిన సమగ్రమైన వ్యాసం

బుద్ధుడు పుట్టటానికి 2500 సంవత్సరాలకు ముందు నుండే అపురూపమైన ఆధ్యాత్మిక శోభ తో అలరారుతూ..సనాతన జ్ఞాన దీపమై వెలుగులీనుతూవుండేది మధుర

కాశీ అయోధ్య తదితర హిందూ క్షేత్రాలలానే మధుర శ్రీకృష్ణ జన్మభూమి పై పలుసార్లు విధ్వంసక దాడులు జరిగాయి. భక్త జనులు ధన మాన ప్రాణాలను ఎదురొడ్డి తురుష్కుల చేసిన దాడులను తిప్పికొట్టారు.

శ్రీకృష్ణ జన్మ భూమి ప్రాంతంలో మొట్టమొదటగా శ్రీ కృష్ణ ని మనవుడు అనిరుధ్దుని కొడుకు వజ్రనాభుడు ఆలయ సముదాయం నిర్మించినట్లు క్షేత్ర పురాణం తెలియ చేస్తోంది.శ్రీకృష్ణ జన్మస్థానంగా చెబుతోన్న కత్రా కేశవ్‌ దేవ్ ఆలయాన్ని శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం చుట్టూ నిర్మించినట్లు క చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులను అక్కడ కంసుడు బందీలుగా ఉంచాడు

ఈ స్థలంలో భారత పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల లో క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ది కి ముందే శ్రీకృష్ణ ఆలయం వున్నట్లు పలు సాక్ష్యాలు లభ్యమైనాయి

ఈ తవ్వకాలలో లభ్యమైన వస్తువులు మధుర ప్రభుత్వపురావస్తుప్రదర్శనశాలలో నేటికీ భద్రంగా ఉన్నాయి.

తవ్వకాల లో లభించిన పలువస్తువులు క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం కంటే ముందునుండి ఆలయం వుందిఅని అనటానికి అవసరమైన ఆలయ సామాగ్రి

కుండలు టేరాకోట్ ప్రక్రియల్లో తయ్యారు చెయ్యబడ్డ వస్తువులు లభ్యమైనాయి.

అంతేకాకుండా లభించిన మరికొన్ని శాసనాలు క్రీస్తుశకం 8 వ శతాబ్దం లో రాష్ట్రకూటులు ఈ ఆలయానికి భారీగా భూ విరాళాలు ఇచ్చినట్లు ధాన శాసనాలు లభ్యమైనాయి.

లభించిన పురాతన చారిత్రక ఆధారాలను పట్టి ఈ ఆలయాన్ని పలుసార్లు జీర్ణోద్ధరణ చేసినట్టు పురాతత్వ వేత్తలు,చరిత్రకారులు అభిప్రాయం.

క్రీస్తుపూర్వం 3 శతాబ్ధం చివరలో మొట్టమొదట గా మత కోణంతో ఈ ఆలయం పై దాడులు చేసింది భౌద్ధ చక్రవర్తి ఆనందుడు ఇతను భౌద్ధమతాభిమానంతో ఈ ఆలయాన్ని భౌద్ధ అరామంగా మార్చాడు

తరవాత క్రీస్తు పూర్వం 4 శతాబ్దం చివరిలో గుప్తుల కాలంలో

భౌద్దారామాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి శ్రీకృష్ణ ఆలయంగా మార్పు చేశారు.తిరిగి 7వ శాతాబ్ధ ము చివరలో వైష్ట్నవ ఆలయ మును తిరిగి జైనారామంగా మార్చారు. తిరిగి 9 వ శతాబ్ద చివర కాలంలో తిరిగి శ్రీకృష్ణ ఆలయంగా మార్చారు. కాబట్టే ఈ ప్రదేశం లో జరిగిన తవ్వకాలలో హిందూ మత చిహ్నాల తోపాటు భౌద్ధ జైన మత చిహ్నాలు లభించాయి అని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం.

