మీకు భారత్ తో ఏం పని?

అందరూ నా పోస్టులు చదివి మెచ్చుకుంటున్నా ‘అమెరికా వలస వెళ్ళాక  మీకు భారత్ తో  ఏం  పని? అమెరికాలో కూర్చుని ఇక్కడ  కబుర్లు ఎందుకు చెప్తారు’ అనే మాట కొంచెం బాధ కలిగిస్తోంది.  ఈ మాట మొన్న మార్చి లో భారత్ వచ్చినపుడు కొందరు నాతో అన్నారు కూడా. 

సప్త సముద్రాలు దాటాక ఏ పూజ చేసినా ఫలితం ఉండదు అంటారు.  పూజలు, క్రతువులు ఏవైనా చేసే విషయంలో మేము అర్హత కోల్పోయి ఉండవచ్చు కూడా.  కాదని నేను చెప్పను. భారతీయ శాస్త్రాలలో ఏముందో నాకు తెలీదు. 

కానీ ఇక్కడ ఇంకో కోణం ఉంది. వలస వచ్చిన మాకు cultural  identity  అనేది  భారతదేశంతోటే ముడిపడి ఉంటుంది. మా దేశంలో నా  identity  నా భాష పరంగానో, నేను ఏ దేశం నుండీ వచ్చానో ఆ దేశ పరంగానో, నా మతపరంగానో ఉంటుంది. ఇంద్ర ధనుస్సులో  రంగులు వేరయినా ఎలా కలిసి ఇంద్ర ధనుస్సుని అందంగా మారుస్తాయో  అలా అందరూ కలిసిపోవడమే →  అమెరికా సంస్కృతి.  అంటే అర్ధం?  నేనేమీ  నా identity  కోల్పోకుండా  ఉండే స్వేచ్ఛ నాకుంది ఇక్కడ.  

కాబట్టి పొలిటికల్ గా చూస్తే భారత్ అనేది ఓ దేశం.  కానీ నా సంస్కృతి కూడా ! రెండు దేశాల మధ్య రాజకీయ పరంగా మాట్లాడే అర్హత కూడా నాకు లేకపోవచ్చు. కానీ ఇంకా నేను ఆ సంస్కృతినే  కొనసాగిస్తున్నాను కాబట్టి దాని  గురించి మాట్లాడటంలో తప్పు లేదు.  భారతదేశపు  రాజకీయ కోణం లో  కూడా రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని నా సంస్కృతిని హేళన, demonize  చేయడం చేస్తున్నారు.  ఎలా చూస్తూ ఊరుకుంటాము? 

అమెరికాలో బళ్లలో హిందూ సంస్కృతిని  misrepresent చేస్తున్న  పాఠ్య ప్రణాళికని మార్చమని Education Dept  వారికి లేఖలు పంపాను.  బంగ్లాదేశ్ లో సనాతనుల మీద దౌర్జన్యాలు జరిగితే నిరసన తెలియజేశాను.  పాకిస్తాన్ లో దైవనింద చేసారు అంటూ  హిందువులకి  మరణశిక్షలు విధిస్తే వారికీ క్షమాభిక్ష పెట్టించమని వేడుకున్నాను.  అమెరికాలో కూర్చుని ‘డబ్బు పంచుతున్నాం కదా’ అని  భారతీయుల్ని & వారి జీవనాన్ని హేళన చేసేవారిని,  వారిని కులాల పరంగా, మతాల పరంగా  విడదీసే వారిని ఖండించాను & ఖండిస్తాను. 

‘నా సంస్కృతి యే  గొప్ప, కాబట్టి అదే అందరూ follow అవ్వాలి’ అని  కూడా నేను ఎప్పుడూ అనను.   కానీ అధర్మం అనిపించినపుడు  మాట్లాడకపోతే  నా గురువులు చెప్పినట్లు  నేను మూగదాని క్రింద లెక్క. 

ఇది Global వరల్డ్.  ‘నా  సంగతి నేను చూసుకుంటా . మీ సంగతి మీరు చూసుకోండి ‘ అంటే ఎలా కుదురుతుంది?.  ఒకరికొకకరం అండగా నిల్చోకపోతే కాలిఫోర్నియాలో SB 403 మార్పులు వచ్చేస్తాయి , Leicester, UK లో జరిగిన గొడవలు ఎవరికీ తెలియవు. పాకిస్తాన్ లో హిందూ అమ్మాయిల బలవంతపు వివాహాలు తెలియవు 

ఎన్నో వేల  ఏళ్ళ  తరువాత కూడా తమ దేశాన్ని, సంస్కృతిని, భాషనీ కాపాడుకోవడానికి కలిసికట్టుగా పని చేసే యూదులని ఉదాహరణగా తీసుకుని భారతీయ  సంస్కృతిని  కాపాడుకోవాలి.  

‘నేను అమెరికాలో ఉన్నాను’ అంటే గొప్ప కాకపోవచ్చు.  కానీ రెండు దేశాలలో నివసించిన అనుభవం ఉన్నది. అంటే  నా అవగాహన ఒక దేశంలో నివసించేవారికంటే ఎక్కువ అన్నట్టే కదా . 

ఆ అవగాహనతోటే వ్రాస్తున్న వ్రాతలే కానీ గర్వంతో వ్రాస్తున్నవి కాదు. 

వ్యాఖ్యానించండి