భారతీయుడిని భారతీయుడిగా …. 

యూదులు హిందువులతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉన్నవారు. అంత కంటే తక్కువ సంఖ్యలో ఉన్నవారు కెనడాలో Indigenous వారు. వీరు కలిసికట్టుగా పని చేసి తమపై జరిగిన హత్యాకాండని ప్రపంచం గుర్తించగలిగేలా చేసుకున్నారు.

హిందువులం ఇన్నికోట్ల మందిమి ఉన్నాము అని చెప్పుకోవడానికే. జరిగిన అన్యాయాలు తెలుసుకోము. తెల్సినా తేలిగ్గా తీసిపారేస్తాము. ప్రపంచానికి తెలుసా మన మీద జరిగిన అన్యాయాలు అక్రమాలు ?

ప్రపంచంలో అన్ని జాతుల వారి గురించి ఏడుస్తారు మన పిల్లలు. మన జాతి గురించి ఏడవాలి అన్న సంగతి మనం వాళ్ళకి నేర్పించట్లేదు. ఎందుకంటే మనమే ఆ చరిత్రని తెలుసుకోము. తెలిసినా feel అవ్వము. feel అవ్వకపోతే పూర్వీకుడు పడ్డ బాధ తెలీదు . మన వ్యవస్థ మీద పిల్లలు ప్రశ్నిస్తే ‘సమాధానం లేని చాలా ప్రశ్నలు వేశారు’ అని మురిసిపోతాము . పూర్వీకుల మీద, వ్యవస్థ మీదా ఛలోక్తులు వేస్తాం.

అన్నీ maggi noodle లా 2 minutes కంటే మించకూడదు. వీడియో 2 నిమిషాలికి మించి ఉండకూడదు. పోస్ట్ ఓ పేరా కి మించి ఉండకూడదు. కానీ అమ్మవారి మీద సౌందర్యలహరి , శివానంద లహరి ఎన్ని ఉంటే అన్ని స్తోత్రాలు చదివేసి బోలెడు instant పుణ్యం సంపాదించుకుంటాము. అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలు మన కళ్లబడకుండా చూసుకుంటాం.

ఎవడు బాగు చేస్తాడు మనల్ని ?

భారతీయులు కాపాడుకున్న దేవతామూర్తులు

ఒక చోటి నుంచీ ఒక చోటికి వెఱ్ఱివాళ్ళలా ప్రాణాలకు తెగించి దాచిన ఆ దేవతామూర్తులని మోసుకుంటూ, దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టుకుంటూ, ధర్మాన్ని రక్షించి తమ భక్తికి సాటిలేనిది ఏదీ లేదని చెప్పారు. ఆ సంస్కృతిని మిగిల్చి వెళ్ళిన మన పూర్వికులకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?

ఈ చరిత్రని చాప కింద తోసేసి , నా సంస్కృతి నుండీ నన్ను, నాలాంటి వాళ్ళని దూరం చేసేసారు. ఇది క్షమించరాని తప్పు.

ప్రముఖ చరిత్రకారిణి మీనాక్షి జైన్ గారు ‘Flight of Deities’ మీద చేసిన ప్రసంగం విన్నాక కళ్ళలో నీరు రాని భారతీయులు ఉండరేమో అనిపించింది. నా పూర్వీకుల నమ్మకాన్ని, వారి భక్తిని కళ్ళకు కట్టినట్టు గా చెప్పి, నా పూర్వికులపై నాకు అపారమైన గౌరవాన్ని కలుగజేసిన మీనాక్షి జైన్ గారి ప్రసంగాన్ని తెలుగులో వ్రాసే సాహసం చేసాను.👇👇👇

భిన్నత్వం లో ఏకత్వం – భారతీయత

వ్యాసంలో ఇంకా స్పృశించ వలసిన అంశాలు చాలా ఉన్నాయి. చుక్కలని కలిపే ప్రయత్నం చేశాను.

సంచిక లో  నా వ్యాసం 

భాస్కర్ యోగి గారి కేంద్రీయ సాహిత్య అకాడమీ పురస్కారాల వ్యాసం మీద ముఖపుస్తకం లో చర్చ జరిగినపుడు ఒక వాదన జరిగింది.  వాదన కాకుండా వ్యాసం రూపం లో వ్రాద్దాం అని వ్రాసాను.  

https://sanchika.com/essay-on-kendirya-sahitya-academy-awards/?fbclid=IwAR2D0xCNUD5pzkzWONGAnY6aUmLhYlN04XoNBUMjFCoDB01UbJ2_kdSOttY