మధ్య యుగంలో క్రీస్తుశకం 1017-1018 లో మహ్మద్ గజనీ బృందావనం మరియు మధుర పై దాడి చేసి చరిత్రలో కనీ వినీ ఎరగని రక్తపాతం సృష్టించి విలువైన అనంత సంపదను దోచుకున్నాడు.

మధుర పై గజనీ చేసిన దాడిని గజనీ ఆస్థాన రచయిత, అల్ ఉత్బీ తన తారిఖ్-ఇ-యామిని అనే అరబిక్ లో వ్రాసిన చారిత్రక గ్రంథంలో వర్ణించాడు.తారిఖ్-ఇ-యామిని అరబిక్ నుండి

ఇంగ్లీష్ అనువదించబడిన పత్రి నేటికీ లభ్యం అవుతున్నది

-తారిఖ్-ఇ-యామిని అంటే అరబిక్ భాషలో అలంకరించబడిన, పుష్పించే పుష్పం అని అర్థం అలంకారిక ప్రాస గద్యంలో వ్రాసిన తారిఖ్ ఐ యామిని, లేదా కితాబ్ ఐ యామిని, సెబుక్టిగిన్ మరియు మహముద్ పాలనల చరిత్ర.

గజనీ ఆస్థాన చరిత్రకారుడు అబూ నస్ర్ ముహమ్మద్ ఇబ్న్ ముహమ్మద్ అల్ జబ్బారు-ఎల్ ఉట్బి రాశారు. అతని రచనలో సెబుక్టిగిన్ పాలన మొత్తం, మరియు మహముద్ యొక్క భాగం, 410 హిజ్రా సంవత్సరం వరకు ఉన్నాయి.

అతని రాత లలో నే”నగరం మధ్యలో ఒక భారీ మరియు అద్భుతమైన శిల్ప కళ తో అలరారే ప్రాచీన ఆలయం ఆకాశాన్ని తా కుతున్నట్లు ఉంది, ఇది మానవులు కాదు, దేవతలు నిర్మించారని ప్రజల విశ్వాసం … ఆలయానికి సంబంధించిన ఏదైనా అంశాన్ని వర్ణించటానికి భాషా పటిమ సరిపోదు.

చెయ్యి తిరిగిన చిత్రలేఖకుడు మాత్రమే ఆలయ సౌందర్యాన్ని తన ప్రతిభతో చిత్రాలు గా ఆవిష్కరించ గలడు . ఈ ఆలయ అందాన్ని వర్ణన చెయ్యటానికి, పదాలు సరిపోవు చిత్రాలలో,మాత్రమే చెప్పగలము చిత్ర లేఖనం కూడా. చిన్నబోయింది ఆలయ అందాన్ని తెలియజేయడంలో విఫలమైంది.” ఘజనీకి చెందిన మహమూద్ ఇంకా ఇలా వ్రాశాడు, “ఎవరైనా ఈ ఆలయానికి సమానమైన అందమైన భవనాన్ని నిర్మించాలనుకుంటే, కనీసం వంద మిలియన్ దినార్లు ఖర్చు చేయకుండా చేయలేరు, ఇంకా అనేక రకాల సామర్థ్యాలు కల వ్యక్తుల తో పాటు అనుభవజ్ఞులైన కార్మికులు కలగలిసి రాత్రి పగలు పనిచేస్తే దాదాపు, రెండు వందల సంవత్సరాలుసమయం పట్టవచ్చు అని అంచనా వేశారు

ఇంతటి సుందర ఆలయ సముదాయాన్ని కూల్చివేసి కాల్చివేసి ఆలయ సంపద ను దోచుకుని రమ్మని మహ్మద్ గజనీ తన సైనికులకు ఆదేశించాడు. వారు ఆలయ ప్రాంగణంలోని బంగారు మరియు వెండి విగ్రహాలను దోచుకున్నారు

ఈ ఆలయంలో దోచుకున్న సంపదను దాదాపు వెయ్యి ఒంటెల పై తన దేశానికి మోసుకెళ్ళాడు.

