మళ్ళీ బ్లాగులోకానికి వచ్చా

బ్లాగు వ్రాసి చాలా రోజులయింది.  ఎక్కువగా ముఖపుస్తకంలోనే  వ్రాసేస్తున్నాను. ఈరోజు మాలిక చూసాక ‘అయ్యో బ్లాగు ఎందుకలా వదిలేస్తున్నాను’ అని దిగులేసింది. కనీసం ముఖపుస్తకం లో టపాలన్నీ దాచుకునే ప్రయత్నం అయినా చేద్దాం అనిపించింది. 

బ్లాగులో వ్రాసి ఆ లంకె ముఖ పుస్తకంలో పెడితే ఆ లంకె కూడా నొక్కట్లేదు జనాలు.  ‘చేరవలసిన విషయం ఎలాగూ  చేరిపోతోంది’ అని బ్లాగుని తగ్గించేసాను. 

ముఖపుస్తకం లాగే ఎంతో మంది మంచి స్నేహితులని ఇచ్చింది బ్లాగు.  ఆ స్నేహాల కోసం మళ్ళీ వచ్చాను.  తరచూ వ్రాయడానికి ప్రయత్నిస్తాను 

2 thoughts on “మళ్ళీ బ్లాగులోకానికి వచ్చా”

  1. మీరే కాదు, ఇప్పుడు అందరు అలానే ఉన్నారు . ఫేస్బుక్ లో రాస్తున్నాం అందుకే బ్లాగ్ లో రాయడం లేదు అంటారు .
    మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఎవరికీ తెలియదు . కేవలం బ్లాగ్ లు మాత్రమే చదివే వారు ఉంటారు , వాళ్లకి మీ రాతలతో తప్పిస్తే మీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ తో సంబంధం లేదు , మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపరు . ఎందుకంటే మీ వ్యక్తిగత విషయాల మీద ఆసక్తి ఉండదు కాబట్టి .

    పోనీ కష్టపడి బాగా రాస్తున్నారు కదా వెతికి వెతికి ( బ్లాగ్ లో ఫేస్బుక్ ప్రొఫైల్ కి లింక్ ఉండదు ), ప్రొఫైల్ దొరకబుచ్చుకుంటే, అది కాస్త లాక్ చేసి ఉంటుంది . ఇంటిపేరు ఉండదు బ్లాగుల్లో , కొంతమంది మారు పేర్లతోనో , మొదటి పేరుతోనో రాస్తారు . వెతికితే పదుల సంఖ్యలో వస్తాయి. సగం ఇంటరెస్ట్ పోతుంది అక్కడ .

    ఏమి అనుకోకండి మేడం . నేను కొంతమంది బ్లాగ్ లో కామెంట్స్ పెట్టాను మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఇవ్వండి అని , కనీసం రెస్పాన్స్ ఉండదు . కేవలం చదవడానికి , వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద కించిత్తు కూడా ఆసక్తి లేదు .

    నేను బ్లాగ్ లు నుండి అలా , కోరా కి వెళ్ళిపోయాను .

    మెచ్చుకోండి

    1. అక్కడ కూడా నాపేరు ఇదేనండి. కాకపోతే అందర్నీ add చేసుకోను. ముఖ్యంగా profile lock చేసినవాళ్ళని. ముఖాముఖీ తెల్సిఉన్నవాళ్ళే ఉంటారు నా ముఖపుస్తకంలో

      మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి