తెలుగులో RAP – ‘ఆటలు మొదలు’

ఈ ‘Mahaa ‘ & స్నేహితులందరూ  కొత్త వినూత్న  ప్రయత్నం చేసారు.

వినండి. చూడండి . షేర్  చేయండి.  గంట కొట్టండి 🙂

ఇది వరకు చేసిన వీడియోలు  ఇవి:

MaaHaa – Na Galli Na Lolli 

MaaHaa – GTA

MaaHaa – House Party

హిందూ అమెరికన్ ఫౌండేషన్ వారి సందేశం వలన ప్రయోజనం పొందిన వామపక్ష వాదులు

నేను మొన్న హిందూ అమెరికన్ ఫౌండేషన్ వారి సందేశం ఒకటి ముఖపుస్తకంలోనూ & వాట్సాప్లో కొన్ని గుంపులకి పంచడం జరిగింది. నేను అందరికీ మంచి జరగాలని పంచినా దానిని కూడా వారికి అనుకూలంగా మలచుకునే మనుష్యులు ఉంటారు అని అర్ధమయ్యింది. భారతదేశంలో కరోనాతో విలవిలాలాడుతూ అందరూ కలిసికట్టుగా పని చేసుకోవాలి అని అనుకుంటుంటే మనుష్యుల్ని విడగొడితే కానీ లెఫ్ట్ వారికి సంతృప్తిగా ఉండదు.. కుంభమేళా అనే ప్రయోగం పని చేసినట్టులేదు. ఎందుకంటే చాలా మంది హిందువులే కుంభమేళాతో వచ్చే ఉంటుంది అని చక్కగా ఒప్పేసుకున్నారు కదా.


అటువంటి సమయంలో నేను పంచిన సందేశం ఒకటి దొరికింది. దానితో వీరికి పాపం, పోయిన ఏడాది ‘తబ్లిగి జమాత్‌ను దాని ద్వారా మొత్తం ముస్లిం వర్గాన్ని ఎలా టార్గెట్ చేశారో రీలులా కళ్ళముందు తిరిగింది.’ ట. గత ఏడాది ఇండియాలో మీడియా వారు ఏ విధంగా దాని గురించి మాట్లారో అవి కూడా ఇంకా ఏవో జోడించి వ్రాసారు.


ఈయన గతం తవ్వుతున్నారు. బాగానే ఉంది. నిజమే మీడియా తప్పే చేసి ఉండచ్చు. హద్దులు లేకుండా చాలా సార్లే ప్రవర్తిస్తున్నారు మీడియా వారు. ఈ రోజే ఒక ఉదాహరణ కూడా పోస్టు పెట్టాను. ఈయన గతం తవ్వినట్లు హిందువులు కూడా గతం త్రవ్వటం మొదలుపెడితే అది ఎక్కడ తేలుతుంది? అమెరికాలో కూర్చుని ఇండియా లో హిందువు ముస్లిం అంటూ మాట్లాడటం మనుష్యుల ప్రాణాలు పోతున్న ఈ సమయంలో అంత అవసరమా ? ఓ నెల రోజులు అయ్యాక మాట్లాడవచ్చు కదా? అంత దాకా ఎలా ఊరుకుంటారు? సమయం సందర్భం చూసి sensation సృష్టించాలి కదా? రాజీవ్ మల్హోత్రా గారు ‘SEPOY’ అంటూ కొంత మందిని గురించి చెబుతుంటారు. వారే ఇలాంటి వారు!! వీరికి Inclusion అన్న మాట ఉండదు. Its always an ‘exclusion’ for them.


ఈయన బాధల్లా ఒకటే → ‘ .హిందువులు నోరెత్తేసి మాట్లాడేస్తున్నారు. అదెలా సాధ్యం? ‘. ఎందుకంటారా ? ఇదిగో ఇదీ కారణం:👇👇👇

ప్రపంచంలో ఇన్ని కోట్లమంది హిందువులు ఉన్నారు కానీ హిందూఫోబియా అనేది ఉన్నది అన్నసంగతి హిందువులకే తెలీదు. వారి హక్కులు గురించి ప్రశ్నించి వారి తరఫున పోరాడే సంస్ధ కానీ నాకు తెలిసి ఏదీ లేదు. హిందూధర్మం భారతదేశంలో మెజారిటీ మతం అవ్వచ్చు. ప్రపంచంలో మైనారిటీ యే అన్న సంగతి ఈ వామపక్ష భావజాలం వారి ఆలోచనా పరిధిలో ఉండదు. ఎన్నో హిందూ సంస్థలు ఉండచ్చు. ఇటువంటి advocacy organizations అనేది ఉండాలి అన్న సంగతి హిందువులకే తెలియదు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ అనేది హిందూధర్మం గురించి విద్యాలయాల్లో తెలియచెప్తూ హిందువుల హక్కులని పరిరక్షించే అమెరికాలో ఉన్న ఒకే ఒక్క చిన్న సంస్థ (అసలు ప్రపంచంలోనే అనచ్చునెమో కూడా). ఈ సంస్థకి ఎవరితోనూ సంబంధం లేదు. అటువంటిది ఆ సంస్థకి RSS కి సంబంధాలు ఉన్నాయని, కాలిఫోర్నియాలో cisco కేసుమీద పోరాటం చేస్తోందని అని ఈయన బాధ అని వ్యాఖ్యల్లో స్పష్టంగా అర్ధమయ్యింది. “In the United States, there is no role for government to define our religious beliefs, whether it be Hinduism, Islam, Judaism, Christianity or any other. In fact, the Constitution expressly prohibits it. HAF’s actions are an important step in protecting the rights of all Americans,”అని cisco విషయం లో కేసు వేసింది HAF. ఈ కేసు విషయంలో ‘caravan’ అనే పత్రిక కూడా హిందూ అమెరికన్ ఫౌండేషన్ మీద ఇష్టం వచ్చినట్లు వ్రాసింది.


వామపక్ష సంస్థలకి ఉన్నన్ని నిధులు హిందూ సంస్థలకి ఉండవు. పైగా మన ధర్మం కాపాడటానికి కేసు వేస్తాం అంటే డబ్బు ఇచ్చే హిందువు ఎవడూ ఉండడు. నాలాంటి వారు ఇచ్చే అరాకొరా donations వారికి చాలా ఉపయోగం. ఇటువంటి సంస్థ మీద కూడా విషం చల్లుతూ ఈ కరోనా సమయంలోకూడా పోస్టులు పెడుతున్నారు అంటే, హిందువు అనే వాడు బ్రిటిష్ వాడు ఎలా చెప్పాడో అలాగే ఉంటూ అమెరికాలో కూడా నోరు ఎత్తకూడదు అని ఎంత స్పష్టంగా చెప్తున్నారు.


ఈ కరోనా సమయంలో నాకు తెలిసి అలుపులేకుండా చేస్తున్న సంస్థలు అక్షయ పాత్ర, Sewa International (10మిలియన్ల డాలర్లు సేకరించారు వీరు). గుజరాత్ లో RSS సంస్థ ఆడవారు స్మశానాల్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో అన్నోజిగూడా లో covid సెంటర్ ఏర్పాటు చేసింది సేవభారతి. నాకు తెలిసినవే కొన్ని. చెప్పుకుంటూ పోతే ఎన్ని? లెక్క లేదు.
అవతలివాడు తమ మతంలో మారిపోవాలన్నటువంటి ఏ స్వార్థం లేకుండా సేవ చేసేది హిందువులు. విషం కక్కేది మాత్రం వారి మీద!!