గజనీ

ఈ ప్రదేశం లో జరిగిన తవ్వకాలలో కనుగొనబడిన సంస్కృతంలో ఉన్న ఒక రాతి శాసనం ప్రకారం

విక్రమ సంవత్ ఇతను మొట్టమొదటి భారతీయ క్యాలండర్ రూపకర్త 1150-1207 కాలంలో గహడవల రాజు అయిన విక్రమ్ సంపత్ ఆదేశానుసారం అతని సామంతుడిగా ఉండే జజ్జ అనే రాజు’తెల్లని మరియు మేఘాలను తాకుతున్న’ విష్ణు ఆలయాన్ని తిరిగి నిర్మించాడు అని తెలుస్తున్నది

ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి చాలా పెద్ద సైన్యంతో మధుర పై దాడి చేసి హిందువులను ఊచకోత కోసి ఆలయాన్ని విధ్వంసం చేశారు ఆలయ సంపదను తిరిగి దోచుకున్నారు. అంతేకాకుండా యమునా నది లో హిందువులు ఎవరు స్నానం చేయరాదు అని ఆదేశించాడు.ఇంకా నదీతీరంలో హిందువులు క్షౌర ము చేయించుకొనరాదని కూడా ఆజ్ఞలు జారీచేయబద్దాయి అని తారిఖ్-ఇ-దౌదీ అనబడే పారశీక గ్రంధంలో పేర్కొన్నారు

తిరిగి మొఘల్ చక్రవర్తి జహంగీర్ సైన్యాధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా సికిందర్ లోడి దాడులతో నామ మాత్రంగా మిగిలిన ఈ ఆలయ సముదాయం పై తిరిగిదాడి చేశారు కనీ వినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించారు.

అయితే జంహంగీర్ చక్రవర్తి కాలంలో నే 1618 లో ఓర్చాకు చెందిన వీరసింగ్ దేవ్ బుందేలా దాదాపు ముప్పై లక్షల రూపాయల వ్యయం తో ఆలయంలో కొంత భాగాన్ని పుననిర్మించారు. ఆ రోజులలో

మొఘల్ యువరాజు దారాషికో ఈ ఆలయానికి భారీ మొత్తంలో భూరి విరాళం తోపాటు ధన వస్తు రూపంలో సహాయం చేశారు

చిట్టచివరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశానుసారం మథుర గవర్నర్ అబ్దున్ నబీ ఖాన్ ఆలయాన్ని సమూలంగా కూల్చివేసి ఎదురు తిరిగిన హిందువులను తెగనరికి దేవాలయ శిథిలాలపై జామా మసీదును నిర్మించాడు. మథురలో జాట్ తిరుగుబాటు సమయంలో, అబ్దుల్ నబీ ఖాన్ 1669 లో చంపబడ్డాడు. జాట్ నాయకులు తిరిగి కేశవ దేవ్ ఆలయాన్ని తిరిగి నిర్మించగా ఈ సారి ఔరంగజేబు స్వయంగా మధురపై దాడి చేసి 1670లో ఆ కేశవదేవ ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో షాహీ ఈద్గాను నిర్మించాడు

ఫ్రెంచ్ యాత్రికుడు. జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ అను రత్నాల వ్యాపారి

1650 నుండి 1675 వరకు దాదాపు ఆరు సార్లు భారత దేశాన్ని సందర్శించాడు ఆ సమయంలోనే మధురను దర్శించాడు ఎర్ర ఇసుక రాతితో నిర్మించిన కేశవ దేవ్ అష్టభుజి ఆలయా విశిష్ఠతను తన ట్రావెలాగ్ లోఎంతో అద్భుతంగా వర్ణించారు అంతే కాకుండా ఔ రంగజెబ్ దాడి కి సంబంధించిన వివరాలను భీతావహంగా వివరించాడు మొఘల్ ఆస్థానంలో పనిచేసినఇటాలియన్ యాత్రికుడు నికోలావ్ మనుచి 19 ఏప్రిల్ 1638–1717 ఒక వెనీషియన్ రచయిత, స్వీయ-బోధన వైద్యుడు మరియు యాత్రికుడు, అతను మొఘల్ సామ్రాజ్యం యొక్క చరిత్రను ప్రత్యక్షంగా చూసి నాటి స్థితి గతులను పుస్తక రూపంలోవ్రాసాడు, అంతేకాక మొఘల్ ఆస్థాన యునాని వైధ్యుడి గా పని చేశారు ఇయన తనరాసిన స్టోరియా డో మోగోర్ లో నాటి కేశవ దేవ్ ఆలయ వైభవాన్ని దాడికి గురైన నేపథ్యాన్ని సవివరంగా గ్రంధస్థం చేశారు

మధుర కు మల్లాపురం అనే పేరు కూడా ఉంది. మధుర లో కృష్ణ జన్మస్థాన్ గా పిలువబడే ప్రస్తుత స్థలాన్ని కత్రా లిట్. ‘మార్కెట్ ప్లేస్’ కేశవదేవ అని రకరకాల పేర్లతో భక్తజనం పిలుస్తారు.

1804లో మథుర బ్రిటీష్ నియంత్రణలోకి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కత్రా భూమిని అంటే ఆలయానికి చెందిన భూమినివేలం వేసింది. ఈ వేలంపాటలో మధుర కృష్ట జన్మ భూమి స్థలాన్ని కాశీలోని ఒక సంపన్న బ్యాంకర్ శ్రీ రాజా పత్నిమల్ కొనుగోలు చేసారు

శ్రీరాజా పత్నిమల్ తను బ్రిటీష్ ప్రభుత్వం నుండి కొనుగోలు చేసిన స్థలంలో ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు కానీ అలా చేయలేకపోయాడు. అతని వారసులు శ్రీరాయ్ కృష్ణ దాస్ కత్రా భూమిని అనగా శ్రీకృష్ణ జన్మభూమి గా పిలవబడుతున్న స్థలాన్ని వారసత్వంగా పొందారు.

మథుర ముస్లింలు 1935 లో వేసిన రెండు సివిల్ వ్యాజ్యాలలో, ఆలయ భూమి మరియు షాహీ ఈద్గా ఉన్న 13.37 ఎకరాల భూమి యాజమాన్యం కోసం అతని వారసుడు రాయ్ కృష్ణ దాస్ ను సవాలు చేస్తూ మొట్టమొదటి సారి న్యాయ స్థానం మెట్లు ఎక్కారు అయితే అలహాబాద్ హైకోర్టు రెండింటిలోనూ శ్రీ రాజ్ కృష్ణ దాస్‌కు అనుకూలంగా తీర్పులను వెలువరించింది

1935లో దాఖలు చేయబడ్డ ఈదావాల లో శ్రీ రాయి కృష్ణ దాస్ కు శ్రీ. కైలాష్ నాథ్ కట్జూ అతను ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ గవర్నరు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రి, కేంద్ర రక్షణ మంత్రి గా పలుపదువులు నిర్వహించాడు.ఇతను భారతదేశ ప్రముఖ న్యాయవాదులలో ఒకడు. ఇతనుతో కలిసి మరియు శ్రీమదన్మోహన్ చతుర్వేది కూడా ఈ వివాదంలో శ్రీ రాయ్ కృష్ట్న దాస్ కు సహాయం చేసారు.

1944 లో ప్రముఖ హిందూ నాయకుడు మరియు విద్యావేత్త శ్రీ మదన్ మోహన్ మాలవీయ శ్రీ రాజ్ కృష్ణ దాస్ నుండి 7 ఫిబ్రవరి న పారిశ్రామికవేత్త జుగల్ కిషోర్ బిర్లా ఆర్థిక సహాయంతో 13000 రూపాయిలను శ్రీకృష్ణ జన్మభూమి స్థలాన్ని కొనుగోలు చేశారు. పండిట్ శ్రీ మదన్ మోహన్ మాలవ్య మరణం తరువాత, జుగల్ కిషోర్ బిర్లా శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్‌ను స్థాపించారు,

ఫిబ్రవరి 21 1951న శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్‌గా నమోదు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. జుగల్ కిషోర్ బిర్లా

నూతన ఆలయ నిర్మాణ బాధ్యతలను మరొక పారిశ్రామికవేత్త మరియు పరోపకారి శ్రీ జైదయాల్ దాల్మియాకు అప్పగించారు..

ఆలయ సముదాయం నిర్మాణం అక్టోబర్ 1953లో భూములను చదును చేయడంతో ప్రారంభించబడింది

మరియు ఫిబ్రవరి 1982లో అంటే దాదాపు ముప్పై సంవత్సరాలకు పూర్తయింది.

శ్రీ జై దయాళ్ దాల్మియా తరవాత పెద్ద కుమారుడు శ్రీ విష్ణు హరి దాల్మియా ట్రస్ట్ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు మరణం వరకు ట్రస్ట్‌లో పనిచేశాడు. శ్రీ విష్ణు హరి దాల్మియా మరణానంతరము అతని కుమారుడు శ్రీ జై దయాళ్ దాల్మియా మనవడు అనురాగ్ దాల్మియా ట్రస్ట్‌లో జాయింట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. నూతన ఆలయ నిర్మాణానికి రామ్‌నాథ్ గోయెంకాతో సహా ఇతర వ్యాపార కుటుంబాలు నిధులు సమకూర్చాయి .

1968లో, శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ మరియు షాహీ ఈద్గా కమిటీ స్థల విషయంలో పరస్పరం ఒక రాజీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి,

ఈ ఒప్పడం ప్రకారం ఆలయ భూమిని ట్రస్ట్‌కు మరియు షాహీ ఈద్గా నిర్వహణను ఈద్గా కమిటీకి బదలాయింపు జరిగింది. అలాగే శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ మునుముందుఎటువంటి చట్టపరమైన దావాలనుషాహీ ఈద్గా.పైవేయబోదు.

భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు గణేష్ వాసుదేవ్ మావలంకర్ రాజీ ఒప్పందంపై సంతకం చేసిన శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్‌కు మొదటి ఛైర్మన్

అయితే చైర్మన్ హోదాలో ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి అతని చట్టపరమైన అధికారం లేదు అన్నది నేటి సంఘ్ పరివార్ విశ్వ హిందూ పరిషత్ నాయకుల వాదన. ఈ ఒప్పందం తో హిందువులకు అన్యాయం జరిగిందని మెజార్టీ హిందూప్రజల అభిప్రాయం

గణేష్ వాసుదేవ్ మావలంకర్ తరువాత MA అయ్యంగార్ , తరువాత అఖండానంద సరస్వతి మరియు రామ్‌దేవ్ మహారాజ్ వచ్చారు. నృత్యగోపాలదాస్ ప్రస్తుత చైర్మన్.

1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత తో, బృందావన్ నివాసి మనోహర్ లాల్ శర్మ, 1968 ఒప్పందాన్ని సవాలు చేస్తూ మధుర జిల్లా కోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు.అలాగే యథాతథ స్థితిని కాపాడే 1991 నాటి మత ప్రార్థనా స్థలాల చట్టాన్ని రద్దు చేయాలనే పిటిషన్‌ను కూడా జత చేసి దాఖలు చేశారు.

శ్రీకృష్ణుడి ఆలయ ప్రాంతానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ మథుర కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై విచారణకు మథుర కోర్టు అంగీకరించింది. మనీష్‌ యాదవ్‌, మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌, దినేశ్‌ శర్మ అనే ముగ్గురు వ్యక్తులు ఈ పిటిషన్ వేశారు. షాహీ ఈద్గా ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించేందుకు అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించాలని వారు కోరారు. మొత్తం 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కృష్ణుడి ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారని పిటిషనర్లు ఆరోపించారు. 17వ శతాబ్దం నాటి ఈ మసీదును తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

మథుర సివిల్ కోర్టులో ఈ వివాదంపై 2020 సెప్టెంబర్‌లో తొలి పిటిషన్ దాఖలైంది. లఖ్‌నవూ వాసి రంజనా అగ్నిహోత్రి సహా మరో ఆరుగురు వ్యక్తులు శ్రీకృష్ణు భగవానుడి తరఫున ఈ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ మసీదును తొలగించి ఆ ప్రాంతాన్ని కృష్ణ జన్మభూమి ట్రస్టుకు తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.

అయితే 2020 సెప్టెంబర్ 30న ఈ పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని సివిల్ కోర్టు జడ్జి తిరస్కరించారు. పిటిషనర్లు ఏ ఒక్కరూ మథురకు చెందినవారు కాదని పేర్కొన్నారు. దీంతో పిటిషనర్లు తమ వ్యాజ్యాన్ని పునఃపరిశీలించాలని మథుర జిల్లా కోర్టును ఆశ్రయించారు. 2022 మే 19న ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది కోర్టు. ట్రస్ట్‌ను, ఆలయ అథారిటీలను ఈ దావాలో పార్టీలుగా చేర్చింది.

మధుర ఆలయం వెనుక సుదీర్ఘ రక్త చరిత్ర ఉంది

కొన్నిలక్షల మంది మన పూర్వుల ఆత్మ బలిదానం ఉంది మధుర ను విముక్తి చెయ్యటం మన అందరి కర్తవ్యం

2020 నుంచి ఇప్పటి వరకు మథుర కోర్టులో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కనీసం డజనుకుపైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకరు ఈ స్థలంలో తవ్వకాలు జరపాలని కోరగా, మరొకరు పురావస్తు శాఖతో శాస్త్రీయ పద్ధతుల లోసర్వే జరిపించాలని డిమాండ్ చేశారు. మసీదులో ఉండే ఆలయ అవశేషాల రక్షణ కోసం అక్కడ సీసీటీవీలు ఏర్పాటు చేయాలని మరొక పిటిషనర్‌ కోరారు. ప్రస్తుతం డిస్తిక్ కోర్టు హైకోర్టులో హిందువులకు అనుకూలమైన తీర్పులు రాగా షాహీ ఈద్గా దర్గా లో అధునాతన శాస్త్రీయ పద్దతులలో సర్వే జరపాలని హిందువులు దాఖలు చేసిన పిటిషన్ కు అనుకూలంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కూడా తాజాగా కిందటి డిసెంబర్ లో సమర్థించింది

ముఖ్యంగా వివాదాస్పదమైన13;37 ఎకరాల పై యాజమాన్య హక్కులు ఎవరికి చెందుతాయి అన్న విషయం పై సుప్రీం కోర్టు లో విచారణ జరుగుతోంది

అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఆలయానికి 1991 ప్రార్థనా స్థలాల చట్టం వర్తించదు ఎందుకంటే న్యాయ వివాదం 1935 లోనే ప్రారంభమైంది కాబట్టి..

త్వరలో ఈ ఆలయ అంశంలో కుడా మనం తీయ్యని కబురు వింటాం

రామ ప్రతిష్ఠ జరిగింది

విశ్వేశ్వరుడు విముక్తి ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయి

కృష్ణయ్య ను కూడా దర్గా పేరు తో ఆక్రమించిన13.37 ఎకరాలను కలుపుకుని భవ్య కృష్ణా ఆలయం త్వరలో నిర్మించాలని కోరుకుందాం

జై శ్రీరామ్ జై విశ్వనాథ జై శ్రీకృష్ణ

వ్యాఖ్యానించండి